Showing posts with label Ghee. Show all posts
Showing posts with label Ghee. Show all posts
Hyderabadi Veg BiryAnI - హైదరాబాదీ వెజ్ బిర్యానీ
కావలసినవి:
బాస్మతి బియ్యం: ఒకటిన్నర కప్పులు,
కుంకుమపువ్వు: కొద్దిగా,
పాలు: అరకప్పు,
నూనె: సరిపడా,
ఉల్లిముక్కలు (సన్నగా పొడవుగా తరిగినవి): ఒకటిన్నర కప్పులు,
జీడిపప్పు:2 టేబుల్ స్పూన్లు,
బాదం: 2 టేబుల్‌స్పూన్లు,
ఎండుద్రాక్ష: 2 టేబుల్ స్పూన్లు,
నెయ్యి: అరకప్పు,
లవంగాలు: నాలుగు,
నల్లయాలకులు: రెండు,
పలావు ఆకులు: రెండు,
ఉల్లిముక్కలు (చిన్నముక్కలుగా తరిగినవి): ముప్పావు కప్పు,
అల్లంవెల్లుల్లి: టేబుల్‌స్పూను,
పుదీనా ముద్ద: అరకప్పు,
కొత్తిమీర ముద్ద: పావుకప్పు,
బిర్యానీ మసాలా: 3 టేబుల్ స్పూన్లు,
ఉప్పు: రుచికి సరిపడా,
బంగాళాదుంప ముక్కలు: ముప్పావు కప్పు,
క్యారెట్ ముక్కలు: ముప్పావు కప్పు,
కాలీఫ్లవర్ ముక్కలు:పావుకప్పు,
బీన్స్ ముక్కలు: పావు కప్పు,
తాజా మీగడ: 2 టేబుల్‌స్పూన్లు,
పెరుగు: అరకప్పు,
కొత్తిమీర తురుము: టేబుల్‌స్పూను,
పిండి ముద్ద: అంచుల్ని మూసేందుకు సరిపడా
[List In English :
BiryAnI, Basmati Rice, Milk, Oil, Oninons, Cashewnut, Almond, Raisin, Ghee, Cloves, Black Cardamom, Pulav Leaves, Ginger Garlic Paste, Mint, Coriander Leaves, Biryani Masala, Salt, Potato, Carrot, Cauliflower, Beans, Fresh Cream ]
తయారుచేసే విధానం:
అన్నం కాస్త పలుకు ఉండి పొడిపొడిలాడేలా వండి పక్కన ఉంచాలి.ఒకటిన్నర టేబుల్‌స్పూన్ల గోరువెచ్చని పాలలో కుంకుమపువ్వును కరిగించి అన్నంలో వేసి బాగా కలపాలి. తరవాత అన్నం రెండు సమ భాగాలుగా చేసి పక్కన ఉంచాలి.నూనె వేసి సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిముక్కలు వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి. నాన్‌స్టిక్ పాన్‌లో సగం నెయ్యి వేసి జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి. అదే పాన్‌లో లవంగాలు, యాలకులు, పలావు ఆకులు వేసి వేయించాలి. చిన్న ముక్కలుగా తరిగిన ఉల్లిముక్కలు, అల్లంవెల్లుల్లి వేసి వేయించాలి. ఇప్పుడు పుదీనా ముద్ద, కొత్తిమీర ముద్ద, బిర్యానీ మసాలా, ఉప్పు, కూరగాయల ముక్కలు వేసి కలపాలి. మీగడ, మిగిలిన పాలు పోసి ఉడికించాలి. తరవాత దించి చల్లారాక గిలకొట్టిన పెరుగు కూడా వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని రెండు భాగాలుగా చేసి పక్కన ఉంచాలి.మరో పాన్‌లో మిగిలిన నెయ్యి వేసి వేయించిన ఉల్లిముక్కలు పరిచినట్లుగా చల్లాలి. దానిమీద ఉడికించిన కూరగాయల మిశ్రమంలో ఒక భాగాన్ని పరచాలి. ఇప్పుడు దానిమీద అన్నంలో ఒక భాగాన్ని పరచాలి. తరవాత మళ్లీ ఉల్లిముక్కలు, కూరగాయల మిశ్రమం, అన్నం వరసగా పరచాలి. చివరగా మిగిలిన ఉల్లిముక్కలు, జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష, కొత్తిమీర తురుము చల్లి మూతపెట్టి ఆవిరి బయటకు పోకుండా అంచుల్ని పిండితో మూసేసి అరగంటసేపు దమ్ చేయాలి. దీన్ని రైతాతో వడ్డిస్తే రుచిగా ఉంటుంది.
Labels:
Almond,
Basmati Rice,
Beans,
BiryAnI,
Black Cardamom,
Carrot,
Cashewnut,
Cauliflower,
Cloves,
Coriander Leaves,
Ghee,
Ginger Garlic Paste,
Mint,
Oninons,
Potato,
Pulav Leaves,
Raisin,
Salt
katte pongali_కట్టె పొంగలి
katte pongali_కట్టె పొంగలి
కావల్సినవి:బియ్యం- అరకప్పు,
పెసరపప్పు- పావు కప్పు,
నీళ్లు- రెండు కప్పులు,
ఉప్పు- తగినంత.
తాలింపు కోసం:
నెయ్యి- మూడు చెంచాలు,
జీలకర్ర- చెంచా,
మిరియాలు- చెంచా,
అల్లం - చిన్న ముక్క,
కరివేపాకు- నాలుగు రెబ్బలు,
జీడిపప్పులు- పది.
తయారీ:
1) బియ్యం, పెసరపప్పును కడిగి కుక్కర్‌లో తీసుకుని నీళ్లు పోయాలి.
2) మూడు కూతలు వచ్చేవరకూ ఉడికించుకుని తీసుకోవాలి.
3) ఇప్పుడు బాణలిని పొయ్యిమీద పెట్టి నెయ్యి వేయాలి.
4) అది కరిగాక జీడిపప్పు వేయించాలి.
5) అవి కాస్త ఎర్రగా వేగాక జీలకర్రా, మిరియాలపొడీ, కరివేపాకూ, అల్లం తరుగు వేయాలి.
6) అవి కూడా వేగాక బాణలి దించేయాలి.
7) ఈ తాలింపూ, సరిపడా ఉప్పు ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నంలో వేసి కలపాలి.
8) ఈ పొంగలిని మరోసారి పొయ్యిమీద పెట్టి రెండు నిమిషాలయ్యాక దింపేయాలి
Wheat Halwa - గోధుమ హల్వా
గోధుమపిండి - కప్పు,
చక్కెర - ఒకటింబావు కప్పు,
నీళ్లు - ఒకటింబావు కప్పు,
వెన్న - పావుకప్పు,
జీడిపప్పూ, కిస్‌మిస్ పలుకులు- కొన్ని,
నెయ్యి - చెంచా.
తయారీ:
బాణలిలో కొద్దిగా వెన్న కరిగించి జీడిపప్పూ, కిస్‌మిస్ పలుకుల్ని వేయించుకుని విడిగా తీసి పెట్టుకోవాలి. అదే బాణలిలో మిగిలిన వెన్న కరిగించి గోధుమపిండిని వేయించుకోవాలి. గోధుమపిండి కాస్త రంగు మారి, కమ్మటి వాసన వచ్చేవరకూ వేయించుకుని తీసుకోవాలి.
ఓ గిన్నెలో నీళ్లూ, చక్కెరా తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. చక్కెర కరిగి బుడగల్లా వస్తున్నప్పుడు వేయించి పెట్టుకున్న గోధుమపిండి వేసేయాలి. మంట తగ్గించి మధ్యమధ్య కలుపుతూ ఉంటే.. ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇది దగ్గరగా అయి, గిన్నె అంచుల నుంచి విడిపోతున్నప్పుడు నెయ్యి వేసి దింపేయాలి.
జీడిపప్పు, కిస్‌మిస్ పలుకులు వేసి తినాలి.
Varieties with Wheat flour - గోధూమ్‌ధామ్

ఏముందిలే... చపాతీ, పూరీలేగా చేసేది అని చప్పరించేయకండి.
అదే పిండికి కొన్ని ఆధరువులు తగిలిస్తే...
చపాతీ, పూరీలు సైతం చవులూరించే
కొత్త రుచులకు కేంద్రమవుతాయి.
గోధుమపిండితోనే స్వీటు, దోసెల లాంటి వెరైటీలూ ఉన్నాయండోయ్!
అందుకే, గోధుమలతో ధూమ్‌ధామ్... ఈ ఆదివారం మీ ఫ్యామిలీలో...
బంగాళదుంప - కొత్తిమీర చపాతీ
కావలసినవి: గోధుమ పిండి - 2 కప్పులు; బంగాళదుంపలు - 8; కొత్తిమీర - ఒక కట్ట, పచ్చి మిర్చి - 4; ఇంగువ - చిటికెడు, ఉప్పు, నెయ్యి - తగినంత
తయారీ: ఒక పాత్రలో గోధుమ పిండి, ఉప్పు, నీళ్లు వేసి చపాతీ పిండిలా కలిపి పక్కన ఉంచాలి.
బంగాళదుంపలను ఉడికించి తొక్క తీసి మెత్తగా చిదిమి పక్కన ఉంచాలి కొత్తిమీర , పచ్చి మిర్చి శుభ్రంగా కడిగి, మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ఒక పాత్రలో బంగాళదుంప మిశ్రమం, కొత్తిమీర మిశ్రమం వేసి, ఇంగువ జత చేసి బాగా కలపాలి చిన్న చిన్న ఉండలుగా చేయాలి ఒక్కో ఉండను గుండ్రంగా ఒత్తి, అందులో బంగాళదుంప మిశ్రమం ఉంచాలి. అంచులు మూసేసి, పిండి కొద్దిగా అద్దుతూ చపాతీలా ఒత్తాలి స్టౌ మీద పాన్ వేడి చేసి, ఒత్తి ఉంచుకున్న చపాతీని వేసి రెండు వైపులా నెయ్యి వేసి బాగా కాల్చి తీసేయాలి వేడివేడిగా వడ్డించాలి.
గోధుమ హల్వా
కావలసినవి: గోధుమ పిండి - కప్పు; పంచదార - 2 కప్పులు; మిఠాయి రంగు - చిటికెడు (కొద్దిపాటి నీళ్లలో వేసి కలిపి ఉంచాలి); ఏలకుల పొడి - పావు టీ స్పూను; నెయ్యి - తగినంత
తయారీ:ఒక పాత్రలో కప్పుడు నీళ్లు, గోధుమ పిండి వేసి కలపాలి వేరొక పాత్రలో పావు కప్పు నీళ్లు, పంచదార వేసి బాగా కలపాలి. స్టౌ మీద ఈ పాత్ర ఉంచి, పంచదార కరిగేవరకు కలపాలి నీళ్లలో కలిపి ఉంచుకున్న గోధుమపిండి, మిఠాయి రంగు, ఏలకుల పొడి, నెయ్యి వేసి అడుగంటకుండా కలపాలి మిశ్రమం బాగా ఉడికిందనిపించాక, స్టౌ కట్టేయాలి పెద్ద పళ్లానికి నెయ్యి రాసి, ఉడికించుకున్న హల్వా పోసి, సమానంగా పరిచి కట్ చేసుకోవాలి.
టొమాటో చీజ్ పూరీ
కావలసినవి గోధుమపిండి - కప్పు మైదా పిండి - కప్పు టొమాటో రసం - కప్పుకారం - టీ స్పూను చీజ్ తురుము - కప్పు ఉప్పు - తగినంత
నూనె - తగినంత
తయారీ ఒక పాత్రలో పైన చెప్పిన పదార్థాలన్నీ వేసి, చపాతీ పిండిలా కలిపి సుమారు అర గంటసేపు నాననివ్వాలి.బాణలిలో నూనె వేసి కాచాలి.పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి, పూరీలా ఒత్తి, నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించాలి. పేపర్ టవల్ మీదకు తీసుకుని, వెజిటబుల్ సలాడ్‌తో వేడివేడిగా అందించాలి.
కశ్మీరీ చపాతీ
కావలసినవి: గోధుమపిండి - కప్పు, సోంపు - అర టీ స్పూను; జీలకర్ర - అర టీ స్పూను, వాము - పావు టీ స్పూను; మిరియాలు - 10, ఇంగువ - పావు టీ స్పూను; పాలు - తగినన్ని, ఉప్పు - తగినంత; నెయ్యి - కొద్దిగా
తయారీ: ముందుగా బాణలిలో సోంపు, జీలకర్ర, వాము, మిరియాలను నూనె లేకుండా వేయించి, చల్లార్చి మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి ఒక పాత్రలో గోధుమపిండి, పొడి చేసి ఉంచుకున్న మసాలా, ఇంగువ, పాలు, ఉప్పు, తగినన్ని నీళ్లు వేసి, చపాతీ పిండిలా కలిపి పక్కన ఉంచాలి స్టౌ మీద పెనం ఉంచి వేడి చేయాలి పిండిని కొద్దిగా తీసుకుని చపాతీలా ఒత్తి, పెనం మీద వేసి రెండువైపులా నేతితో కాల్చి తీయాలి. వేడివేడిగా ఏదైనా కూరతో అందించాలి.
Carrot Halwa - క్యారట్ హల్వా
Carrot Halwa - క్యారట్ హల్వా
కావలసినవి:
క్యారట్ తురుము - కప్పు; పాలు - లీటరు; పంచదార - ఒకటిన్నర కప్పులు; జీడిపప్పు పలుకులు - పది; కిస్మిస్ - 10; నెయ్యి - 6 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి - టీ స్పూను
తయారీ:
పాలను స్టౌ మీద ఉంచి నాలుగో వంతు వచ్చేవరకు మరిగించి పక్కన ఉంచాలి బాణలిలో టేబుల్ స్పూను నెయ్యి వేసి కరిగాక, క్యారట్ తురుము వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాలి
మరిగించిన పాలు జత చేసి బాగా ఉడకు పట్టాక, పంచదార వేయాలి
అన్నీ బాగా ఉడుకుపట్టాక ఏలకుల పొడి, నెయ్యి వేసి కలపాలి
ఒక బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి కరిగాక జీడిపప్పులు, కిస్మిస్ వేసి వేయించి, ఉడికిన క్యారట్ హల్వాలో వేసి దించేయాలి
బాగా చల్లారాక చిన్న చిన్న కప్పులలో వేసి అందించాలి.
క్యారట్ తురుము - కప్పు; పాలు - లీటరు; పంచదార - ఒకటిన్నర కప్పులు; జీడిపప్పు పలుకులు - పది; కిస్మిస్ - 10; నెయ్యి - 6 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి - టీ స్పూను
తయారీ:
పాలను స్టౌ మీద ఉంచి నాలుగో వంతు వచ్చేవరకు మరిగించి పక్కన ఉంచాలి బాణలిలో టేబుల్ స్పూను నెయ్యి వేసి కరిగాక, క్యారట్ తురుము వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాలి
మరిగించిన పాలు జత చేసి బాగా ఉడకు పట్టాక, పంచదార వేయాలి
అన్నీ బాగా ఉడుకుపట్టాక ఏలకుల పొడి, నెయ్యి వేసి కలపాలి
ఒక బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి కరిగాక జీడిపప్పులు, కిస్మిస్ వేసి వేయించి, ఉడికిన క్యారట్ హల్వాలో వేసి దించేయాలి
బాగా చల్లారాక చిన్న చిన్న కప్పులలో వేసి అందించాలి.





