కావలసిన పదార్థాలు:
బియ్యం - అర గ్లాసు
నువ్వులు - అర కప్పు
ఎండు మిర్చి - 4
పచ్చిమిర్చి - 4
కరివేపాకు - 2 రెమ్మలు
పల్లీలు - 2 టే.స్పూన్లు
శనగపప్పు - 1 టే.స్పూను
అవాలు, జీలకర్ర - చెరో అర టీస్పూను
ఉప్పు, నూనె - సరిపడా
పసుపు - తగినంత
తయారీ విధానం:
ఎండుమిర్చి, నువ్వులు వేయించుకుని ఉప్పుతో కలిపి పొడి చేసుకోవాలి.
అన్నం కొద్దిగా పలుకుగా వండి పక్కన పెట్టుకోవాలి.
స్టవ్ మీద కడాయి పెట్టి నూనె పోసి కాగాక ఆవాలు, శనగపప్పు, కరివేపాకు, పల్లీలు,పచ్చిమిరిపకాయలు, ఉప్పు, పసుపు వేసి వేయించాలి.
బాగా వేగాక దింపి అన్నంలో కలపాలి.
తర్వాత రెండు టే.స్పూన్ల నువ్వుల పొడి కలపాలి.
దాంతో నువ్వుల సద్ది రెడీ అయినట్టే!