Bengal gram Palak - చనా పాలక్
కావలసిన పదార్థాలు:నానబెట్టి ఉడికించిన శెనగలు- 1 కప్పు,
పాలకూర తరుగు- 5 కప్పులు,
పచ్చిమిర్చి- 5,
టొమాటో- 1,
జీడిపప్పు పొడి- 1/4 కప్పు,
నూనె- 1 టేబుల్ స్పూను,
అల్లం వెల్లుల్లి పేస్ట్- 1 టీ స్పూను,
ఉప్పు- రుచికి సరిపడా,
గరం మసాల, ధనియాల పొడి- ఒక్కోటి 1 టీ స్పూను చొప్పున,
కసూరి మేథీ- 1 టీ స్పూను.
తయారీ విధానం:
ఒక గిన్నెలో ఆరు కప్పుల నీళ్లు పోసి మరిగించి అరస్పూను ఉప్పు, టొమాటో వేయాలి. టొమాటో తోలు ఊడి వస్తుండగా దానిని గిన్నెలోంచి తీసేసి పాలకూర తరుగు వేసి మూడు నిమిషాలు ఉడికించి నీళ్లు వంచేయాలి. టొమాటో తోలు తీసి మిక్సీలో వేసి మెత్తగా గుజ్జు చేసి పక్కనుంచుకోవాలి. తరువాత పచ్చిమిర్చి, పాలకూరను కలిపి గుజ్జు చేసుకోవాలి. ఆ తరువాత ఒక కడాయిలో నూనె వేసి ఉల్లి ముక్కలను వేగించాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగించి ఆ తరువాత టొమాటో గుజ్జు వేసి దానిలోని నీరు ఇంకిపోయే వరకూ ఉడికించాలి. ఆ తరువాత పాలకూర గుజ్జు వేసి బుడగలు వచ్చే వరకూ ఉడికించాలి. తరువాత జీడిపప్పు పొడి, గరం మసాల, ధనియాల పొడి, కసూరి మేథీ వేసి బాగా కలిపి, శెనగలు వేసి అరకప్పు నీళ్ళు పోసి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. ఇది చపాతీలకు మంచి కాంబినేషన్.