కుష్బూ ఇడ్లీ - Khushboo Idli
కావలసిన పదార్థాలు:
ముడి బియ్యం - రెండు కప్పులు,
మినపప్పు - అర కప్పు,
సగ్గుబియ్యం - పావు కప్పు,
ఉప్పు - తగినంత,
వంట సోడా - పావు టీస్పూన్
తయారీ:
ముడిబియ్యం, మినపప్పు, సగ్గుబియ్యంలను శుభ్రంగా కడిగి పది గంటలు నానబెట్టాలి. వాటన్నింటినీ కలిపి ఇడ్లీ పిండిలా రుబ్బాలి. ఈ పిండి కనీసం పదిగంటల సేపైనా పులవలి. అంటే ముడిబియ్యం, మినపప్పు, సగ్గుబియ్యాలను ఉదయం నానబెట్టాలి. సాయంత్రం పిండి పట్టి మరుసటిరోజు ఇడ్లీల్లా వేసుకోవాలన్నమాట. అచ్చం మామూలు ఇడ్లీకి మల్లే. పిండిలో కొంచెం వంట సోడా కలిపి ఇడ్లీ ప్లేట్లలో వేసి ఉడికించాలి. సాంబారుతో కలిపి వీటిని తింటే చాలా బాగుంటాయి.
Showing posts with label Idli. Show all posts
Showing posts with label Idli. Show all posts
Fried Chilli Idli - ఫ్రైడ్ చిల్లీ ఇడ్లీ
ఫ్రైడ్ చిల్లీ ఇడ్లీ - Fried Chilli Idli
కావలసినవి:
ఇడ్లీలు - ఆరు,
ఉల్లిపాయలు (తరిగి)- రెండు,
టొమాటోలు(తరిగి) - మూడు,
వెల్లుల్లి రెబ్బలు (నలిపి)- ఆరు,
కరివేపాకు-కొద్దిగా,
టొమాటో సాస్ - నాలుగు టేబుల్‌స్పూన్లు,
కారం, పసుపు -ఒక్కో టీస్పూన్ చొప్పున,
పచ్చి మిరపకాయలు(నిలువుగా చీల్చి) - ఆరు,
నూనె- వేయించడానికి సరిపడినంత,
కొత్తిమీర తరుగు- కొద్దిగా,
మైదా - ఒక కప్పు,
మొక్కజొన్నపిండి- ఒక టేబుల్‌స్పూన్,
మిరియాల పొడి- ఒక టేబుల్‌స్పూన్,
ఉప్పు-తగినంత
తయారీ:
ఇడ్లీలని ఒకే సైజులో కొంచెం పెద్ద ముక్కలుగా కోయాలి. మైదా, కార్న్‌ఫ్లోర్, మిరియాల పొడి, ఉప్పు తీసుకొని అందులో కొద్దిగా నీరు పోసి కలపాలి. ఈ పిండిలో ఇడ్లీ ముక్కలను ముంచి నూనెలో గోధుమరంగు వచ్చేవరకు వేగించాలి. వేరొక కడాయిలో రెండు టేబుల్‌స్పూన్ల నూనె పోసి కరివేపాకు, వెల్లుల్లిలను వేగించాలి. తరువాత అందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి మూడు నిమిషాలపాటు వేగిన తరువాత టొమాటో ముక్కలు కూడా వేసి బాగా కలపాలి. ఒక నిమిషం తరువాత టొమాటో సాస్ వేసి, నూనె తేలేవరకూ ఉడికించాలి. తరువాత దానిలో కారం, పసుపు, ఉప్పు, ఫ్రై చేసిన ఇడ్లీలు వేసి, రెండు నుంచి మూడు నిమిషాలపాలు ఉడికించాలి. తరువాత కొత్తిమీరతో అలంకరించి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది.
కావలసినవి:
ఇడ్లీలు - ఆరు,
ఉల్లిపాయలు (తరిగి)- రెండు,
టొమాటోలు(తరిగి) - మూడు,
వెల్లుల్లి రెబ్బలు (నలిపి)- ఆరు,
కరివేపాకు-కొద్దిగా,
టొమాటో సాస్ - నాలుగు టేబుల్‌స్పూన్లు,
కారం, పసుపు -ఒక్కో టీస్పూన్ చొప్పున,
పచ్చి మిరపకాయలు(నిలువుగా చీల్చి) - ఆరు,
నూనె- వేయించడానికి సరిపడినంత,
కొత్తిమీర తరుగు- కొద్దిగా,
మైదా - ఒక కప్పు,
మొక్కజొన్నపిండి- ఒక టేబుల్‌స్పూన్,
మిరియాల పొడి- ఒక టేబుల్‌స్పూన్,
ఉప్పు-తగినంత
తయారీ:
ఇడ్లీలని ఒకే సైజులో కొంచెం పెద్ద ముక్కలుగా కోయాలి. మైదా, కార్న్‌ఫ్లోర్, మిరియాల పొడి, ఉప్పు తీసుకొని అందులో కొద్దిగా నీరు పోసి కలపాలి. ఈ పిండిలో ఇడ్లీ ముక్కలను ముంచి నూనెలో గోధుమరంగు వచ్చేవరకు వేగించాలి. వేరొక కడాయిలో రెండు టేబుల్‌స్పూన్ల నూనె పోసి కరివేపాకు, వెల్లుల్లిలను వేగించాలి. తరువాత అందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి మూడు నిమిషాలపాటు వేగిన తరువాత టొమాటో ముక్కలు కూడా వేసి బాగా కలపాలి. ఒక నిమిషం తరువాత టొమాటో సాస్ వేసి, నూనె తేలేవరకూ ఉడికించాలి. తరువాత దానిలో కారం, పసుపు, ఉప్పు, ఫ్రై చేసిన ఇడ్లీలు వేసి, రెండు నుంచి మూడు నిమిషాలపాలు ఉడికించాలి. తరువాత కొత్తిమీరతో అలంకరించి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది.
Wheat Rava Idli - గోధుమరవ్వ ఇడ్లీ
గోధుమరవ్వ ఇడ్లీ - Broken Wheat Idli
కావలసినవి:
గోధుమ రవ్వ, పెరుగు ఒక్కోటి అరకప్పు చొప్పున,
ఓట్స్ - ఒక కప్పు,
క్యారెట్ తురుము - మూడు టేబుల్‌స్పూన్లు,
క్యాబేజీ తురుము - ఒకటిన్నర టేబుల్‌స్పూన్,
పచ్చి బఠానీలు - రెండు టేబుల్‌స్పూన్లు,
ఉప్పు- తగినంత,
నీళ్లు- ఒక కప్పు,
అల్లం- కొద్దిగా,
పచ్చిమిరపకాయలు (తరిగి) - రెండు,
మిరియాలు - అరటీస్పూను,
నిమ్మరసం - కొద్దిగా,
కొత్తిమీర తరుగు, నూనె, పోపు గింజలు- రెండు టీస్పూన్ల చొప్పున,
కరివేపాకు, ఇంగువ- సరిపడినంత.
తయారీ:
కడాయిలో ఓట్స్‌ని మూడు నిమిషాలపాటు వేగించాలి. చల్లార్చి పొడి చేసుకోవాలి. వేరొక కడాయిలో నూనెపోసి పోపు గింజలు, కరివేపాకు, ఇంగువ వేగించాలి. ఆ తరువాత క్యారెట్, క్యాబేజీ, బఠానీలు వేయాలి. ఒక నిమిషం తరువాత గోధుమ రవ్వ, ఓట్స్ పొడి వేసి రెండు నిమిషాలు వేగించాలి. కొద్దిసేపటి తరువాత ఉప్పు వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత పెరుగు, కొన్ని నీళ్లు పోసి ఇడ్లీ పిండిలా కలపాలి. ఇందులో నిమ్మరసం, కొత్తిమీర కలిపి ఇడ్లీ ప్లేట్లలో వేసి పావు గంటసేపు ఉండికించాలి. వేడి వేడిగా ఉన్నప్పుడు తింటే చాలా రుచిగా ఉంటాయి.
Idli Berger - ఇడ్లీ బర్గర్
కావలసినవి:
ఇడ్లీలు- ఆరు,
పుదీనా చట్నీ- 4 టీస్పూన్లు,
టమాటా (తరిగి)- మూడు,
ఉల్లిపాయ (తరిగి)- మూడు,
క్యారెట్ తురుము- ఒక కప్పు,
పచ్చి బటానీలు- ఒక కప్పు,
మైదా - ఒక టీస్పూను,
పసుపు తగినంత,
కారం, అల్లంవెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, గరం మసాలా ఒక్కోటి అరటీస్పూన్ చొప్పున, కొత్తిమీర తరుగు-తగినంత,
ఉప్పు- రుచికి సరిపడా, నూనె- వేగించడానికి సరిపడినంత.
తయారీ:
కడాయిలో నూనె వేడి చేసి ఇడ్లీలని గోధుమరంగు వచ్చే వరకు వేగించాలి. అవి బయట క్రిస్పీగా లోపల మెత్తగా ఉండేట్టు జాగ్రత్తపడాలి. కొత్తిమీర, పుదీనా చట్నీలను ఇడ్లీలకు రెండు వైపులా పూయాలి. క్యారెట్, పచ్చి బటానీలను ఉడికించి వడకట్టాలి. దోరగా వేగించిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలాలను ఒక గిన్నెలో వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో ఉడికించిన క్యారెట్, బటానీలు, ఉప్పు, కొత్తిమీర వేసి జారుగా కాకుండా గారెల పిండిలా కలపాలి. ఈ మిశ్రమాన్ని కట్లెట్‌లా చేయాలి. ఇవి ఇడ్లీ సైజ్‌లో ఉండాలి. వీటిని గోధుమ రంగు వచ్చే వరకు నూనెలో వేగించాలి. ఆ తరువాత కట్లెట్‌ని మధ్యలో పెట్టి రెండు వైపులా ఉల్లిపాయ, టొమాటో ముక్కలు ఉంచి వాటిపై ఇడ్లీని పెట్టి తినేయాలి.
ఇడ్లీలు- ఆరు,
పుదీనా చట్నీ- 4 టీస్పూన్లు,
టమాటా (తరిగి)- మూడు,
ఉల్లిపాయ (తరిగి)- మూడు,
క్యారెట్ తురుము- ఒక కప్పు,
పచ్చి బటానీలు- ఒక కప్పు,
మైదా - ఒక టీస్పూను,
పసుపు తగినంత,
కారం, అల్లంవెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, గరం మసాలా ఒక్కోటి అరటీస్పూన్ చొప్పున, కొత్తిమీర తరుగు-తగినంత,
ఉప్పు- రుచికి సరిపడా, నూనె- వేగించడానికి సరిపడినంత.
తయారీ:
కడాయిలో నూనె వేడి చేసి ఇడ్లీలని గోధుమరంగు వచ్చే వరకు వేగించాలి. అవి బయట క్రిస్పీగా లోపల మెత్తగా ఉండేట్టు జాగ్రత్తపడాలి. కొత్తిమీర, పుదీనా చట్నీలను ఇడ్లీలకు రెండు వైపులా పూయాలి. క్యారెట్, పచ్చి బటానీలను ఉడికించి వడకట్టాలి. దోరగా వేగించిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలాలను ఒక గిన్నెలో వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో ఉడికించిన క్యారెట్, బటానీలు, ఉప్పు, కొత్తిమీర వేసి జారుగా కాకుండా గారెల పిండిలా కలపాలి. ఈ మిశ్రమాన్ని కట్లెట్‌లా చేయాలి. ఇవి ఇడ్లీ సైజ్‌లో ఉండాలి. వీటిని గోధుమ రంగు వచ్చే వరకు నూనెలో వేగించాలి. ఆ తరువాత కట్లెట్‌ని మధ్యలో పెట్టి రెండు వైపులా ఉల్లిపాయ, టొమాటో ముక్కలు ఉంచి వాటిపై ఇడ్లీని పెట్టి తినేయాలి.
Tiffin for School going Children
®¾Öˆ@ÁÙx ÅçJÍê½Õ. XÏ©x© Â¢ Íäæ® šËX¶ÏÊÕx „Ã@ÁxÂ¹× ¯îª½Ö-J¢ÍÃL.ÆŸä ®¾«Õ-§ŒÕ¢©ð ®¾Õ©Õ-«Û-’Ã-ÊÖ X¾Üª½h-„ÃyL. Ʃǒ¹E ‡X¾Ûpœ¿Ö Ÿî¬Ç, ƒœÎx, ÍŒ¤ÄB Æ¢˜ä Aʪ½Õ ®¾J¹ŸÄ, åXšËd*aÊ ¦Ç¹×qÊÕ Æ©Çê’ „çÊÂˈ ÅçÍäa-²Äh-ª½Õ Âí¢Ÿ¿ª½Õ ’¹œ¿Õ-’Ã_-ªá-©Õ. Æ¢Ÿ¿Õê šËX¶ÏÊxÊÕ ƒ©Ç ÂíÅŒh’à Íä®Ï åX{d¢œË. |
Tri Colours Six Tastes - మూడు రంగులు ఆరు రుచులు
Tri Colours Six Tastes - మూడు రంగులు ఆరు రుచులు
Republic Day Special Varieties
గణతంత్రం... స్వేచ్ఛా పావురం.దేశభక్తి... త్యాగం, శాంతి, సౌభాగ్యాల త్రివర్ణం!
సమరయోధులు స్వాతంత్య్రాన్ని తెచ్చారు.
రాజనీతిజ్ఞులు రాజ్యాంగాన్నిచ్చారు.
మన దేశం, మన పాలన, మన వేడుక.
రేపు రిపబ్లిక్ డే.
ప్రతి హృదయం నిండా... మూడు రంగులే.
మనకు మాత్రం...
మూడు రంగులతో పాటు... ఆరు రుచులు.
హ్యాపీ రిపబ్లిక్ డే!
తిరంగా ఇడ్లీ
ఇడ్లీపిండి - అరకేజీ, క్యారట్ తురుము - కప్పు, కొత్తిమీర పేస్ట్ - కప్పు, పోపు - టీ స్పూను
తయారి:
ఇడ్లీ పిండిని మూడు భాగాలుగా చేసుకుని, ఒక భాగంలో క్యారట్ తురుము, ఒక భాగంలో కొత్తిమీర పేస్ట్ వేసి కలపాలి. ఒక భాగం అలాగే ఉంచేయాలి
ఈ మిశ్రమాన్ని గుండ్రంగా ఉండే మూడు బాక్స్‌లలో విడివిడిగా వేసి, కుకర్‌లో ఉంచి, ఆవిరి మీద ఉడికించాలి
మూడిటినీ వరుసగా ఒక ప్లేట్‌లో ఉంచి, పోపుతో గార్నిష్ చేసి, సర్వ్ చేయాలి.
తిరంగారవియోలి
కార్న్‌ఫ్లోర్ - 50 గ్రా., టొమాటో తరుగు - అర కప్పు, రెడ్ క్యాప్సికమ్ పేస్ట్ - 50 గ్రా., వెల్లుల్లి తరుగు - టీ స్పూను, చీజ్ తురుము - 20 గ్రా., ఆలివ్ ఆయిల్ - 10 మి.లీ., తులసి ఆకులు - 5 గ్రా., పుదీనా పేస్ట్ - 50 గ్రా., మైదాపిండి - 150 గ్రా., పుదీనా పేస్ట్ - 50 గ్రా., నీరు - లీటరు, చెర్రీ టొమాటోలు - 4 (మధ్యకి కట్ చేయాలి)
తయారి:
ఒక పాత్రలో... : కార్న్‌ఫ్లోర్, టొమాటో తరుగు, రెడ్ క్యాప్సికమ్ పేస్ట్, వెల్లుల్లి తరుగు, చీజ్ తురుము వేసి పక్కన ఉంచాలి (కాషాయరంగు)
కార్న్‌ఫ్లోర్, ఆలివ్ ఆయిల్ వేసి కలిపి పక్కన ఉంచాలి (తెలుపురంగు)
కార్న్‌ఫ్లోర్, తులసి ఆకులు, ఆలివ్ ఆయిల్, పుదీనా పేస్ట్ వేసి కలిపి ఉంచాలి (ఆకుపచ్చ రంగు)
మైదాను చపాతీపిండిలా కలిపి, చిన్నచిన్న ఉండలు చేసి, పల్చటి పూరీలా ఒత్తి, పొడవుగా రిబ్బన్‌లా కట్ చేయాలి
మూడురంగుల మిశ్రమాలను విడివిడిగా మూడు పొరలలో చుట్టి, మూడిటినీ కలిపి నలుచదరంగా వచ్చేలా కట్ చేసి, పైన కార్న్‌ఫ్లోర్‌తో బ్రష్ చేయాలి.
ఒక పాత్రలో నీరు, ఉప్పు వేసి మరిగించాలి
తయారుచేసి ఉంచుకున్న ‘రవియోలి’లను నీటిలో వేసి 5 నిముషాలు ఉంచి తీసేయాలి
చెర్రీ టొమాటోలతో గార్నిష్ చేసి, సర్వ్ చేయాలి.
తిరంగా పాస్తా
బటర్ - 2 టేబుల్ స్పూన్లు, మైదా - 2 టేబుల్ స్పూన్లు, పాలు - 100 మి.లీ., ఉప్పు - తగినంత, టొమాటో ప్యూరీ - 80 గ్రా. , టొమాటో కెచప్ - 2 టేబుల్ స్పూన్లు, తులసి ఆకులు - 10, పాస్తా - 80 గ్రా., నూనె - 50 గ్రా., వెల్లుల్లి రేకలు - 4, చీజ్ - 4 టేబుల్ స్పూన్లు, క్రీమ్ - 4 టేబుల్ స్పూన్లు, వైట్ సాస్ - 80 గ్రా., పుదీనాపేస్ట్ - 50 గ్రా., ఆలివ్ ఆయిల్ - 2 టేబుల్ స్పూన్లు.
టొమాటో ప్యూరీ కోసం
టొమాటోలు - 150 గ్రా., టొమాటో కెచప్ - 2 టేబుల్ స్పూన్లు
తయారి:
పాస్తాను ఉడికించి మూడు భాగాలుగా చేసి పక్కన ఉంచాలి
పాన్‌లో బటర్ వేసి కరిగాక మైదా, చల్లటిపాలు వేసి కలిపాక ఉప్పు జత చేసి పక్కన ఉంచాలి
టొమాటో ప్యూరీ కోసం... టొమాటోల పై తొక్క తీసి, టొమాటోలను మిక్సీలో వేసి మెత్తగా చేసి, గిన్నెలో వేసి ఉడికాక, టొమాటో కెచప్, తులసి ఆకులు, ఉప్పు జత చేసి పక్కన ఉంచాలి
పుదీనా ఆకులను మిక్సీలో వేసి మెత్తగా చేసి, పక్కన ఉంచాలి
గిన్నెలో నీళ్లు పోసి మరిగాక, పాస్తా వేసి ఉడికించి పక్కన ఉంచాలి
బాణలిలో నూనె వేసి కాగాక వెల్లుల్లి రేకలు, టొమాటో ప్యూరీ, క్రీమ్ వేసి ఉడికించాక, పాస్తా జత చేసి, పైన చీజ్ వేసి తీసేయాలి
అదే బాణలిలో ఆలివ్ ఆయిల్ కాగాక వెల్లుల్లి రేకలు, వైట్ సాస్, క్రీమ్, పాస్తా వేసి ఉడికించి దించేసి క్రీమ్‌తో గార్నిష్ చేయాలి
ఆలివ్ ఆయిల్ కాగాక వెల్లుల్లి రేకలు వేయించి, క్రీమ్, పుదీనా పేస్ట్ జత చేసి, కొద్దిగా ఉడికాక దించి చీజ్‌తో గార్నిష్ చేయాలి
మూడు రంగుల పాస్తాలను వరుసగా పేర్చి సర్వ్ చేయాలి.
తిరంగా మౌసే
పాలు - టేబుల్ స్పూను, వైట్ చాకొలేట్ - 20 గ్రా., చిక్కగా చిలికిన క్రీమ్ - 150 మి.లీ., ఆరెంజ్ ప్యూరీ - 20 గ్రా., కివీ ప్యూరీ - 20 గ్రా.
తయారి:
ఒక పాత్రలో పాలు, వైట్ చాకొలేట్ వేసి కరిగించాలి
క్రీమ్‌ను మూడు భాగాలుగా చేసి పక్కన ఉంచాలి
క్రీమ్‌లో ఒక్కో భాగానికి ఆరెంజ్ ప్యూరీ, కివీ ప్యూరీ, కరిగించిన వైట్ చాకొలేట్ విడివిడిగా జతచేయాలి
ఒక గ్లాసులో ఈ మిశ్రమాలను వరుసగా పోసి సుమారు రెండు గంటలసేపు ఫ్రిజ్‌లో ఉంచాక, చల్లగా సర్వ్ చేయాలి.
తిరంగా కుల్ఫీ
చిక్కటిపాలు - ఒకటిన్నర లీటర్లు, బాదంపప్పు - 2 టేబుల్ స్పూన్లు, పిస్తా తరుగు - టేబుల్ స్పూను, ఏలకులపొడి - 5 గ్రా., కుంకుమపువ్వు - కొద్దిగా, ఖస్ సిరప్ - 2 టేబుల్ స్పూన్లు (సూపర్ మార్కెట్‌లో దొరుకుతుంది), క్రీమ్ - 3 టేబుల్ స్పూన్లు
తయారి:
మందంగా ఉండే వెడల్పాటి పాత్రలో పాలు పోసి మరిగాక, మంట తగ్గించి, పాలు చిక్కబడి సగం అయ్యేవరకు కలుపుతూ ఉండాలి
బాదంపప్పులు, పిస్తా తరుగు, ఏలకులపొడి జత చేసి మరోసారి కలిపి దించేయాలి మూడు భాగాలుగా విభజించి, ఒక భాగానికి కుంకుమపువ్వు, ఒక భాగానికి ఖస్ సిరప్, ఒక భాగానికి క్రీమ్ జతచేసి కుల్ఫీ మౌల్డ్‌లో వరుసగా పోసి కవర్ చేసి ఫ్రిజ్‌లో సుమారు ఆరు గంటలు ఉంచాక, సర్వ్ చేయాలి.
తిరంగా వెజిటబుల్ పులావ్
కార్న్‌ఫ్లోర్ - 50 గ్రా., టొమాటో తరుగు - అర కప్పు, రెడ్ క్యాప్సికమ్ పేస్ట్ - 50 గ్రా., వెల్లుల్లి తరుగు - టీ స్పూను, చీజ్ తురుము - 20 గ్రా., ఆలివ్ ఆయిల్ - 2 టేబుల్ స్పూన్లు, తులసి ఆకులు - 5 గ్రా., పుదీనా పేస్ట్ - 50 గ్రా., మైదాపిండి - 150 గ్రా., పుదీనా పేస్ట్ - 50 గ్రా., నీరు - లీటరు, చెర్రీ టొమాటోలు - 4 (మధ్యకి కట్ చేయాలి)
తయారి:
ఒక పాత్రలో... : కార్న్‌ఫ్లోర్, టొమాటో తరుగు, రెడ్ క్యాప్సికమ్ పేస్ట్, వెల్లుల్లి తరుగు, చీజ్ తురుము వేసి కలిపి పక్కన ఉంచాలి (కాషాయరంగు)
కార్న్‌ఫ్లోర్, ఆలివ్ ఆయిల్ వేసి కలిపి పక్కన ఉంచాలి (తెలుపురంగు)
కార్న్‌ఫ్లోర్, తులసి ఆకులు, ఆలివ్ ఆయిల్, పుదీనా పేస్ట్ వేసి కలిపి ఉంచాలి (ఆకుపచ్చ రంగు)
మైదాను చపాతీపిండిలా కలిపి, చిన్నచిన్న ఉండలు చేసి, పల్చటి పూరీలా ఒత్తి, పొడవుగా రిబ్బన్‌లా కట్ చేయాలి
మూడురంగుల మిశ్రమాలను విడివిడిగా మూడు పొరలలో చుట్టి, మూడిటినీ కలిపి చతురస్రంగా వచ్చేలా కట్ చేసి, పైన కార్న్‌ఫ్లోర్‌తో బ్రష్ చేయాలి
ఒక పాత్రలో నీరు, ఉప్పు వేసి మరిగించాలి
తయారుచేసి ఉంచుకున్న ‘రవియోలి’లను నీటిలో వేసి 5 నిముషాలు ఉంచి తీసేయాలి
చెర్రీ టొమాటోలతో గార్నిష్ చేసి, సర్వ్ చేయాలి.
Idli Varities - రకరకాల ఇడ్లీలు
Idli Varities - రకరకాల ఇడ్లీలు
తెలుగువారిదీ... ఇడ్లీదీ... కలివిడి గుణం...అల్లప్పచ్చడితో, ఆవకాయతో, సాంబార్‌తో, కారప్పొడితో, చట్నీతో,
దేనితోనైనా ఇట్టే కలిసిపోతుంది....
జాతీయ సమైక్యతకు చిహ్నం ఇడ్లీ...
మన సంస్కృతుల్లాగే ఇడ్లీకీ అనేక రూపాలు.
రవ్వ ఇడ్లీ, బటన్ ఇడ్లీ, ఓట్స్ ఇడ్లీ, సాంబారిడ్లీ!
అన్నం పరబ్రహ్మ స్వరూపమైతే...
ఇడ్లీది అపర ధన్వంతరి రూపం.
అందుకే ఇడ్లీ... నిత్యభోజనం.. పథ్యభోజనం
రండి... రకరకాల ఇడ్లీలను నోటిలో ఉంచుకుందాం.
పలురకాలైన వాటిని పంటి కింద నంజుకుందాం.
కారంపొడి ఇడ్లీలు - Chilli Powder Idli
ఇడ్లీలు - 10, మినప్పప్పు - కప్పు, శనగపప్పు - ముప్పావు కప్పు, ఎండుమిర్చి - 6, ఇంగువ - అర టీ స్పూను, నూనె - 2 టేబుల్‌స్పూన్లు, ఉప్పు - తగినంత, ఆవాలు - అర టీ స్పూను, జీలకర్ర - అర టీ స్పూను, కొత్తిమీర - కొద్దిగా
తయారి:
బాణలిలో నూనె వేసి కాగాక, మినప్పప్పు, శనగపప్పు వేసి వేయించాలి
ఎండుమిర్చి జత చేసి, బాగా కలిపి దించేయాలి
చల్లారాక, ఇంగువ, ఉప్పు జత చేసి మిక్సీలో వేసి పొడి చేసి పక్కన ఉంచాలి
బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి
ఇడ్లీలు వేసి జాగ్రత్తగా కలపాలి
తయారుచేసి ఉంచుకున్న కారంపొడి జల్లి బాగా కలపాలి
కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.
ఇడ్లీ వెజిటబుల్ సాండ్‌విచ్ - Idli Vegetable Sandwitch
ఇడ్లీపిండి - 3 కప్పులు; బంగాళదుంప కూర - కప్పు; వంటసోడా - చిటికెడు
కూరకు కావలసినవి:
బంగాళదుంపలు - 3, ఉడికించిన బఠాణీ - అర కప్పు, ఉల్లితరుగు - అర కప్పు, పచ్చిమిర్చి తరుగు - 2 టీ స్పూన్లు, పసుపు - పావు టీ స్పూను, శనగపప్పు - టేబుల్ స్పూను, మినప్పప్పు - టీ స్పూను, ఆవాలు - అర టీ స్పూను, కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు - 2 రెమ్మలు, ఉప్పు - తగినంత, నూనె - 2 టేబుల్ స్పూన్లు
తయారి:
బంగాళదుంపలను ఉడికించి మెత్తగా మాష్ చేయాలి
బాణలిలో నూనె కాగాక ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు వేసి వేయించాలి
పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, ఉల్లితరుగు వేసి వేయించాలి
ఉడికించిన బఠాణీలు జత చేయాలి
పసుపు, ఉప్పు, బంగాళదుంప పేస్ట్ వేసి రెండుమూడు నిమిషాలు ఉడికించాలి
కొత్తిమీర జత చేసి కలిపి దించి చల్లారనివ్వాలి
ఇడ్లీ రేకులకు నూనె రాసి, టేబుల్ స్పూను ఇడ్లీ పిండి వేసి, దాని మీద తయారుచేసి ఉంచుకున్న కూర, ఆ పైన రెండు టేబుల్‌స్పూన్ల ఇడ్లీ పిండి వేసి, కుకర్‌లో ఉంచి, ఒక విజిల్ వచ్చాక దించేయాలి
ఇడ్లీలను తీసి, మధ్యకు కట్ చేసి, చట్నీతో సర్వ్ చేయాలి.
ఉల్లి మసాలా ఇడ్లీ - Onion Masala Idli
ఇడ్లీ పిండి - 3 కప్పులు, ఉల్లి తరుగు - పావు కప్పు, నానబెట్టిన శనగపప్పు - పావు కప్పు, కొత్తిమీర తరుగు - 3 టేబుల్ స్పూన్లు, క్యారట్ తురుము - పావు కప్పు, కరివేపాకు - 2 రెమ్మలు, పచ్చిమిర్చి పేస్ట్ - టీ స్పూను, వంటసోడా - పావు టీ స్పూను, ఆవాలు - అర టీ స్పూను, ఉప్పు - తగినంత, నూనె - టేబుల్ స్పూను
ఇడ్లీ పిండికి.... ఉప్పుడు బియ్యం - 4 కప్పులు; మినప్పప్పు - కప్పు, అటుకులు - కప్పు; మెంతులు - టీ స్పూను, ఉప్పు - తగినంత
తయారి:
ఉప్పుడు బియ్యం, మినప్పప్పులను విడివిడిగా ముందురోజు రాత్రి నానబెట్టాలి
ఇడ్లీలు తయారుచేయడానికి రెండు గంటల ముందు అటుకులు, మెంతులను విడిగా నానబెట్టాలి మినప్పప్పును గ్రైండర్‌లో వేసి మెత్తగా చేసుకోవాలి
బియ్యం, అటుకులు, మెంతులను విడిగా మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి
ఒక గిన్నెలో రెండురకాల పిండులను వేసి సుమారు 9 గంటలు నానబెట్టాలి
బాణలిలో నూనె కాగాక ఆవాలు వేసి చిటపటలాడాక, ఉల్లితరుగు, పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేయించి, దించి చల్లారనివ్వాలి
నానబెట్టి ఉంచుకున్న శనగపప్పును ఇడ్లీపిండిలో వేయాలి
క్యారట్ తురుము, కొత్తిమీర తరుగు, కరివేపాకు, ఉప్పు వేసి బాగా కలిపి ఇడ్లీలు వేసుకోవాలి.
ఓట్స్ ఇడ్లీ - Oats Idli
ఓట్లు - కప్పు; గోధుమరవ్వ - అర కప్పు; పెరుగు - అర కప్పు; క్యారట్ తురుము - 3 టేబుల్ స్పూన్లు; క్యాబేజీ తురుము - 2 టేబుల్ స్పూన్లు; బఠాణీ - 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు - తగినంత; నీరు - కప్పు, అల్లం తురుము - టీ స్పూను; పచ్చిమిర్చి తరుగు - టీ స్పూను; మిరియాలపొడి - అర టీ స్పూను; నిమ్మరసం - అర టీ స్పూను; కొత్తిమీర తరుగు - 2 టీ స్పూన్లు; నూనె - 2 టేబుల్ స్పూన్లు; ఆవాలు - అర టీ స్పూను, మినప్పప్పు - టీ స్పూను; శనగపప్పు - టీ స్పూను, కరివేపాకు - 2 రెమ్మలు; ఇంగువ - కొద్దిగా
తయారి:
బాణలిలో నూనె కాగాక ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు వేసి వేయించాలి
క్యారట్ తురుము, క్యాబేజీ తురుము, బఠాణీలు వేసి మరో మారు వేయించాలి గోధుమరవ్వ, ఓట్స్ వేసి రెండు నిముషాలు వేయించాలి
ఉప్పు జత చేసి కలిపి దించేయాలి
చల్లారాక పెరుగు, నీళ్లు వేసి ఇడ్లీపిండి మాదిరిగా కలపాలి
కరివేపాకు, నిమ్మరసం జత చేయాలి
ఇడ్లీ రేకులకు నూనె రాసి, పిండిని ఇడ్లీలుగా వేసి, కుకర్‌లో ఉంచి పావుగంట తరువాత దించేయాలి.
మసాలా మినీ ఇడ్లీ ఫ్రై - Spice Mini Idli Fry
బటన్ ఇడ్లీలు - 18; ఉల్లితరుగు - పావు కప్పు; రెడ్ క్యాప్సికమ్ తరుగు - అర కప్పు; టొమాటో తరుగు - పావు కప్పు, బఠాణీ - పావు కప్పు; కరివేపాకు - 2 రెమ్మలు; జీలకర్ర - అర టీ స్పూను; ఆవాలు - అర టీ స్పూను; కారం - అర టీ స్పూను; పసుపు - పావు టీ స్పూను; నూనె - 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు - తగినంత
తయారి:
బాణలిలో నూనె కాగాక, ఆవాలు, జీలకర్ర వేసి వేగాక, ఉల్లి తరుగు, రెడ్ క్యాప్సికమ్ తరుగు, టొమాటో తరుగు వేసి వేయించాలి
బఠాణీ, కరివేపాకు, పసుపు, కారం, ఉప్పు జత చేయాలి
బటన్ ఇడ్లీలను జత చేసి, జాగ్రత్తగా కలిపి సర్వ్ చేయాలి.
మసాలా ఇడ్లీ ఫ్రై - Spice Idli Fry
ఇడ్లీలు - 6; ఇడ్లీకారం - 2 టేబుల్ స్పూన్లు, పసుపు - పావు టీ స్పూను; ఆలివ్ ఆయిల్ - టేబుల్ స్పూను, నూనె - అర టీ స్పూను, ఉప్పు - తగినంత;
పోపు కోసం:
నువ్వుపప్పు - టేబుల్ స్పూను, ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - అర టీ స్పూను, మినప్పప్పు - టీ స్పూను; శనగపప్పు - అర టీ స్పూను, ఉల్లితరుగు - పావు కప్పు; పచ్చిమిర్చి తరుగు - టీ స్పూను, వెల్లుల్లి రేకలు - 2; కరివేపాకు - 2 రెమ్మలు, ఇంగువ - చిటికెడు; కొత్తిమీర - కొద్దిగా
తయారి:
ఇడ్లీలను పొడవుగా కట్ చేసి, బాణలిలో నూనె కాగాక అందులో వేసి దోరగా వేయించాలి
నూనె రాసిన అల్యూమినియం ఫాయిల్ మీద ఈ ముక్కలను ఉంచి, ఆలివ్ ఆయిల్ చిలకరించాలి
180 డిగ్రీల దగ్గర ప్రీ హీట్‌చేసిన అవెన్‌లో ఈ ఫాయిల్స్‌ను సుమారు పావుగంటసేపు ఉంచి తీసేయాలి
బాణలిలో అర టీ స్పూను నూనె కాగాక, ఆవాలు, జీలకర్ర, నువ్వుపప్పు వేసి వేయించాలి
వెల్లుల్లిరేకలు, పచ్చిమిర్చి తరుగు, ఇంగువ జత చేయాలి
ఉల్లితరుగు, కరివేపాకు, నిమ్మరసం, ఇడ్లీ ముక్కలు వేసి కలపాలి
కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి.





