Babycorn Butter Masala - బేబీకార్న్ బటర్ మసాలా
కావల్సినవి:
బేబీకార్న్ - ఐదారు,
ఉల్లిపాయలు - మూడు,
టొమాటోలు - నాలుగు,
జీడిపప్పు - పావుకప్పు,
పచ్చిమిర్చి - రెండు,
వెన్న - పావుకప్పు,
కారం - చెంచా,
ధనియాలపొడి - ఒకటిన్నర చెంచా,
జీలకర్రపొడి - చెంచా,
గరంమసాలా - అరచెంచా,
కసూరీమేథీ - చెంచా,
అల్లంవెల్లుల్లిపేస్టు - చెంచా,
క్రీం - టేబుల్‌స్పూను,
ఉప్పు - తగినంత.
బేబీకార్న్ - ఐదారు,
ఉల్లిపాయలు - మూడు,
టొమాటోలు - నాలుగు,
జీడిపప్పు - పావుకప్పు,
పచ్చిమిర్చి - రెండు,
వెన్న - పావుకప్పు,
కారం - చెంచా,
ధనియాలపొడి - ఒకటిన్నర చెంచా,
జీలకర్రపొడి - చెంచా,
గరంమసాలా - అరచెంచా,
కసూరీమేథీ - చెంచా,
అల్లంవెల్లుల్లిపేస్టు - చెంచా,
క్రీం - టేబుల్‌స్పూను,
ఉప్పు - తగినంత.
తయారీ:
టొమాటోలు, రెండు ఉల్లిపాయముక్కలూ, జీడిపప్పూ, పచ్చిమిర్చీని ఓ గిన్నెలో తీసుకుని అవి మునిగేలా నీళ్లు పోసి పొయ్యిమీద పెట్టాలి. టొమాటోలు కొద్దిగా మెత్తగా అయ్యాక దింపేసి నీటిని వంపేయాలి. తరవాత వీటన్నింటినీ మిక్సీలో తీసుకుని మెత్తని మిశ్రమంలా చేసుకోవాలి. ఇప్పుడు బాణలిలో వెన్నను కరిగించి కసూరీమేథీ, అల్లంవెల్లుల్లి పేస్టూ వేయించి నిమిషం తరవాత మిగిలిన ఉల్లిపాయముక్కల్ని కూడా వేయాలి. అవి దోరగా వేగాక కారం, ధనియాలపొడీ, జీలకర్రపొడీ వేసి మరోసారి కలపాలి. ఇందులో టొమాటో జీడిపప్పు మిశ్రమం, తగినంత ఉప్పూ, గరంమసాలా వేసి మంట తగ్గించేయాలి. రెండుమూడు నిమిషాల తరవాత బేబీకార్న్ ముక్కల్ని కూడా వేసి కొన్ని నీళ్లు పోసి మూతపెట్టేయాలి. అవి ఉడికి, గ్రేవీ దగ్గరకు అయ్యాక పైన క్రీం వేసి దింపేయాలి. ఇది రొట్టెలూ, పూరీల్లోకి చాలా బాగుంటుంది.