How to stop falling Hair
ప్రతి ఒక్కరిలో జుట్టు రాలిపోవడం అనేది సాధారణ సమస్యగా మారిపోయింది. ముఖ్యంగా జుట్టురాలడానికి హార్మోన్ ల అసమతుల్యత, రసాయనాలు కలిగిన షాంపూలు, ఆయిల్స్ ఉపయోగించడం వల్ల, ఈస్ట్, ఫంగల్ ఇన్ఫెక్షణ్, మరియు మందులు తరచూ ఉపయోగించడం, ఒత్తిడి, ఆహారంలో అసమతుల్యత ఇలా చాలా కారణాలే ఉంటాయి. వీటితో పాటు జుట్టు రాలడానికి మరో ముఖ్యమైన కారణం కూడా ఉంది. అదే చుండ్రు. చుండ్రు వల్ల తలో దురద లేదా మంట వంటి కారణాల చేత కూడా జుట్టు అధికంగా రాలిపోయే అవకాశం ఉంది.
కారణాలు ఏవైనా కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల జుట్టును ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు.
సాధారణంగా కొంత మంది తలకు నూనె అనేది వాడరు సాధారణంగా కొంత మంది తలకు నూనె అనేది వాడరు. అందువల్ల కేశాలు పొడిబారి పోవడం, తడిలేకుండా నిర్జీవంగా మారి కురులు తెగిపోవడం లేదా, రాలిపోవడం జరుగుతుంటాయి. అందుకోసం నెలలో రెండు సార్లైనా తలకు గోరువెచ్చని నూనెతో మసాజ్ చేసుకోవాలి. అందులో బాదం నూనె లేదా ఆలివ్ నూనె లేదా శుద్దమైన కొబ్బరి నూనె ఏదో ఒకటి తీసుకోవాలి. ఒక చిన్న బౌల్ లో మీ జుట్టుకు సరిపడా తీసుకొని అందులో కొన్ని మెంతులు కలిపి తక్కువ మంట మీద వేడి చేసి, రెండు నిమిషాల తర్వాత గోరువెచ్చగా తలకు మునివేళ్ళతో పట్టించి బాగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల రక్తప్రసరణ బాగా జరిగి కేశాలు రాలడం తగ్గి, ఆరోగ్యంగా పెరుగుతాయి.
కేశాలు రాలడానికి మరో ముఖ్యమైన కారణం ఆహారం. ముఖ్యంగా ప్రతి రోజూ తీసుకొనే ఆహారంలో ఐరన్ శాతం ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. దాంతో జుట్టు రాలడాన్ని నివారించవచ్చు. ఎండబెట్టిన అత్తిపండు, జీడిపప్పు, బాదాం, లివర్ మరియు రొయ్యలు వంటివి తరచూ ఆహారంలో తీసుకోవడం వల్ల తగినంత ఐరన్ శరీరాని అంది, జుట్టు రాలడాన్ని నిరోధిస్తుంది.
తలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. కనీసం వారానికి రెండు సార్లైనా మంచి కండీషనర్ తో తలస్నానం చేయడం మంచిది.
హెయిర్ క్లిప్స్ లేదా హెయిర్ బ్యాండ్స్ చాలా బిగుతుగా వుండేవి వాడకూడదు. జుట్టును ఇలాంటి కఠినమైనటువంటి క్లిప్స్, హెయిర్ బ్యాండ్ తో గట్టిగా బంధిచడం లేదా ముడి వేయడం వల్ల జుట్టును బలహీన పరచి కురులను నాశనం చేస్తాయి.
షాంపూ తేమ స్వభావాన్ని కలిగి ఉండేలా చూసుకోవాలి. జిడ్డుగా ఉన్న కురుల కోసం తప్పనిసరిగా ఇలాంటి షాంపూలను మాత్రమే ఎంపిక చేసుకోవాలి.
కేశాలకు హెయిర్ జెల్ లేదా హెయిర్ స్ప్రేలను ఉపయోగించడం వల్ల కురులు తెగిపోవడం జరుగుతుంది. ఇలా మెయింటైన్ చేయడం చాలా కష్టం. హెయిర్ జెల్, హెయిర్ స్ప్రేలను వాడినప్పుడు వెంటవెంటనే తలస్నానం చేయాల్సి ఉంటుంది.
జుట్టు రాలడాన్ని నియంత్రించడానికి ఉత్తమమైన మార్గం కొబ్బరి నీళ్ళు తాగడమే. తాజా కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల జుట్టు రాలడాన్ని తగ్గించేందుకు బాగా సహాయ పడుతుంది.
ఎక్కువగా ఎండగా ఉన్నప్పుడు శరీరానికి కానీ, తలకు కానీ ఎండ వేడిమి, సూర్య రశ్మి డైరెక్ట్ గా తగలకుండా జాగ్రత్త తీసుకోవాలి.