Ads 468x60px

Pages

Learn English Vocabulary & Help the Poor| |Free Rice |
Showing posts with label Turmeric. Show all posts
Showing posts with label Turmeric. Show all posts

Brinjal Tomato Dal - వంకాయ టమోటా పప్పు

Brinjal Tomato Dal - వంకాయ టమోటా పప్పు




కావలసిన పదార్థాలు: వంకాయలు - పావు కేజీ,
కందిపప్పు - అరకప్పు,
టమోటాలు - 2,
పచ్చిమిర్చి - 2,
ఉప్పు - రుచికి తగినంత,
చింతపండు - నిమ్మకాయంత,
పసుపు - అర టీ స్పూను,
కొత్తిమీర తరుగు - అరకప్పు;
నూనె, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ, మినపప్పు - తిరగమోతకి సరిపడా.

తయారుచేసే విధానం:
కప్పు నీటిలో పప్పు, పసుపు వేసి మెత్తగా ఉడికించాలి. అవసరం అయితే మరో కప్పు నీరు కలిపి జారుగా మెదిపి పక్కనుంచాలి. నూనెలో తాలింపు వేగాక (చీరిన) పచ్చిమిర్చి, వంకాయ ముక్కలు వేసి మూతపెట్టి రెండు నిమిషాలు మగ్గించి టమోటా ముక్కలు కలపాలి. ముక్కలు మెత్తబడ్డాక ఉప్పు, పప్పు వేసి 5 నిమిషాలు చిన్నమంటపై మరిగించి కొత్తిమీర చల్లి దించేయాలి. ఈ పప్పు అన్నంతో పాటు పరాటాల్లోకి కూడా చాలా బాగుంటుంది. (ముదిరిన వంకాయలను కొందరు పారేస్తుంటారు. అలాంటివాటిని పప్పులో వాడుకోవచ్చు).

Chicken Garelu - చికెన్‌ గారెలు

కావలసిన పదార్థాలు:
బోన్‌లెస్‌ చికెన్‌ - పావు కిలో
శనగపప్పు - 2 కప్పులు
గరం మాసాలా - 2 టీస్పూన్లు
కారం - 1 టీస్పూను
అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - చిన్న ముద్ద
పచ్చిమిరిపకాయలు - 4
ఉల్లిపాయలు - 2
పసుపు - చిటికెడు
కొత్తిమీర కట్ట - 1
నూనె, ఉప్పు - తగినంత
తయారీ విధానం:
గిన్నెలో శనగపప్పు వేసి నీళ్లలో నానబెట్టుకోవాలి.
చికెన్‌ ముక్కలు శుభ్రంగా కడిగి కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, పసుపు, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి.
నానబెట్టిన శనగపప్పును మెత్తగా రుబ్బుకోవాలి.
ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉడికించిన చికెన్‌, మసాలా, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
కడాయిలో నూనె వేడిచేసి కొద్దిగా చికెన్‌ ముద్దను అరచేతిలో తీసుకుని మధ్యలో రంధ్రం చేసి నూనెలో వేయించాలి.

Prawns Fry - రొయ్యల వేపుడు

కావలసిన పదార్థాలు:
రొయ్యలు - అర కిలో
పెరుగు - 1 కప్పు
పసుపు - అర టీస్పూను
గరం మసాలా - 1 టే.స్పూను
ధనియాల పొడి - 1 టే.స్పూను
కారం - 1 టే.స్పూను
అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 1 టే.స్పూను
ఉప్పు, నూనె - తగినంత
ఉల్లి ముక్కలు - కాసిన్ని
తయారీ విధానం:
రొయ్యలకు పెరుగు, పసుపు చేర్చి రుద్ది బాగా కడగాలి.
తర్వాత కారం, ధనియాల పొడి, గరం మాసాలా, వేసి కలిపి గంట సేపు
పక్కనుంచాలి.
బాండ్లీలో నూనె పోసి కాగాక ఉల్లి ముక్కలు వేయించి అల్లం వెల్లుల్లి పేస్ట్‌ కలపాలి.
రెండు నిమిషాలు వేగాక రొయ్యలు వేసి వేయించాలి.
చిన్న మంట మీద కలుపుతూ వేయించాలి.
15 నిమిషాలపాటు వేయించాక తరిగిన కొత్తిమీరతో అలంకరించి వడ్డించాలి.

Panjabi Recipes - పంజాబీ వంటలు

రుచుల కోటలోపాగా!

 

ఐదు పదుల వయసులోనూ పదుైనె దేళ్ల కుర్రాళ్లా కనిపించేదెవరు?
 సాధారణ లారీ కంటే రెట్టింపు సైజు ట్రక్కులు నడిపేదెవరు?
 తలపాగా మెలి పెట్టి మకుటం లాంటి తలకట్టుతో ఆకట్టుకునేదెవరు?
 ఇంకెవరు... పరమ కష్టజీవులైన పంజాబీలే!
 వాళ్లకు కావాల్సినవన్నీ డబుల్ ఎక్స్‌ట్రా అని తెలిసే
 ఆ ప్రాంతాన ఐదు నదులు పారించాడా దేవుడు!
 ఈ లెక్కన వాళ్ల వంటలూ ఐదింతల రుచితో ఉండాలి కదా!
 కాబట్టే ఆరు రుచులనూ నోరారా, ఆరారా తినేలా చేస్తాయవి.
 ‘జనగణమన’లోని పంజాబ సింధు గుజరాత మరాఠాల్లో తొలిస్థానంలాగే
 మన దేశీయ వంటకాల్లో పంజాబీ రుచులకే అగ్రపీఠం, శిఖరాగ్రస్థానం.
 అందుకే... ఆ వంటలకు కిరీటంలా గౌరవమనే తలపాగాను చుడదాం రండి.
 రుచుల కోటలో పాగా వేసి మనమూ కాస్త వాటిని ఆస్వాదిద్దాం పదండి.

 తడ్కా భునా ఝింగా
 కావలసినవి:
 రొయ్యలు - అర కిలో; పసుపు - అర టీ స్పూను; ఉప్పు - తగినంత; నూనె - 4 టీ స్పూన్లు; టొమాటో తరుగు - కప్పు; ఉల్లి తరుగు - కప్పు; పచ్చి మిర్చి తరుగు - అర టీ స్పూను; టొమాటో గుజ్జు - కప్పు; గరం మసాలా పొడి - టీ స్పూను; కొబ్బరి తురుము - కప్పు; జీడి పప్పు పేస్ట్ - టీ స్పూను; కారం - టీ స్పూను; బటర్ - 10 గ్రా.; క్రీమ్- 10 గ్రా.; నిమ్మరసం - టీ స్పూను; కొత్తిమీర - ఒక కట్ట

 తయారీ:  
 రొయ్యలను శుభ్రం చేసుకుని, పసుపు, ఉప్పు జత చేసి సుమారు అర గంట సేపు పక్కన ఉంచాలి

 బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక, రొయ్యలను వేయించి తీసి పక్కన ఉంచాలి

 అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి ఉల్లితరుగు, టొమాటో తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి గోధుమ రంగులోకి వచ్చేవరకు వేయించాలి

 టొమాటో గుజ్జు, గరం మసాలా, కొబ్బరి తురుము వేసి కలపాలి

 కొద్దిగా ఉడుకు పట్టిన తర్వాత జీడిపప్పు పేస్ట్, కారం, బటర్, క్రీమ్ వేసి కలపాలి

 చివరగా రొయ్యలను వేసి బాగా కలిపి రెండు నిమిషాలు ఉంచి దించేయాలి

 నిమ్మరసం జత చేయాలి

 కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.

 చూజ్ ఏ రోగన్

 కావలసినవి:  

 చికెన్ లెగ్‌పీస్‌లు - 4; ఉల్లి తరుగు - అర కప్పు; టొమాటో తరుగు - అర కప్పు; గరంమసాలా పొడి -  టీ స్పూను; బిర్యానీ ఆకు - 1; మిరియాల పొడి -  టీ స్పూను; ఉప్పు - తగినంత ; కారం -  టీ స్పూను; బటర్ - 50 గ్రా.; నిమ్మరసం - టీ స్పూను

 తయారీ:   
 ఒక పాత్రలో తగినన్ని నీళ్లు, చికెన్ లెగ్‌పీస్‌లు, ఉల్లి తరుగు, టొమాటో తరుగు, గరం మసాలా పొడి, బిర్యానీ ఆకు వేసి ఉడికించి నీటిని వేరుచేయాలి

 చికెన్ లెగ్‌పీస్‌లకి మసాలా పొడులు పట్టించి రెండు గంటలు నాననివ్వాలి
 బాణలిలో బటర్ వేసి కరిగాక, చికెన్ లెగ్‌పీస్‌ల మిశ్రమం వేసి వేయించాలి

 ఉప్పు, కారం వేసి కలపాలి

 దించాక నిమ్మరసం కలిపి సర్వ్ చేయాలి.

 నలీ కా సాలన్

 కావలసినవి:
 మటన్ బోన్స్ - అర కేజీ; ఉల్లి తరుగు - అర కప్పు; టొమాటో తరుగు - అర కప్పు; గరం మసాలా పొడి - టీ స్పూను; బిరియానీ ఆకు - రెండు; నల్ల మిరియాల పొడి - టీ స్పూను; ఉప్పు - తగినంత; పసుపు - అర టీ స్పూను; అల్లంవెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను; కారం -  టీ స్పూను; నూనె - రెండు టేబుల్ స్పూన్లు;  ధనియాలపొడి -  టీ స్పూను; జీలకర్ర పొడి -  టీ స్పూను; నిమ్మరసం - పావు టీ స్పూను.

 తయారీ: 
 కుకర్‌లో మటన్‌ను ఉడికించి పక్కన ఉంచాలి

 బాణలిలో నూనె కాగాక ఉల్లి తరుగు, టొమాటో తరుగు, గరం మసాలా, బిరియానీ ఆకు, నల్ల మిరియాల పొడి వేసి బాగా కలిపి ఉడికించాలి 

 అల్లంవెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు వేసి కలపాలి

 ఉడికించుకున్న మటన్ జత చేయాలి

 కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలపాలి

 నిమ్మరసం వేసి సర్వ్ చేయాలి.

  ముర్గ్ తుల్సీ టిక్కా

 కావలసినవి:  
 బోన్‌లెస్ చికెన్ - పావు కిలో; అల్లంవెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను; ఉప్పు - తగినంత; పుదీనా పేస్ట్ - టీ స్పూను; పచ్చి మిర్చి పేస్ట్ - టీ స్పూను; పెరుగు - లీటరు; గరం మసాలా పొడి - టీ స్పూను; ఆవ నూనె - రెండు టేబుల్ స్పూన్లు

 తయారీ:  
 బోన్‌లెస్ చికెన్‌ని కావలసిన  పరిమాణంలో ముక్కలు చేసుకోవాలి

 అల్లంవెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పుదీనా పేస్ట్, పచ్చి మిర్చి పేస్ట్, పెరుగు, గరం మసాలా, ఆవనూనె కలిపిన మిశ్రమాన్ని చికెన్‌కు పట్టించి గంట సేపు ఉంచాలి

 అన్నిటినీ బాగా కలిపి అవెన్‌లో కానీ, తందూరీ పద్ధతిలో కానీ ఉడికించి సర్వ్ చేయాలి.

 పనీర్ కుర్చాన్
 కావలసినవి:
పనీర్ - 50 గ్రా.; గ్రీన్ క్యాప్సికమ్ - ఒకటి; నూనె - రెండు టీ స్పూన్లు; ఉల్లి తరుగు - అర కప్పు; టొమాటో తరుగు - అర కప్పు; పచ్చి మిర్చి తరుగు - రెండు టీ స్పూన్లు; టొమాటో గుజ్జు - కప్పు; గరం మసాలా - టీ స్పూను; బటర్ - 50 గ్రా.; క్రీమ్ - పావు కప్పు; చాట్‌మసాలా పౌడర్- టీ స్పూను; కారం - టీ స్పూను; మెంతి ఆకులు - రెండు టీ స్పూన్లు (ఎండినవి);  ఉప్పు - తగినంత; అల్లం తురుము - టీ  స్పూను; కొత్తిమీర - చిన్న కట్ట

 తయారీ:
 పనీర్‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి

 గ్రీన్ క్యాప్సికమ్‌ను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేయాలి

 బాణలిలో నూనె వేడి చేసి, ఉల్లి తరుగు, టొమాటో తరుగు, పచ్చి మిర్చి తరుగు వేసి గోధుమరంగులోకి వచ్చే వరకు వేయించాలి

 టొమాటో గుజ్జు, గరం మసాలా, బటర్, క్రీమ్, చాట్ మసాలా, కారం జత చేయాలి  తరిగి ఉంచుకున్న క్యాప్సికమ్ ముక్కలు, మెంతి ఆకులు, ఉప్పు వేసి బాగా వేయించాలి

 అల్లం తురుము వేసి బాగా కలిపి దించేయాలి

 కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.

 పంజాబీ చోలే బటూరా

 కావలసినవి:
 పెద్ద సెనగలు - 2 కప్పులు; ఉప్పు - తగినంత; నూనె - రెండు టీ స్పూన్లు; అల్లంవెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను; పచ్చి మిర్చి పేస్ట్ - టీ స్పూను; వాము - పావు టీ స్పూను; చోలే మసాలా - టీ స్పూను; ఇంగువ - అర టీ స్పూను; టొమాటో గుజ్జు - అర కప్పు; కొత్తిమీర తరుగు - టీ స్పూను::: బటూరా కోసం...: పెరుగు - 2 టేబుల్ స్పూన్లు; పంచదార - టీ స్పూను ;  ఉప్పు - తగినంత; పాలు - అర కప్పు; మైదా - అర కేజీ; బొంబాయిరవ్వ - 100 గ్రా.; నీరు - తగినంత; నూనె - వేయించడానికి తగినంత:::

 తయారీ:  
 పెద్ద సెనగలను సుమారు ఎనిమిది గంటలు నానబెట్టి ఉడికించాలి 

 ఉడుకు పడుతుండగా ఉప్పు జత చేయాలి

 బాణలిలో నూనె వేసి కాగాక, అల్లంవెల్లుల్లి పేస్ట్, పచ్చి మిర్చి పేస్ట్, వాము వేసి వేయించాలి 

 ఉడికించుకున్న సెనగలను జత చేసి, చోలే మసాలా, ఇంగువ వేసి కలపాలి  టొమాటో గుజ్జు వేసి ఉడికించాలి

 కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి.:::

 బటూరా తయారీ:  
 ఒక పాత్రలో పెరుగు, పంచదార, ఉప్పు, పాలు వేసి కలపాలి

 మైదా, బొంబాయి రవ్వ జత చేసి చపాతీపిండిలా కలిపి రెండు గంటలు నాననివ్వాలి

చిన్న చిన్న ఉండలుగా చేసి పూరీలా ఒత్తుకుని కాగుతున్న నూనెలో వేయించి తీయాలి  పళ్లెంలో చోలే, బటూరాలను అందంగా అలంకరించి సర్వ్ చేయాలి.
Learn English Vocabulary & Help the Poor |Free Rice |
 
google-site-verification: google2463dc209284d38a.html