Ads 468x60px

Pages

Learn English Vocabulary & Help the Poor| |Free Rice |
Showing posts with label Ginger Garlic Paste. Show all posts
Showing posts with label Ginger Garlic Paste. Show all posts

Hyderabadi Veg BiryAnI - హైదరాబాదీ వెజ్‌ బిర్యానీ




కావలసినవి:

బాస్మతి బియ్యం: ఒకటిన్నర కప్పులు,
కుంకుమపువ్వు: కొద్దిగా,
పాలు: అరకప్పు,
నూనె: సరిపడా,
ఉల్లిముక్కలు (సన్నగా పొడవుగా తరిగినవి): ఒకటిన్నర కప్పులు,
జీడిపప్పు:2 టేబుల్‌ స్పూన్లు,
బాదం: 2 టేబుల్‌స్పూన్లు,
ఎండుద్రాక్ష: 2 టేబుల్‌ స్పూన్లు,
నెయ్యి: అరకప్పు,
లవంగాలు: నాలుగు,
నల్లయాలకులు: రెండు,
పలావు ఆకులు: రెండు,
ఉల్లిముక్కలు (చిన్నముక్కలుగా తరిగినవి): ముప్పావు కప్పు,
 అల్లంవెల్లుల్లి: టేబుల్‌స్పూను,
పుదీనా ముద్ద: అరకప్పు,
కొత్తిమీర ముద్ద: పావుకప్పు,
బిర్యానీ మసాలా: 3 టేబుల్‌ స్పూన్లు,
ఉప్పు: రుచికి సరిపడా,
బంగాళాదుంప ముక్కలు: ముప్పావు కప్పు,
క్యారెట్‌ ముక్కలు: ముప్పావు కప్పు,
 కాలీఫ్లవర్‌ ముక్కలు:పావుకప్పు,
బీన్స్‌ ముక్కలు: పావు కప్పు,
తాజా మీగడ: 2 టేబుల్‌స్పూన్లు,
పెరుగు: అరకప్పు,
కొత్తిమీర తురుము: టేబుల్‌స్పూను,
పిండి ముద్ద: అంచుల్ని మూసేందుకు సరిపడా
[List In English :
BiryAnI, Basmati Rice, Milk, Oil, Oninons, Cashewnut, Almond, Raisin, Ghee, Cloves, Black Cardamom, Pulav Leaves, Ginger Garlic Paste, Mint, Coriander Leaves, Biryani Masala, Salt, Potato, Carrot, Cauliflower, Beans, Fresh Cream ]

తయారుచేసే విధానం:

అన్నం కాస్త పలుకు ఉండి పొడిపొడిలాడేలా వండి పక్కన ఉంచాలి.ఒకటిన్నర టేబుల్‌స్పూన్ల గోరువెచ్చని పాలలో కుంకుమపువ్వును కరిగించి అన్నంలో వేసి బాగా కలపాలి. తరవాత అన్నం రెండు సమ భాగాలుగా చేసి పక్కన ఉంచాలి.నూనె వేసి సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిముక్కలు వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి. నాన్‌స్టిక్‌ పాన్‌లో సగం నెయ్యి వేసి జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి. అదే పాన్‌లో లవంగాలు, యాలకులు, పలావు ఆకులు వేసి వేయించాలి. చిన్న ముక్కలుగా తరిగిన ఉల్లిముక్కలు, అల్లంవెల్లుల్లి వేసి వేయించాలి. ఇప్పుడు పుదీనా ముద్ద, కొత్తిమీర ముద్ద, బిర్యానీ మసాలా, ఉప్పు, కూరగాయల ముక్కలు వేసి కలపాలి. మీగడ, మిగిలిన పాలు పోసి ఉడికించాలి. తరవాత దించి చల్లారాక గిలకొట్టిన పెరుగు కూడా వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని రెండు భాగాలుగా చేసి పక్కన ఉంచాలి.మరో పాన్‌లో మిగిలిన నెయ్యి వేసి వేయించిన ఉల్లిముక్కలు పరిచినట్లుగా చల్లాలి. దానిమీద ఉడికించిన కూరగాయల మిశ్రమంలో ఒక భాగాన్ని పరచాలి. ఇప్పుడు దానిమీద అన్నంలో ఒక భాగాన్ని పరచాలి. తరవాత మళ్లీ ఉల్లిముక్కలు, కూరగాయల మిశ్రమం, అన్నం వరసగా పరచాలి. చివరగా మిగిలిన ఉల్లిముక్కలు, జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష, కొత్తిమీర తురుము చల్లి మూతపెట్టి ఆవిరి బయటకు పోకుండా అంచుల్ని పిండితో మూసేసి అరగంటసేపు దమ్‌ చేయాలి. దీన్ని రైతాతో వడ్డిస్తే రుచిగా ఉంటుంది.

Carrot Pickle_క్యారెట్‌ పచ్చడి

Carrot Pickle_క్యారెట్‌ పచ్చడి

కావల్సినవి:
ధనియాలపొడి,
ఆవపొడి - చెంచా చొప్పున,
జీలకర్రపొడి - అరచెంచా,
మెంతిపొడి - పావు చెంచా,
కారం - రెండు చెంచాలు,
ఉప్పు - తగినంత,
ఇంగువ - చిటికెడు,
క్యారెట్లు - పదిహేను (చెక్కు తీసి ముక్కల్లా తరగాలి),
ఉల్లిపాయలు - రెండు,
అల్లంవెల్లుల్లి పేస్టు - అరచెంచా,
ఎండుమిర్చి - రెండు,
కరివేపాకు - రెండురెబ్బలు,
చక్కెర - కొద్దిగా,
నిమ్మరసం - మూడు చెంచాలు,
మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర - పావుచెంచా చొప్పున,
నూనె - కప్పు.

తయారీ:
ఉల్లిపాయల్ని తరిగి మిక్సీలో పేస్టులా చేసుకోవాలి.
ఇప్పుడు బాణలిలో అరకప్పు నూనె వేడిచేసి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చిని వేయించాలి.
ఆ తరవాత కరివేపాకు రెబ్బలు వేసి అవి కూడా వేగాక ఇంగువ, ఉల్లిపాయ మిశ్రమం, అల్లంవెల్లుల్లి పేస్టు వేసి బాగా వేయించాలి.
ఉల్లిపాయల పచ్చివాసన పోయాక దింపేయాలి.
అందులో సన్నగా తరిగిన క్యారెట్‌ ముక్కలు, నిమ్మరసం, తగినంత ఉప్పుతోపాటు మిగిలిన అన్ని పదార్థాల్నీ వేసేయాలి.
మిగిలిన నూనె కూడా వేసేస్తే స్పైసీ క్యారెట్‌ పచ్చడి రెడీ.
ఇది వేడివేడి అన్నంలోకే కాదు.. చపాతీల్లోకీ బాగుంటుంది.

Bengal gram Palak - చనా పాలక్‌

Bengal gram Palak - చనా పాలక్‌

కావలసిన పదార్థాలు:
నానబెట్టి ఉడికించిన శెనగలు- 1 కప్పు,
పాలకూర తరుగు- 5 కప్పులు,
పచ్చిమిర్చి- 5,
టొమాటో- 1,
జీడిపప్పు పొడి- 1/4 కప్పు,
నూనె- 1 టేబుల్‌ స్పూను,
అల్లం వెల్లుల్లి పేస్ట్‌- 1 టీ స్పూను,
ఉప్పు- రుచికి సరిపడా,
గరం మసాల, ధనియాల పొడి- ఒక్కోటి 1 టీ స్పూను చొప్పున,
కసూరి మేథీ- 1 టీ స్పూను.

తయారీ విధానం:
ఒక గిన్నెలో ఆరు కప్పుల నీళ్లు పోసి మరిగించి అరస్పూను ఉప్పు, టొమాటో వేయాలి. టొమాటో తోలు ఊడి వస్తుండగా దానిని గిన్నెలోంచి తీసేసి పాలకూర తరుగు వేసి మూడు నిమిషాలు ఉడికించి నీళ్లు వంచేయాలి. టొమాటో తోలు తీసి మిక్సీలో వేసి మెత్తగా గుజ్జు చేసి పక్కనుంచుకోవాలి. తరువాత పచ్చిమిర్చి, పాలకూరను కలిపి గుజ్జు చేసుకోవాలి. ఆ తరువాత ఒక కడాయిలో నూనె వేసి ఉల్లి ముక్కలను వేగించాక అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసి వేగించి ఆ తరువాత టొమాటో గుజ్జు వేసి దానిలోని నీరు ఇంకిపోయే వరకూ ఉడికించాలి. ఆ తరువాత పాలకూర గుజ్జు వేసి బుడగలు వచ్చే వరకూ ఉడికించాలి. తరువాత జీడిపప్పు పొడి, గరం మసాల, ధనియాల పొడి, కసూరి మేథీ వేసి బాగా కలిపి, శెనగలు వేసి అరకప్పు నీళ్ళు పోసి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. ఇది చపాతీలకు మంచి కాంబినేషన్‌.

Babycorn Butter Masala - బేబీకార్న్‌ బటర్‌ మసాలా

Babycorn Butter Masala - బేబీకార్న్‌ బటర్‌ మసాలా


కావల్సినవి:
బేబీకార్న్‌ - ఐదారు, 
ఉల్లిపాయలు - మూడు, 
టొమాటోలు - నాలుగు, 
జీడిపప్పు - పావుకప్పు, 
పచ్చిమిర్చి - రెండు, 
వెన్న - పావుకప్పు, 
కారం - చెంచా, 
ధనియాలపొడి - ఒకటిన్నర చెంచా, 
జీలకర్రపొడి - చెంచా, 
గరంమసాలా - అరచెంచా, 
కసూరీమేథీ - చెంచా, 
అల్లంవెల్లుల్లిపేస్టు - చెంచా, 
క్రీం - టేబుల్‌స్పూను, 
ఉప్పు - తగినంత.

తయారీ:

టొమాటోలు, రెండు ఉల్లిపాయముక్కలూ, జీడిపప్పూ, పచ్చిమిర్చీని ఓ గిన్నెలో తీసుకుని అవి మునిగేలా నీళ్లు పోసి పొయ్యిమీద పెట్టాలి. టొమాటోలు కొద్దిగా మెత్తగా అయ్యాక దింపేసి నీటిని వంపేయాలి. తరవాత వీటన్నింటినీ మిక్సీలో తీసుకుని మెత్తని మిశ్రమంలా చేసుకోవాలి. ఇప్పుడు బాణలిలో వెన్నను కరిగించి కసూరీమేథీ, అల్లంవెల్లుల్లి పేస్టూ వేయించి నిమిషం తరవాత మిగిలిన ఉల్లిపాయముక్కల్ని కూడా వేయాలి. అవి దోరగా వేగాక కారం, ధనియాలపొడీ, జీలకర్రపొడీ వేసి మరోసారి కలపాలి. ఇందులో టొమాటో జీడిపప్పు మిశ్రమం, తగినంత ఉప్పూ, గరంమసాలా వేసి మంట తగ్గించేయాలి. రెండుమూడు నిమిషాల తరవాత బేబీకార్న్‌ ముక్కల్ని కూడా వేసి కొన్ని నీళ్లు పోసి మూతపెట్టేయాలి. అవి ఉడికి, గ్రేవీ దగ్గరకు అయ్యాక పైన క్రీం వేసి దింపేయాలి. ఇది రొట్టెలూ, పూరీల్లోకి చాలా బాగుంటుంది. 

Chicken Garelu - చికెన్‌ గారెలు

కావలసిన పదార్థాలు:
బోన్‌లెస్‌ చికెన్‌ - పావు కిలో
శనగపప్పు - 2 కప్పులు
గరం మాసాలా - 2 టీస్పూన్లు
కారం - 1 టీస్పూను
అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - చిన్న ముద్ద
పచ్చిమిరిపకాయలు - 4
ఉల్లిపాయలు - 2
పసుపు - చిటికెడు
కొత్తిమీర కట్ట - 1
నూనె, ఉప్పు - తగినంత
తయారీ విధానం:
గిన్నెలో శనగపప్పు వేసి నీళ్లలో నానబెట్టుకోవాలి.
చికెన్‌ ముక్కలు శుభ్రంగా కడిగి కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, పసుపు, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి.
నానబెట్టిన శనగపప్పును మెత్తగా రుబ్బుకోవాలి.
ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉడికించిన చికెన్‌, మసాలా, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
కడాయిలో నూనె వేడిచేసి కొద్దిగా చికెన్‌ ముద్దను అరచేతిలో తీసుకుని మధ్యలో రంధ్రం చేసి నూనెలో వేయించాలి.
Learn English Vocabulary & Help the Poor |Free Rice |
 
google-site-verification: google2463dc209284d38a.html