Ads 468x60px

Pages

Learn English Vocabulary & Help the Poor| |Free Rice |

Wheat Rava Idli - గోధుమరవ్వ ఇడ్లీ

గోధుమరవ్వ ఇడ్లీ - Broken Wheat Idli

కావలసినవి:
గోధుమ రవ్వ, పెరుగు ఒక్కోటి అరకప్పు చొప్పున, 
ఓట్స్‌ - ఒక కప్పు, 
క్యారెట్‌ తురుము - మూడు టేబుల్‌స్పూన్లు, 
క్యాబేజీ తురుము - ఒకటిన్నర టేబుల్‌స్పూన్‌, 
పచ్చి బఠానీలు - రెండు టేబుల్‌స్పూన్లు, 
ఉప్పు- తగినంత, 
నీళ్లు- ఒక కప్పు, 
అల్లం- కొద్దిగా, 
పచ్చిమిరపకాయలు (తరిగి) - రెండు, 
మిరియాలు - అరటీస్పూను, 
నిమ్మరసం - కొద్దిగా, 
కొత్తిమీర తరుగు, నూనె, పోపు గింజలు- రెండు టీస్పూన్ల చొప్పున, 
కరివేపాకు, ఇంగువ- సరిపడినంత. 

తయారీ: 
కడాయిలో ఓట్స్‌ని మూడు నిమిషాలపాటు వేగించాలి. చల్లార్చి పొడి చేసుకోవాలి. వేరొక కడాయిలో నూనెపోసి పోపు గింజలు, కరివేపాకు, ఇంగువ వేగించాలి. ఆ తరువాత క్యారెట్‌, క్యాబేజీ, బఠానీలు వేయాలి. ఒక నిమిషం తరువాత గోధుమ రవ్వ, ఓట్స్‌ పొడి వేసి రెండు నిమిషాలు వేగించాలి. కొద్దిసేపటి తరువాత ఉప్పు వేసి స్టవ్‌ ఆఫ్‌ చేయాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత పెరుగు, కొన్ని నీళ్లు పోసి ఇడ్లీ పిండిలా కలపాలి. ఇందులో నిమ్మరసం, కొత్తిమీర కలిపి ఇడ్లీ ప్లేట్లలో వేసి పావు గంటసేపు ఉండికించాలి. వేడి వేడిగా ఉన్నప్పుడు తింటే చాలా రుచిగా ఉంటాయి.
Learn English Vocabulary & Help the Poor |Free Rice |
 
google-site-verification: google2463dc209284d38a.html