కావల్సినవి:
పుదీనా ఆకులు - రెండు కప్పులు,
కొత్తిమీర - పావుకప్పు,
అన్నం - కప్పు,
పచ్చిమిర్చి - రెండు,
నిమ్మరసం - చెంచా,
నూనె- టేబుల్ స్పూను,
జీడిపప్పు పలుకులు - కొన్ని,
జీలకర్ర - చెంచా,
సెనగ పప్పు - ఒకటిన్నర చెంచా,
ఉప్పు - తగినంత,
దాల్చిన చెక్క - చిన్నముక్క,
లవంగాలు - ఐదారు,
యాలకులు - రెండు,
అల్లం ముద్ద - చెంచా.
తయారీ:
బాణలిని పొయ్యిమీద పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక జీలకర్రా, జీడిపప్పూ, సెనగపప్పు వేయించాలి.
రెండు నిమిషాలయ్యాక లవంగాలూ, దాల్చినచెక్కా, యాలకులు వేయాలి.
అవి వేగాక అల్లం ముద్దా, పచ్చిమిర్చి తరుగూ, కడిగిన పుదీనా ఆకులూ వేసి మంట తగ్గించాలి.
కాసేపటికి పుదీనా ఆకుల పచ్చివాసన పోతుంది.
అప్పుడు తగినంత ఉప్పూ, కొత్తిమీర తరుగూ, నిమ్మరసం అన్నం వేసి బాగా వేయించి దింపేయాలి.
దీన్ని ఉల్లిపాయ పెరుగు పచ్చడితో కలిపి తీసుకోవచ్చు.
Mint Rice _ పుదీనా అన్నం
Labels:
Bengal Gram,
Cardamom,
Cashewnut,
Cinnamon,
Cloves,
Coriander Leaves,
Cumin,
Ginger,
Green Chillies,
Lemon,
Mint Leaves,
Oil,
Rice
Hyderabadi Veg BiryAnI - హైదరాబాదీ వెజ్ బిర్యానీ
కావలసినవి:
బాస్మతి బియ్యం: ఒకటిన్నర కప్పులు,
కుంకుమపువ్వు: కొద్దిగా,
పాలు: అరకప్పు,
నూనె: సరిపడా,
ఉల్లిముక్కలు (సన్నగా పొడవుగా తరిగినవి): ఒకటిన్నర కప్పులు,
జీడిపప్పు:2 టేబుల్ స్పూన్లు,
బాదం: 2 టేబుల్‌స్పూన్లు,
ఎండుద్రాక్ష: 2 టేబుల్ స్పూన్లు,
నెయ్యి: అరకప్పు,
లవంగాలు: నాలుగు,
నల్లయాలకులు: రెండు,
పలావు ఆకులు: రెండు,
ఉల్లిముక్కలు (చిన్నముక్కలుగా తరిగినవి): ముప్పావు కప్పు,
అల్లంవెల్లుల్లి: టేబుల్‌స్పూను,
పుదీనా ముద్ద: అరకప్పు,
కొత్తిమీర ముద్ద: పావుకప్పు,
బిర్యానీ మసాలా: 3 టేబుల్ స్పూన్లు,
ఉప్పు: రుచికి సరిపడా,
బంగాళాదుంప ముక్కలు: ముప్పావు కప్పు,
క్యారెట్ ముక్కలు: ముప్పావు కప్పు,
కాలీఫ్లవర్ ముక్కలు:పావుకప్పు,
బీన్స్ ముక్కలు: పావు కప్పు,
తాజా మీగడ: 2 టేబుల్‌స్పూన్లు,
పెరుగు: అరకప్పు,
కొత్తిమీర తురుము: టేబుల్‌స్పూను,
పిండి ముద్ద: అంచుల్ని మూసేందుకు సరిపడా
[List In English :
BiryAnI, Basmati Rice, Milk, Oil, Oninons, Cashewnut, Almond, Raisin, Ghee, Cloves, Black Cardamom, Pulav Leaves, Ginger Garlic Paste, Mint, Coriander Leaves, Biryani Masala, Salt, Potato, Carrot, Cauliflower, Beans, Fresh Cream ]
తయారుచేసే విధానం:
అన్నం కాస్త పలుకు ఉండి పొడిపొడిలాడేలా వండి పక్కన ఉంచాలి.ఒకటిన్నర టేబుల్‌స్పూన్ల గోరువెచ్చని పాలలో కుంకుమపువ్వును కరిగించి అన్నంలో వేసి బాగా కలపాలి. తరవాత అన్నం రెండు సమ భాగాలుగా చేసి పక్కన ఉంచాలి.నూనె వేసి సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిముక్కలు వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి. నాన్‌స్టిక్ పాన్‌లో సగం నెయ్యి వేసి జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి. అదే పాన్‌లో లవంగాలు, యాలకులు, పలావు ఆకులు వేసి వేయించాలి. చిన్న ముక్కలుగా తరిగిన ఉల్లిముక్కలు, అల్లంవెల్లుల్లి వేసి వేయించాలి. ఇప్పుడు పుదీనా ముద్ద, కొత్తిమీర ముద్ద, బిర్యానీ మసాలా, ఉప్పు, కూరగాయల ముక్కలు వేసి కలపాలి. మీగడ, మిగిలిన పాలు పోసి ఉడికించాలి. తరవాత దించి చల్లారాక గిలకొట్టిన పెరుగు కూడా వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని రెండు భాగాలుగా చేసి పక్కన ఉంచాలి.మరో పాన్‌లో మిగిలిన నెయ్యి వేసి వేయించిన ఉల్లిముక్కలు పరిచినట్లుగా చల్లాలి. దానిమీద ఉడికించిన కూరగాయల మిశ్రమంలో ఒక భాగాన్ని పరచాలి. ఇప్పుడు దానిమీద అన్నంలో ఒక భాగాన్ని పరచాలి. తరవాత మళ్లీ ఉల్లిముక్కలు, కూరగాయల మిశ్రమం, అన్నం వరసగా పరచాలి. చివరగా మిగిలిన ఉల్లిముక్కలు, జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష, కొత్తిమీర తురుము చల్లి మూతపెట్టి ఆవిరి బయటకు పోకుండా అంచుల్ని పిండితో మూసేసి అరగంటసేపు దమ్ చేయాలి. దీన్ని రైతాతో వడ్డిస్తే రుచిగా ఉంటుంది.
Labels:
Almond,
Basmati Rice,
Beans,
BiryAnI,
Black Cardamom,
Carrot,
Cashewnut,
Cauliflower,
Cloves,
Coriander Leaves,
Ghee,
Ginger Garlic Paste,
Mint,
Oninons,
Potato,
Pulav Leaves,
Raisin,
Salt
PineApple Chutney _ అనాస పచ్చడి
PineApple Chutney _ అనాస పచ్చడి
anAsa pachhaDi
కావలసిన వస్తువులు:
అనాస (ఫైనాపిల్) - 150గ్రాములు,
పచ్చికొబ్బరి తురుము - 100 గ్రాములు,
వెల్లుల్లి రెబ్బలు - 3,
అల్లం - 10 గ్రాములు,
పచ్చిమిర్చి - 3,
పెరుగు - 100 గ్రాములు,
కరివేపాకు - రెండు రెబ్బలు,
ఆవాలు - అర టీ స్పూను,
ఎండుమిర్చి - 2,
కొబ్బరినూనె - 2 టేబుల్ స్పూన్లు.
తయారుచేసే విధానం:
అనాసను నాలుగు పలకల చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. కొబ్బరి, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చిలను కలిపి పేస్టులా చేసుకోవాలి. కడాయిలో కొబ్బరినూనెని వేడిచేసి ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు చిటపటమన్నాక కొబ్బరి పేస్టుని వేసి కొద్ది నిమిషాల పాటు వేగించాక, అనాస ముక్కల్ని వేసి మరో 3 నిమిషాలు ఉంచాలి. దించేముందు పెరుగు కలపాలి.
ఇది తియతియ్యగా, పులపుల్లగా కొత్త రుచిగా ఉంటుంది.
Mushroom Noodles _ పుట్టగొడుగుల నూడుల్స్
Mushroom Noodles _ పుట్టగొడుగుల నూడుల్స్
కావలసినవి
పుట్టగొడుగులు: పావుకిలో,
నూడుల్స్: పావుకిలో,
ఉల్లిపాయలు: రెండు,
వెల్లుల్లి: పది రెబ్బలు,
క్రీమ్: కప్పు,
చీజ్ తురుము: 2 టేబుల్‌స్పూన్లు,
వెన్న: 3 టేబుల్‌స్పూన్లు,
జీలకర్ర: టీస్పూను,
ఉప్పు: రుచికి సరిపడా,
మిరియాలపొడి: అరటీస్పూను
తయారుచేసే విధానం
* నూడుల్స్‌ను ఉడికించి నీళ్లు వంపి చన్నీళ్లతో కడగాలి.
* పుట్టగొడుగుల్ని చిన్న ముక్కలుగా కోయాలి. ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు సన్నని ముక్కల్లా కోయాలి.
* బాణలిలో టేబుల్‌స్పూను వెన్న వేసి కరిగించాలి.
* ఉడికించిన నూడుల్స్, చిటికెడు ఉప్పు వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి.
* ఇప్పుడు మిగిలిన వెన్న వేసి ఉల్లిపాయ, వెల్లుల్లి ముక్కలు వేసి వేయించాలి.
* పుట్టగొడుగుల ముక్కలు, జీలకర్ర వేసి రెండు నిమిషాలు వేయించాలి.
* తరవాత ఉప్పు, మిరియాలపొడి, నూడుల్స్, క్రీమ్ వేసి కాసేపు ఉడికించాలి.
* చివరగా తురిమిన చీజ్ వేసి ఓ నిమిషం వేయించి దించాలి.
Egg Noodles _ గుడ్డు నూడుల్స్
Egg Noodles _ గుడ్డు నూడుల్స్
హాకా నూడుల్స్: పావుకిలో,
క్యారెట్, క్యాప్సికమ్ ముక్కలు: పావుకప్పు చొప్పున, సోయాసాస్: టీస్పూను,
టొమాటోసాస్: 2 టీస్పూన్లు,
పాస్టాసాస్: 2 టీస్పూను,
నిమ్మరసం: అరటీస్పూను,
గుడ్లు: రెండు,
వెల్లుల్లిరెబ్బలు: మూడు,
ఉల్లిపాయ: ఒకటి,
మిరియాలపొడి: అరటీస్పూను,
నూనె: 2 టేబుల్‌స్పూన్లు
తయారుచేసే విధానం
* నీళ్లు మరిగించి నూడుల్స్ ఉడికించి చల్లని నీళ్లతో కడిగి ఉంచాలి.
* బాణలిలో అరటీస్పూను నూనె వేసి గుడ్లసొన, చిటికెడు ఉప్పు, మిరియాలపొడి వేసి బాగా కలుపుతూ పొరటులా వేయించి తీసి పక్కన ఉంచాలి.
* మరో బాణలిలో మిగిలిన నూనె వేసి కాగాక వెల్లుల్లి, ఉల్లిపాయలు వేసి రెండు నిమిషాలు వేయించాలి.
* తరవాత సన్నగా తరిగిన కూరగాయ ముక్కలు వేసి వేయించాలి.
* తరవాత కొద్దిగా నీళ్లు చిలకరించి సోయాసాస్ వేసి కలిపి సిమ్‌లో పెట్టాలి.
* ఇప్పుడు పాస్టా సాస్, టొమాటో సాస్, ఉప్పు, మిరియాలపొడి వేసి బాగా కలపాలి.
* గుడ్డు పొరటును కూడా వేసి బాగా కలపాలి.
* చివరగా ఉడికించి పక్కన ఉంచిన నూడుల్స్ వేసి బాగా కలిపి రెండు నిమిషాలు వేయించాలి.
* తరవాత నిమ్మరసం కలిపి దించాలి.
* నీళ్లు మరిగించి నూడుల్స్ ఉడికించి చల్లని నీళ్లతో కడిగి ఉంచాలి.
* బాణలిలో అరటీస్పూను నూనె వేసి గుడ్లసొన, చిటికెడు ఉప్పు, మిరియాలపొడి వేసి బాగా కలుపుతూ పొరటులా వేయించి తీసి పక్కన ఉంచాలి.
* మరో బాణలిలో మిగిలిన నూనె వేసి కాగాక వెల్లుల్లి, ఉల్లిపాయలు వేసి రెండు నిమిషాలు వేయించాలి.
* తరవాత సన్నగా తరిగిన కూరగాయ ముక్కలు వేసి వేయించాలి.
* తరవాత కొద్దిగా నీళ్లు చిలకరించి సోయాసాస్ వేసి కలిపి సిమ్‌లో పెట్టాలి.
* ఇప్పుడు పాస్టా సాస్, టొమాటో సాస్, ఉప్పు, మిరియాలపొడి వేసి బాగా కలపాలి.
* గుడ్డు పొరటును కూడా వేసి బాగా కలపాలి.
* చివరగా ఉడికించి పక్కన ఉంచిన నూడుల్స్ వేసి బాగా కలిపి రెండు నిమిషాలు వేయించాలి.
* తరవాత నిమ్మరసం కలిపి దించాలి.
katte pongali_కట్టె పొంగలి
katte pongali_కట్టె పొంగలి
కావల్సినవి:బియ్యం- అరకప్పు,
పెసరపప్పు- పావు కప్పు,
నీళ్లు- రెండు కప్పులు,
ఉప్పు- తగినంత.
తాలింపు కోసం:
నెయ్యి- మూడు చెంచాలు,
జీలకర్ర- చెంచా,
మిరియాలు- చెంచా,
అల్లం - చిన్న ముక్క,
కరివేపాకు- నాలుగు రెబ్బలు,
జీడిపప్పులు- పది.
తయారీ:
1) బియ్యం, పెసరపప్పును కడిగి కుక్కర్‌లో తీసుకుని నీళ్లు పోయాలి.
2) మూడు కూతలు వచ్చేవరకూ ఉడికించుకుని తీసుకోవాలి.
3) ఇప్పుడు బాణలిని పొయ్యిమీద పెట్టి నెయ్యి వేయాలి.
4) అది కరిగాక జీడిపప్పు వేయించాలి.
5) అవి కాస్త ఎర్రగా వేగాక జీలకర్రా, మిరియాలపొడీ, కరివేపాకూ, అల్లం తరుగు వేయాలి.
6) అవి కూడా వేగాక బాణలి దించేయాలి.
7) ఈ తాలింపూ, సరిపడా ఉప్పు ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నంలో వేసి కలపాలి.
8) ఈ పొంగలిని మరోసారి పొయ్యిమీద పెట్టి రెండు నిమిషాలయ్యాక దింపేయాలి
Carrot Pickle_క్యారెట్ పచ్చడి
Carrot Pickle_క్యారెట్ పచ్చడి
కావల్సినవి:ధనియాలపొడి,
ఆవపొడి - చెంచా చొప్పున,
జీలకర్రపొడి - అరచెంచా,
మెంతిపొడి - పావు చెంచా,
కారం - రెండు చెంచాలు,
ఉప్పు - తగినంత,
ఇంగువ - చిటికెడు,
క్యారెట్లు - పదిహేను (చెక్కు తీసి ముక్కల్లా తరగాలి),
ఉల్లిపాయలు - రెండు,
అల్లంవెల్లుల్లి పేస్టు - అరచెంచా,
ఎండుమిర్చి - రెండు,
కరివేపాకు - రెండురెబ్బలు,
చక్కెర - కొద్దిగా,
నిమ్మరసం - మూడు చెంచాలు,
మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర - పావుచెంచా చొప్పున,
నూనె - కప్పు.
తయారీ:
ఉల్లిపాయల్ని తరిగి మిక్సీలో పేస్టులా చేసుకోవాలి.
ఇప్పుడు బాణలిలో అరకప్పు నూనె వేడిచేసి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చిని వేయించాలి.
ఆ తరవాత కరివేపాకు రెబ్బలు వేసి అవి కూడా వేగాక ఇంగువ, ఉల్లిపాయ మిశ్రమం, అల్లంవెల్లుల్లి పేస్టు వేసి బాగా వేయించాలి.
ఉల్లిపాయల పచ్చివాసన పోయాక దింపేయాలి.
అందులో సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, నిమ్మరసం, తగినంత ఉప్పుతోపాటు మిగిలిన అన్ని పదార్థాల్నీ వేసేయాలి.
మిగిలిన నూనె కూడా వేసేస్తే స్పైసీ క్యారెట్ పచ్చడి రెడీ.
ఇది వేడివేడి అన్నంలోకే కాదు.. చపాతీల్లోకీ బాగుంటుంది.
Labels:
Asafoetida,
Black gram,
Carrot,
Coriander,
Cumin,
Curry Leaves,
FenuGreek,
Ginger Garlic Paste,
Lemon,
Oil,
Oninons,
Salt,
Sugar
Bengal gram Palak - చనా పాలక్
Bengal gram Palak - చనా పాలక్
కావలసిన పదార్థాలు:నానబెట్టి ఉడికించిన శెనగలు- 1 కప్పు,
పాలకూర తరుగు- 5 కప్పులు,
పచ్చిమిర్చి- 5,
టొమాటో- 1,
జీడిపప్పు పొడి- 1/4 కప్పు,
నూనె- 1 టేబుల్ స్పూను,
అల్లం వెల్లుల్లి పేస్ట్- 1 టీ స్పూను,
ఉప్పు- రుచికి సరిపడా,
గరం మసాల, ధనియాల పొడి- ఒక్కోటి 1 టీ స్పూను చొప్పున,
కసూరి మేథీ- 1 టీ స్పూను.
తయారీ విధానం:
ఒక గిన్నెలో ఆరు కప్పుల నీళ్లు పోసి మరిగించి అరస్పూను ఉప్పు, టొమాటో వేయాలి. టొమాటో తోలు ఊడి వస్తుండగా దానిని గిన్నెలోంచి తీసేసి పాలకూర తరుగు వేసి మూడు నిమిషాలు ఉడికించి నీళ్లు వంచేయాలి. టొమాటో తోలు తీసి మిక్సీలో వేసి మెత్తగా గుజ్జు చేసి పక్కనుంచుకోవాలి. తరువాత పచ్చిమిర్చి, పాలకూరను కలిపి గుజ్జు చేసుకోవాలి. ఆ తరువాత ఒక కడాయిలో నూనె వేసి ఉల్లి ముక్కలను వేగించాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగించి ఆ తరువాత టొమాటో గుజ్జు వేసి దానిలోని నీరు ఇంకిపోయే వరకూ ఉడికించాలి. ఆ తరువాత పాలకూర గుజ్జు వేసి బుడగలు వచ్చే వరకూ ఉడికించాలి. తరువాత జీడిపప్పు పొడి, గరం మసాల, ధనియాల పొడి, కసూరి మేథీ వేసి బాగా కలిపి, శెనగలు వేసి అరకప్పు నీళ్ళు పోసి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. ఇది చపాతీలకు మంచి కాంబినేషన్.
Labels:
Bengal Gram,
Cashewnut,
Garam Masala,
Ginger Garlic Paste,
Green Chillies,
kasuri methi,
Oil,
Salt,
Spinach,
Tomato
Babycorn Butter Masala - బేబీకార్న్ బటర్ మసాలా
Babycorn Butter Masala - బేబీకార్న్ బటర్ మసాలా
కావల్సినవి:
బేబీకార్న్ - ఐదారు,
ఉల్లిపాయలు - మూడు,
టొమాటోలు - నాలుగు,
జీడిపప్పు - పావుకప్పు,
పచ్చిమిర్చి - రెండు,
వెన్న - పావుకప్పు,
కారం - చెంచా,
ధనియాలపొడి - ఒకటిన్నర చెంచా,
జీలకర్రపొడి - చెంచా,
గరంమసాలా - అరచెంచా,
కసూరీమేథీ - చెంచా,
అల్లంవెల్లుల్లిపేస్టు - చెంచా,
క్రీం - టేబుల్‌స్పూను,
ఉప్పు - తగినంత.
బేబీకార్న్ - ఐదారు,
ఉల్లిపాయలు - మూడు,
టొమాటోలు - నాలుగు,
జీడిపప్పు - పావుకప్పు,
పచ్చిమిర్చి - రెండు,
వెన్న - పావుకప్పు,
కారం - చెంచా,
ధనియాలపొడి - ఒకటిన్నర చెంచా,
జీలకర్రపొడి - చెంచా,
గరంమసాలా - అరచెంచా,
కసూరీమేథీ - చెంచా,
అల్లంవెల్లుల్లిపేస్టు - చెంచా,
క్రీం - టేబుల్‌స్పూను,
ఉప్పు - తగినంత.
తయారీ:
టొమాటోలు, రెండు ఉల్లిపాయముక్కలూ, జీడిపప్పూ, పచ్చిమిర్చీని ఓ గిన్నెలో తీసుకుని అవి మునిగేలా నీళ్లు పోసి పొయ్యిమీద పెట్టాలి. టొమాటోలు కొద్దిగా మెత్తగా అయ్యాక దింపేసి నీటిని వంపేయాలి. తరవాత వీటన్నింటినీ మిక్సీలో తీసుకుని మెత్తని మిశ్రమంలా చేసుకోవాలి. ఇప్పుడు బాణలిలో వెన్నను కరిగించి కసూరీమేథీ, అల్లంవెల్లుల్లి పేస్టూ వేయించి నిమిషం తరవాత మిగిలిన ఉల్లిపాయముక్కల్ని కూడా వేయాలి. అవి దోరగా వేగాక కారం, ధనియాలపొడీ, జీలకర్రపొడీ వేసి మరోసారి కలపాలి. ఇందులో టొమాటో జీడిపప్పు మిశ్రమం, తగినంత ఉప్పూ, గరంమసాలా వేసి మంట తగ్గించేయాలి. రెండుమూడు నిమిషాల తరవాత బేబీకార్న్ ముక్కల్ని కూడా వేసి కొన్ని నీళ్లు పోసి మూతపెట్టేయాలి. అవి ఉడికి, గ్రేవీ దగ్గరకు అయ్యాక పైన క్రీం వేసి దింపేయాలి. ఇది రొట్టెలూ, పూరీల్లోకి చాలా బాగుంటుంది.
Labels:
babycorn,
Butter,
Cashewnut,
Coriander,
Cream,
Cumin,
Garam Masala,
Ginger Garlic Paste,
Green Chillies,
kasuri methi,
Oninons,
Red Chilli Powder,
Salt,
Tomato
How to stop falling Hair
How to stop falling Hair
ప్రతి ఒక్కరిలో జుట్టు రాలిపోవడం అనేది సాధారణ సమస్యగా మారిపోయింది. ముఖ్యంగా జుట్టురాలడానికి హార్మోన్ ల అసమతుల్యత, రసాయనాలు కలిగిన షాంపూలు, ఆయిల్స్ ఉపయోగించడం వల్ల, ఈస్ట్, ఫంగల్ ఇన్ఫెక్షణ్, మరియు మందులు తరచూ ఉపయోగించడం, ఒత్తిడి, ఆహారంలో అసమతుల్యత ఇలా చాలా కారణాలే ఉంటాయి. వీటితో పాటు జుట్టు రాలడానికి మరో ముఖ్యమైన కారణం కూడా ఉంది. అదే చుండ్రు. చుండ్రు వల్ల తలో దురద లేదా మంట వంటి కారణాల చేత కూడా జుట్టు అధికంగా రాలిపోయే అవకాశం ఉంది.
కారణాలు ఏవైనా కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల జుట్టును ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు.
సాధారణంగా కొంత మంది తలకు నూనె అనేది వాడరు సాధారణంగా కొంత మంది తలకు నూనె అనేది వాడరు. అందువల్ల కేశాలు పొడిబారి పోవడం, తడిలేకుండా నిర్జీవంగా మారి కురులు తెగిపోవడం లేదా, రాలిపోవడం జరుగుతుంటాయి. అందుకోసం నెలలో రెండు సార్లైనా తలకు గోరువెచ్చని నూనెతో మసాజ్ చేసుకోవాలి. అందులో బాదం నూనె లేదా ఆలివ్ నూనె లేదా శుద్దమైన కొబ్బరి నూనె ఏదో ఒకటి తీసుకోవాలి. ఒక చిన్న బౌల్ లో మీ జుట్టుకు సరిపడా తీసుకొని అందులో కొన్ని మెంతులు కలిపి తక్కువ మంట మీద వేడి చేసి, రెండు నిమిషాల తర్వాత గోరువెచ్చగా తలకు మునివేళ్ళతో పట్టించి బాగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల రక్తప్రసరణ బాగా జరిగి కేశాలు రాలడం తగ్గి, ఆరోగ్యంగా పెరుగుతాయి.
కేశాలు రాలడానికి మరో ముఖ్యమైన కారణం ఆహారం. ముఖ్యంగా ప్రతి రోజూ తీసుకొనే ఆహారంలో ఐరన్ శాతం ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. దాంతో జుట్టు రాలడాన్ని నివారించవచ్చు. ఎండబెట్టిన అత్తిపండు, జీడిపప్పు, బాదాం, లివర్ మరియు రొయ్యలు వంటివి తరచూ ఆహారంలో తీసుకోవడం వల్ల తగినంత ఐరన్ శరీరాని అంది, జుట్టు రాలడాన్ని నిరోధిస్తుంది.
తలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. కనీసం వారానికి రెండు సార్లైనా మంచి కండీషనర్ తో తలస్నానం చేయడం మంచిది.
హెయిర్ క్లిప్స్ లేదా హెయిర్ బ్యాండ్స్ చాలా బిగుతుగా వుండేవి వాడకూడదు. జుట్టును ఇలాంటి కఠినమైనటువంటి క్లిప్స్, హెయిర్ బ్యాండ్ తో గట్టిగా బంధిచడం లేదా ముడి వేయడం వల్ల జుట్టును బలహీన పరచి కురులను నాశనం చేస్తాయి.
షాంపూ తేమ స్వభావాన్ని కలిగి ఉండేలా చూసుకోవాలి. జిడ్డుగా ఉన్న కురుల కోసం తప్పనిసరిగా ఇలాంటి షాంపూలను మాత్రమే ఎంపిక చేసుకోవాలి.
కేశాలకు హెయిర్ జెల్ లేదా హెయిర్ స్ప్రేలను ఉపయోగించడం వల్ల కురులు తెగిపోవడం జరుగుతుంది. ఇలా మెయింటైన్ చేయడం చాలా కష్టం. హెయిర్ జెల్, హెయిర్ స్ప్రేలను వాడినప్పుడు వెంటవెంటనే తలస్నానం చేయాల్సి ఉంటుంది.
జుట్టు రాలడాన్ని నియంత్రించడానికి ఉత్తమమైన మార్గం కొబ్బరి నీళ్ళు తాగడమే. తాజా కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల జుట్టు రాలడాన్ని తగ్గించేందుకు బాగా సహాయ పడుతుంది.
ఎక్కువగా ఎండగా ఉన్నప్పుడు శరీరానికి కానీ, తలకు కానీ ఎండ వేడిమి, సూర్య రశ్మి డైరెక్ట్ గా తగలకుండా జాగ్రత్త తీసుకోవాలి.
Wheat Halwa - గోధుమ హల్వా
గోధుమపిండి - కప్పు,
చక్కెర - ఒకటింబావు కప్పు,
నీళ్లు - ఒకటింబావు కప్పు,
వెన్న - పావుకప్పు,
జీడిపప్పూ, కిస్‌మిస్ పలుకులు- కొన్ని,
నెయ్యి - చెంచా.
తయారీ:
బాణలిలో కొద్దిగా వెన్న కరిగించి జీడిపప్పూ, కిస్‌మిస్ పలుకుల్ని వేయించుకుని విడిగా తీసి పెట్టుకోవాలి. అదే బాణలిలో మిగిలిన వెన్న కరిగించి గోధుమపిండిని వేయించుకోవాలి. గోధుమపిండి కాస్త రంగు మారి, కమ్మటి వాసన వచ్చేవరకూ వేయించుకుని తీసుకోవాలి.
ఓ గిన్నెలో నీళ్లూ, చక్కెరా తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. చక్కెర కరిగి బుడగల్లా వస్తున్నప్పుడు వేయించి పెట్టుకున్న గోధుమపిండి వేసేయాలి. మంట తగ్గించి మధ్యమధ్య కలుపుతూ ఉంటే.. ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇది దగ్గరగా అయి, గిన్నె అంచుల నుంచి విడిపోతున్నప్పుడు నెయ్యి వేసి దింపేయాలి.
జీడిపప్పు, కిస్‌మిస్ పలుకులు వేసి తినాలి.
Mushroom Biryani - మష్రూమ్ బిర్యాని
Mushroom Biryani - మష్రూమ్ బిర్యాని
-X¾Û-{d-’í-œ¿Õ-’¹Õ-©Õ:ƪ½ÂË©ð,
…Lx¤Ä-§ŒÕ-©Õ: 骢œ¿Õ,
šï«Öšð: ŠÂ¹šË,
¦Ç®¾t-A-G-§ŒÕu¢: 2 ¹X¾Ûp©Õ,
ÊÖ¯ç ©äŸÄ ¯çªáu: ƪ½Â¹X¾Ûp,
²ò§ŒÖ²Ä®ý: 2 šÌ®¾ÖpÊÕx,
Æ©x¢ÅŒÕ-ª½Õ-«á: ŠÂ¹šËÊoª½ šÌ®¾ÖpÊÕx,
„ç©ÕxLx 骦s©Õ: 4,
X¾*aNÕJa: 骢œ¿Õ,
ŸÄLa-Ê-Íç-¹ˆ: Æ¢’¹Õ-@Á¢Êoª½ «á¹ˆ,
§ŒÖ©Â¹×©Õ: 骢œ¿Õ,
©«¢’éÕ: 骢œ¿Õ,
Ÿ¿E§ŒÖ-©-¤ñ-œË: ŠÂ¹šËÊoª½ šÌ®¾ÖpÊÕx,
X¾ÛD¯Ã ‚¹שÕ: ÂíCl’Ã,
…X¾Ûp: ®¾JX¾œÄ,
E«ÕtÂçŒÕ: ®¾’¹¢«á-¹ˆ
-ÅŒ-§ŒÖ-ª½Õ-Íäæ® NŸµÄÊ¢
*G§ŒÕu¢ ¹œËT ’¹¢{æ®X¾Û ¯ÃÊE„ÃyL. ÅŒª½„ÃÅŒ F@ÁÙx «¢æX®Ï …¢ÍÃL.
*“åX†¾-ªý-¤Ä-¯þ©ð ÂíCl’à ¯çªáu „ä®Ï ¹œËTÊ G§ŒÕu¢ „ä®Ï „äªá¢* Bæ®§ŒÖL.
*X¾Û{d-’í-œ¿Õ-’¹Õ-Lo «á¹ˆ©Õ’à Âî®Ï X¾Â¹ˆÊ …¢ÍÃL. §ŒÖ©Â¹×©Õ, ©«¢’éÕ, Æ©x¢ÅŒÕ-ª½Õ-«á, ŸÄLa-Ê-Íç-¹ˆ, „ç©Õx-Lx-骦s©Õ...Æ-Fo ¹LXÏ „çÕÅŒh’à ª½Õ¦ÇsL.
*“åX†¾-ªý-¤Ä-¯þ©ð ®¾JX¾œÄ ÊÖ¯ç ©äŸÄ ¯çªáu „ä®Ï «Õ²Ä-©Ç-«á-Ÿ¿l „ä®Ï „äªá¢ÍÃL. ÅŒª½„ÃÅŒ …Lx«á¹ˆ©Õ „ä®Ï „äªá¢ÍÃL. ƒX¾Ûpœ¿Õ X¾Û{d-’í-œ¿Õ-’¹Õ© «á¹ˆ©Õ, šï«Öšð «á¹ˆ©Õ Â¹ØœÄ „ä®Ï X¾C ENÕ³Ä©Õ „äªá¢ÍÃL. ÅŒª½„ÃÅŒ ²ò§ŒÖ²Ä®ý „ä®Ï ¹©¤ÄL.
*ƒX¾Ûpœ¿Õ «âœ¿ÕÊoª½ ¹X¾Ûp© F@ÁÙx ¤ò®Ï «ÕJTÊ ÅŒª½„ÃÅŒ „äªá¢*Ê G§ŒÕu¢ „ä®Ï ¹©¤ÄL. Ÿ¿E§ŒÖ-©-¤ñœË, …X¾Ûp, X¾ÛD¯Ã „ä®Ï ¹LXÏ «âÅŒåXšËd Ō¹׈« «Õ¢{OÕŸ¿ X¾Cæ£ÇÊÕ ENÕ³Ä©Õ …œËÂË¢* C¢ÍÃL. ƒ†¾d„çÕiÅä A¯ä«á¢Ÿ¿Õ Âî¾h E«Õtª½®¾¢ XÏ¢œ¿ÕÂî«ÍŒÕa.
Labels:
Basmati Rice,
Cardamom,
Cinnamon,
Cloves,
Coriander,
Garlic,
Ginger,
Green Chillies,
Lemon,
Mint Leaves,
mushroom,
Oninons,
Soya Sauce,
Tomato
Brinjal Tomato Dal - వంకాయ టమోటా పప్పు
Brinjal Tomato Dal - వంకాయ టమోటా పప్పు
కావలసిన పదార్థాలు: వంకాయలు - పావు కేజీ,
కందిపప్పు - అరకప్పు,
టమోటాలు - 2,
పచ్చిమిర్చి - 2,
ఉప్పు - రుచికి తగినంత,
చింతపండు - నిమ్మకాయంత,
పసుపు - అర టీ స్పూను,
కొత్తిమీర తరుగు - అరకప్పు;
నూనె, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ, మినపప్పు - తిరగమోతకి సరిపడా.
తయారుచేసే విధానం:
కప్పు నీటిలో పప్పు, పసుపు వేసి మెత్తగా ఉడికించాలి. అవసరం అయితే మరో కప్పు నీరు కలిపి జారుగా మెదిపి పక్కనుంచాలి. నూనెలో తాలింపు వేగాక (చీరిన) పచ్చిమిర్చి, వంకాయ ముక్కలు వేసి మూతపెట్టి రెండు నిమిషాలు మగ్గించి టమోటా ముక్కలు కలపాలి. ముక్కలు మెత్తబడ్డాక ఉప్పు, పప్పు వేసి 5 నిమిషాలు చిన్నమంటపై మరిగించి కొత్తిమీర చల్లి దించేయాలి. ఈ పప్పు అన్నంతో పాటు పరాటాల్లోకి కూడా చాలా బాగుంటుంది. (ముదిరిన వంకాయలను కొందరు పారేస్తుంటారు. అలాంటివాటిని పప్పులో వాడుకోవచ్చు).
Labels:
Brinjal,
Coriander Leaves,
Cumin,
Curry Leaves,
Dal,
Green Chillies,
Mustard Seeds,
Oil,
Salt,
Tamarind,
Tomato,
Turmeric
Musk Melon Juice - మస్క్ మెలన్ జ్యూస్
Musk Melon Juice - మస్క్ మెలన్ జ్యూస్
కావలసినవి:ఖర్బూజ (మస్క్ మెలన్) - ఒకటి (మీడియం సైజ్),
పంచదార - రెండు టేబుల్ స్పూన్లు,
నిమ్మరసం - కొన్ని చుక్కలు (ఇష్టపడితేనే),
నీళ్లు - సరిపడా, ఐస్‌క్యూబ్స్ - కొన్ని.
తయారీ:
ఖర్బూజను శుభ్రంగా కడిగి మధ్యకి రెండుగా కోయాలి. తరువాత లోపలి గింజలను తీసేసి గరిటెతో గుజ్జును తీయాలి. ఆ గుజ్జును జార్‌లో వేసి పంచదార, నిమ్మరసం కలిపి మిక్సీ పట్టాలి. చిక్కగా అనిపిస్తే కొన్ని నీళ్లు కలుపుకోవచ్చు. జ్యూస్‌ను గ్లాసులో పోసి ఐస్‌క్యూబ్స్ కలుపుకుని తాగితే చల్లగా, కమ్మగా హాయిగా ఉంటుంది. తక్షణ శక్తి కూడా వస్తుంది.
- నీళ్లకు బదులుగా వేడి లేదా చల్లటి పాలు వాడొచ్చు. పాలు కలిపితే మిల్క్‌షేక్ అవుతుంది. కాకపోతే ఇందులో ఎక్కువ పంచదార కలపాల్సి వస్తుంది. పాలు కలిపినప్పుడు నిమ్మరసం కలపకూడదు. అవసరమనుకుంటే యాలక్కాయ పొడిని పైన చల్లుకుని తాగొచ్చు.
Mint Shartat - పుదీనా షర్బత్
Mint Shartat - పుదీనా షర్బత్
కావలసినవి:పుదీనా ఆకులు - ఒకటిన్నర కప్పు
బెల్లం పొడి లేదా పంచదార - తొమ్మిది లేదా పది టేబుల్ స్పూన్లు
నీళ్లు - అరకప్పు
బ్లాక్ సాల్ట్ - అర టీస్పూన్
జీలకర్ర పొడి - ఒక టీస్పూన్
నిమ్మరసం - మూడు నుంచి నాలుగు టీస్పూన్లు
తయారీ:
పుదీనా ఆకుల్ని రెండుమూడుసార్లు శుభ్రంగా కడగాలి. ఆ తరువాత పైన చెప్పిన పదార్థాలన్నింటినీ బ్లెండర్‌లో వేసి మెత్తటి పేస్ట్‌లా మిక్సీ చేసి, వడకట్టాలి. వడకట్టిన పుదీనా రసంలో పావు భాగం తీసుకుని అందులో ముప్పావు భాగం నీళ్లు పోసి స్పూన్‌తో బాగా కలియతిప్పాలి. ఆ తరువాత ఐస్‌క్యూబ్స్ వేసుకుని చల్లచల్లగా తాగితే ఫ్రెష్ ఫీలింగ్ మీ సొంతమవుతుంది.
బెల్లం బదులు తేనె కూడా వాడొచ్చు. ఈ కొలతలతో తయారుచేసిన షర్బత్ ముగ్గురికి సరిపోతుంది.
Saunf Sharbat - సోపు గింజలతో షర్భత్
Saunf (Variyali) Sharbat - సోపు గింజలతో షర్భత్
నోటిని శుభ్రం చేసుకోవటానికి సోపు గింజలను వాడుతూ ఉంటారు. దీని వల్ల జీర్ణశక్తి బాగా పెరుగుతుందని ఆయిర్వేద నిపుణులు పేర్కొంటూ ఉంటారు.జీర్ణశక్తిని పెంచటంతో పాటుగా, వేసవిలో వేడికి ఇది మందులా పనిచేస్తుందని చాలా మంది భావిస్తారు. ముఖ్యంగా గుజరాత్‌లో సొపుతో చేసి షర్భత్‌కు వేసవిలో చాలా డిమాండ్ ఉంటుంది. ఈ షర్భత్‌ను ఎలా చేయాలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
సొపు గింజలు- పావుకప్పు,
పటిక బెల్లం- రెండున్నర చెంచాలు,
నీళ్లు- రెండున్నర కప్పులు,
లవంగం- ఒకటి.
చేసే విధానం :
సోపు గింజలను, లవంగాన్ని పొడి చేయాలి. ఈ పొడిని కనీసం రెండు గంటలు నీటిలో నానపెట్టాలి. ఆ మిశ్రమాన్ని వడబోసి, సోపుగింజల పొడి ముద్దను వేరు చేయాలి. మిశ్రమంలో పటిక బెల్లం పొడిని కలపాలి. దీనిని ఐస్ క్యూబ్స్‌తో కలిపి సర్వ్ చేయాలి. దీనిలో నిమ్మరసం వేసుకుంటే చాలా బావుంటుంది. కొందరు మిరియాల పొడిని కూడా ఈ మిశ్రమంలో కొద్దిగా కలుపుతారు.
Ruby Red grape fruit cocktail - రూబీ-రెడ్ గ్రేప్‌ఫ్రూట్ కాక్‌టెయిల్
Ruby Red grape fruit cocktail - రూబీ-రెడ్ గ్రేప్‌ఫ్రూట్ కాక్‌టెయిల్
వేసవిలో దాహం తీర్చుకోవడానికి రకరకాల డ్రింక్స్ తాగుతుంటారు. అయితే అలాంటి డ్రింక్స్‌కు బదులుగా ఫ్రూట్ జ్యూస్ తాగితే దాహం తీరడంతో పాటు పోషకాలు లభిస్తాయి. అలాంటి వాటిలో ముఖ్యమైనది రూబీ-రెడ్ గ్రేప్‌ఫ్రూట్ కాక్‌టెయిల్. ఒంటికి సి-విటమిన్ ఇస్తుంది. దీన్ని ఇంట్లో ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.కావలసిన పదార్థాలు
ఒకటిన్నర కప్పు - రెడ్ లేక పింక్ గ్రేప్‌ఫ్రూట్ జ్యూస్
ఒకటిన్నర కప్పు - సాదా సోడా
అరకప్పు - జిన్
రెండు టేబుల్‌స్పూన్ల - కాంపరి
ఐస్‌క్యూబ్స్ - తగినన్ని
కొన్ని గ్రేప్‌ఫ్రూట్ ముక్కలు - గార్నిష్ కోసం.
తయారుచేయు విధానం
గ్రేప్‌ఫ్రూట్ జ్యూస్ తీసుకుని అందులో జిన్, సోడా, కాంపరి కలుపుకోవాలి. తరువాత గ్లాసుల్లో పోసుకుని ఐస్‌క్యూబ్స్ వేసుకోవాలి. పండ్ల ముక్కలతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. వేసవిలో ఈ డ్రింక్ చల్లదనాన్ని ఇస్తుంది. శరీరానికి కావలసిన విటమిన్-సి లభిస్తుంది.
Soya Dosa - సోయా దోశ
కావలసిన పదార్థాలు:
సోయా పాలు - 1 కప్పు
గోధుమ పిండి - పావు కప్పు
పచ్చిమిర్చి - 1
ఉల్లి తరుగు - అర కప్పు
కొత్తిమీర - 1 టే.స్పూను
బేకింగ్ సోడా - పావు స్పూను
నూనె, ఉప్పు - తగినంత
తయారీ విధానం:
అన్నిటినీ కలిపి దోశలా పిండిలా తయారు చేసుకోవాలి.
పెనం వేడెక్కాక పిండి పోసి రెండు వైపులా కాల్చుకోవాలి.
టమాటో సాస్‌తో వడ్డించాలి.
సోయా పాలు - 1 కప్పు
గోధుమ పిండి - పావు కప్పు
పచ్చిమిర్చి - 1
ఉల్లి తరుగు - అర కప్పు
కొత్తిమీర - 1 టే.స్పూను
బేకింగ్ సోడా - పావు స్పూను
నూనె, ఉప్పు - తగినంత
తయారీ విధానం:
అన్నిటినీ కలిపి దోశలా పిండిలా తయారు చేసుకోవాలి.
పెనం వేడెక్కాక పిండి పోసి రెండు వైపులా కాల్చుకోవాలి.
టమాటో సాస్‌తో వడ్డించాలి.
Onion Ravva Dosa - ఆనియన్ రవ్వ దోశ
కావలసిన పదార్థాలు:
బొంబాయి రవ్వ - 1 కప్పు
బియ్యం పిండి - 1 కప్పు
పచ్చిమిర్చి - 3
అల్లం - అర అంగుళం (సన్నగా తరగాలి)
మిరియాలు - అర టీస్పూను
జీలకర్ర - పావు టీస్పూను
ఉప్పు - తగినంత
ఉల్లిపాయలు - 3
వేయించిన జీడిపప్పు పలుకులు - 3 టీస్పూన్లు
తయారీ విధానం:
బియ్యం పిండి, రవ్వలకు నీళ్లు చేర్చి గంట జారుడుగా కలుపుకోవాలి.
జీలకర్ర, ఉప్పు పిండిలో వేసి కలపాలి.
పిండిని 4 గంటలపాటు పక్కన ఉంచి.. పులియనివ్వాలి.
ఉల్లి, పచ్చిమిర్చి, అల్లం, జీడిపప్పు, మిరియాలు కూడా వేసి కలుపుకోవాలి.
పెనం వేడిచేసి కాసింత నూనె పోయాలి.
పిండిని దోశలా పోసి ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు చల్లాలి.
నూనె పోసి దోశ కాల్చాలి.
వేడిగా సాంబార్ లేదా చట్నీతో వడ్డించాలి.
బొంబాయి రవ్వ - 1 కప్పు
బియ్యం పిండి - 1 కప్పు
పచ్చిమిర్చి - 3
అల్లం - అర అంగుళం (సన్నగా తరగాలి)
మిరియాలు - అర టీస్పూను
జీలకర్ర - పావు టీస్పూను
ఉప్పు - తగినంత
ఉల్లిపాయలు - 3
వేయించిన జీడిపప్పు పలుకులు - 3 టీస్పూన్లు
తయారీ విధానం:
బియ్యం పిండి, రవ్వలకు నీళ్లు చేర్చి గంట జారుడుగా కలుపుకోవాలి.
జీలకర్ర, ఉప్పు పిండిలో వేసి కలపాలి.
పిండిని 4 గంటలపాటు పక్కన ఉంచి.. పులియనివ్వాలి.
ఉల్లి, పచ్చిమిర్చి, అల్లం, జీడిపప్పు, మిరియాలు కూడా వేసి కలుపుకోవాలి.
పెనం వేడిచేసి కాసింత నూనె పోయాలి.
పిండిని దోశలా పోసి ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు చల్లాలి.
నూనె పోసి దోశ కాల్చాలి.
వేడిగా సాంబార్ లేదా చట్నీతో వడ్డించాలి.
Labels:
Bombay Ravva,
Cashewnut,
Cumin,
dosa,
Ginger,
Green Chillies,
Oninons,
Pepper,
Rice Flour,
Salt
Cheese Chilli Dosa - చీజ్ చిల్లీ దోశ
కావలసిన పదార్థాలు:
బియ్యం - అర కిలో
మినప్పప్పు - 100 గ్రా
శనగపప్పు - 50 గ్రా
ఉప్పు - తగినంత
చీజ్ - 50 గ్రా
పచ్చిమిర్చి - కొన్ని ముక్కలు
తయారీ విధానం:
బియ్యం, పప్పు రాత్రంతా నానబెట్టాలి.
పొద్దున్నే ఉప్పు కలుపుకోవాలి.
పెనం వేడి చేసి ముందుగా నూనె పూసి తర్వాత నీళ్లు చల్లాలి.
పిండిని దోశగా పోసుకోవాలి.
చీజ్, పచ్చిమిర్చి తరుగు పట్టించాలి. నూనె వేసి దోరగా కాల్చి తీయాలి.
బియ్యం - అర కిలో
మినప్పప్పు - 100 గ్రా
శనగపప్పు - 50 గ్రా
ఉప్పు - తగినంత
చీజ్ - 50 గ్రా
పచ్చిమిర్చి - కొన్ని ముక్కలు
తయారీ విధానం:
బియ్యం, పప్పు రాత్రంతా నానబెట్టాలి.
పొద్దున్నే ఉప్పు కలుపుకోవాలి.
పెనం వేడి చేసి ముందుగా నూనె పూసి తర్వాత నీళ్లు చల్లాలి.
పిండిని దోశగా పోసుకోవాలి.
చీజ్, పచ్చిమిర్చి తరుగు పట్టించాలి. నూనె వేసి దోరగా కాల్చి తీయాలి.




















