Ads 468x60px

Pages

Learn English Vocabulary & Help the Poor| |Free Rice |
Showing posts with label Sugar. Show all posts
Showing posts with label Sugar. Show all posts

Carrot Pickle_క్యారెట్‌ పచ్చడి

Carrot Pickle_క్యారెట్‌ పచ్చడి

కావల్సినవి:
ధనియాలపొడి,
ఆవపొడి - చెంచా చొప్పున,
జీలకర్రపొడి - అరచెంచా,
మెంతిపొడి - పావు చెంచా,
కారం - రెండు చెంచాలు,
ఉప్పు - తగినంత,
ఇంగువ - చిటికెడు,
క్యారెట్లు - పదిహేను (చెక్కు తీసి ముక్కల్లా తరగాలి),
ఉల్లిపాయలు - రెండు,
అల్లంవెల్లుల్లి పేస్టు - అరచెంచా,
ఎండుమిర్చి - రెండు,
కరివేపాకు - రెండురెబ్బలు,
చక్కెర - కొద్దిగా,
నిమ్మరసం - మూడు చెంచాలు,
మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర - పావుచెంచా చొప్పున,
నూనె - కప్పు.

తయారీ:
ఉల్లిపాయల్ని తరిగి మిక్సీలో పేస్టులా చేసుకోవాలి.
ఇప్పుడు బాణలిలో అరకప్పు నూనె వేడిచేసి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చిని వేయించాలి.
ఆ తరవాత కరివేపాకు రెబ్బలు వేసి అవి కూడా వేగాక ఇంగువ, ఉల్లిపాయ మిశ్రమం, అల్లంవెల్లుల్లి పేస్టు వేసి బాగా వేయించాలి.
ఉల్లిపాయల పచ్చివాసన పోయాక దింపేయాలి.
అందులో సన్నగా తరిగిన క్యారెట్‌ ముక్కలు, నిమ్మరసం, తగినంత ఉప్పుతోపాటు మిగిలిన అన్ని పదార్థాల్నీ వేసేయాలి.
మిగిలిన నూనె కూడా వేసేస్తే స్పైసీ క్యారెట్‌ పచ్చడి రెడీ.
ఇది వేడివేడి అన్నంలోకే కాదు.. చపాతీల్లోకీ బాగుంటుంది.

Wheat Halwa - గోధుమ హల్వా

Wheat Halwa - గోధుమ హల్వా

                           

కావల్సినవి:
గోధుమపిండి - కప్పు,
చక్కెర - ఒకటింబావు కప్పు,
నీళ్లు - ఒకటింబావు కప్పు,
వెన్న - పావుకప్పు,
జీడిపప్పూ, కిస్‌మిస్‌ పలుకులు- కొన్ని,
నెయ్యి - చెంచా.

 తయారీ:
బాణలిలో కొద్దిగా వెన్న కరిగించి జీడిపప్పూ, కిస్‌మిస్‌ పలుకుల్ని వేయించుకుని విడిగా తీసి పెట్టుకోవాలి. అదే బాణలిలో మిగిలిన వెన్న కరిగించి గోధుమపిండిని వేయించుకోవాలి. గోధుమపిండి కాస్త రంగు మారి, కమ్మటి వాసన వచ్చేవరకూ వేయించుకుని తీసుకోవాలి.

ఓ గిన్నెలో నీళ్లూ, చక్కెరా తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. చక్కెర కరిగి బుడగల్లా వస్తున్నప్పుడు వేయించి పెట్టుకున్న గోధుమపిండి వేసేయాలి. మంట తగ్గించి మధ్యమధ్య కలుపుతూ ఉంటే.. ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇది దగ్గరగా అయి, గిన్నె అంచుల నుంచి విడిపోతున్నప్పుడు నెయ్యి వేసి దింపేయాలి.

జీడిపప్పు, కిస్‌మిస్‌ పలుకులు వేసి తినాలి.

Musk Melon Juice - మస్క్‌ మెలన్‌ జ్యూస్‌

Musk Melon Juice - మస్క్‌ మెలన్‌ జ్యూస్‌

కావలసినవి: 
ఖర్బూజ (మస్క్‌ మెలన్‌) - ఒకటి (మీడియం సైజ్‌),
పంచదార - రెండు టేబుల్‌ స్పూన్లు,
నిమ్మరసం - కొన్ని చుక్కలు (ఇష్టపడితేనే),
నీళ్లు - సరిపడా, ఐస్‌క్యూబ్స్‌ - కొన్ని.

తయారీ: 
ఖర్బూజను శుభ్రంగా కడిగి మధ్యకి రెండుగా కోయాలి. తరువాత లోపలి గింజలను తీసేసి గరిటెతో గుజ్జును తీయాలి. ఆ గుజ్జును జార్‌లో వేసి పంచదార, నిమ్మరసం కలిపి మిక్సీ పట్టాలి. చిక్కగా అనిపిస్తే కొన్ని నీళ్లు కలుపుకోవచ్చు. జ్యూస్‌ను గ్లాసులో పోసి ఐస్‌క్యూబ్స్‌ కలుపుకుని తాగితే చల్లగా, కమ్మగా హాయిగా ఉంటుంది. తక్షణ శక్తి కూడా వస్తుంది.

- నీళ్లకు బదులుగా వేడి లేదా చల్లటి పాలు వాడొచ్చు. పాలు కలిపితే మిల్క్‌షేక్‌ అవుతుంది. కాకపోతే ఇందులో ఎక్కువ పంచదార కలపాల్సి వస్తుంది. పాలు కలిపినప్పుడు నిమ్మరసం కలపకూడదు. అవసరమనుకుంటే యాలక్కాయ పొడిని పైన చల్లుకుని తాగొచ్చు.

Mint Shartat - పుదీనా షర్బత్‌

Mint Shartat - పుదీనా షర్బత్‌

కావలసినవి:
పుదీనా ఆకులు - ఒకటిన్నర కప్పు
బెల్లం పొడి లేదా పంచదార - తొమ్మిది లేదా పది టేబుల్‌ స్పూన్లు
నీళ్లు - అరకప్పు
బ్లాక్‌ సాల్ట్‌ - అర టీస్పూన్‌
జీలకర్ర పొడి - ఒక టీస్పూన్‌
నిమ్మరసం - మూడు నుంచి నాలుగు టీస్పూన్లు

తయారీ:
పుదీనా ఆకుల్ని రెండుమూడుసార్లు శుభ్రంగా కడగాలి. ఆ తరువాత పైన చెప్పిన పదార్థాలన్నింటినీ బ్లెండర్‌లో వేసి మెత్తటి పేస్ట్‌లా మిక్సీ చేసి, వడకట్టాలి. వడకట్టిన పుదీనా రసంలో పావు భాగం తీసుకుని అందులో ముప్పావు భాగం నీళ్లు పోసి స్పూన్‌తో బాగా కలియతిప్పాలి. ఆ తరువాత ఐస్‌క్యూబ్స్‌ వేసుకుని చల్లచల్లగా తాగితే ఫ్రెష్‌ ఫీలింగ్‌ మీ సొంతమవుతుంది.

బెల్లం బదులు తేనె కూడా వాడొచ్చు. ఈ కొలతలతో తయారుచేసిన షర్బత్‌ ముగ్గురికి సరిపోతుంది.

Varieties with Wheat flour - గోధూమ్‌ధామ్

గోధూమ్‌ధామ్
గోధుమపిండి...
ఏముందిలే... చపాతీ, పూరీలేగా చేసేది అని చప్పరించేయకండి.
అదే పిండికి కొన్ని ఆధరువులు తగిలిస్తే...
చపాతీ, పూరీలు సైతం చవులూరించే
కొత్త రుచులకు కేంద్రమవుతాయి.
గోధుమపిండితోనే స్వీటు, దోసెల లాంటి వెరైటీలూ ఉన్నాయండోయ్!
అందుకే, గోధుమలతో ధూమ్‌ధామ్... ఈ ఆదివారం మీ ఫ్యామిలీలో...
 

బంగాళదుంప - కొత్తిమీర చపాతీ
 
కావలసినవి: గోధుమ పిండి - 2 కప్పులు; బంగాళదుంపలు - 8; కొత్తిమీర - ఒక కట్ట, పచ్చి మిర్చి - 4; ఇంగువ - చిటికెడు, ఉప్పు, నెయ్యి - తగినంత
తయారీ: ఒక పాత్రలో గోధుమ పిండి, ఉప్పు, నీళ్లు వేసి చపాతీ పిండిలా కలిపి పక్కన ఉంచాలి.
 బంగాళదుంపలను  ఉడికించి తొక్క తీసి మెత్తగా చిదిమి పక్కన ఉంచాలి  కొత్తిమీర , పచ్చి మిర్చి శుభ్రంగా కడిగి, మిక్సీలో వేసి మెత్తగా చేయాలి   ఒక పాత్రలో బంగాళదుంప మిశ్రమం, కొత్తిమీర మిశ్రమం వేసి, ఇంగువ జత చేసి బాగా కలపాలి   చిన్న చిన్న ఉండలుగా చేయాలి ఒక్కో ఉండను గుండ్రంగా ఒత్తి, అందులో బంగాళదుంప మిశ్రమం ఉంచాలి. అంచులు మూసేసి, పిండి కొద్దిగా అద్దుతూ చపాతీలా ఒత్తాలి  స్టౌ మీద పాన్ వేడి చేసి, ఒత్తి ఉంచుకున్న చపాతీని వేసి రెండు వైపులా నెయ్యి వేసి బాగా కాల్చి తీసేయాలి వేడివేడిగా వడ్డించాలి.

 గోధుమ హల్వా


కావలసినవి: గోధుమ పిండి - కప్పు; పంచదార - 2 కప్పులు; మిఠాయి రంగు - చిటికెడు (కొద్దిపాటి నీళ్లలో వేసి కలిపి ఉంచాలి); ఏలకుల పొడి - పావు టీ స్పూను; నెయ్యి - తగినంత
 తయారీ:ఒక పాత్రలో కప్పుడు నీళ్లు, గోధుమ పిండి వేసి కలపాలి  వేరొక పాత్రలో పావు కప్పు నీళ్లు, పంచదార వేసి బాగా కలపాలి. స్టౌ మీద ఈ పాత్ర ఉంచి, పంచదార కరిగేవరకు కలపాలి నీళ్లలో కలిపి ఉంచుకున్న గోధుమపిండి, మిఠాయి రంగు, ఏలకుల పొడి, నెయ్యి వేసి అడుగంటకుండా కలపాలి  మిశ్రమం బాగా ఉడికిందనిపించాక, స్టౌ కట్టేయాలి పెద్ద పళ్లానికి నెయ్యి రాసి, ఉడికించుకున్న హల్వా పోసి, సమానంగా పరిచి కట్ చేసుకోవాలి.
 
 టొమాటో  చీజ్ పూరీ
 
కావలసినవి గోధుమపిండి - కప్పు మైదా పిండి - కప్పు టొమాటో రసం - కప్పుకారం - టీ స్పూను చీజ్ తురుము - కప్పు ఉప్పు - తగినంత
 నూనె - తగినంత
 
తయారీ ఒక పాత్రలో పైన చెప్పిన పదార్థాలన్నీ వేసి, చపాతీ పిండిలా కలిపి సుమారు అర గంటసేపు నాననివ్వాలి.బాణలిలో నూనె వేసి కాచాలి.పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి, పూరీలా ఒత్తి, నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించాలి. పేపర్ టవల్ మీదకు తీసుకుని, వెజిటబుల్ సలాడ్‌తో వేడివేడిగా అందించాలి.
 
కశ్మీరీ చపాతీ
 
కావలసినవి: గోధుమపిండి - కప్పు, సోంపు - అర టీ స్పూను; జీలకర్ర - అర టీ స్పూను, వాము - పావు టీ స్పూను; మిరియాలు - 10, ఇంగువ - పావు టీ స్పూను; పాలు - తగినన్ని, ఉప్పు - తగినంత; నెయ్యి - కొద్దిగా
 
తయారీ: ముందుగా బాణలిలో సోంపు, జీలకర్ర, వాము, మిరియాలను నూనె లేకుండా వేయించి, చల్లార్చి మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి  ఒక పాత్రలో గోధుమపిండి, పొడి చేసి ఉంచుకున్న మసాలా, ఇంగువ, పాలు, ఉప్పు, తగినన్ని నీళ్లు వేసి, చపాతీ పిండిలా కలిపి పక్కన ఉంచాలి  స్టౌ మీద పెనం ఉంచి వేడి చేయాలి  పిండిని కొద్దిగా తీసుకుని చపాతీలా ఒత్తి, పెనం మీద వేసి రెండువైపులా నేతితో కాల్చి తీయాలి. వేడివేడిగా ఏదైనా కూరతో అందించాలి.

Malai Peda - మలై పేడా

Malai Peda - మలై పేడా

 కావలసినవి:
చిక్కటి పాలు - రెండున్నర కప్పులు; పల్చటి పాలు - రెండున్నర కప్పులు; కుంకుమ పువ్వు - కొద్దిగా; నిమ్మ ఉప్పు - పావు టీ స్పూను; కార్న్ ఫ్లోర్ - 2 టీ స్పూన్లు (పల్చటి పాలలో వేసి కరిగించాలి); ఏలకుల పొడి - అర టీ స్పూను; పంచదార - 4 టీస్పూన్లు; పిస్తా పప్పులు - టీ స్పూను (చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి)

 తయారీ:  

నాలుగు టీ స్పూన్ల చిక్కటి పాలను పక్కన ఉంచి, మిగిలిన చిక్కటి పాలకు, పల్చటి పాలను జత చేసి స్టౌ మీద ఉంచి మరిగించాలి. అంచులకు అంటుకోకుండా గరిటెతో కలుపుతూ ఉండాలి. చిన్న పాత్రలో నాలుగు టీ స్పూన్ల చిక్కటి పాలు, కుంకుమ పువ్వు వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి  

 మూడు టేబుల్ స్పూన్ల నీళ్లలో నిమ్మ ఉప్పు వేసి కలిపి, మరుగుతున్న పాలలో చిలకరించాలి

 నీళ్లలో కరిగించిన కార్న్‌ఫ్లోర్, పంచదార వేసి బాగా కలిపి చూడటానికి కోవాలా అయ్యేవరకు ఉంచాలి  

 కుంకుమ పువ్వు మిశ్రమం, ఏలకుల పొడి వేసి బాగా కలిపి దించి, చల్లారనివ్వాలి  

 ఈ మిశ్రమాన్ని పేడాలుగా చేసుకోవాలి

 పిస్తా తరుగుతో అలంకరించి, సుమారు గంటసేపు ఫ్రిజ్‌లో ఉంచి, తీసిన పావు గంటకు అందించాలి  

 ఇవి రెండు మూడురోజులు తాజాగా ఉంటాయి.

Strawberry Shrikhand - స్ట్రాబెర్రీ శ్రీఖండ్

Strawberry Shrikhand - స్ట్రాబెర్రీ శ్రీఖండ్


 కావలసినవి:
 నీరు పూర్తిగా తీసేసిన పెరుగు - కప్పు; మెత్తగా చేసిన స్ట్రాబెర్రీల గుజ్జు - అర కప్పు; క్రీమ్ - పావు కప్పు; పంచదార - 2 టీ స్పూన్లు; స్ట్రాబెర్రీలు - 2 (చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి)

 తయారి:  
 ఒక పాత్రలో ముందుగా పెరుగు, పంచదార వేసి బాగా కలపాలి  

 క్రీమ్, మెత్తగా చేసిన స్ట్రాబెర్రీల గుజ్జు జత చేసి మరోమారు కలిపి, మూడు గంటలసేపు ఫ్రిజ్‌లో ఉంచి తీసేయాలి

 స్ట్రాబెర్రీలతో అలంకరించి అందించాలి. (నాలుగు కప్పుల పెరుగును మూట గడితే ఒక కప్పు పెరుగు తయారవుతుంది)

Mava Kaju Sandwich - మావా కాజు శాండ్‌విచ్

Mava Kaju Sandwich - మావా కాజు శాండ్‌విచ్

 కావలసినవి:
 మెత్తగా పొడి చేసిన కోవా - 150 గ్రా; పంచదార - 40 గ్రా; నెయ్యి - టీ స్పూను; ఖర్జూరాలు - 10 (పాలలో సుమారు పది నిమిషాలు నానబెట్టాలి); జీడిపప్పు పలుకులు - 3 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి - అర టీ స్పూను; నూనె - కొద్దిగా

 తయారి:  
 ఒక పాత్రలో కోవా పొడి, పంచదార వేసి స్టౌ మీద ఉంచి ముద్దలా అయ్యేవరకు కలిపి, దించి చల్లారాక ఈ మిశ్రమాన్ని రెండు ఉండలుగా (ఒకటి పెద్దది, ఒకటి చిన్నది) చేసి పక్కన ఉంచాలి  

 బాణలిలో నెయ్యి వేసి స్టౌ మీద ఉంచి కరిగాక, నానబెట్టి ఉంచుకున్న ఖర్జూరాలు వేసి మెత్తగా గుజ్జులా అయ్యేవరకు కలపాలి

 ఏలకుల పొడి, జీడిపప్పు పలుకులు వేసి బాగా కలిపి దించేయాలి  

 ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకుని దాని మీద కొద్దిగా నూనె పూయాలి

 ఐదు అంగుళాల వెడల్పు, ఒక అంగుళం లోతు ఉన్న డబ్బా మూత తీసుకుని, అందులో ప్లాస్టిక్ షీట్ ఉంచాలి  

 తయారుచేసి ఉంచుకున్న కోవా పెద్ద బాల్ తీసుకుని మూత మధ్యలో ఉంచి, చేతితో జాగ్రత్తగా అంచులు కూడా మూసుకునేలా ఒత్తాలి  

 ఇప్పుడు కోవా మిశ్రమం మీద ఖర్జూరం మిశ్రమం ఉంచి, ఆ పైన చిన్న బాల్ పెట్టి గట్టిగా ఒత్తి పైన సిల్వర్ ఫాయిల్ ఉంచి, ఫ్రిజ్ లో పది నిమిషాలు ఉంచి తీసేయాలి  ఎనిమిది సమాన భాగాలుగా కట్ చేసి అందించాలి.

Choco Sweet - చాకో స్వీట్

Choco Sweet - చాకో స్వీట్


 కావలసినవి:
 డార్క్ చాకొలేట్ తురుము - 75 గ్రా; పల్లీలు + బాదం పప్పులు - రెండు టేబుల్ స్పూన్లు; తురిమిన పనీర్ - 150 గ్రా (కాటేజ్ చీజ్); కాఫీ పొడి - అర టీ స్పూను; కోకో పొడి - టీ స్పూను; పంచదార పొడి -   75 గ్రా.; బాదం పప్పులు - 8;
 చాకో చిప్స్ - అలంకరిచండానికి తగినన్ని

 తయారీ:  
 డార్క్ చాకొలేట్‌ను అవెన్‌లో ఒక నిమిషం ఉంచి కరిగించి బయటకు తీసి స్పూన్‌తో బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చాకొలేట్ మౌల్డ్‌లో పల్చగా ఒక పొరలా పోయాలి  

 బాణలిలో పల్లీలు, బాదంపప్పులు వేసి వేయించి, చల్లారాక మిక్సీలో వేసి ముక్కలుముక్కలుగా వచ్చేలా చేయాలి  

పనీర్‌ను పొడిపొడిలా చేసి రెండు నిమిషాలపాటు చేతితో మెత్తగా చేయాలి. పంచదార, కాఫీ పొడి, కోకో పొడి, పల్లీలు + బాదం పప్పుల పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని బాల్స్‌లా తయారుచేసి, చాకొలేట్ టార్ట్ మౌల్డ్స్‌లో ఉంచి, సుమారు అరగంటసేపు ఫ్రిజ్‌లో ఉంచి తీసేయాలి  

 చాకో చిప్స్‌తో అలంకరించి చల్లగా అందచేయాలి.
Learn English Vocabulary & Help the Poor |Free Rice |
 
google-site-verification: google2463dc209284d38a.html