కావలసిన పదార్థాలు:
బోన్‌లెస్ చికెన్ - పావు కిలో
శనగపప్పు - 2 కప్పులు
గరం మాసాలా - 2 టీస్పూన్లు
కారం - 1 టీస్పూను
అల్లం వెల్లుల్లి పేస్ట్ - చిన్న ముద్ద
పచ్చిమిరిపకాయలు - 4
ఉల్లిపాయలు - 2
పసుపు - చిటికెడు
కొత్తిమీర కట్ట - 1
నూనె, ఉప్పు - తగినంత
తయారీ విధానం:
గిన్నెలో శనగపప్పు వేసి నీళ్లలో నానబెట్టుకోవాలి.
చికెన్ ముక్కలు శుభ్రంగా కడిగి కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి.
నానబెట్టిన శనగపప్పును మెత్తగా రుబ్బుకోవాలి.
ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉడికించిన చికెన్, మసాలా, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
కడాయిలో నూనె వేడిచేసి కొద్దిగా చికెన్ ముద్దను అరచేతిలో తీసుకుని మధ్యలో రంధ్రం చేసి నూనెలో వేయించాలి.