Ads 468x60px

Pages

Learn English Vocabulary & Help the Poor| |Free Rice |
Showing posts with label Pepper. Show all posts
Showing posts with label Pepper. Show all posts

Mushroom Noodles _ పుట్టగొడుగుల నూడుల్స్‌

Mushroom Noodles _ పుట్టగొడుగుల నూడుల్స్‌









కావలసినవి 
పుట్టగొడుగులు: పావుకిలో, 
నూడుల్స్‌: పావుకిలో, 
ఉల్లిపాయలు: రెండు, 
వెల్లుల్లి: పది రెబ్బలు, 
క్రీమ్‌: కప్పు, 
చీజ్‌ తురుము: 2 టేబుల్‌స్పూన్లు, 
వెన్న: 3 టేబుల్‌స్పూన్లు, 
జీలకర్ర: టీస్పూను, 
ఉప్పు: రుచికి సరిపడా, 
మిరియాలపొడి: అరటీస్పూను
తయారుచేసే విధానం 

* నూడుల్స్‌ను ఉడికించి నీళ్లు వంపి చన్నీళ్లతో కడగాలి. 

* పుట్టగొడుగుల్ని చిన్న ముక్కలుగా కోయాలి. ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు సన్నని ముక్కల్లా కోయాలి. 

* బాణలిలో టేబుల్‌స్పూను వెన్న వేసి కరిగించాలి. 
* ఉడికించిన నూడుల్స్‌, చిటికెడు ఉప్పు వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి. 
* ఇప్పుడు మిగిలిన వెన్న వేసి ఉల్లిపాయ, వెల్లుల్లి ముక్కలు వేసి వేయించాలి. 
* పుట్టగొడుగుల ముక్కలు, జీలకర్ర వేసి రెండు నిమిషాలు వేయించాలి. 
* తరవాత ఉప్పు, మిరియాలపొడి, నూడుల్స్‌, క్రీమ్‌ వేసి కాసేపు ఉడికించాలి. 
* చివరగా తురిమిన చీజ్‌ వేసి ఓ నిమిషం వేయించి దించాలి.

Egg Noodles _ గుడ్డు నూడుల్స్‌

Egg Noodles _ గుడ్డు నూడుల్స్‌















కావలసినవి
హాకా నూడుల్స్‌: పావుకిలో, 
క్యారెట్‌, క్యాప్సికమ్‌ ముక్కలు: పావుకప్పు చొప్పున, సోయాసాస్‌: టీస్పూను, 
టొమాటోసాస్‌: 2 టీస్పూన్లు, 
పాస్టాసాస్‌: 2 టీస్పూను, 
నిమ్మరసం: అరటీస్పూను, 
గుడ్లు: రెండు, 
వెల్లుల్లిరెబ్బలు: మూడు, 
ఉల్లిపాయ: ఒకటి, 
మిరియాలపొడి: అరటీస్పూను, 
నూనె: 2 టేబుల్‌స్పూన్లు
తయారుచేసే విధానం
* నీళ్లు మరిగించి నూడుల్స్‌ ఉడికించి చల్లని నీళ్లతో కడిగి ఉంచాలి.

* బాణలిలో అరటీస్పూను నూనె వేసి గుడ్లసొన, చిటికెడు ఉప్పు, మిరియాలపొడి వేసి బాగా కలుపుతూ పొరటులా వేయించి తీసి పక్కన ఉంచాలి. 

* మరో బాణలిలో మిగిలిన నూనె వేసి కాగాక వెల్లుల్లి, ఉల్లిపాయలు వేసి రెండు నిమిషాలు వేయించాలి. 

* తరవాత సన్నగా తరిగిన కూరగాయ ముక్కలు వేసి వేయించాలి. 

* తరవాత కొద్దిగా నీళ్లు చిలకరించి సోయాసాస్‌ వేసి కలిపి సిమ్‌లో పెట్టాలి. 

* ఇప్పుడు పాస్టా సాస్‌, టొమాటో సాస్‌, ఉప్పు, మిరియాలపొడి వేసి బాగా కలపాలి. 

* గుడ్డు పొరటును కూడా వేసి బాగా కలపాలి. 

* చివరగా ఉడికించి పక్కన ఉంచిన నూడుల్స్‌ వేసి బాగా కలిపి రెండు నిమిషాలు వేయించాలి. 

* తరవాత నిమ్మరసం కలిపి దించాలి.

katte pongali_కట్టె పొంగలి

katte pongali_కట్టె పొంగలి

కావల్సినవి:
బియ్యం- అరకప్పు,
పెసరపప్పు- పావు కప్పు,
నీళ్లు- రెండు కప్పులు,
ఉప్పు- తగినంత.

తాలింపు కోసం: 
నెయ్యి- మూడు చెంచాలు,
జీలకర్ర- చెంచా,
మిరియాలు- చెంచా,
అల్లం - చిన్న ముక్క,
కరివేపాకు- నాలుగు రెబ్బలు,
జీడిపప్పులు- పది.

తయారీ:
1) బియ్యం, పెసరపప్పును కడిగి కుక్కర్‌లో తీసుకుని నీళ్లు పోయాలి.
2) మూడు కూతలు వచ్చేవరకూ ఉడికించుకుని తీసుకోవాలి.
3) ఇప్పుడు బాణలిని పొయ్యిమీద పెట్టి నెయ్యి వేయాలి.
4) అది కరిగాక జీడిపప్పు వేయించాలి.
5) అవి కాస్త ఎర్రగా వేగాక జీలకర్రా, మిరియాలపొడీ, కరివేపాకూ, అల్లం తరుగు వేయాలి.
6) అవి కూడా వేగాక బాణలి దించేయాలి.
7) ఈ తాలింపూ, సరిపడా ఉప్పు ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నంలో వేసి కలపాలి.
8) ఈ పొంగలిని మరోసారి పొయ్యిమీద పెట్టి రెండు నిమిషాలయ్యాక దింపేయాలి

Onion Ravva Dosa - ఆనియన్‌ రవ్వ దోశ

కావలసిన పదార్థాలు:
బొంబాయి రవ్వ - 1 కప్పు
బియ్యం పిండి - 1 కప్పు
పచ్చిమిర్చి - 3
అల్లం - అర అంగుళం (సన్నగా తరగాలి)
మిరియాలు - అర టీస్పూను
జీలకర్ర - పావు టీస్పూను
ఉప్పు - తగినంత
ఉల్లిపాయలు - 3
వేయించిన జీడిపప్పు పలుకులు - 3 టీస్పూన్లు

తయారీ విధానం:
బియ్యం పిండి, రవ్వలకు నీళ్లు చేర్చి గంట జారుడుగా కలుపుకోవాలి.
జీలకర్ర, ఉప్పు పిండిలో వేసి కలపాలి.
పిండిని 4 గంటలపాటు పక్కన ఉంచి.. పులియనివ్వాలి.
ఉల్లి, పచ్చిమిర్చి, అల్లం, జీడిపప్పు, మిరియాలు కూడా వేసి కలుపుకోవాలి.
పెనం వేడిచేసి కాసింత నూనె పోయాలి.
పిండిని దోశలా పోసి ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు చల్లాలి.
నూనె పోసి దోశ కాల్చాలి.
వేడిగా సాంబార్‌ లేదా చట్నీతో వడ్డించాలి.

Varieties with Wheat flour - గోధూమ్‌ధామ్

గోధూమ్‌ధామ్
గోధుమపిండి...
ఏముందిలే... చపాతీ, పూరీలేగా చేసేది అని చప్పరించేయకండి.
అదే పిండికి కొన్ని ఆధరువులు తగిలిస్తే...
చపాతీ, పూరీలు సైతం చవులూరించే
కొత్త రుచులకు కేంద్రమవుతాయి.
గోధుమపిండితోనే స్వీటు, దోసెల లాంటి వెరైటీలూ ఉన్నాయండోయ్!
అందుకే, గోధుమలతో ధూమ్‌ధామ్... ఈ ఆదివారం మీ ఫ్యామిలీలో...
 

బంగాళదుంప - కొత్తిమీర చపాతీ
 
కావలసినవి: గోధుమ పిండి - 2 కప్పులు; బంగాళదుంపలు - 8; కొత్తిమీర - ఒక కట్ట, పచ్చి మిర్చి - 4; ఇంగువ - చిటికెడు, ఉప్పు, నెయ్యి - తగినంత
తయారీ: ఒక పాత్రలో గోధుమ పిండి, ఉప్పు, నీళ్లు వేసి చపాతీ పిండిలా కలిపి పక్కన ఉంచాలి.
 బంగాళదుంపలను  ఉడికించి తొక్క తీసి మెత్తగా చిదిమి పక్కన ఉంచాలి  కొత్తిమీర , పచ్చి మిర్చి శుభ్రంగా కడిగి, మిక్సీలో వేసి మెత్తగా చేయాలి   ఒక పాత్రలో బంగాళదుంప మిశ్రమం, కొత్తిమీర మిశ్రమం వేసి, ఇంగువ జత చేసి బాగా కలపాలి   చిన్న చిన్న ఉండలుగా చేయాలి ఒక్కో ఉండను గుండ్రంగా ఒత్తి, అందులో బంగాళదుంప మిశ్రమం ఉంచాలి. అంచులు మూసేసి, పిండి కొద్దిగా అద్దుతూ చపాతీలా ఒత్తాలి  స్టౌ మీద పాన్ వేడి చేసి, ఒత్తి ఉంచుకున్న చపాతీని వేసి రెండు వైపులా నెయ్యి వేసి బాగా కాల్చి తీసేయాలి వేడివేడిగా వడ్డించాలి.

 గోధుమ హల్వా


కావలసినవి: గోధుమ పిండి - కప్పు; పంచదార - 2 కప్పులు; మిఠాయి రంగు - చిటికెడు (కొద్దిపాటి నీళ్లలో వేసి కలిపి ఉంచాలి); ఏలకుల పొడి - పావు టీ స్పూను; నెయ్యి - తగినంత
 తయారీ:ఒక పాత్రలో కప్పుడు నీళ్లు, గోధుమ పిండి వేసి కలపాలి  వేరొక పాత్రలో పావు కప్పు నీళ్లు, పంచదార వేసి బాగా కలపాలి. స్టౌ మీద ఈ పాత్ర ఉంచి, పంచదార కరిగేవరకు కలపాలి నీళ్లలో కలిపి ఉంచుకున్న గోధుమపిండి, మిఠాయి రంగు, ఏలకుల పొడి, నెయ్యి వేసి అడుగంటకుండా కలపాలి  మిశ్రమం బాగా ఉడికిందనిపించాక, స్టౌ కట్టేయాలి పెద్ద పళ్లానికి నెయ్యి రాసి, ఉడికించుకున్న హల్వా పోసి, సమానంగా పరిచి కట్ చేసుకోవాలి.
 
 టొమాటో  చీజ్ పూరీ
 
కావలసినవి గోధుమపిండి - కప్పు మైదా పిండి - కప్పు టొమాటో రసం - కప్పుకారం - టీ స్పూను చీజ్ తురుము - కప్పు ఉప్పు - తగినంత
 నూనె - తగినంత
 
తయారీ ఒక పాత్రలో పైన చెప్పిన పదార్థాలన్నీ వేసి, చపాతీ పిండిలా కలిపి సుమారు అర గంటసేపు నాననివ్వాలి.బాణలిలో నూనె వేసి కాచాలి.పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి, పూరీలా ఒత్తి, నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించాలి. పేపర్ టవల్ మీదకు తీసుకుని, వెజిటబుల్ సలాడ్‌తో వేడివేడిగా అందించాలి.
 
కశ్మీరీ చపాతీ
 
కావలసినవి: గోధుమపిండి - కప్పు, సోంపు - అర టీ స్పూను; జీలకర్ర - అర టీ స్పూను, వాము - పావు టీ స్పూను; మిరియాలు - 10, ఇంగువ - పావు టీ స్పూను; పాలు - తగినన్ని, ఉప్పు - తగినంత; నెయ్యి - కొద్దిగా
 
తయారీ: ముందుగా బాణలిలో సోంపు, జీలకర్ర, వాము, మిరియాలను నూనె లేకుండా వేయించి, చల్లార్చి మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి  ఒక పాత్రలో గోధుమపిండి, పొడి చేసి ఉంచుకున్న మసాలా, ఇంగువ, పాలు, ఉప్పు, తగినన్ని నీళ్లు వేసి, చపాతీ పిండిలా కలిపి పక్కన ఉంచాలి  స్టౌ మీద పెనం ఉంచి వేడి చేయాలి  పిండిని కొద్దిగా తీసుకుని చపాతీలా ఒత్తి, పెనం మీద వేసి రెండువైపులా నేతితో కాల్చి తీయాలి. వేడివేడిగా ఏదైనా కూరతో అందించాలి.
Learn English Vocabulary & Help the Poor |Free Rice |
 
google-site-verification: google2463dc209284d38a.html