Showing posts with label Potato. Show all posts
Showing posts with label Potato. Show all posts
Hyderabadi Veg BiryAnI - హైదరాబాదీ వెజ్ బిర్యానీ
కావలసినవి:
బాస్మతి బియ్యం: ఒకటిన్నర కప్పులు,
కుంకుమపువ్వు: కొద్దిగా,
పాలు: అరకప్పు,
నూనె: సరిపడా,
ఉల్లిముక్కలు (సన్నగా పొడవుగా తరిగినవి): ఒకటిన్నర కప్పులు,
జీడిపప్పు:2 టేబుల్ స్పూన్లు,
బాదం: 2 టేబుల్‌స్పూన్లు,
ఎండుద్రాక్ష: 2 టేబుల్ స్పూన్లు,
నెయ్యి: అరకప్పు,
లవంగాలు: నాలుగు,
నల్లయాలకులు: రెండు,
పలావు ఆకులు: రెండు,
ఉల్లిముక్కలు (చిన్నముక్కలుగా తరిగినవి): ముప్పావు కప్పు,
అల్లంవెల్లుల్లి: టేబుల్‌స్పూను,
పుదీనా ముద్ద: అరకప్పు,
కొత్తిమీర ముద్ద: పావుకప్పు,
బిర్యానీ మసాలా: 3 టేబుల్ స్పూన్లు,
ఉప్పు: రుచికి సరిపడా,
బంగాళాదుంప ముక్కలు: ముప్పావు కప్పు,
క్యారెట్ ముక్కలు: ముప్పావు కప్పు,
కాలీఫ్లవర్ ముక్కలు:పావుకప్పు,
బీన్స్ ముక్కలు: పావు కప్పు,
తాజా మీగడ: 2 టేబుల్‌స్పూన్లు,
పెరుగు: అరకప్పు,
కొత్తిమీర తురుము: టేబుల్‌స్పూను,
పిండి ముద్ద: అంచుల్ని మూసేందుకు సరిపడా
[List In English :
BiryAnI, Basmati Rice, Milk, Oil, Oninons, Cashewnut, Almond, Raisin, Ghee, Cloves, Black Cardamom, Pulav Leaves, Ginger Garlic Paste, Mint, Coriander Leaves, Biryani Masala, Salt, Potato, Carrot, Cauliflower, Beans, Fresh Cream ]
తయారుచేసే విధానం:
అన్నం కాస్త పలుకు ఉండి పొడిపొడిలాడేలా వండి పక్కన ఉంచాలి.ఒకటిన్నర టేబుల్‌స్పూన్ల గోరువెచ్చని పాలలో కుంకుమపువ్వును కరిగించి అన్నంలో వేసి బాగా కలపాలి. తరవాత అన్నం రెండు సమ భాగాలుగా చేసి పక్కన ఉంచాలి.నూనె వేసి సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిముక్కలు వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి. నాన్‌స్టిక్ పాన్‌లో సగం నెయ్యి వేసి జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి. అదే పాన్‌లో లవంగాలు, యాలకులు, పలావు ఆకులు వేసి వేయించాలి. చిన్న ముక్కలుగా తరిగిన ఉల్లిముక్కలు, అల్లంవెల్లుల్లి వేసి వేయించాలి. ఇప్పుడు పుదీనా ముద్ద, కొత్తిమీర ముద్ద, బిర్యానీ మసాలా, ఉప్పు, కూరగాయల ముక్కలు వేసి కలపాలి. మీగడ, మిగిలిన పాలు పోసి ఉడికించాలి. తరవాత దించి చల్లారాక గిలకొట్టిన పెరుగు కూడా వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని రెండు భాగాలుగా చేసి పక్కన ఉంచాలి.మరో పాన్‌లో మిగిలిన నెయ్యి వేసి వేయించిన ఉల్లిముక్కలు పరిచినట్లుగా చల్లాలి. దానిమీద ఉడికించిన కూరగాయల మిశ్రమంలో ఒక భాగాన్ని పరచాలి. ఇప్పుడు దానిమీద అన్నంలో ఒక భాగాన్ని పరచాలి. తరవాత మళ్లీ ఉల్లిముక్కలు, కూరగాయల మిశ్రమం, అన్నం వరసగా పరచాలి. చివరగా మిగిలిన ఉల్లిముక్కలు, జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష, కొత్తిమీర తురుము చల్లి మూతపెట్టి ఆవిరి బయటకు పోకుండా అంచుల్ని పిండితో మూసేసి అరగంటసేపు దమ్ చేయాలి. దీన్ని రైతాతో వడ్డిస్తే రుచిగా ఉంటుంది.
Labels:
Almond,
Basmati Rice,
Beans,
BiryAnI,
Black Cardamom,
Carrot,
Cashewnut,
Cauliflower,
Cloves,
Coriander Leaves,
Ghee,
Ginger Garlic Paste,
Mint,
Oninons,
Potato,
Pulav Leaves,
Raisin,
Salt
Varieties with Wheat flour - గోధూమ్‌ధామ్

ఏముందిలే... చపాతీ, పూరీలేగా చేసేది అని చప్పరించేయకండి.
అదే పిండికి కొన్ని ఆధరువులు తగిలిస్తే...
చపాతీ, పూరీలు సైతం చవులూరించే
కొత్త రుచులకు కేంద్రమవుతాయి.
గోధుమపిండితోనే స్వీటు, దోసెల లాంటి వెరైటీలూ ఉన్నాయండోయ్!
అందుకే, గోధుమలతో ధూమ్‌ధామ్... ఈ ఆదివారం మీ ఫ్యామిలీలో...
బంగాళదుంప - కొత్తిమీర చపాతీ
కావలసినవి: గోధుమ పిండి - 2 కప్పులు; బంగాళదుంపలు - 8; కొత్తిమీర - ఒక కట్ట, పచ్చి మిర్చి - 4; ఇంగువ - చిటికెడు, ఉప్పు, నెయ్యి - తగినంత
తయారీ: ఒక పాత్రలో గోధుమ పిండి, ఉప్పు, నీళ్లు వేసి చపాతీ పిండిలా కలిపి పక్కన ఉంచాలి.
బంగాళదుంపలను ఉడికించి తొక్క తీసి మెత్తగా చిదిమి పక్కన ఉంచాలి కొత్తిమీర , పచ్చి మిర్చి శుభ్రంగా కడిగి, మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ఒక పాత్రలో బంగాళదుంప మిశ్రమం, కొత్తిమీర మిశ్రమం వేసి, ఇంగువ జత చేసి బాగా కలపాలి చిన్న చిన్న ఉండలుగా చేయాలి ఒక్కో ఉండను గుండ్రంగా ఒత్తి, అందులో బంగాళదుంప మిశ్రమం ఉంచాలి. అంచులు మూసేసి, పిండి కొద్దిగా అద్దుతూ చపాతీలా ఒత్తాలి స్టౌ మీద పాన్ వేడి చేసి, ఒత్తి ఉంచుకున్న చపాతీని వేసి రెండు వైపులా నెయ్యి వేసి బాగా కాల్చి తీసేయాలి వేడివేడిగా వడ్డించాలి.
గోధుమ హల్వా
కావలసినవి: గోధుమ పిండి - కప్పు; పంచదార - 2 కప్పులు; మిఠాయి రంగు - చిటికెడు (కొద్దిపాటి నీళ్లలో వేసి కలిపి ఉంచాలి); ఏలకుల పొడి - పావు టీ స్పూను; నెయ్యి - తగినంత
తయారీ:ఒక పాత్రలో కప్పుడు నీళ్లు, గోధుమ పిండి వేసి కలపాలి వేరొక పాత్రలో పావు కప్పు నీళ్లు, పంచదార వేసి బాగా కలపాలి. స్టౌ మీద ఈ పాత్ర ఉంచి, పంచదార కరిగేవరకు కలపాలి నీళ్లలో కలిపి ఉంచుకున్న గోధుమపిండి, మిఠాయి రంగు, ఏలకుల పొడి, నెయ్యి వేసి అడుగంటకుండా కలపాలి మిశ్రమం బాగా ఉడికిందనిపించాక, స్టౌ కట్టేయాలి పెద్ద పళ్లానికి నెయ్యి రాసి, ఉడికించుకున్న హల్వా పోసి, సమానంగా పరిచి కట్ చేసుకోవాలి.
టొమాటో చీజ్ పూరీ
కావలసినవి గోధుమపిండి - కప్పు మైదా పిండి - కప్పు టొమాటో రసం - కప్పుకారం - టీ స్పూను చీజ్ తురుము - కప్పు ఉప్పు - తగినంత
నూనె - తగినంత
తయారీ ఒక పాత్రలో పైన చెప్పిన పదార్థాలన్నీ వేసి, చపాతీ పిండిలా కలిపి సుమారు అర గంటసేపు నాననివ్వాలి.బాణలిలో నూనె వేసి కాచాలి.పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి, పూరీలా ఒత్తి, నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించాలి. పేపర్ టవల్ మీదకు తీసుకుని, వెజిటబుల్ సలాడ్‌తో వేడివేడిగా అందించాలి.
కశ్మీరీ చపాతీ
కావలసినవి: గోధుమపిండి - కప్పు, సోంపు - అర టీ స్పూను; జీలకర్ర - అర టీ స్పూను, వాము - పావు టీ స్పూను; మిరియాలు - 10, ఇంగువ - పావు టీ స్పూను; పాలు - తగినన్ని, ఉప్పు - తగినంత; నెయ్యి - కొద్దిగా
తయారీ: ముందుగా బాణలిలో సోంపు, జీలకర్ర, వాము, మిరియాలను నూనె లేకుండా వేయించి, చల్లార్చి మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి ఒక పాత్రలో గోధుమపిండి, పొడి చేసి ఉంచుకున్న మసాలా, ఇంగువ, పాలు, ఉప్పు, తగినన్ని నీళ్లు వేసి, చపాతీ పిండిలా కలిపి పక్కన ఉంచాలి స్టౌ మీద పెనం ఉంచి వేడి చేయాలి పిండిని కొద్దిగా తీసుకుని చపాతీలా ఒత్తి, పెనం మీద వేసి రెండువైపులా నేతితో కాల్చి తీయాలి. వేడివేడిగా ఏదైనా కూరతో అందించాలి.
Snacks with Tea - చిరుతిండితో టీ
Snacks with Tea - చిరుతిండితో టీ
చిటపట చినుకులతో సన్నని వాన కురుస్తూంటే...పొగలు కక్కే వేడి వేడి టీలో కరకరలాడే బిస్కెట్లు నంచుకుని తింటుంటే...
ఏదో తెలియని అనుభూతి... మరేదో తెలియని ఆనందం...
ఇదంతా పాతబడిపోయింది...
ఇప్పుడు... మన ఇంటికి టీ సమయంలో అనుకోని అతిథి వస్తే...
వాళ్లకి రొటీన్‌గా కాకుండా రకరకాల టీ లు తయారుచేసి...
వాటికి రకరకాల స్నాక్స్ జత చేస్తూ అందిస్తే...
వాళ్లు పొందే సంతోషం...
సిప్పు సిప్పుకీ... ముక్క ముక్కకీ రెట్టింపు అవుతూ ఉంటుంది.
ఈ వారం రకరకాల టీలను, రకరకాల స్నాక్స్ కాంబినేషన్లతో మీ అతిథులకు అందించండి...
వారిచ్చే కాంప్లిమెంట్స్‌ని అందుకోవడానికి సిద్ధమైపోండి...
పెపరీ నగ్గెట్స్
మైదాపిండి - కప్పు; ఉప్పు - అర టీస్పూను; బేకింగ్ పౌడర్ - అర టీ స్పూను; బేకింగ్ సోడా - అర టీ స్పూను; నల్ల జీలకర్ర - అర టీస్పూను; నెయ్యి - టేబుల్ స్పూను; కారం - చిటికెడు; నీళ్లు - తగినన్ని; నూనె - వేయించడానికి తగినంత
తయారీ:
ఒక పాత్రలో మైదాపిండి, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఉప్పు వేసి బాగా కలపాలి
నెయ్యి లేదా నూనె జత చేసి ఈ మిశ్రమం బ్రెడ్ పొడిలా కనిపించేలా కలపాలి
కారం, నల్ల జీలకర్ర జత చేసి బాగా కలపాలి
తగినన్ని నీళ్లు జత చేసి చపాతీపిండిలా కలిపి, అప్పడాల పీట మీద మందంగా ఒత్తి, కావలసిన ఆకారంలో కట్ చేయాలి
బాణలిలో నూనె వేసి కాగాక వీటిని అందులో వేసి దోరగా వేయించి, చల్లారాక వేడి వేడి టీతో అందించాలి.
వైట్ టీ
వైట్ టీ పొడి - 2 టీ స్పూన్లు (ఒక కప్పుకి); పంచదార - తగినంత (ఇష్టం లేనివాళ్లు పంచదార లేకుండా కూడా తాగచ్చు)
తయారీ:
నీళ్లను బాగా మరిగించాలి
ఒక్కో కప్పులో 2 టీ స్పూన్ల టీ పొడి వేయాలి
వేడి నీళ్లు పోసి మూత పెట్టి ఐదు నిమిషాలు ఉంచాక, మూత తీసి తాగాలి
(అవసరమనుకుంటే మధ్యలో ఒకసారి కలపాలి. అప్పుడు టీ ఆకులలోని సారం బాగా దిగుతుంది. మూత పెట్టి ఉండటం వలన వేడి కూడా తగ్గదు)
మోనా
కోడి గుడ్లు - 6 (మరో రెండు గుడ్లు విడిగా ఉంచుకోవాలి); సోంపు కషాయం - (అర లీటరు); చల్లటి పాలు - 750 మి.లీ.; ఆలివ్ ఆయిల్ - 250 మి.లీ.; పంచదార - అర కేజీ; నిమ్మ తొక్కల తురుము - కొద్దిగా; ఈస్ట్ - 75 గ్రా.; మైదా పిండి - 2.5 కేజీలు; దాల్చినచెక్క పొడి - కొద్దిగా
తయారీ:
కోడిగుడ్లను బాగా గిలక్కొట్టి పక్కన ఉంచాలి
ఒక పాత్రలో సోంపు కషాయం, ఈస్ట్ వేసి బాగా కలిపి, పాలు, ఆలివ్ ఆయిల్, నిమ్మ తొక్కల తురుము, పంచదార వేసి బాగా కలిపి, గిలక్కొట్టిన కోడిగుడ్లలో వేయాలి
మైదాపిండి కొద్దికొద్దిగా వేస్తూ చేత్తో జాగ్రత్తగా కలుపుతూండాలి. (చేతికి అంటకుండా ఉండేవరకు కలపాలి)
ఈ మిశ్రమాన్ని ఒక పెద్ద పాత్రలోకి నెమ్మదిగా పోసి సుమారు రెండు గంటలు అలా వదిలేయాలి
మిశ్రమం కొద్దిగా పొంగిన తర్వాత పెద్ద నారింజకాయ పరిమాణంలో కట్ చేసి, అదనంగా ఉంచుకున్న కోడిగుడ్ల సొన ఉపయోగిస్తూ రింగ్ ఆకారంలో తయారుచేయాలి (సుమారు 30 సెం.మీ. పొడవు, 10 సెం.మీ వెడల్పు)
అవెన్‌ను 180 డిగ్రీల దగ్గర ప్రీహీట్ చేయాలి
నెయ్యి లేదా నూనె రాసిన ట్రేలో తయారుచేసి ఉంచుకున్న మోనాలను ఉంచి, వాటి మీద కోడి గుడ్డు సొన లేదా పంచదార + దాల్చినచెక్క మిశ్రమం వేసి అవెన్‌లో ఉంచాలి
బంగారురంగులోకి వచ్చేవరకు బేక్ చేసి బయటకు తీసి టీ తో అందించాలి.
గ్రీన్ టీ విత్ తులసి
నీళ్లు - 2 కప్పులు; గ్రీన్ టీ + తులసి టీ బ్యాగులు - 2; పంచదార - 2 టీ స్పూన్లు
తయారీ:
నీళ్లను మరిగించాక, అందులో టీ బ్యాగ్ వేసి రెండు మూడు నిమిషాలు ముంచి తీస్తూ చేయాలి. అలా చేయడం వలన వాటిలో ఉండే ఫ్లేవర్ టీ లోకి వస్తుంది. (వీటిని నీటితో కలిపి మరిగించకూడదు. సాధారణంగా ఒక కప్పు టీ కి ఒక బ్యాగ్ సరిపోతుంది)
పంచదార జత చేయాలి. ఇష్టపడేవారు పాలు కూడా కలుపుకోవచ్చు.
బేక్‌డ్ మేథీ ముథియా
కసూరీ మేథీ - ఒకటిన్నర టీ స్పూన్లు; గోధుమపిండి - 5 టేబుల్ స్పూన్లు; సెనగ పిండి - 5 టేబుల్ స్పూన్లు; అల్లం పచ్చి మిర్చి ముద్ద - 2 టీ స్పూన్లు; జీలకర్ర పొడి - ఒకటిన్నర టీ స్పూన్లు; మిరియాలు - 6 గింజలు; గరం మసాలా - అర టీ స్పూను; ఇంగువ - చిటికెడు; నూనె - 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు - తగినంత
తయారీ:
400 డిగ్రీ ఫారెన్ హీట్ దగ్గర అవెన్‌ను ప్రీ హీట్ చేయాలి
ఒక పాత్రలో అన్ని వస్తువులూ వేసి తగినంత నీళ్లు పోసి చపాతీ పిండిలా కలపాలి, ఉండలు చేసి, చేతితో వడల మాదిరిగా కొద్దిగా ఒత్తాలి
నూనె రాసిన బేకింగ్ డిష్‌లో వీటిని ఉంచి సుమారు పది నిమిషాలు బేక్ చేయాలి. (అవసరమనుకుంటే రెండో వైపు కూడా బంగారు రంగు వచ్చేలా మరోమారు అవెన్‌లో ఉంచవచ్చు)
కొత్తిమీర పచ్చడి, నిమ్మ చెక్కలతో సర్వ్ చేయాలి.
పాల టీ
అల్లం + ఏలకులు/ అల్లం + ఏలకులు + లవంగాలు; పాలు - కప్పు; పంచదార - అర టీ స్పూను; టీ పొడి - అర టీ స్పూను
తయారీ
తగినన్ని నీళ్లను మరిగించాలి
ఆ నీళ్లలో మనకు కావలసిన ఫ్లేవర్ ఆకులు, టీ పొడి వేసి కొద్దిసేపు వదిలేయాలి
వేడి పాలు, పంచదార జత చేసి, శ్నాక్స్‌తో కలిపి అందించాలి.
మలై స్టైల్ కర్రీ పఫ్
ఫ్రోజెన్ పఫ్ పేస్ట్రీ - ఒక ప్యాకెట్ (సూపర్ మార్కెట్‌లో దొరుకుతుంది); బంగాళదుంపలు - 3 (ఉడికించి, తొక్క తీసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయాలి); కైమా మీట్ - కప్పు (ఉప్పు, మిరియాల పొడి జత చేసి మ్యారినేట్ చేయాలి); ఉల్లి తరుగు - అర కప్పు; వెల్లుల్లి - 2 రేకలు (సన్నగా తరగాలి); ఉడికించిన కూర ముక్కలు - కప్పు (బఠాణీ, మొక్కజొన్న, క్యారట్); కూర పొడి - 3 టేబుల్ స్పూన్లు; నీళ్లు - కప్పు; ఉప్పు, పంచదార, మిరియాల పొడి - రుచికి తగినంత; నూనె - తగినంత
తయారీ:
బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక వెల్లుల్లి తరుగు వేసి వేయించాలి
కై మా మీట్ వేసి రెండు నిమిషాలు వేయించాలి
ఉల్లి తరుగు జత చేసి బాగా వేయించాక, బంగాళ దుంప ముక్కలు, కూర పొడి, నీళ్లు, ఉప్పు, పంచదార, మిరియాల పొడి వేసి మంట తగ్గించి అన్నీ మెత్తగా అయ్యేవరకు ఉడికించి, దించేయాలి
పఫ్ పేస్ట్రీని పొడవుగా ముక్కలుగా కట్ చేసి, ఉడికించి ఉంచుకున్న మిశ్రమాన్ని ఒక్కో దానిలో ఉంచి, మడత పెట్టి, కోడిగుడ్డు సొనతో అంచులు మూసేయాలి
ఫ్రోజెన్ పఫ్ పేస్ట్రీని ప్యాకెట్ మీద ఉన్న సూచనల మేరకు, ప్రీహీట్ చేసిన అవెన్‌లో బేక్ చేయాలి.
పుదీనా టీ
పుదీనా ఆకులు - రెండు టీ స్పూన్లు; సోంపు - అర టీ స్పూను; ఎండు అల్లం - చిటికెడు
తయారీ
ఒక కప్పులో మరిగించిన నీళ్లు పోయాలి
పుదీనా ఆకులు, సోంపు, ఎండు అల్లం వేసి మూత ఉంచి ఐదు నిమిషాల తర్వాత వడ గట్టి తాగాలి.
Tiffin for School going Children
®¾Öˆ@ÁÙx ÅçJÍê½Õ. XÏ©x© Â¢ Íäæ® šËX¶ÏÊÕx „Ã@ÁxÂ¹× ¯îª½Ö-J¢ÍÃL.ÆŸä ®¾«Õ-§ŒÕ¢©ð ®¾Õ©Õ-«Û-’Ã-ÊÖ X¾Üª½h-„ÃyL. Ʃǒ¹E ‡X¾Ûpœ¿Ö Ÿî¬Ç, ƒœÎx, ÍŒ¤ÄB Æ¢˜ä Aʪ½Õ ®¾J¹ŸÄ, åXšËd*aÊ ¦Ç¹×qÊÕ Æ©Çê’ „çÊÂˈ ÅçÍäa-²Äh-ª½Õ Âí¢Ÿ¿ª½Õ ’¹œ¿Õ-’Ã_-ªá-©Õ. Æ¢Ÿ¿Õê šËX¶ÏÊxÊÕ ƒ©Ç ÂíÅŒh’à Íä®Ï åX{d¢œË. |
Different Indian Chips - వడియాలు
కంచం అంచున...వడియాల జడివాన...
వడియాలను చూస్తే చాలు...
ఎందుకిలా రేడియంలా మెరుస్తాయి కళ్లు?
వడియాన్ని చూస్తే ఎందుకిలా నాలుకపై సుడి తిరుగుతాయి నీళ్లు?
వడియం రుచిని వర్ణించడం అంటే...
కడియాన్ని అద్దంలో చూడటమే!
ఇక... అదేం చిత్రమోగానీ... మిరప కారంలో ఓ చమత్కారం ఉంది.
మిరపకాయల్ని మజ్జిగలో ఊరేశాక చల్లలోని పుల్లదనం కాస్తా కారాన్ని జోకొడుతుంది.
మిరపలోని చిరు ‘మంట’ కాస్తా కడుపులోకి స్థానచలనంపై వెళ్లి
అక్కడ ‘జఠరాగ్ని’ హోదా సాధిస్తుంది.
ఇదోరకం ప్రమోషన్‌తో కూడిన ట్రాన్స్‌ఫర్.
అయినా వడ్డన మాని వర్ణనలేలా?
తినడం మానేసి ఈ తిప్పలేలా?
కంచం అంచున వడియాలు వడ్డించుకోండి.
చల్ల మిరపకాయల్ని ఫుల్లుగా కొరికి నమిలేయండి.
వడియంతో దోస్తీ చేయండి... విస్తరితో కుస్తీ పట్టండి...
పెసర వడియాలు
కావలసినవి:
పెసరపప్పు - పావు కేజీ
పచ్చి మిర్చి - 15
జీలకర్ర - టీ స్పూను
ఉప్పు - తగినంత
ఇంగువ - టీస్పూను
తయారీ:
పెసరపప్పును శుభ్రంగా కడిగి సుమారు రెండు గంటలసేపు నానబెట్టాలి
నీళ్లు వడకట్టి... పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, కొద్దిగా నీరు జత చేసి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి
ఎండలో... ప్లాస్టిక్ కవర్ మీద స్పూనుతో వడియాలు పెట్టి ఎండనివ్వాలి
రెండు రోజులతరువాత కవర్ నుండి విడదీసి పళ్లెంలో వేసి ఎండబెట్టి, గాలి చొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి.
బంగాళ దుంప అప్పడాలు
కావలసినవి:
బంగాళదుంపలు - కిలో; ఉప్పు - తగినంత; కారం - 2 టీ స్పూన్లు; నూనె - 2 టేబుల్ స్పూన్లు
తయారీ
బంగాళదుంపలను శుభ్రంగా కడిగి తగినంత నీళ్లు జత చేసి కుకర్‌లో ఉంచి రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి
చల్లారాక బంగాళదుంపల తొక్క తీసి సన్నగా తురమాలి
ఉప్పు, కారం జత చేసి మెత్తగా కలపాలి
చేతికి నూనె రాసుకుని, ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచాలి చిన్న ప్లాస్టిక్ కవర్ తీసుకుని దాని మీద నూనె రాయాలి
ఉండల అంచులకు కూడా కొద్దిగా నూనె రాసి ప్లాస్టిక్ కవర్ మీద ఉంచి పైన రాసి, మళ్లీ ప్లాస్టిక్ కవర్ ఉంచి, ఆ పైన జాగ్రత్తగా ఒత్తాలి
ముందుగా పైన ఉన్న పొర తీసి ఒత్తి ఉంచుకున్న అప్పడాన్ని జాగ్రత్తగా చేతితో తీసి ఒక పెద్ద ప్లాస్టిక్ కవర్ మీద వేసి ఎండలో ఆరబెట్టాలి. నాలుగైదు రోజులు ఎండాక డబ్బాలో నిల్వ చేసుకోవాలి.
టొమాటో సగ్గుబియ్యం వడియాలు
కావలసినవి:
సగ్గుబియ్యం - అర కేజీ; టొమాటోలు - 200 గ్రా;
నీళ్లు - 6 కప్పులు; కారం - 2 టీ స్పూన్లు; ఉప్పు - తగినంత
తయారీ
టొమాటోలను శుభ్రంగా కడిగి వేడి నీళ్లలో సుమారు పావుగంటసేపు ఉడికించాలి చల్లారాక పైన తొక్కు తీసి ప్యూరీలా చేసి పక్కన ఉంచాలి
సగ్గుబియ్యాన్ని సుమారు పావుగంటసేపు నానబెట్టి నీళ్లు ఒంపేయాలి
ఒక పాత్రలో సగ్గుబియ్యం, ఆరు కప్పుల నీళ్లు పోసి కుకర్‌లో ఉంచి ఐదు విజిల్స్ వచ్చాక దింపేయాలి
సగ్గుబియ్యం చల్లారాక, టొమాటో ప్యూరీ, ఉప్పు, కారం వేసి బాగా కలపాలి ఎండలో ప్లాస్టిక్ కవర్ మీద, ఉడికించుకున్న సగ్గుబియ్యం మిశ్రమాన్ని స్పూన్‌తో తీసుకుని వడియాలుగా పెట్టాలి
కొద్దిగా ఎండాక ప్లాస్టిక్ కవర్ నుంచి వేరు చేసి పళ్లెంలో నాలుగైదు రోజులు ఎండబెట్టి, డబ్బాలో నిల్వ చేసుకోవాలి.
గుమ్మడివడియాలు
కావలసినవి:
బూడిద గుమ్మడికాయ - ఒకటి
పచ్చి మిర్చి - 100 గ్రా.
పొట్టు మినప్పప్పు - పావు కేజీ
పసుపు - టీ స్పూను
ఉప్పు - తగినంత
జీలకర్ర - 50 గ్రా.
ఇంగువ - టీ స్పూను
నువ్వులపొడి - 2 టీ స్పూన్లు
తయారీ:
బూడిద గుమ్మడికాయ ముక్కలు సన్నగా తరిగి పొడి వస్త్రంలో మూట గట్టి దాని మీద బరువు ఉంచి ఒక రోజు రాత్రి వదిలేయాలి
పొట్టుమినప్పప్పు నానబెట్టి, మరుసటి రోజు పప్పును శుభ్రంగా కడిగి, పొట్టు తీసి, గ్రైండర్‌లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి
పచ్చి మిర్చి, ఉప్పు, జీలకర్ర జత చేయాలి
ఒక పెద్ద పాత్రలో గుమ్మడికాయ ముక్కలు, రుబ్బి ఉంచుకున్న పిండి వేసి కలపాలి
ప్లాస్టిక్ కవర్ మీద వడియాలు పెట్టాలి
రెండుమూడు రోజులతరువాత ప్లాస్టిక్ కవర్ మీద నుంచి విడదీసి పళ్లెంలో వేసి ఎండబెట్టాలి.
రాగి పిండి వడియాలు
కావలసినవి:
రాగి పిండి - కప్పు; నీళ్లు - 5 కప్పులు; కారం - టీ స్పూను; ఉప్పు - తగినంత; ఇంగువ - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను
తయారీ:
రెండు కప్పుల నీళ్లలో రాగి పిండి వేసి కలిపి పక్కన ఉంచాలి
మిగిలిన నీటిని స్టౌ మీద ఉంచి మరిగించాలి
ఉప్పు, కారం, జీలకర్ర జత చేయాలి
చల్లటి నీటిలో కలిపి ఉంచుకున్న రాగి పిండిని మరుగుతున్న నీటిలో వేసి ఉడికించాలి
బాగా ఉడికాక ఇంగువ వేసి కలిపి దించేయాలి
చల్లారాక ప్టాస్లిక్ కాగితం మీద స్పూన్‌తో వడియాలు పెట్టి ఎండనివ్వాలి
కొద్దిగా ఎండిన తర్వాత వాటిని విడదీసి పళ్లెంలో ఉంచి రెండు రోజులు ఎండనిచ్చి, డబ్బాలో నిల్వ చేసుకోవాలి.
ఊరిన మిరపకాయలు
కావలసినవి:
పచ్చి మిర్చి - కేజీ (బజ్జీమిర్చి వాడాలి)
పుల్ల పెరుగు - 2 లీటర్లు
ఉప్పు - తగినంత
పసుపు - కొద్దిగా
ఇంగువ - టీ స్పూను
తయారీ
పచ్చి మిర్చిని నిలువుగా ఒక వైపు కట్ చేయాలి
పుల్ల పెరుగులో ఉప్పు, పసుపు, ఇంగువ వేసి కలపాలి
పచ్చిమిర్చిని అందులో వేసి ఒక రోజంతా ఉంచాలి
మరుసటి రోజు పెరుగులో నుంచి మిర్చిని బయటకు తీసి ప్లాస్టిక్ కవర్ మీద ఎండలో ఉంచాలి
పెరుగును కూడా ఎండబెట్టాలి
సాయంత్రం మిర్చిని పెరుగులో నానబెట్టాలి
మరుసటి రోజు మళ్లీ ముందులాగే ఎండబెట్టాలి
ఇలా సుమారు ఐదు రోజులయ్యాక ఇంక పెరుగులో వేయకుండా కేవలం మిర్చి మాత్రమే ఎండబెట్టాలి
పూర్తిగా ఎండిన తర్వాత డబ్బాలో నిల్వచేసుకోవాలి
వీటిని వేయించుకుంటే, మామిడికాయ పప్పులోకి రుచిగా ఉంటాయి.