కావలసినవి:
ఇడ్లీలు- ఆరు,
పుదీనా చట్నీ- 4 టీస్పూన్లు,
టమాటా (తరిగి)- మూడు,
ఉల్లిపాయ (తరిగి)- మూడు,
క్యారెట్ తురుము- ఒక కప్పు,
పచ్చి బటానీలు- ఒక కప్పు,
మైదా - ఒక టీస్పూను,
పసుపు తగినంత,
కారం, అల్లంవెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, గరం మసాలా ఒక్కోటి అరటీస్పూన్ చొప్పున, కొత్తిమీర తరుగు-తగినంత,
ఉప్పు- రుచికి సరిపడా, నూనె- వేగించడానికి సరిపడినంత.
తయారీ:
కడాయిలో నూనె వేడి చేసి ఇడ్లీలని గోధుమరంగు వచ్చే వరకు వేగించాలి. అవి బయట క్రిస్పీగా లోపల మెత్తగా ఉండేట్టు జాగ్రత్తపడాలి. కొత్తిమీర, పుదీనా చట్నీలను ఇడ్లీలకు రెండు వైపులా పూయాలి. క్యారెట్, పచ్చి బటానీలను ఉడికించి వడకట్టాలి. దోరగా వేగించిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలాలను ఒక గిన్నెలో వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో ఉడికించిన క్యారెట్, బటానీలు, ఉప్పు, కొత్తిమీర వేసి జారుగా కాకుండా గారెల పిండిలా కలపాలి. ఈ మిశ్రమాన్ని కట్లెట్‌లా చేయాలి. ఇవి ఇడ్లీ సైజ్‌లో ఉండాలి. వీటిని గోధుమ రంగు వచ్చే వరకు నూనెలో వేగించాలి. ఆ తరువాత కట్లెట్‌ని మధ్యలో పెట్టి రెండు వైపులా ఉల్లిపాయ, టొమాటో ముక్కలు ఉంచి వాటిపై ఇడ్లీని పెట్టి తినేయాలి.