కావలసిన పదార్థాలు:
మటన్ జాయింట్ - 600 గ్రా
కారం - 20 గ్రా
అల్లం వెల్లుల్లి ముద్ద - తగినంత
కాశ్మీరీ కారం - 50 గ్రా
గరం మసాలా - రెండు గ్రా
ఆవ నూనె - 100 మి.లీ
పెరుగు - 300 మి.లీ
ఉప్పు - రుచికి సరిపడా
తయారీ విధానం:
కాశ్మీరీ కారం, అల్లం వెల్లుల్లి, ఉప్పు బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని మటన్ జాయింట్‌కు పట్టించి ఫ్రిజ్‌లో కనీసం 6 గంటలు ఉంచాలి.
వెడల్పాటి పాత్ర తీసుకుని అందులో రెండు లీటర్ల నీళ్లు పోసి మిగిలిన పదార్థాలు, మటన్ జాయింట్‌ను వేయాలి.
పాత్రకు సిల్వర్ ఫాయిల్ చుట్టేయాలి.
160 డిగ్రీల్లో ఓవెన్‌ను ప్రీ హీట్ చేసుకుని దాన్లో పాత్రను ఉంచాలి.
ఇలా గంటంబావు ఉడికిస్తూ మధ్య మధ్యలో గమనిస్తూ ఎముక నుంచి మటన్ వేరు పడుతున్నప్పుడు ఓవెన్ నుంచి బయటకు తీయాలి.
దీన్ని మళ్లీ ఇనుప చువ్వకు గుచ్చి నిప్పులపై కాల్చాలి.
ఆ తర్వాత పైన సాస్‌తో అలంకరించి వడ్డించాలి.