కావలసిన పదార్థాలు:
రొయ్యలు - అర కిలో
పెరుగు - 1 కప్పు
పసుపు - అర టీస్పూను
గరం మసాలా - 1 టే.స్పూను
ధనియాల పొడి - 1 టే.స్పూను
కారం - 1 టే.స్పూను
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టే.స్పూను
ఉప్పు, నూనె - తగినంత
ఉల్లి ముక్కలు - కాసిన్ని
తయారీ విధానం:
రొయ్యలకు పెరుగు, పసుపు చేర్చి రుద్ది బాగా కడగాలి.
తర్వాత కారం, ధనియాల పొడి, గరం మాసాలా, వేసి కలిపి గంట సేపు
పక్కనుంచాలి.
బాండ్లీలో నూనె పోసి కాగాక ఉల్లి ముక్కలు వేయించి అల్లం వెల్లుల్లి పేస్ట్ కలపాలి.
రెండు నిమిషాలు వేగాక రొయ్యలు వేసి వేయించాలి.
చిన్న మంట మీద కలుపుతూ వేయించాలి.
15 నిమిషాలపాటు వేయించాక తరిగిన కొత్తిమీరతో అలంకరించి వడ్డించాలి.