కావలసిన పదార్థాలు:
మటన్ జాయింట్ - 600 గ్రా
కారం - 20 గ్రా
అల్లం వెల్లుల్లి ముద్ద - తగినంత
కాశ్మీరీ కారం - 50 గ్రా
గరం మసాలా - రెండు గ్రా
ఆవ నూనె - 100 మి.లీ
పెరుగు - 300 మి.లీ
ఉప్పు - రుచికి సరిపడా
తయారీ విధానం:
కాశ్మీరీ కారం, అల్లం వెల్లుల్లి, ఉప్పు బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని మటన్ జాయింట్‌కు పట్టించి ఫ్రిజ్‌లో కనీసం 6 గంటలు ఉంచాలి.
వెడల్పాటి పాత్ర తీసుకుని అందులో రెండు లీటర్ల నీళ్లు పోసి మిగిలిన పదార్థాలు, మటన్ జాయింట్‌ను వేయాలి.
పాత్రకు సిల్వర్ ఫాయిల్ చుట్టేయాలి.
160 డిగ్రీల్లో ఓవెన్‌ను ప్రీ హీట్ చేసుకుని దాన్లో పాత్రను ఉంచాలి.
ఇలా గంటంబావు ఉడికిస్తూ మధ్య మధ్యలో గమనిస్తూ ఎముక నుంచి మటన్ వేరు పడుతున్నప్పుడు ఓవెన్ నుంచి బయటకు తీయాలి.
దీన్ని మళ్లీ ఇనుప చువ్వకు గుచ్చి నిప్పులపై కాల్చాలి.
ఆ తర్వాత పైన సాస్‌తో అలంకరించి వడ్డించాలి.
Showing posts with label Indian Recipes. Show all posts
Showing posts with label Indian Recipes. Show all posts
Prawns Fry - రొయ్యల వేపుడు
కావలసిన పదార్థాలు:
రొయ్యలు - అర కిలో
పెరుగు - 1 కప్పు
పసుపు - అర టీస్పూను
గరం మసాలా - 1 టే.స్పూను
ధనియాల పొడి - 1 టే.స్పూను
కారం - 1 టే.స్పూను
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టే.స్పూను
ఉప్పు, నూనె - తగినంత
ఉల్లి ముక్కలు - కాసిన్ని
తయారీ విధానం:
రొయ్యలకు పెరుగు, పసుపు చేర్చి రుద్ది బాగా కడగాలి.
తర్వాత కారం, ధనియాల పొడి, గరం మాసాలా, వేసి కలిపి గంట సేపు
పక్కనుంచాలి.
బాండ్లీలో నూనె పోసి కాగాక ఉల్లి ముక్కలు వేయించి అల్లం వెల్లుల్లి పేస్ట్ కలపాలి.
రెండు నిమిషాలు వేగాక రొయ్యలు వేసి వేయించాలి.
చిన్న మంట మీద కలుపుతూ వేయించాలి.
15 నిమిషాలపాటు వేయించాక తరిగిన కొత్తిమీరతో అలంకరించి వడ్డించాలి.
రొయ్యలు - అర కిలో
పెరుగు - 1 కప్పు
పసుపు - అర టీస్పూను
గరం మసాలా - 1 టే.స్పూను
ధనియాల పొడి - 1 టే.స్పూను
కారం - 1 టే.స్పూను
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టే.స్పూను
ఉప్పు, నూనె - తగినంత
ఉల్లి ముక్కలు - కాసిన్ని
తయారీ విధానం:
రొయ్యలకు పెరుగు, పసుపు చేర్చి రుద్ది బాగా కడగాలి.
తర్వాత కారం, ధనియాల పొడి, గరం మాసాలా, వేసి కలిపి గంట సేపు
పక్కనుంచాలి.
బాండ్లీలో నూనె పోసి కాగాక ఉల్లి ముక్కలు వేయించి అల్లం వెల్లుల్లి పేస్ట్ కలపాలి.
రెండు నిమిషాలు వేగాక రొయ్యలు వేసి వేయించాలి.
చిన్న మంట మీద కలుపుతూ వేయించాలి.
15 నిమిషాలపాటు వేయించాక తరిగిన కొత్తిమీరతో అలంకరించి వడ్డించాలి.
Labels:
Coriander,
Curd,
Garam Masala,
Garlic,
Ginger,
Indian Recipes,
Mirch Powder,
Prawns,
Turmeric
Egg Masala Curry - ఎగ్ మసాలా కర్రీ
కావలసిన పదార్థాలు:
గుడ్డు - 6
ఉల్లిపాయలు - 2
టమాటాలు - 2
పచ్చిమిర్చి - 5
గరం మసాలా - అర టే.స్పూను
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 1 టే.స్పూను
పసుపు - పావు టీ స్పూను
ధనియాల పొడి - 1 టే.స్పూను
తయారీ విధానం:
గుడ్లు ఉడికించి రెండుగా కట్ చేయాలి.
బాండ్లీలో నూనె పోసి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేయించాలి.
వేగాక టమాటా ముక్కలు వేసి వేయించాలి.
తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేయాలి.
నూనె వేరు పడే వరకూ వేయించాలి.
తర్వాత గరం మాసాలా, ధనియాల పొడి, ఉప్పు, వేసి బాగా కలపాలి.
చివరిగా గుడ్లు కలిపి మూత ఉంచి 10 నిమిషాలు ఉడికించాలి.
కొత్తిమీరతో అలంకరించి వేడిగా వడ్డించాలి.
గుడ్డు - 6
ఉల్లిపాయలు - 2
టమాటాలు - 2
పచ్చిమిర్చి - 5
గరం మసాలా - అర టే.స్పూను
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 1 టే.స్పూను
పసుపు - పావు టీ స్పూను
ధనియాల పొడి - 1 టే.స్పూను
తయారీ విధానం:
గుడ్లు ఉడికించి రెండుగా కట్ చేయాలి.
బాండ్లీలో నూనె పోసి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేయించాలి.
వేగాక టమాటా ముక్కలు వేసి వేయించాలి.
తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేయాలి.
నూనె వేరు పడే వరకూ వేయించాలి.
తర్వాత గరం మాసాలా, ధనియాల పొడి, ఉప్పు, వేసి బాగా కలపాలి.
చివరిగా గుడ్లు కలిపి మూత ఉంచి 10 నిమిషాలు ఉడికించాలి.
కొత్తిమీరతో అలంకరించి వేడిగా వడ్డించాలి.
FenuGreek Leaves pAThOLi Fry - మెంతి కూర పాఠోలి వేపుడు
Åî{¹ت¹, ¤Ä©Â¹Øª¹, ͌չˆÂ¹Øª¹... «ÕÊ¢ OšËÅî ‡X¾Ûpœ¿Ö X¾X¾Ûp ©äŸÄ „äX¾Ûœ¿Õ «Ö“ÅŒ„äÕ Í䮾Õh¢šÇ¢. ÂÃF OšËE ƒÅŒª¹ ¹ت¹©Åî Â¹ØœÄ Â¹©’¹LXÏ «¢œ¿ÕÂî«ÍŒÕa. Ƅ䢚ð ͌֟Äl«Ö...
„çÕ¢A¹ت¹ ¤Äª¸îR

Âë©®ÏÊN
„çÕ¢A¹ت¹: 4 ¹X¾Ûp©Õ, ¯ÃʦçšËdÊ å®Ê’¹©Õ: 2 ¹X¾Ûp©Õ, X¾*aNÕJa: ‚ª¹Õ, …Lx«á¹ˆ©Õ: ¹X¾Ûp, …X¾Ûp: ÅŒTʢŌ, ‡¢œ¿ÕNÕJa: 5, NÕÊX¾pX¾Ûp: 4 šÌ®¾ÖpÊÕx, ‚„éÕ: ƪ¹šÌ®¾ÖpÊÕ, °©Â¹“ª¹: šÌ®¾ÖpÊÕ, „ç©ÕxLx骦s©Õ: ¯Ã©Õ’¹Õ, Æ©x¢ Ōժ¹Õ«á: 2 šÌ®¾ÖpÊÕx, ÊÖ¯ç: 8 šÌ®¾ÖpÊÕx, X¾®¾ÕX¾Û: *šË霿Õ, ¹J„ä¤Ä¹×: 2 骦s©Õ
„çÕ¢A¹ت¹: 4 ¹X¾Ûp©Õ, ¯ÃʦçšËdÊ å®Ê’¹©Õ: 2 ¹X¾Ûp©Õ, X¾*aNÕJa: ‚ª¹Õ, …Lx«á¹ˆ©Õ: ¹X¾Ûp, …X¾Ûp: ÅŒTʢŌ, ‡¢œ¿ÕNÕJa: 5, NÕÊX¾pX¾Ûp: 4 šÌ®¾ÖpÊÕx, ‚„éÕ: ƪ¹šÌ®¾ÖpÊÕ, °©Â¹“ª¹: šÌ®¾ÖpÊÕ, „ç©ÕxLx骦s©Õ: ¯Ã©Õ’¹Õ, Æ©x¢ Ōժ¹Õ«á: 2 šÌ®¾ÖpÊÕx, ÊÖ¯ç: 8 šÌ®¾ÖpÊÕx, X¾®¾ÕX¾Û: *šË霿Õ, ¹J„ä¤Ä¹×: 2 骦s©Õ
ÅŒ§ŒÖª¹ÕÍäæ® NŸµÄÊ¢
«á¢Ÿ¿Õ’à „çÕ¢A¹ت¹ÊÕ ÂÜ¿©Õ ©ä¹עœÄ ¬ÁÙ“¦µ¼¢Íä®Ï ÅŒJT …¢ÍÃL. ¯ÃʦçšËdÊ å®Ê’¹Lo NÕÂÌq X¾šÇdL. ¦ÇºL©ð ÂíCl’à ÊÖ¯ç „ä®Ï ÂÒù å®Ê’¹© NÕ“¬Á«ÖEo „ä®Ï „äªá¢* C¢ÍÃL. «Õªî ¦ÇºL©ð NÕTLÊ ÊÖ¯ç „ä®Ï ÂÒù ¤òX¾ÛCÊÕ®¾Õ©Fo „ä®Ï „äªá¢ÍÃL. ÅŒª¹„ÃÅŒ X¾®¾ÕX¾Û, Æ©x¢, „ç©ÕxLx, X¾*aNÕJa, …Lx«á¹ˆ©Õ „ä®Ï ¦Ç’à „äªá¢ÍÃL. ƒX¾Ûpœ¿Õ ®¾Êo’à ŌJTÊ „çÕ¢A¹ت¹ „ä®Ï Âî¾h …X¾Ûp „ä®Ï «Õ’¹_E„ÃyL. ÆC «ÕT_Ê ÅŒª¹„ÃÅŒ „äªá¢*Ê å®Ê’¹© NÕ“¬Á«ÖEo „ä®Ï ¹LXÏ «âÅŒåXšËd ÂÃæ®X¾Û …œËÂË¢* C¢ÍÃL.
«á¢Ÿ¿Õ’à „çÕ¢A¹ت¹ÊÕ ÂÜ¿©Õ ©ä¹עœÄ ¬ÁÙ“¦µ¼¢Íä®Ï ÅŒJT …¢ÍÃL. ¯ÃʦçšËdÊ å®Ê’¹Lo NÕÂÌq X¾šÇdL. ¦ÇºL©ð ÂíCl’à ÊÖ¯ç „ä®Ï ÂÒù å®Ê’¹© NÕ“¬Á«ÖEo „ä®Ï „äªá¢* C¢ÍÃL. «Õªî ¦ÇºL©ð NÕTLÊ ÊÖ¯ç „ä®Ï ÂÒù ¤òX¾ÛCÊÕ®¾Õ©Fo „ä®Ï „äªá¢ÍÃL. ÅŒª¹„ÃÅŒ X¾®¾ÕX¾Û, Æ©x¢, „ç©ÕxLx, X¾*aNÕJa, …Lx«á¹ˆ©Õ „ä®Ï ¦Ç’à „äªá¢ÍÃL. ƒX¾Ûpœ¿Õ ®¾Êo’à ŌJTÊ „çÕ¢A¹ت¹ „ä®Ï Âî¾h …X¾Ûp „ä®Ï «Õ’¹_E„ÃyL. ÆC «ÕT_Ê ÅŒª¹„ÃÅŒ „äªá¢*Ê å®Ê’¹© NÕ“¬Á«ÖEo „ä®Ï ¹LXÏ «âÅŒåXšËd ÂÃæ®X¾Û …œËÂË¢* C¢ÍÃL.
Amaranthus Plantain Fry - తోటకూర అరటికాయ వేపుడు
Åî{¹ت¹, ¤Ä©Â¹Øª¹, ͌չˆÂ¹Øª¹... «ÕÊ¢ OšËÅî ‡X¾Ûpœ¿Ö X¾X¾Ûp ©äŸÄ „äX¾Ûœ¿Õ «Ö“ÅŒ„äÕ Í䮾Õh¢šÇ¢. ÂÃF OšËE ƒÅŒª¹ ¹ت¹©Åî Â¹ØœÄ Â¹©’¹LXÏ «¢œ¿ÕÂî«ÍŒÕa. Ƅ䢚ð ͌֟Äl«Ö...
ÅŒJTÊ Åî{¹ت¹: 5 ¹X¾Ûp©Õ, ƪ¹šËÂçŒÕ: ŠÂ¹šË, Âí¦sJŌժ¹Õ«á: 2 ˜ä¦Õ©ü®¾ÖpÊÕx, „çբŌթÕ: ƪ¹šÌ®¾ÖpÊÕ, ‚„éÕ: ƪ¹šÌ®¾ÖpÊÕ, °©Â¹“ª¹: šÌ®¾ÖpÊÕ, ‡¢œ¿ÕNÕJa: ‚ª¹Õ, Ÿ¿E§ŒÖ©Õ: šÌ®¾ÖpÊÕ, X¾ÛšÇo©X¾X¾Ûp: 2 ˜ä¦Õ©ü®¾ÖpÊÕx, ÊÖ¯ç: 3 ˜ä¦Õ©ü®¾ÖpÊÕx, …X¾Ûp: ÅŒTʢŌ, E«ÕtÂçŒÕ: ŠÂ¹šË, X¾*aNÕJa: ‚ª¹Õ, ÊÕ«Ûy©Õ: ƪ¹Â¹X¾Ûp
ÅŒ§ŒÖª¹ÕÍäæ® NŸµÄÊ¢
Åî{¹ت¹ ¦Ç’à ¹œËT ®¾Êo’à ŌJT ‚ª¹E„ÃyL. X¾ÛšÇo©X¾X¾Ûp ¤ñœË Íä§ŒÖL. ƪ¹šËÂçŒÕÂ¹× ÊÖ¯ç ªÃ®Ï ®¾d„þOÕŸ¿ ¯äª¹Õ’à åXšËd ÂéÇaL. ÅŒª¹„ÃÅŒ Åí¹ˆB®Ï ¤ñœË¤ñœË’à Íä§ŒÖL. ‡¢œ¿ÕNÕJa, Ÿ¿E§ŒÖ©Õ „äªá¢* NÕÂÌq X¾šÇdL. ¦ÇºL©ð ÊÖ¯ç „ä®Ï ÂÒù CÊÕ®¾Õ©Fo ÅÃL¢X¾Û „ä§ŒÖL. ÅŒª¹„ÃÅŒ X¾*aNÕJa «á¹ˆ©Õ „ä®Ï „ä’ù Åî{¹ت¹, …X¾Ûp „ä®Ï «Õ’¹_E„ÃyL. ƒX¾Ûpœ¿Õ ƪ¹šËÂçŒÕ ¤ñœË, ‡¢œ¿ÕNÕJa ¤ñœË, X¾ÛšÇo©X¾X¾Ûp ¤ñœË „ä®Ï ¹©¤ÄL. *«J’à E«Õtª¹®¾¢ XÏ¢œËÅä ®¾J. |
Cucumber Mettalla Curry - దోసకాయ-మెత్తళ్ల కూర
Cucumber Mettalla Curry - దోసకాయ-మెత్తళ్ల కూర
దోసకాయ ముక్కలు - కప్పు; కడిగి శుభ్రం చేసిన పచ్చి మెత్తళ్లు - 3 కప్పులు (ఇష్టాన్ని అనుసరించి కొలతలు మార్చుకోవచ్చు); కరివేపాకు - 2 రెమ్మలు; ఉల్లి తరుగు - కప్పు; పచ్చి మిర్చి - 6; ధనియాల పొడి - టీ స్పూను; అల్లం వెల్లుల్లి ముద్ద - టేబుల్ స్పూను; ఉప్పు - తగినంత; పసుపు - తగినంత; కారం - రెండు టీ స్పూన్లు; నూనె - తగినంత; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను
తయారీ:
బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర వేసి వేగాక, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి
అల్లం వెల్లుల్లి ముద్ద వేసి గోధుమ రంగులోకి వచ్చేవరకు వేయించాలి
పసుపు, కరివేపాకు వేసి మరోమారు వేయించాలి
తరిగి ఉంచుకున్న దోసకాయ ముక్కలు, కడిగి శుభ్రం చేసుకున్న మెత్తళ్లు వేసి బాగా కలిపి ఉప్పు, కారం వేసి, తగినన్ని నీళ్లు పోసి మూత ఉంచాలి
బాగా ఉడికిన తర్వాత ధనియాల పొడి, కొత్తిమీర వేసి కలిపి దించేయాలి
ఈ కూర అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది.
Angular Bengal gram Curry - బీరకాయ - సెనగపప్పు కూర
Angular gourd,Bengal gram Curry - బీరకాయ - సెనగపప్పు కూర
బీరకాయలు - అర కేజీ; నూనె - 3 టేబుల్ స్పూన్లు; సెనగపప్పు - అర కప్పు; ఎండు మిర్చి - 8; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; మినప్పప్పు - టీ స్పూను; ఇంగువ - పావు టీ స్పూను; కరివేపాకు - 2 రెమ్మలు; వెల్లుల్లి రేకలు - 4; ఉప్పు, పసుపు - తగినంత
తయారీ:
బీరకాయలను శుభ్రంగా కడిగి, చెక్కు తీసి, ముక్కలు కట్ చేయాలి
సెనగపప్పును గంట సేపు నానబెట్టాలి
బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించి, ఎండు మిర్చి ముక్కలు, వెల్లుల్లి రేకలు వేసి వేయించాలి
కరివేపాకు వేసి వేగాక, బీరకాయ ముక్కలు, సెనగపప్పు, ఉప్పు, పసుపు వేసి కలిపి మూత ఉంచాలి
మెత్తగా ఉడికాక దించేయాలి.
Colacasia Stew Curry - చేమదుంపల పులుసు కూర
చేమదుంపల పులుసు కూర
చేమదుంపలు - అర కేజీ; ఉల్లి తరుగు - అర కప్పు; పచ్చి మిర్చి - 10 (మధ్యకు నిలువుగా కట్ చేయాలి); చింతపండు పులుసు - 5 టేబుల్ స్పూన్లు (చింతపండు నానబెట్టి పులుసు చిక్కగా తీయాలి); ఉప్పు - తగినంత; కారం - టీ స్పూను; బెల్లం పొడి - టేబుల్ స్పూను; నూనె - 3 టేబుల్ స్పూన్లు; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; ఎండు మిర్చి - 6; కరివేపాకు - 2 రెమ్మలు; కొత్తిమీర - కొద్దిగా; మెంతి పొడి - పావు టీ స్పూను
తయారి:
చేమదుంపలను కుకర్‌లో ఉడికించి, తీసి చల్లారాక తొక్క తీసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచాలి
బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి
కరివేపాకు, ఉల్లితరుగు, పచ్చి మిర్చి ముక్కలు వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి
చింతపండు పులుసు, ఉప్పు, కారం, బెల్లం పొడి వేసి ఉడికించాలి
చేమదుంప ముక్కలు వేసి బాగా కలిపి సుమారు పది నిమిషాలు ఉంచాలి
మెంతి పొడి, కొత్తిమీర వేసి కలిపి దించేయాలి.
Mixed Vegetable Stew - ముక్కల పులుసు
Mixed Vegetable Stew - ముక్కల పులుసు
కూరగాయ ముక్కలు - 3 కప్పులు (బెండకాయలు, టొమాటో, మునగకాడ, సొరకాయ, ఉల్లిపాయలు, క్యారట్, ముల్లంగి, దోస, తోటకూర...); చింతపండు - పెద్ద నిమ్మకాయంత (నానబెట్టి రసం తీయాలి); ఉప్పు - తగినంత; నూనె - టేబుల్ స్పూను; పసుపు - పావు టీ స్పూను; ఇంగువ - పావు టీ స్పూను; రసం పొడి - టీ స్పూను; ఎండు మిర్చి - 5; పచ్చి మిర్చి - 5 (మధ్యకు పొడవుగా కట్ చేయాలి); ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; బియ్యప్పిండి - టేబుల్ స్పూను; బెల్లం పొడి - టేబుల్ స్పూను; కొత్తిమీర - చిన్న కట్ట; కరివేపాకు - 2 రెమ్మలు
తయారి:
ముందుగా అన్ని కూరగాయ ముక్కలను ఒక గిన్నెలో వేసి, తగినంత ఉప్పు, నీళ్లు జత చేసి ఉడికించాలి
చింతపండు రసం వేసి మరిగించాలి
చిన్న బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, పచ్చి మిర్చి వేసి వేయించి, మరుగుతున్న పులుసులో వే యాలి
బెల్లం పొడి వేసి మరోమారు కలపాలి
చిన్న గిన్నెలో కొద్దిగా నీళ్లలో బియ్యప్పిండి వేసి ఉండలు లేకుండా కలిపి, ఉడుకుతున్న పులుసులో వే సి మరిగించాలి
కొత్తిమీర, కరివేపాకు, రసం పొడి, పసుపు వేసి బాగా కలిపి దించేయాలి.
Mango Dal - మామిడికాయ పప్పు
Mango Dal - మామిడికాయ పప్పు
కందిపప్పు - కప్పు; మామిడికాయ - 1; పచ్చి మిర్చి - 4; ఎండు మిర్చి - 4; ఇంగువ - పావు టీ స్పూను; పసుపు - పావు టీ స్పూను; మునగకాడ - 1 (ముక్కలుగా కట్ చేయాలి); ఉల్లి తరుగు - పావు కప్పు; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; శనగపప్పు - టీ స్పూను; మినప్పప్పు - టీ స్పూను; కరివేపాకు - 2 రెమ్మలు; కొత్తిమీర - కొద్దిగా; ఉప్పు - తగినంత; నూనె - తగినంత; కారం - టీ స్పూను
తయారి:
ముందుగా మామిడికాయ తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన ఉంచాలి మునగకాడను ముక్కలు చేయాలి
కందిపప్పుకి తగినంత నీరు చేర్చి కుకర్‌లో ఉంచి మెత్తగా ఉడికించాలి
బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వరసగా ఒకదాని తరువాత ఒకటి వేసి వేయించాలి
కరివేపాకు వేసి వేగాక, మామిడికాయ ముక్కలు, మునగకాడ ముక్కలు, ఉల్లి తరుగు, పచ్చి మిర్చి, ఉప్పు వేసి బాగా కలిపి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా ఉడికించాలి
ఉడికించిన పప్పు జత చేసి బాగా కలపాలి
పసుపు, కారం వేసి మరో మారు కలిపి కొత్తిమీర చల్లి దించేయాలి.
Indian gooseberry Recipes - ఉసిరి
Phyllanthus emblica, also known as emblic,emblic myrobalan,Indian gooseberry,or amla from Sanskrit amalika
రోజూ పంచ భక్ష్య పరమాన్నాలు ఉడికే ఇంట్లోనైనా...
ఈ మాసంలో ఉసిరి లేకుంటే పస్తులున్నట్టే.
ఉసిరి సిరి అంతా అందులోని వగరులో ఉంది.
అందులోని పులుపులో ఉంది.
వేడి వేడి అన్నంలో మొదటి ముద్దగా ఉసిరిని కలుపుకుంటే
అదో ప్రారంభోత్సవం!
చిక్కటి పెరుగులోనైనా, పల్చటి మజ్జిగతోనైనా
ఉసిరిని నంజుకుంటే అదో ముగింపు మహోత్సవం!
ఉసిరి పచ్చడిలోనే ఇంత మజా ఉంటే...
ఉసిరి పొడి, ఉసిరి పకోడీ, ఉసిరి చారు ఇంకెలా ఉంటాయి!!
చేసి చూడండి.
మీ పక్కవాళ్లకూ కొసరి కొసరి గిన్నెల్లో పంపించండి.
Indian gooseberry Pakodi - ఉసిరి పకోడీ
కావలసినవి
: ఉసిరికాయలు - 6; నూనె - వేయించడానికి తగినంత; ఉల్లి తరుగు - పావు కప్పు; సెనగ పిండి - పావు కేజీ; బియ్యప్పిండి - టేబుల్ స్పూను; కార్న్ ఫ్లోర్ - టేబుల్ స్పూను; ధనియాల పొడి - పావు టీ స్పూను; జీలకర్ర పొడి - పావు టీ స్పూను; ఇంగువ - కొద్దిగా; కారం - టీ స్పూను; ఉప్పు - తగినంత; కరివేపాకు - 3 రెమ్మలు; కొత్తిమీర - చిన్న కట్ట
తయారీ: ముందుగా ఉసిరి కాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, పచ్చి వాసన పోయేవరకు టీ స్పూను నూనెలో దోరగా వేయించి పక్కన ఉంచాలి ఒక పాత్రలో ఉల్లి తరుగు, సెనగ పిండి, బియ్యప్పిండి, కార్న్ ఫ్లోర్, ఇంగువ, కారం, ఉసిరి తరుగు, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కలపాలి ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మరో మారు కలపాలి ఉప్పు, తగినన్ని నీళ్లు జత చేసి పకోడీల పిండిలా కలపాలి బాణలిలో నూనె పోసి కాగాక, తయారుచేసి ఉంచుకున్న మిశ్రమాన్ని పకోడీలా వేసి, బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించి, పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి.
Indian gooseberry Rice - ఉసిరి అన్నం
కావలసినవి: అన్నం - 3 కప్పులు; ఉసిరి కాయలు - 6; పచ్చి మిర్చి - 6; ఉల్లిపాయ - 1; నూనె - 3 టేబుల్ స్పూన్లు; ఆవాలు - టీ స్పూను; మినప్పప్పు - 2 టీ స్పూన్లు; ఇంగువ - కొద్దిగా; పసుపు - చిటికెడు; ఉప్పు - తగినంత; కరివేపాకు - 2 రెమ్మలు
తయారీ: పచ్చి మిర్చి, ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి ఉసిరికాయల నుంచి గింజలు వేరు చేసి, ముక్కలుగా కట్ చేసి, పచ్చి మిర్చి జత చేసి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి బాణలిలో నూనె వేసి కాగాక, ఆవాలు, మినప్పప్పు వేసి దోరగా వేయించాలి ఉల్లి తరుగు జత చేసి మరో మారు వేయించాలి మెత్తగా చే సి ఉంచుకున్న ఉసిరి ముద్ద, పసుపు, ఇంగువ, ఉప్పు వేసి బాగా కలియబెట్టి దించి చల్లార్చాలి పెద్ద పాత్రలో అన్నం వేసి, దాని మీద ఉసిరి మిశ్రమం వేసి బాగా కలిపి, కరివేపాకుతో అలంకరించి వేడివేడిగా వడ్డించాలి.
Indian gooseberry Kolikattai - ఉసిరి కోళికట్టై
కావలసినవి: బియ్యప్పిండి - కప్పు; ఉసిరి కాయలు - 6; బెల్లం తురుము - అర కప్పు; ఏలకుల పొడి - కొద్దిగా; నెయ్యి - తగినంత; ఉప్పు - కొద్దిగా
తయారీ: ఒక పాత్రలో నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి మరిగించాలి ఉప్పు, బియ్యప్పిండి వేసి బాగా కలిపి, పిండి ఉడికిన తర్వాత దింపేయాలి మరొక పాత్రలో కొద్దిగా నీళ్లు, ఉసిరి కాయలు వేసి మెత్తగా ఉడికించి దింపి, చల్లారాక, గింజలు వేరు చేసి, ఉసిరి కాయ ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా ముద్ద చేయాలి బాణలిలో తగినంత నెయ్యి వేసి కరిగాక, ఉసిరి ముద్ద, బెల్లం, ఏలకుల పొడి జత చేసి కొద్దిసేపు ఉడికించాలి మిశ్రమం బాగా చిక్కబడ్డాక, దింపేయాలి ఉడికించిన బియ్యప్పిండి కొద్దిగా తీసుకుని చేతితో వెడల్పుగా ఒత్తి, మధ్యలో ఉసిరి మిశ్రమం కొద్దిగా ఉంచి, అంచులు మూసేయాలి ఇలా అన్నీ తయారుచేసుకుని, ఇడ్లీ రేకులలో ఉంచి ఇడ్లీ మాదిరిగా ఆవిరి మీద ఉడికించాలి.
Indian gooseberry Curd Chutney - ఉసిరి పెరుగు పచ్చడి
కావలసినవి: ఉసిరి కాయలు - 5; కొబ్బరి తురుము - టీ స్పూను; గడ్డ పెరుగు - 2 కప్పులు; నూనె - టీ స్పూను; ఆవాలు - 2 టీ స్పూన్లు; సెనగ పప్పు - టీ స్పూను; మినప్పప్పు - టీ స్పూను; ఎండు మిర్చి - 6; కారం - అర టీ స్పూను; పచ్చి మిర్చి - 4; ఉప్పు - తగినంత; పసుపు - పావు టీ స్పూను; కరివేపాకు - 2 రెమ్మలు
తయారీ: ఉసిరి కాయలను శుభ్రంగా కడిగి గింజలు వేరు చేసి, ముక్కలుగా కట్ చేయాలి బాణలిలో నూనె వేసి, కాగాక ఉసిరి కాయ ముక్కలు వేసి కొద్దిగా వేగాక తీసి, చల్లారాక, పచ్చి మిర్చి, కొబ్బరి తురుము జత చేసి మిక్సీలో వేసి కొద్దిగా మెత్తగా చేయాలి అదే బాణలిలో సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండు మిర్చి వరసగా ఒకదాని తరవాత ఒకటి వేసి బాగా వేయించాక, ఉసిరి ముద్ద వేసి వేయించి రెండు నిమిషాలు ఉడికించి దింపి, చల్లార్చాలి పెరుగులో ఉప్పు, పసుపు, కారం వేసి గిలక్కొట్టాక, ఉసిరి మిశ్రమం వేసి కలపాలి చివరగా కరివేపాకుతో అలంకరించాలి.
Indian gooseberry Rasam - ఉసిరి చారు
కావలసినవి: ఉసిరి కాయలు - 2; నూనె - టీ స్పూను; సెనగ పప్పు - టీ స్పూను; మినప్పప్పు - టీ స్పూను; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; ఎండు మిర్చి - 4; పచ్చి మిర్చి - 1; మిరియాల పొడి - కొద్దిగా; ఇంగువ - చిటికెడు; పసుపు - చిటికెడు; ఉప్పు - తగినంత; కరివేపాకు - 2 రెమ్మలు; కొత్తిమీర - కొద్దిగా
తయారీ: ముందుగా ఉసిరి కాయలను శుభ్రంగా కడిగి, ముక్కలు తరిగి, గింజలు వేరు చేసి, ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా చేయాలి మందంగా ఉండే గిన్నెలో నూనె వేసి కాగాక ఇంగువ వేసి వేయించాలి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వరసగా ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి ఉసిరి కాయ ముద్ద వేసి దోరగా వేయించి తగినన్ని నీళ్లు పోయాలి ఉప్పు, పసుపు, పచ్చి మిర్చి ముక్కలు వేసి చారు మరిగించాలి కరివేపాకు, కొత్తిమీర, మిరియాల పొడి వేసి ఒక పొంగు రానిచ్చి దింపాలి.
Indian gooseberry Power - ఉసిరి పొడి
కావలసినవి: ఉసిరి కాయలు - కేజీ; నూనె - టేబుల్ స్పూను; జీలకర్ర - 2 టేబుల్ స్పూన్లు; మిరియాలు - అర టీ స్పూను (పొడి చేయాలి); ఎండు అల్లం - 50 గ్రా.; ఇంగువ - కొద్దిగా; ఉప్పు - తగినంత; పల్లీలు - 2 టేబుల్ స్పూన్లు (వేయించాలి); పుట్నాల పప్పు - టేబుల్ స్పూను; నువ్వు పప్పు - టేబుల్ స్పూను (వేయించాలి); ఎండు మిర్చి - 100 గ్రా.
తయారీ: ఉసిరి కాయలను శుభ్రంగా కడిగి, గింజలు వేరు చేసి, ముక్కలుగా కట్ చేసి, వాటిని రెండు రోజులు ఎండబెట్టాలి బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక, ఉసిరి ముక్కలు, జీలకర్ర వేసి వేయించి తీసి చల్లార్చాలి మిక్సీలో ఉసిరి కాయ ముక్కలు, మిరియాల పొడి, ఎండు అల్లం, ఉప్పు వేసి పొడి చేసి తీసి పక్కన ఉంచాలి పల్లీలు, పుట్నాల పప్పు, నువ్వు పప్పు, ఎండు మిర్చి వేసి మెత్తగా పొడి చేసి పక్కన ఉంచాలి ఒక పాత్రలో ఉసిరి పొడి, పల్లీల మిశ్రమం పొడి, ఇంగువ వేసి బాగా కలిపి వేడి వేడి అన్నంలో, కమ్మని నేతితో వడ్డించాలి.
Indian gooseberry Pickle - ఉసిరి పచ్చడి
కావలసినవి: ఉసిరి కాయలు - 4; అల్లం - చిన్న ముక్క; వెల్లుల్లి రేకలు - 2; ఉల్లిపాయ - 1 (ముక్కలుగా కట్ చేయాలి); కరివేపాకు - రెండు రెమ్మలు; పచ్చి మిర్చి - 5; ఉప్పు - తగినంత; పసుపు - కొద్దిగా; నూనె - అర టీ స్పూను; ఇంగువ - పావు టీస్పూను
తయారీ: ఉసిరికాయలను శుభ్రంగా కడిగి గింజలు వేరు చేయాలి మిక్సీలో ఉసిరికాయ ముక్కలు, పచ్చి మిర్చి, ఉప్పు, పసుపు, అల్లం ముక్క, ఉల్లి తరుగు, వెల్లుల్లి రేకలు వేసి మెత్తగా చేయాలి బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, కరివేపాకు వేసి వేయించి, ఉసిరికాయ పచ్చడిలో వేసి కలిపి అన్నంలో వడ్డించాలి.
Indian gooseberry Uses - ఉసిరి ఉపయోగాలు...
ఉసిరిలో సి విటమిన్ పుష్కలంగా ఉంది.
ఇందులో క్యాల్షియమ్, ఫాస్ఫరస్, ఐరన్, మినరల్స్ అధికంగా ఉన్నాయి.
ఉసిరి అతి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది.
ఉసిరిరసంలో తేనె కలిపి ప్రతిరోజూ ఉదయం తీసుకుంటే కంటిచూపు చక్కగా ఉంటుంది.
ఉసిరికాయను నిత్యం ఏదో ఒక రూపంలో వాడటం వల్ల జీర్ణశక్తి బాగుంటుంది.
ఉసిరి కాయను ఏ రూపంలో తీసుకున్నా గుండె కండరాలు బలంగా తయారవుతాయి.
ఉసిరి వాడకం వల్ల జుట్టు రాలిపోవడం తగ్గుతుంది.
వ్యాధినిరోధకశక్తి మెరుగుపడుతుంది.
డయాబెటిస్ ఉన్నవారిలో బ్లడ్ సుగర్ స్థాయులు తగ్గుతాయి.
Sweet and Hot Tomato - స్వీటొమాటో హాటొమాటో
Sweet and Hot Tomato - స్వీటొమాటో హాటొమాటో
టొమాటోలు...నిన్నమొన్నటి దాకా ఆకాశంలో కూర్చుని మనకు అందకుండా దూరం నుంచి ఊరించాయి...
మరి ఇప్పుడో...
ఒక్కసారిగా నేలమీదకు వచ్చి బుద్ధిగా చేతులు కట్టుకు నిలబడ్డాయి...
ఆలస్యం చేయకుండా....
చాకు పట్టుకుని టొమాటోలను కసాకసా ముక్కలు చేసేద్దాం...
పచ్చడి, ఊరగాయ, రసం, సూప్, స్నాక్...
మనకు నచ్చినట్టుగా వండేద్దాం...
స్వీటైనా, హాటైనా టొమాటో మాటెత్తకుండా ముద్ద దిగడం కష్టమని గమనిద్దాం...
టొమాటోకి ఓటేద్దాం...
టొమాటో హల్వా
టొమాటోలు - 4 (మీడియం సైజువి)
నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు
ఏలకుల పొడి - పావు టీ స్పూను
పంచదార - 7 టేబుల్ స్పూన్లు
కార్న్‌ఫ్లోర్ - టేబుల్ స్పూను
బాదంపప్పులు, పిస్తా పప్పులు - గార్నిషింగ్‌కి తగినంత
తయారీ:
టొమాటోలను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి, మిక్సీలో వేసి మెత్తగా చేయాలి
బాణలిలో టేబుల్ స్పూను నెయ్యి కాగాక టొమాటో గుజ్జు, ఏలకులపొడి, పంచదార వేసి, కలుపుతుండాలి
మంట బాగా తగ్గించి, టొమాటో గుజ్జు ఉడుకుతుండగా మరికాస్త నెయ్యి జత చేయాలి
కార్న్‌ఫ్లోర్, కొద్దిగా నీరు జత చేయాలి
మిశ్రమం బాగా చిక్కగా, మృదువుగా అయ్యేవరకు కలిపి దించేయాలి
బాదంపప్పులు, పిస్తా పప్పులతో గార్నిష్ చేయాలి.
టొమాటో సూప్
పాస్తా - కప్పు
నీరు - 4 కప్పులు
టొమాటోలు - 8
మిరియాలపొడి - టీ స్పూను
కారం - టీ స్పూను
జీలకర్ర పొడి - టీ స్పూను
అల్లంవెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను
ఉప్పు - తగినంత
పుదీనా ఆకులు - 5
బ్రెడ్ క్యూబ్స్ - 10
కొత్తిమీర - ఒక కట్ట
తయారీ:
ఒక పాత్రలో నీరు మరుగుతుండగా పాస్తా వేసి దించేయాలి.
టొమాటోలను శుభ్రంగా కడిగి, రెండు విజిల్స్ వచ్చేవరకు కుకర్‌లో ఉడికించాలి.
చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా బ్లెండ్ చేయాలి.
ఇప్పుడు ఈ మిశ్రమానికి నీటిని జత చేసి స్టౌ మీద ఉంచి, బాగా మరుగుతుండగా మిరియాలపొడి, కారం, జీలకర్రపొడి, అల్లం, వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి కలపాలి.
ఉడికించిన పాస్తా జత చేయాలి.
మంట తగ్గించి పది నిమిషాలు ఉడికించి దించేయాలి.
ఔసూప్‌బౌల్‌లో బ్రెడ్ క్యూబ్స్, పుదీనా, కొత్తిమీర వేసి, వేడివేడిగా సర్వ్ చేయాలి.
స్టఫ్‌డ్ టొమాటో
ఎర్రగా ఉన్న టొమాటోలు - 2
ఆలివ్ ఆయిల్ - టీ స్పూను
వెల్లుల్లి రేక లు - 2
ఉల్లి తరుగు - పావుకప్పు
జీలకర్ర - అర టీ స్పూను
వంకాయ ముక్కలు - అర కప్పు
వెనిగర్ - 2 టేబుల్ స్పూన్లు
టొమాటో ముక్కలు - పావుకప్పు
పుదీనా ఆకులు - 5
నువ్వుపప్పు - 3 టేబుల్ స్పూన్లు
పైన్‌నట్స్ - 2 టేబుల్ స్పూన్లు
కారం - అర టీ స్పూను
ఉప్పు - తగినంత
మిరియాలపొడి - పావు టీ స్పూను
కొత్తిమీర తరుగు - కప్పు
తయారీ:
అవెన్‌ను 375 డిగ్రీల దగ్గర వేడి చేయాలి
టొమాటోలపై భాగాన్ని కట్ చేసి, లోపల ఉండే గుజ్జును స్పూను సహాయంతో జాగ్రత్తగా తీయాలి
ఒక పాన్‌లో ఆలివ్ ఆయిల్ కాగాక వెల్లుల్లిరేకలు, ఉల్లి తరుగు, జీలకర్ర వేసి మూడు నిమిషాలు వేయించాలి
వంకాయ ముక్కలను జత చేసి మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి
ఒక చిన్న బాణలిలో వెనిగర్, టొమాటో ముక్కలు వేసి వేయించాలి
పుదీనా ఆకులు, కారం జత చేసి రెండు నిమిషాలు వేయించి దించి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి
మరో బాణలిలో కూరగాయ ముక్కలకు, నువ్వుపప్పు, పైన్ నట్స్ జత చేసి కలపాలి
వేడిగా ఉండగానే మిరియాలపొడి, ఉప్పు వేసి కలిపి దించేయాలి
పైన తయారుచేసుకున్న పదార్థాలన్నిటినీ ఒక పాత్రలో వేసి బాగా కలపాలి
పెద్ద స్పూన్‌తో ఈ మిశ్రమాన్ని టొమాటోలలో స్టఫ్ చేసి, బేకింగ్ షీట్ మీద ఉంచి అవెన్‌లో 20 నిమిషాలు బేక్ చేయాలి.
బయటకు తీసి, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.
టొమాటో - పుదీనా చట్నీ
పుదీనా ఆకులు - అర కప్పు
పండిన టొమాటోలు - 4
(మీడియం సైజువి)
ఉల్లి తరుగు - పావుకప్పు
పుట్నాలపప్పు - అర కప్పు
ఎండుమిర్చి - 4
ఇంగువ - పావు టీ స్పూను
నూనె - టేబుల్‌స్పూను
ఆవాలు - పావు టీ స్పూను
మినప్పప్పు - అర టీ స్పూను
ఉప్పు - తగినంత
తయారీ:
బాణలిలో నూనె కాగాక ఆవాలు, మినప్పప్పు, ఇంగువ వేసి వేయించి, పక్కన ఉంచాలి
అదే బాణలిలో ఉల్లితరుగు వేసి గోధుమ రంగులోకి వచ్చేవరకు వేయించి, ఎండుమిర్చి, టొమాటో ముక్కలు వేసి మెత్తబడేవరకు ఉంచాలి
పుదీనా ఆకులు జత చేసి మూడు నిమిషాలు ఉడికించాలి
పుట్నాలపప్పు, ఉప్పు వేసి బాగా కలిపి దించి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. (నీరు కలపకూడదు)
(పుదీనా బదులు కొత్తిమీర కూడా వాడవచ్చు)
టొమాటో ఆవకాయ
టొమాటోలు - కిలో
కారం - 50 గ్రా.
చింతపండు - 150 గ్రా.
ఉప్పు - తగినంత
నూనె - పావు కేజీ
ఇంగువ - టేబుల్ స్పూను
ఎండుమిర్చి - 6
ఆవాలు - టేబుల్ స్పూను
మెంతిపొడి - టేబుల్ స్పూను
తయారీ:
ముందురోజు రాత్రి ఒక గిన్నెలో టొమాటో ముక్కలు, ఉప్పు వేసి మూత పెట్టి ఉంచాలి
మరుసటి రోజు ముక్కలను గట్టిగా పిండి, రసం ఒక గిన్నెలో, ముక్కలు ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి
రసంలో చింతపండు వేసి, ముక్కలను, రసాన్ని విడివిడిగా ఎండబెట్టాలి
అయిదారు రోజులు ఎండాక, ముక్కలను రసంలో వేసి కలిసి, మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి.
కారం, మెంతిపిండి జత చేయాలి
బాణలిలో పావుకేజీ నూనె వేసి కొద్దిగా కాగాక ఇంగువ వేసి దించేసి, చల్లారాక టొమాటో ఊరగాయలో పోయాలి
బాణలిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె కాగాక ఎండుమిర్చి, ఆవాలు వేసి వేయించి, పచ్చడిలో వేసి కలపాలి.
టొమాటో సాస్
అరకిలో టొమాటోలను ఉడికించి, తొక్క తీసి మిక్సీలో వేసి పేస్ట్ చేయాలి.
ఒక పాత్రలో ఉడికించిన టొమాటో పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కప్పు పంచదార, తగినంత ఉప్పు, కారం జత చేసి సుమారు పావుగంటసేపు ఉడికిస్తే హోమ్ మేడ్ టొమాటో సాస్ రెడీ.
Enjoy Pizza Varieties - పిజ్జా మజాలు
Enjoy Pizza Varieties - పిజ్జా మజాలు
పెనం మీద వేస్తే మధ్యకు ఉబ్బుతుంది...
డబుల్‌రొట్టె కూడా అంతే...
కాల్చాక డబులవుతుంది...
పొగరు విగరెప్పుడూ వగరే కదా!
దిబ్బరొట్టెలోని దిబ్బకు కాస్త థిమ్మిసా కొట్టి...
డబుల్ రొట్టెను సింగిల్ చేస్తే...
వచ్చిన వినయరూపమే పిజ్జా...
వినయమనే ఆభరణమొక్కటే నచ్చక...
పిజ్జా సాస్‌తోనూ, వెజ్జీ వ ర్క్స్‌తోనూ అలంకరించారు.
అవే టాప్స్...
టాప్స్‌తో భూషించాక టాప్‌గా ఉండకుండా ఎలా ఉంటుంది?
అందుకే టాపింగ్స్‌తో టాప్‌గా ఉండే పిజ్జాలు తయారుచేసుకోండి.
పిజ్జా మేనమామ మన దిబ్బరొట్టే...
దాని పుట్టింటి నిజానిజాలు మనకూ తెలుసు...
అందుకే... అప్పుడప్పుడు మాత్రమే...
పిజ్జా చేసుకోండి... మజాగా ఉండండి...
వెజ్జీ వర్క్స్
లెట్యూస్ ఆకులు - కప్పు, చెర్రీ టొమాటోలు - 2;
ఫెటా చీజ్ - టేబుల్ స్పూను, పర్మెజాన్ చీజ్ - టీ స్పూను
తయారీ:
పిజ్జా తయారీకి ఉపయోగించే వస్తువులతో పిజ్జా తయారుచేశాక వాటి మీద ముందుగా ఫెటా చీజ్, పర్మెజాన్ చీజ్ వేయాలి.
చెర్రీ టొమాటో ముక్కలు, లెట్యూస్ ఆకులు అందంగా అమర్చి అవెన్‌లో ఉంచి 30 నిమిషాల తరవాత తీసేయాలి.
పిజ్జా బేస్
మైదా - కప్పు
ఉప్పు - చిటికెడు
బేకింగ్ సోడా/ఈస్ట్ - చిటికెడు
నీరు - పావు కప్పు; మోజరెల్లా చీజ్ - తగినంత
తయారీ:
ఒకపాత్రలో మైదా, బేకింగ్ సోడా/ఈస్ట్, నీళ్లు వేసి చపాతీపిండిలా కలిపి సుమారు గంటసేపు పక్కన ఉంచాలి.
చపాతీ మాదిరిగా ఒత్తి బేకింగ్ ట్రేలో ఉంచాలి.
పిజ్జా సాస్‌ను పొరలా పూయాలి. (అంచుల్లో అంగుళం మేర మాత్రం వదిలేయాలి)
మోజరెల్లా చీజ్ పూయాలి.
మనం ఎంచుకున్న వస్తువులతో టాపింగ్ చేసి అవెన్‌లో ఉంచి సుమారు 30 నిమిషాలు బేక్ చేసి తీసేయాలి.
పెప్పరోనీ
ల్యాంబ్ పెప్పరోనీ సలామీ - 10 ముక్కలు
థైమ్ - చిటికెడు
తయారీ:
పిజ్జా తయారీకి ఉపయోగించే వస్తువులతో పిజ్జా తయారుచేశాక ముందుగా చిటికెడు థైమ్ చల్లాలి.
ల్యాంబ్ పెప్పరోనీ సలామీ స్లైసులను వరుసక్రమంలో అందంగా అమర్చి అవెన్‌లో అరగంటసేపు ఉంచి దించేయాలి.
మార్గెరిటా
తులసి ఆకులు - పావు కప్పు
తయారీ:
ఇది చాలా సులువుగా చేసుకోవచ్చు.పిజ్జా తయారీకి ఉపయోగించే వస్తువులతో పిజ్జా తయారుచేశాక దాని మీద ఈ తులసి ఆకులు అందంగా అమర్చి, అవెన్‌లో ఉంచి అరగంటయ్యాక తీసేయాలి.
పిజ్జా సాస్
టొమాటో ముక్కలు - కప్పు
తులసి ఆకులు - 10
ఉప్పు - చిటికెడు
మిరియాలపొడి - చిటికెడు
ఒరిగానో - పావు టీ స్పూను
ఉల్లి తరుగు - పావు కప్పు
వెల్లుల్లి రేకలు - 5 (సన్నగా కట్ చేయాలి)
తయారీ:
టొమాటో తొక్కలను జాగ్రత్తగా తీసి సన్నగా కట్ చేసుకోవాలి.
బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఉల్లి తరుగు, వెల్లుల్లి తరుగు వేసి లేత గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించి, తరిగి ఉంచుకున్న టొమాటో ముక్కలు, ఉప్పు వేసి సుమారు ఐదు నిమిషాలు ఉడికించాలి.
మిరియాలపొడి, ఒరిగానో, తులసి ఆకులు వేసి ఐదు నిమిషాలు ఉంచి దించేయాలి.
పిరిపిరి చికెన్
గ్రిల్డ్ చికెన్ (బోన్‌లెస్) - పావుకప్పు
చికెన్ సాసేజ్ - పావు కప్పు
చికెన్ సలామీ - పావు కప్పు
ఉల్లిచక్రాలు - అరకప్పు
కరివేపాకు - నాలుగు రెమ్మలు
పిరిపిరి సాస్ - టీ స్పూను
తయారీ:
పిజ్జా తయారీకి ఉపయోగించే వస్తువులతో పిజ్జా తయారుచేశాక గ్రిల్డ్ చికెన్, చికెన్ సాసేజ్, చికెన్ సలామీ వరసగా వేయాలి. వాటి మీద ఉల్లి చక్రాలు, కరివేపాకు, పిరి పిరి సాస్ వేసి అవెన్‌లో ఉంచి 30 నిమిషాల తరవాత తీసేయాలి.
హార్వెస్ట్ వెజిటబుల్స్
చెర్రీ టొమాటోలు - 10
ఆలివ్స్ - 5
రెడ్ క్యాప్సికమ్ తరుగు - పావు కప్పు
ఎల్లో క్యాప్సికమ్ తరుగు - పావు కప్పు
గ్రీన్ క్యాప్సికమ్ తరుగు - పావు కప్పు
పుదీనా ఆకులు - కప్పు
తులసి ఆకులు - 5
ఉల్లి తరుగు - పావు కప్పు
తయారీ:
పిజ్జా తయారీకి ఉపయోగించే వస్తువులతో పిజ్జా తయారుచేశాక వాటి మీద ముందుగా రెడ్ క్యాప్సికమ్ తరుగు, ఎల్లో క్యాప్సికమ్ తరుగు, గ్రీన్ క్యాప్సికమ్ తరుగు వరుసగా అమర్చాలి.
పైన పుదీనా ఆకులు, తులసి ఆకులు, ఉల్లితరుగు వేసి, చివరగా ఆలివ్స్, చెర్రీ టొమాటో ముక్కలు పేర్చి, అవెన్‌లో ఉంచి 30 నిమిషాల తరువాత తీసేయాలి.
బెల్జియన్ మీట్
గ్రిల్డ్ చికెన్ (బోన్‌లెస్) - పావు కప్పు; చికెన్ మోర్టడెల్లా - పావు కప్పు; చికెన్ సలామీ - పావు కప్పు
టర్కీ హ్యామ్ - పావు కప్పు; ఉల్లితరుగు - అర కప్పు; ఆలివ్స్ - 5; తులసి ఆకులు - 5
జలపెనోస్ - 10 ముక్కలు
తయారీ:
పిజ్జా తయారీకి ఉపయోగించే వస్తువులతో పిజ్జా తయారుచేశాక దాని మీద ముందుగా గ్రిల్డ్ చికెన్, చికెన్ మోర్టడెల్లా, చికెన్ సలామీ వేయాలి.
టర్కీ హ్యామ్ వేసి సమానంగా పరచాలి.
ఉల్లితరుగు, తులసి ఆకులు, ఆలివ్‌స,జలపెనోస్ ముక్కలతో అందంగా అలంకరించి అవెన్‌లో ఉంచి 30 నిమిషాల తరవాత తీసేయాలి.
నోట్: ఇందులో ఉపయోగించిన వస్తువులన్నీ సూపర్‌మార్కెట్‌లో దొరుకుతాయి.
Idli Varities - రకరకాల ఇడ్లీలు
Idli Varities - రకరకాల ఇడ్లీలు
తెలుగువారిదీ... ఇడ్లీదీ... కలివిడి గుణం...అల్లప్పచ్చడితో, ఆవకాయతో, సాంబార్‌తో, కారప్పొడితో, చట్నీతో,
దేనితోనైనా ఇట్టే కలిసిపోతుంది....
జాతీయ సమైక్యతకు చిహ్నం ఇడ్లీ...
మన సంస్కృతుల్లాగే ఇడ్లీకీ అనేక రూపాలు.
రవ్వ ఇడ్లీ, బటన్ ఇడ్లీ, ఓట్స్ ఇడ్లీ, సాంబారిడ్లీ!
అన్నం పరబ్రహ్మ స్వరూపమైతే...
ఇడ్లీది అపర ధన్వంతరి రూపం.
అందుకే ఇడ్లీ... నిత్యభోజనం.. పథ్యభోజనం
రండి... రకరకాల ఇడ్లీలను నోటిలో ఉంచుకుందాం.
పలురకాలైన వాటిని పంటి కింద నంజుకుందాం.
కారంపొడి ఇడ్లీలు - Chilli Powder Idli
ఇడ్లీలు - 10, మినప్పప్పు - కప్పు, శనగపప్పు - ముప్పావు కప్పు, ఎండుమిర్చి - 6, ఇంగువ - అర టీ స్పూను, నూనె - 2 టేబుల్‌స్పూన్లు, ఉప్పు - తగినంత, ఆవాలు - అర టీ స్పూను, జీలకర్ర - అర టీ స్పూను, కొత్తిమీర - కొద్దిగా
తయారి:
బాణలిలో నూనె వేసి కాగాక, మినప్పప్పు, శనగపప్పు వేసి వేయించాలి
ఎండుమిర్చి జత చేసి, బాగా కలిపి దించేయాలి
చల్లారాక, ఇంగువ, ఉప్పు జత చేసి మిక్సీలో వేసి పొడి చేసి పక్కన ఉంచాలి
బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి
ఇడ్లీలు వేసి జాగ్రత్తగా కలపాలి
తయారుచేసి ఉంచుకున్న కారంపొడి జల్లి బాగా కలపాలి
కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.
ఇడ్లీ వెజిటబుల్ సాండ్‌విచ్ - Idli Vegetable Sandwitch
ఇడ్లీపిండి - 3 కప్పులు; బంగాళదుంప కూర - కప్పు; వంటసోడా - చిటికెడు
కూరకు కావలసినవి:
బంగాళదుంపలు - 3, ఉడికించిన బఠాణీ - అర కప్పు, ఉల్లితరుగు - అర కప్పు, పచ్చిమిర్చి తరుగు - 2 టీ స్పూన్లు, పసుపు - పావు టీ స్పూను, శనగపప్పు - టేబుల్ స్పూను, మినప్పప్పు - టీ స్పూను, ఆవాలు - అర టీ స్పూను, కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు - 2 రెమ్మలు, ఉప్పు - తగినంత, నూనె - 2 టేబుల్ స్పూన్లు
తయారి:
బంగాళదుంపలను ఉడికించి మెత్తగా మాష్ చేయాలి
బాణలిలో నూనె కాగాక ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు వేసి వేయించాలి
పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, ఉల్లితరుగు వేసి వేయించాలి
ఉడికించిన బఠాణీలు జత చేయాలి
పసుపు, ఉప్పు, బంగాళదుంప పేస్ట్ వేసి రెండుమూడు నిమిషాలు ఉడికించాలి
కొత్తిమీర జత చేసి కలిపి దించి చల్లారనివ్వాలి
ఇడ్లీ రేకులకు నూనె రాసి, టేబుల్ స్పూను ఇడ్లీ పిండి వేసి, దాని మీద తయారుచేసి ఉంచుకున్న కూర, ఆ పైన రెండు టేబుల్‌స్పూన్ల ఇడ్లీ పిండి వేసి, కుకర్‌లో ఉంచి, ఒక విజిల్ వచ్చాక దించేయాలి
ఇడ్లీలను తీసి, మధ్యకు కట్ చేసి, చట్నీతో సర్వ్ చేయాలి.
ఉల్లి మసాలా ఇడ్లీ - Onion Masala Idli
ఇడ్లీ పిండి - 3 కప్పులు, ఉల్లి తరుగు - పావు కప్పు, నానబెట్టిన శనగపప్పు - పావు కప్పు, కొత్తిమీర తరుగు - 3 టేబుల్ స్పూన్లు, క్యారట్ తురుము - పావు కప్పు, కరివేపాకు - 2 రెమ్మలు, పచ్చిమిర్చి పేస్ట్ - టీ స్పూను, వంటసోడా - పావు టీ స్పూను, ఆవాలు - అర టీ స్పూను, ఉప్పు - తగినంత, నూనె - టేబుల్ స్పూను
ఇడ్లీ పిండికి.... ఉప్పుడు బియ్యం - 4 కప్పులు; మినప్పప్పు - కప్పు, అటుకులు - కప్పు; మెంతులు - టీ స్పూను, ఉప్పు - తగినంత
తయారి:
ఉప్పుడు బియ్యం, మినప్పప్పులను విడివిడిగా ముందురోజు రాత్రి నానబెట్టాలి
ఇడ్లీలు తయారుచేయడానికి రెండు గంటల ముందు అటుకులు, మెంతులను విడిగా నానబెట్టాలి మినప్పప్పును గ్రైండర్‌లో వేసి మెత్తగా చేసుకోవాలి
బియ్యం, అటుకులు, మెంతులను విడిగా మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి
ఒక గిన్నెలో రెండురకాల పిండులను వేసి సుమారు 9 గంటలు నానబెట్టాలి
బాణలిలో నూనె కాగాక ఆవాలు వేసి చిటపటలాడాక, ఉల్లితరుగు, పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేయించి, దించి చల్లారనివ్వాలి
నానబెట్టి ఉంచుకున్న శనగపప్పును ఇడ్లీపిండిలో వేయాలి
క్యారట్ తురుము, కొత్తిమీర తరుగు, కరివేపాకు, ఉప్పు వేసి బాగా కలిపి ఇడ్లీలు వేసుకోవాలి.
ఓట్స్ ఇడ్లీ - Oats Idli
ఓట్లు - కప్పు; గోధుమరవ్వ - అర కప్పు; పెరుగు - అర కప్పు; క్యారట్ తురుము - 3 టేబుల్ స్పూన్లు; క్యాబేజీ తురుము - 2 టేబుల్ స్పూన్లు; బఠాణీ - 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు - తగినంత; నీరు - కప్పు, అల్లం తురుము - టీ స్పూను; పచ్చిమిర్చి తరుగు - టీ స్పూను; మిరియాలపొడి - అర టీ స్పూను; నిమ్మరసం - అర టీ స్పూను; కొత్తిమీర తరుగు - 2 టీ స్పూన్లు; నూనె - 2 టేబుల్ స్పూన్లు; ఆవాలు - అర టీ స్పూను, మినప్పప్పు - టీ స్పూను; శనగపప్పు - టీ స్పూను, కరివేపాకు - 2 రెమ్మలు; ఇంగువ - కొద్దిగా
తయారి:
బాణలిలో నూనె కాగాక ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు వేసి వేయించాలి
క్యారట్ తురుము, క్యాబేజీ తురుము, బఠాణీలు వేసి మరో మారు వేయించాలి గోధుమరవ్వ, ఓట్స్ వేసి రెండు నిముషాలు వేయించాలి
ఉప్పు జత చేసి కలిపి దించేయాలి
చల్లారాక పెరుగు, నీళ్లు వేసి ఇడ్లీపిండి మాదిరిగా కలపాలి
కరివేపాకు, నిమ్మరసం జత చేయాలి
ఇడ్లీ రేకులకు నూనె రాసి, పిండిని ఇడ్లీలుగా వేసి, కుకర్‌లో ఉంచి పావుగంట తరువాత దించేయాలి.
మసాలా మినీ ఇడ్లీ ఫ్రై - Spice Mini Idli Fry
బటన్ ఇడ్లీలు - 18; ఉల్లితరుగు - పావు కప్పు; రెడ్ క్యాప్సికమ్ తరుగు - అర కప్పు; టొమాటో తరుగు - పావు కప్పు, బఠాణీ - పావు కప్పు; కరివేపాకు - 2 రెమ్మలు; జీలకర్ర - అర టీ స్పూను; ఆవాలు - అర టీ స్పూను; కారం - అర టీ స్పూను; పసుపు - పావు టీ స్పూను; నూనె - 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు - తగినంత
తయారి:
బాణలిలో నూనె కాగాక, ఆవాలు, జీలకర్ర వేసి వేగాక, ఉల్లి తరుగు, రెడ్ క్యాప్సికమ్ తరుగు, టొమాటో తరుగు వేసి వేయించాలి
బఠాణీ, కరివేపాకు, పసుపు, కారం, ఉప్పు జత చేయాలి
బటన్ ఇడ్లీలను జత చేసి, జాగ్రత్తగా కలిపి సర్వ్ చేయాలి.
మసాలా ఇడ్లీ ఫ్రై - Spice Idli Fry
ఇడ్లీలు - 6; ఇడ్లీకారం - 2 టేబుల్ స్పూన్లు, పసుపు - పావు టీ స్పూను; ఆలివ్ ఆయిల్ - టేబుల్ స్పూను, నూనె - అర టీ స్పూను, ఉప్పు - తగినంత;
పోపు కోసం:
నువ్వుపప్పు - టేబుల్ స్పూను, ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - అర టీ స్పూను, మినప్పప్పు - టీ స్పూను; శనగపప్పు - అర టీ స్పూను, ఉల్లితరుగు - పావు కప్పు; పచ్చిమిర్చి తరుగు - టీ స్పూను, వెల్లుల్లి రేకలు - 2; కరివేపాకు - 2 రెమ్మలు, ఇంగువ - చిటికెడు; కొత్తిమీర - కొద్దిగా
తయారి:
ఇడ్లీలను పొడవుగా కట్ చేసి, బాణలిలో నూనె కాగాక అందులో వేసి దోరగా వేయించాలి
నూనె రాసిన అల్యూమినియం ఫాయిల్ మీద ఈ ముక్కలను ఉంచి, ఆలివ్ ఆయిల్ చిలకరించాలి
180 డిగ్రీల దగ్గర ప్రీ హీట్‌చేసిన అవెన్‌లో ఈ ఫాయిల్స్‌ను సుమారు పావుగంటసేపు ఉంచి తీసేయాలి
బాణలిలో అర టీ స్పూను నూనె కాగాక, ఆవాలు, జీలకర్ర, నువ్వుపప్పు వేసి వేయించాలి
వెల్లుల్లిరేకలు, పచ్చిమిర్చి తరుగు, ఇంగువ జత చేయాలి
ఉల్లితరుగు, కరివేపాకు, నిమ్మరసం, ఇడ్లీ ముక్కలు వేసి కలపాలి
కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి.
Red Chilli - పండుమిర్చి
Varities with Red Chilli - పండుమిర్చి
పండుమిర్చి...పేరు వినగానే నోరు మండుతుంది...
అలాగని మనసు ఊరుకోనిస్తుందా...
ఒక్కసారి ఆ ఘాటును రుచి చూడమంటుంది...
అంత కారం తినాలంటే ఎలా అని మళ్లీ అనిపిస్తుంది...
అందుకే పండుమిర్చితో రకరకాల పదార్థాలను జత కట్టిద్దాం...
గోంగూర, కొబ్బరి, చింతకాయ, టొమాటో, మసాలా...
వీటి స్నేహంతో మిరప తన ఘాటు కోపాన్ని కాస్తంత తగ్గించుకొని...
కమ్మటి రుచిని అందిస్తోంది...
అమ్మో! పండుమిర్చి! అనకుండా ఒక్కసారి ప్రయత్నించి చూడండి...
అబ్బ! ఎంత బాగుందో... అనక మానరు.
Red Chilli Tamarind Chutney - పండుమిర్చిచింతకాయ పచ్చడి
పండుమిర్చి - 100 గ్రా.
చింతకాయలు - 100 గ్రా., శనగపప్పు - టీ స్పూను
జీలకర్ర - అర టీస్పూను, కరివేపాకు - ఒక రెమ్మ, వెల్లుల్లి రేకలు - 5 ఇంగువ - చిటికెడు, ఆవాలు - అర టీ స్పూను,
నూనె - 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి - 2, ఉప్పు - 25 గ్రా. పసుపు - టీ స్పూను, మినప్పప్పు - టీ స్పూను
తయారి:
చింతకాయలను కడిగి ఆరబోసి, తడి పోయాక దంచి, గింజలు, ఈనెలు, పై తొక్క వేరు చేయాలి
పండుమిర్చిని శుభ్రంగా కడిగి తడిపోయేవరకు ఆరనిచ్చి, తొడిమలు తీసి, మిర్చిని మిక్సీలో వేసి మెత్తగా చేయాలి
చింతకాయల పేస్ట్, ఉప్పు, పసుపు, వెల్లుల్లి రేకలు జత చేసి మరోమారు తిప్పి తీసేయాలి. బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి వేసి బాగా వేగాక, ఇంగువ, కరివేపాకు జత చేసి వేగాక పచ్చడిలో వేసి కలపాలి.
Red Chilli Tomato Chutney - పండుమిర్చి టొమాటో పచ్చడి
ఆవాలు - ఒకటిన్నర టేబుల్ స్పూన్లు
వైట్ వెనిగర్ - ఒకటిన్నర కప్పులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ - టేబుల్ స్పూను, ఆలివ్ ఆయిల్ - ఒకటిన్నర కప్పులు, పండుమిర్చి - పావు కేజీ (గింజలు తీసేయాలి)
టొమాటోలు - 2 కేజీలు, (చిన్న ముక్కలుగా కట్ చేయాలి) పసుపు - టీ స్పూను, జీలకర్ర - 4 టీ స్పూన్లు
పంచదార - కప్పు, ఉప్పు - తగినంత
తయారి:
ఒక పాత్రలో ఆవాలు, వైట్ వెనిగర్ వేసి సుమారు అరగంటసేపు నాననివ్వాలి
బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక పండుమిర్చి ముక్కలు, టొమాటో ముక్కలు వేసి కొద్దిసేపు వేయించాలి
పసుపు, జీలకర్ర, పంచదార, ఉప్పు, వెనిగర్‌లో నానబెట్టిన ఆవాలు జత చేయాలి
మిశ్రమం దగ్గరపడే వరకు సుమారు గంటసేపు స్టౌ మీద ఉంచి దించేయాలి
చల్లారాక గాలిచొరని జాడీలోకి తీసుకుని సుమారు 10 రోజుల తరువాత ఉపయోగించుకోవాలి.
Red Chilli Coconut Chutney - పండుమిర్చి కొబ్బరి పచ్చడి
పండుమిర్చి - 200 గ్రా., కొబ్బరితురుము - కప్పు, వెల్లుల్లి రేకలు - 10, అల్లం తురుము - టీ స్పూను, ఆవపొడి - అర కప్పు, ఎండుమిర్చి - 6, ఆవాలు - టేబుల్ స్పూను, పసుపు - టీ స్పూను, చింతపండు - కొద్దిగా, మెంతిపొడి - అర టేబుల్ స్పూను, పల్లీ నూనె - 300 మి.లీ., ధనియాలపొడి - టీ స్పూను, జీలకర్రపొడి - టీ స్పూను, ఉప్పు - తగినంత, ఇంగువ - టీ స్పూను
తయారి:
పండుమిర్చిని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి
బాణలిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగాక పండుమిర్చి ముక్కలు, కొబ్బరితురుము వేసి వేయించాలి. చల్లారాక, ఉప్పు జత చేసి మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి
అల్లం తురుము, చింతపండు జత చేసి మెత్తగా చేసి పక్కన ఉంచాలి
బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, వెల్లుల్లి రేకలు, ఇంగువ, ఎండుమిర్చి వేసి వేయించాలి
పండుమిర్చి, కొబ్బరిపేస్ట్ వేసి వేయించాలి
చివరగా ఆవపొడి, ధనియాలపొడి, జీలకర్రపొడి, పసుపు, మెంతిపొడి వేసి బాగా కలిపి మూడు నిమిషాలయ్యాక దింపేయాలి.
Red Chilli Gutti Chutney - పండుమిర్చి గుత్తి పచ్చడి
పండుమిర్చి -3 కేజీలు, వాము - 100 గ్రా.
జీలకర్ర - 100 గ్రా., సోంపు - 100 గ్రా., ఎండుమిర్చి - 100 గ్రా. మెంతులు - 100 గ్రా., ఇంగువ - టేబుల్ స్పూను
కలౌంజీ - 100 గ్రా., ఉప్పు - 200 గ్రా.
ఆమ్‌చూర్ - 150 గ్రా., ఆవనూనె - కేజీ
వైట్ వెనిగర్ - 200 మి.లీ.
తయారి:
పండుమిర్చిని శుభ్రంగా కడిగి,తడి పోయేవరకు గాలిలో ఆరబెట్టి, తొడిమలు తీసేయాలి. గింజలు తీసి పక్కన ఉంచాలి
స్టౌ మీద బాణలిలో వాము, జీలకర్ర, సోంపు, ఎండుమిర్చి, మెంతులు వేసి వేయించి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి
ఉప్పు, ఆమ్‌చూర్ జతచేసి మరోమారు మిక్సీ పట్టాలి. పండు మిర్చి గింజలను కూడా మిక్సీలో వేసి మెత్తగా చేసి పక్కన ఉంచాలి
రెండు పొడులకు కలౌంజీ జత చేసి, ఆవనూనె, వైట్ వెనిగర్ వేయాలి. (వీటిని కలిపేటప్పుడు గ్లౌజ్ వేసుకుంటే మంచిది. లేదంటే చేతులు మండుతాయి)
నూనె, ఇంగువ వేసి బాగా కలిపి, ఈ మిశ్రమాన్ని రెండు మూడు రోజులు ఎండలో ఉంచాలి
ఈ మిశ్రమాన్ని కట్ చేసి ఉంచుకున్న పండుమిర్చిలో స్టఫ్ చేసి, నాలుగు రోజులు ఎండలో ఉంచాక, మిగిలిన నూనెను వాటి మీద పోసి గాలిచొరని జాడీలో నిల్వ చేయాలి.
Red Chilli Hibiscus Cannabinus ( Kenaf ) Chutney - పండుమిర్చి గోంగూర పచ్చడి
గోంగూర - కేజీ, పండుమిర్చి - 300గ్రా., చింతపండు - 250 గ్రా., ఉప్పు -తగినంత, ఇంగువ - టీ స్పూను, వెల్లుల్లి రేకలు - 6, పసుపు - టీ స్పూను, మెంతులు - 3 టీ స్పూన్లు, నూనె - పావు కేజీ
తయారి:
మెంతులను దోరగా వేయించి పొడి చేసి పక్కన ఉంచాలి
పండుమిర్చిని శుభ్రంగా కడిగి తడిపోయేవరకు ఆరనిచ్చి, తొడిమలు తీసి మిక్సీలో వేసి మెత్తగా చేసి పక్కన ఉంచాలి
చింతపండు శుభ్రం చేసి పక్కన ఉంచాలి
గోంగూర ఆకులను శుభ్రం చేసి, బాగా కడిగి తడిపోయేవరకు ఆరబెట్టాలి
బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక గోంగూర ఆకులు వేసి వేయించి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి
ఒక పెద్ద పాత్రలో మెత్తగా చేసి ఉంచుకున్న పండుమిర్చి, గోంగూర, చింతపండు వేసి వాటికి ఉప్పు, వెల్లుల్లి రేకలు, పసుపు, మెంతిపొడి జత చేసి బాగా కలపాలి
బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ వేసి బాగా కలిపి దించి చల్లారిన తరువాత పచ్చడిలో వేసి బాగా కలిపి, గాలిచొరని జాడీలో నిల్వ చేసుకోవాలి
వాడుకునే ముందు పోపు వేస్తే తాజాగా, రుచిగా ఉంటుంది.
Red Chilli Chutney - పండుమిర్చి పచ్చడి
పండుమిర్చి - కేజీ
ఉప్పు - అర కప్పు
చింతపండు - పావు కేజీ
పసుపు - టీ స్పూను
మెంతులు - టీ స్పూను
నూనె - 2 కప్పులు
జీలకర్ర - టేబుల్ స్పూను
ఆవాలు - టేబుల్ స్పూను
ఇంగువ - పావు టీ స్పూను
తయారి:
ఒక పాత్రలో పండు మిర్చి ముక్కలు, ఉప్పు, చింతపండు వేసి బాగా కలిపి గాలిచొరని సీసాలో మూడు రోజులు ఉంచాలి
బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, ఇంగువ, మెంతులు, పసుపు వేయించి, పచ్చడిలో వేసి కలపాలి
తగినంత నూనె పోసి రెండు రోజుల తర్వాత వాడుకోవాలి.
Millets - మిల్లెట్లు
Millets - Health Bullets
మిల్లెట్లు...ఆరోగ్యానికి బుల్లెట్లు..!
ఆరోగ్యాన్ని కోరుకునేవారు తృణీకరించలేనివివి.
కొందరు చిరుధాన్యాలంటారు.
అచిరకాలం జీవించేలా చేసేవివి.
ఆరోగ్యానికి మిన్న... జొన్న
నిత్య కుర్రతనం కోసం... కొర్రలు
స్వస్థత బోధించే ఒజ్జ... సజ్జ
వేగిరం నిమ్మళపరిచే... రాగి
ఆరోగ్యధామాలు... సామలు
శివరాత్రి సందర్భంగా వంటింటి మైదానంలో ప్రభలు చూపే...
ఈ మిల్లెట్లతో రుచికరమైన వంటలు చేసుకుని భుజించండి.
వాటిని వ్యాధుల పాలిట బుల్లెట్లుగా మార్చుకుని కలకాలం జీవించండి.
జొన్న లడ్డు
జొన్నలు + సజ్జలు - కేజీ
బెల్లం తురుము లేదా చక్కెర - 700 గ్రా.
నెయ్యి - పావు కేజీ
ఏలకుల పొడి - టీ స్పూను
తయారి:
జొన్నలను, సజ్జలను విడివిడిగా వేయించి, చల్లారాక
మిక్సీలో వేసి పిండి చేసుకోవాలి (జల్లెడ పట్టకూడదు)
ఒక పాత్రలో జొన్నపిండి, సజ్జపిండి వేసి వాటికి బెల్లం తురుము, ఏలకులపొడి వేసి కలపాలి
నెయ్యి జత చేస్తూ లడ్డూలు తయారుచేసుకోవాలి
జొన్నరొట్టెలు
జొన్నపిండి - కేజీ,
నీరు - తగినంత,
ఉప్పు - తగినంత
తయారి:
ఒక పాత్రలో జొన్నపిండి, ఉప్పు వేసి, తగినంత నీరు చేర్చి చపాతీ ముద్దలా కలుపుకోవాలి
చిన్న ఉండలా పిండి తీసుకుని, మెల్లమెల్లగా చేతితో గుండ్రంగా చేసుకోవాలి
స్టౌ మీద పాన్ వేడయ్యాక రొట్టెను దాని మీద వేసి, కొద్దిగా నీరు చల్లి, తిరగేయాలి
బాగా కాలేవరకు రెండువైపులా తిరగేస్తుండాలి. (ఇదే పద్ధతిలో సజ్జలు, రాగుల పిండితో కూడా రొట్టెలు తయారుచేసుకోవచ్చు)
సంగటి
కొర్రబియ్యం - పావు కిలో
రాగి పిండి - 400 గ్రా.; పెరుగు - కప్పు
ఉల్లిపాయ ముక్కలు - కప్పు; కొత్తిమీర - చిన్నకట్ట
పచ్చిమిర్చి - 4 (నిలువుగా కట్ చేయాలి)
ఉప్పు - తగినంత
తయారి:
మరుగుతున్న నీటిలో కొర్ర బియ్యం వేసి ఉడికించాలి
చిన్న గిన్నెలో చల్లటి నీళ్లు, రాగిపిండి వేసి ఉండలు లేకుండా కలిపి, ఉడుకుతున్న కొర్రబియ్యంలో వేసి కలపాలి
కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి, ఉడికిన తర్వాత దించేయాలి
చల్లారిన తరువాత పెరుగు, ఉల్లిపాయ ముక్కలు జత చేయాలి
కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి
గోంగూర -కొర్ర అన్నం
కొర్రబియ్యం - అర కిలో గోంగూర - 5 ; కట్టలు
పచ్చిమిర్చి - 6
ఉప్పు - తగినంత
నూనె - కొద్దిగా
ఆవాలు - టీ స్పూను
జీలకర్ర - టీ స్పూను
ఎండుమిర్చి - 5
కరివేపాకు - 2 రెమ్మలు
ఉల్లితరుగు - పావు కప్పు కొత్తిమీర - చిన్న కట్ట
తయారి:
కొర్రబియ్యాన్ని (1:2 నిష్పత్తిలో నీరు పోయాలి) ఉడికించి చల్లార్చాలి.
గోంగూర ఆకును శుభ్రంగా కడగాలి.
బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక గోంగూర ఆకు వేసి వేయించి చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి
అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించాలి
ఒక పాత్రలో కొర్ర అన్నం, గోంగూర పేస్ట్, ఉప్పు, పోపు వేసి బాగా కలపాలి.
కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.
మురుకులు
కొర్రపిండి - అరకిలో; మినప్పిండి - పావు కిలో; జీలకర్ర - టేబుల్ స్పూను; నువ్వులు - 2 టేబుల్‌స్పూన్లు; ఉప్పు - తగినంత; వాము - టీ స్పూను; నూనె - డీప్ ఫ్రైకి సరిపడా; ఇంగువ - కొద్దిగా; మిరియాల పొడి - అర టీ స్పూను
తయారి:
ఒక పెద్ద పాత్రలో కొర్రపిండి, మినప్పిండి వేసి కలుపుకోవాలి;
జీలకర్ర, మిరియాలపొడి, ఇంగువ, నువ్వులు, కొద్దిగా నూనె జత చేయాలి;
నీళ్లు పోస్తూ, జంతికల పిండి మాదిరిగా కలుపుకోవాలి;
బాణలిలో నూనె పోసి కాచాలి;
మురుకుల అచ్చులో పిండి ఉంచి, నూనెలో మురుకులను చుట్టలా వేసి వేగాక పేపర్ న్యాప్‌కిన్ మీదకు తీసుకోవాలి.
అంబలి
కావలసినవి:
రాగిపిండి - 2 టేబుల్ స్పూన్లు, నీరు - అర లీటరు, మజ్జిగ - గ్లాసు (పల్చగా ఉండాలి), ఉప్పు - తగినంత, జీలకర్ర పొడి - టీ స్పూను, కొత్తిమీర - కొద్దిగా
తయారి:
నీళ్లను ఒక గిన్నెలో మరిగించాలి.
చిన్న గిన్నెలో కొద్దిగా చల్లటి నీరు పోసి, అందులో రాగిపిండి వేసి, ఉండలు లేకుండా కలపాలి .
మరుగుతున్న నీటిలో రాగిపిండి వేసి మంట తగ్గించి ఉడికించి దించేయాలి.
చల్లారాక మజ్జిగ, ఉప్పు, జీలకర్ర పొడి వేసి కలపాలి.
సర్వ్ చేసే ముందు కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.
తెలుసుకుందాం...
మలబద్దకం రాకుండా రక్షిస్తాయి.
శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ తగ్గిస్తాయి.
యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి.
పోషకపదార్థాలు ఎక్కువ.
అసిడిటీ రాకుండా కాపాడతాయి.
ఖనిజలవణాలు, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం ఎక్కువగా ఉంటాయి.
తక్కువ శాతం గ్లూకోజ్‌ను విడుదల చేస్తాయి.
వరి, గోధుమల కంటె వీటిలో క్యాల్షియం పదిరెట్లు ఎక్కువ.
Millets - Health Bullets
మిల్లెట్లు...ఆరోగ్యానికి బుల్లెట్లు..!
ఆరోగ్యాన్ని కోరుకునేవారు తృణీకరించలేనివివి.
కొందరు చిరుధాన్యాలంటారు.
అచిరకాలం జీవించేలా చేసేవివి.
ఆరోగ్యానికి మిన్న... జొన్న
నిత్య కుర్రతనం కోసం... కొర్రలు
స్వస్థత బోధించే ఒజ్జ... సజ్జ
వేగిరం నిమ్మళపరిచే... రాగి
ఆరోగ్యధామాలు... సామలు
శివరాత్రి సందర్భంగా వంటింటి మైదానంలో ప్రభలు చూపే...
ఈ మిల్లెట్లతో రుచికరమైన వంటలు చేసుకుని భుజించండి.
వాటిని వ్యాధుల పాలిట బుల్లెట్లుగా మార్చుకుని కలకాలం జీవించండి.
జొన్న లడ్డు
జొన్నలు + సజ్జలు - కేజీ
బెల్లం తురుము లేదా చక్కెర - 700 గ్రా.
నెయ్యి - పావు కేజీ
ఏలకుల పొడి - టీ స్పూను
తయారి:
జొన్నలను, సజ్జలను విడివిడిగా వేయించి, చల్లారాక
మిక్సీలో వేసి పిండి చేసుకోవాలి (జల్లెడ పట్టకూడదు)
ఒక పాత్రలో జొన్నపిండి, సజ్జపిండి వేసి వాటికి బెల్లం తురుము, ఏలకులపొడి వేసి కలపాలి
నెయ్యి జత చేస్తూ లడ్డూలు తయారుచేసుకోవాలి
జొన్నరొట్టెలు
జొన్నపిండి - కేజీ,
నీరు - తగినంత,
ఉప్పు - తగినంత
తయారి:
ఒక పాత్రలో జొన్నపిండి, ఉప్పు వేసి, తగినంత నీరు చేర్చి చపాతీ ముద్దలా కలుపుకోవాలి
చిన్న ఉండలా పిండి తీసుకుని, మెల్లమెల్లగా చేతితో గుండ్రంగా చేసుకోవాలి
స్టౌ మీద పాన్ వేడయ్యాక రొట్టెను దాని మీద వేసి, కొద్దిగా నీరు చల్లి, తిరగేయాలి
బాగా కాలేవరకు రెండువైపులా తిరగేస్తుండాలి. (ఇదే పద్ధతిలో సజ్జలు, రాగుల పిండితో కూడా రొట్టెలు తయారుచేసుకోవచ్చు)
సంగటి
కొర్రబియ్యం - పావు కిలో
రాగి పిండి - 400 గ్రా.; పెరుగు - కప్పు
ఉల్లిపాయ ముక్కలు - కప్పు; కొత్తిమీర - చిన్నకట్ట
పచ్చిమిర్చి - 4 (నిలువుగా కట్ చేయాలి)
ఉప్పు - తగినంత
తయారి:
మరుగుతున్న నీటిలో కొర్ర బియ్యం వేసి ఉడికించాలి
చిన్న గిన్నెలో చల్లటి నీళ్లు, రాగిపిండి వేసి ఉండలు లేకుండా కలిపి, ఉడుకుతున్న కొర్రబియ్యంలో వేసి కలపాలి
కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి, ఉడికిన తర్వాత దించేయాలి
చల్లారిన తరువాత పెరుగు, ఉల్లిపాయ ముక్కలు జత చేయాలి
కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి
గోంగూర -కొర్ర అన్నం
కొర్రబియ్యం - అర కిలో గోంగూర - 5 ; కట్టలు
పచ్చిమిర్చి - 6
ఉప్పు - తగినంత
నూనె - కొద్దిగా
ఆవాలు - టీ స్పూను
జీలకర్ర - టీ స్పూను
ఎండుమిర్చి - 5
కరివేపాకు - 2 రెమ్మలు
ఉల్లితరుగు - పావు కప్పు కొత్తిమీర - చిన్న కట్ట
తయారి:
కొర్రబియ్యాన్ని (1:2 నిష్పత్తిలో నీరు పోయాలి) ఉడికించి చల్లార్చాలి.
గోంగూర ఆకును శుభ్రంగా కడగాలి.
బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక గోంగూర ఆకు వేసి వేయించి చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి
అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించాలి
ఒక పాత్రలో కొర్ర అన్నం, గోంగూర పేస్ట్, ఉప్పు, పోపు వేసి బాగా కలపాలి.
కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.
మురుకులు
కొర్రపిండి - అరకిలో; మినప్పిండి - పావు కిలో; జీలకర్ర - టేబుల్ స్పూను; నువ్వులు - 2 టేబుల్‌స్పూన్లు; ఉప్పు - తగినంత; వాము - టీ స్పూను; నూనె - డీప్ ఫ్రైకి సరిపడా; ఇంగువ - కొద్దిగా; మిరియాల పొడి - అర టీ స్పూను
తయారి:
ఒక పెద్ద పాత్రలో కొర్రపిండి, మినప్పిండి వేసి కలుపుకోవాలి;
జీలకర్ర, మిరియాలపొడి, ఇంగువ, నువ్వులు, కొద్దిగా నూనె జత చేయాలి;
నీళ్లు పోస్తూ, జంతికల పిండి మాదిరిగా కలుపుకోవాలి;
బాణలిలో నూనె పోసి కాచాలి;
మురుకుల అచ్చులో పిండి ఉంచి, నూనెలో మురుకులను చుట్టలా వేసి వేగాక పేపర్ న్యాప్‌కిన్ మీదకు తీసుకోవాలి.
అంబలి
కావలసినవి:
రాగిపిండి - 2 టేబుల్ స్పూన్లు, నీరు - అర లీటరు, మజ్జిగ - గ్లాసు (పల్చగా ఉండాలి), ఉప్పు - తగినంత, జీలకర్ర పొడి - టీ స్పూను, కొత్తిమీర - కొద్దిగా
తయారి:
నీళ్లను ఒక గిన్నెలో మరిగించాలి.
చిన్న గిన్నెలో కొద్దిగా చల్లటి నీరు పోసి, అందులో రాగిపిండి వేసి, ఉండలు లేకుండా కలపాలి .
మరుగుతున్న నీటిలో రాగిపిండి వేసి మంట తగ్గించి ఉడికించి దించేయాలి.
చల్లారాక మజ్జిగ, ఉప్పు, జీలకర్ర పొడి వేసి కలపాలి.
సర్వ్ చేసే ముందు కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.
తెలుసుకుందాం...
మలబద్దకం రాకుండా రక్షిస్తాయి.
శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ తగ్గిస్తాయి.
యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి.
పోషకపదార్థాలు ఎక్కువ.
అసిడిటీ రాకుండా కాపాడతాయి.
ఖనిజలవణాలు, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం ఎక్కువగా ఉంటాయి.
తక్కువ శాతం గ్లూకోజ్‌ను విడుదల చేస్తాయి.
వరి, గోధుమల కంటె వీటిలో క్యాల్షియం పదిరెట్లు ఎక్కువ.




