కావల్సినవి:
పుదీనా ఆకులు - రెండు కప్పులు,
కొత్తిమీర - పావుకప్పు,
అన్నం - కప్పు,
పచ్చిమిర్చి - రెండు,
నిమ్మరసం - చెంచా,
నూనె- టేబుల్ స్పూను,
జీడిపప్పు పలుకులు - కొన్ని,
జీలకర్ర - చెంచా,
సెనగ పప్పు - ఒకటిన్నర చెంచా,
ఉప్పు - తగినంత,
దాల్చిన చెక్క - చిన్నముక్క,
లవంగాలు - ఐదారు,
యాలకులు - రెండు,
అల్లం ముద్ద - చెంచా.
తయారీ:
బాణలిని పొయ్యిమీద పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక జీలకర్రా, జీడిపప్పూ, సెనగపప్పు వేయించాలి.
రెండు నిమిషాలయ్యాక లవంగాలూ, దాల్చినచెక్కా, యాలకులు వేయాలి.
అవి వేగాక అల్లం ముద్దా, పచ్చిమిర్చి తరుగూ, కడిగిన పుదీనా ఆకులూ వేసి మంట తగ్గించాలి.
కాసేపటికి పుదీనా ఆకుల పచ్చివాసన పోతుంది.
అప్పుడు తగినంత ఉప్పూ, కొత్తిమీర తరుగూ, నిమ్మరసం అన్నం వేసి బాగా వేయించి దింపేయాలి.
దీన్ని ఉల్లిపాయ పెరుగు పచ్చడితో కలిపి తీసుకోవచ్చు.
Showing posts with label Cinnamon. Show all posts
Showing posts with label Cinnamon. Show all posts
Mint Rice _ పుదీనా అన్నం
Labels:
Bengal Gram,
Cardamom,
Cashewnut,
Cinnamon,
Cloves,
Coriander Leaves,
Cumin,
Ginger,
Green Chillies,
Lemon,
Mint Leaves,
Oil,
Rice
Mushroom Biryani - మష్రూమ్ బిర్యాని
Mushroom Biryani - మష్రూమ్ బిర్యాని
-X¾Û-{d-’í-œ¿Õ-’¹Õ-©Õ:ƪ½ÂË©ð,
…Lx¤Ä-§ŒÕ-©Õ: 骢œ¿Õ,
šï«Öšð: ŠÂ¹šË,
¦Ç®¾t-A-G-§ŒÕu¢: 2 ¹X¾Ûp©Õ,
ÊÖ¯ç ©äŸÄ ¯çªáu: ƪ½Â¹X¾Ûp,
²ò§ŒÖ²Ä®ý: 2 šÌ®¾ÖpÊÕx,
Æ©x¢ÅŒÕ-ª½Õ-«á: ŠÂ¹šËÊoª½ šÌ®¾ÖpÊÕx,
„ç©ÕxLx 骦s©Õ: 4,
X¾*aNÕJa: 骢œ¿Õ,
ŸÄLa-Ê-Íç-¹ˆ: Æ¢’¹Õ-@Á¢Êoª½ «á¹ˆ,
§ŒÖ©Â¹×©Õ: 骢œ¿Õ,
©«¢’éÕ: 骢œ¿Õ,
Ÿ¿E§ŒÖ-©-¤ñ-œË: ŠÂ¹šËÊoª½ šÌ®¾ÖpÊÕx,
X¾ÛD¯Ã ‚¹שÕ: ÂíCl’Ã,
…X¾Ûp: ®¾JX¾œÄ,
E«ÕtÂçŒÕ: ®¾’¹¢«á-¹ˆ
-ÅŒ-§ŒÖ-ª½Õ-Íäæ® NŸµÄÊ¢
*G§ŒÕu¢ ¹œËT ’¹¢{æ®X¾Û ¯ÃÊE„ÃyL. ÅŒª½„ÃÅŒ F@ÁÙx «¢æX®Ï …¢ÍÃL.
*“åX†¾-ªý-¤Ä-¯þ©ð ÂíCl’à ¯çªáu „ä®Ï ¹œËTÊ G§ŒÕu¢ „ä®Ï „äªá¢* Bæ®§ŒÖL.
*X¾Û{d-’í-œ¿Õ-’¹Õ-Lo «á¹ˆ©Õ’à Âî®Ï X¾Â¹ˆÊ …¢ÍÃL. §ŒÖ©Â¹×©Õ, ©«¢’éÕ, Æ©x¢ÅŒÕ-ª½Õ-«á, ŸÄLa-Ê-Íç-¹ˆ, „ç©Õx-Lx-骦s©Õ...Æ-Fo ¹LXÏ „çÕÅŒh’à ª½Õ¦ÇsL.
*“åX†¾-ªý-¤Ä-¯þ©ð ®¾JX¾œÄ ÊÖ¯ç ©äŸÄ ¯çªáu „ä®Ï «Õ²Ä-©Ç-«á-Ÿ¿l „ä®Ï „äªá¢ÍÃL. ÅŒª½„ÃÅŒ …Lx«á¹ˆ©Õ „ä®Ï „äªá¢ÍÃL. ƒX¾Ûpœ¿Õ X¾Û{d-’í-œ¿Õ-’¹Õ© «á¹ˆ©Õ, šï«Öšð «á¹ˆ©Õ Â¹ØœÄ „ä®Ï X¾C ENÕ³Ä©Õ „äªá¢ÍÃL. ÅŒª½„ÃÅŒ ²ò§ŒÖ²Ä®ý „ä®Ï ¹©¤ÄL.
*ƒX¾Ûpœ¿Õ «âœ¿ÕÊoª½ ¹X¾Ûp© F@ÁÙx ¤ò®Ï «ÕJTÊ ÅŒª½„ÃÅŒ „äªá¢*Ê G§ŒÕu¢ „ä®Ï ¹©¤ÄL. Ÿ¿E§ŒÖ-©-¤ñœË, …X¾Ûp, X¾ÛD¯Ã „ä®Ï ¹LXÏ «âÅŒåXšËd Ō¹׈« «Õ¢{OÕŸ¿ X¾Cæ£ÇÊÕ ENÕ³Ä©Õ …œËÂË¢* C¢ÍÃL. ƒ†¾d„çÕiÅä A¯ä«á¢Ÿ¿Õ Âî¾h E«Õtª½®¾¢ XÏ¢œ¿ÕÂî«ÍŒÕa.
Labels:
Basmati Rice,
Cardamom,
Cinnamon,
Cloves,
Coriander,
Garlic,
Ginger,
Green Chillies,
Lemon,
Mint Leaves,
mushroom,
Oninons,
Soya Sauce,
Tomato
Moghalayi Biryani Badshahi - మొఘలాయీ బిర్యానీ బాద్షాహీ
Moghalayi Biryani Badshahi - మొఘలాయీ బిర్యానీ బాద్షాహీ
మటన్ - అర కేజీ; బాస్మతి బియ్యం - పావు కేజీ; నిమ్మరసం - 3 టేబుల్ స్పూన్లు; బాదం పప్పుల తరుగు - 2 టేబుల్ స్పూన్లు; పుదీనా ఆకులు - 10; బటర్ - కప్పు; కొత్తిమీర - కొద్దిగా; జీలకర్ర - అర టేబుల్ స్పూను; ఉల్లి తరుగు - అర కప్పు; ఏలకులు - 2; నూనె - టేబుల్ స్పూను; వెల్లుల్లి రేకలు - 2; అల్లం ముక్క - చిన్నది; కుంకుమ పువ్వు - అర టేబుల్ స్పూను; పచ్చి మిర్చి తరుగు - అర టేబుల్ స్పూను; కారం - అర టేబుల్ స్పూను; దాల్చిన చెక్క - చిన్న ముక్క; పెరుగు - అర కేజీ; పాలు - 125 మి.లీ; నీళ్లు - 3 కప్పులు
తయారీ:
బియ్యం కడిగి నానబెట్టాలి
బాణలిలో నూనె వేసి కాగాక ఉల్లి తరుగు వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి
కొద్దిగా నీళ్లలో కుంకుమ పువ్వు వేసి కలపాలి
అల్లం, ఎండు మిర్చి, వెల్లుల్లి, బాదంపప్పులను మిక్సీలో వేసి ముద్ద చేయాలి
బాణలిలో బటర్ వేసి కరిగాక తయారుచేసి ఉంచుకున్న ఈ ముద్ద వేసి వేయించాలి మటన్, ఉప్పు జత చేసి బాగా కలిపి ఐదు నిమిషాలు ఉంచాలి
నీళ్లు పోసి బాగా ఉడికించాలి. (సుమారు ఒక కప్పు గ్రేవీ ఉండేవరకు ఉడికించాలి)
ఒక పెద్ద పాత్రలో నీళ్లలో ఉప్పు, బియ్యం వేసి ఉడికించాలి
పెరుగును ఒక వస్త్రంలో గట్టిగా కట్టి ఉన్న నీరంతా పోయేలా పిండేయాలి
లవంగాలు, ఏలకులు, జీలకర్ర, పుదీనా, పచ్చి మిర్చి తరుగు, కొత్తిమీర పెరుగులో వేసి కలపాలి
కుంకుమ పువ్వు నీరు, నిమ్మరసం రెండింటినీ మటన్‌లో వేసి కలపాలి
సగం అన్నాన్ని మటన్ మీద వేసి, వేయించి ఉంచుకున్న ఉల్లి తరుగు వేసి మళ్లీ పైన అన్నం వేయాలి
పాలు, కొద్దిగా పెరుగు వేసి మూత ఉంచాలి
సుమారు గంటసేపు స్టౌ మీద ఉంచి దించేయాలి
వేడివేడిగా వడ్డించాలి.
Carrot Cake - క్యారట్ కేక్
Carrot Cake - క్యారట్ కేక్
కోడిగుడ్లు - 4; వెజిటబుల్ ఆయిల్ - ఒకటిన్నర కప్పులు; బెల్లం తురుము - 2 కప్పులు; వెనిలా ఎక్స్‌ట్రాక్ట్ - 2 టీ స్పూన్లు; మైదా - 2 కప్పులు; బేకింగ్ సోడా - 2 టీ స్పూన్లు; బేకింగ్ పౌడర్ - 2 టీ స్పూన్లు; ఉప్పు - అర టీ స్పూను; దాల్చినచెక్క పొడి - 2 టీ స్పూన్లు; క్యారట్ తురుము - 3 కప్పులు; వాల్నట్ తురుము - కప్పు; నూనె - అర కప్పు; క్రీమ్ చీజ్ - అర కప్పు; కన్ఫెక్షనరీ సుగర్ - 4 కప్పులు; వెనిలా ఎక్స్‌ట్రాక్ట్ - టీ స్పూను; వాల్నట్ తురుము - కప్పు
తయారీ:
అవెన్‌ను 350 డిగ్రీల దగ్గర ప్రీహీట్ చేయాలి
పెద్ద పాత్రలో కోడిగుడ్లు (తెల్ల సొన మాత్రమే), నూనె, బెల్లం తురుము, 2 టీ స్పూన్ల వెనిలా ఎక్స్‌ట్రాక్ట్ వేసి గిలకొట్టాక, మైదా, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఉప్పు, దాల్చిన చెక్క పొడి వేసి బాగా కలపాలి
క్యారట్ తురుము, వాల్నట్ పొడి జత చేసి మరోమారు కలిపి నూనె రాసి ఉంచుకున్న బేకింగ్ పాన్‌లో ఈ మిశ్రమాన్ని వేసి అవెన్‌లో సుమారు 50 నిమిషాలు బేక్ చేసి బయటకు తీసి పది నిమిషాలు చల్లారనివ్వాలి
ఒక పాత్రలో నూనె, బెల్లం తురుము, టీ స్పూను వెనిలా ఎసెన్స్ వేసి నురుగులా వచ్చేలా గిలక్కొట్టాలి
వాల్నట్ తురుము జత చేసి డీప్ ఫ్రిజ్‌లో ఉంచి తీసేసి, క్యారట్ కేక్ మీద వేసి చల్లగా అందించాలి.
Snacks with Tea - చిరుతిండితో టీ
Snacks with Tea - చిరుతిండితో టీ
చిటపట చినుకులతో సన్నని వాన కురుస్తూంటే...పొగలు కక్కే వేడి వేడి టీలో కరకరలాడే బిస్కెట్లు నంచుకుని తింటుంటే...
ఏదో తెలియని అనుభూతి... మరేదో తెలియని ఆనందం...
ఇదంతా పాతబడిపోయింది...
ఇప్పుడు... మన ఇంటికి టీ సమయంలో అనుకోని అతిథి వస్తే...
వాళ్లకి రొటీన్‌గా కాకుండా రకరకాల టీ లు తయారుచేసి...
వాటికి రకరకాల స్నాక్స్ జత చేస్తూ అందిస్తే...
వాళ్లు పొందే సంతోషం...
సిప్పు సిప్పుకీ... ముక్క ముక్కకీ రెట్టింపు అవుతూ ఉంటుంది.
ఈ వారం రకరకాల టీలను, రకరకాల స్నాక్స్ కాంబినేషన్లతో మీ అతిథులకు అందించండి...
వారిచ్చే కాంప్లిమెంట్స్‌ని అందుకోవడానికి సిద్ధమైపోండి...
పెపరీ నగ్గెట్స్
మైదాపిండి - కప్పు; ఉప్పు - అర టీస్పూను; బేకింగ్ పౌడర్ - అర టీ స్పూను; బేకింగ్ సోడా - అర టీ స్పూను; నల్ల జీలకర్ర - అర టీస్పూను; నెయ్యి - టేబుల్ స్పూను; కారం - చిటికెడు; నీళ్లు - తగినన్ని; నూనె - వేయించడానికి తగినంత
తయారీ:
ఒక పాత్రలో మైదాపిండి, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఉప్పు వేసి బాగా కలపాలి
నెయ్యి లేదా నూనె జత చేసి ఈ మిశ్రమం బ్రెడ్ పొడిలా కనిపించేలా కలపాలి
కారం, నల్ల జీలకర్ర జత చేసి బాగా కలపాలి
తగినన్ని నీళ్లు జత చేసి చపాతీపిండిలా కలిపి, అప్పడాల పీట మీద మందంగా ఒత్తి, కావలసిన ఆకారంలో కట్ చేయాలి
బాణలిలో నూనె వేసి కాగాక వీటిని అందులో వేసి దోరగా వేయించి, చల్లారాక వేడి వేడి టీతో అందించాలి.
వైట్ టీ
వైట్ టీ పొడి - 2 టీ స్పూన్లు (ఒక కప్పుకి); పంచదార - తగినంత (ఇష్టం లేనివాళ్లు పంచదార లేకుండా కూడా తాగచ్చు)
తయారీ:
నీళ్లను బాగా మరిగించాలి
ఒక్కో కప్పులో 2 టీ స్పూన్ల టీ పొడి వేయాలి
వేడి నీళ్లు పోసి మూత పెట్టి ఐదు నిమిషాలు ఉంచాక, మూత తీసి తాగాలి
(అవసరమనుకుంటే మధ్యలో ఒకసారి కలపాలి. అప్పుడు టీ ఆకులలోని సారం బాగా దిగుతుంది. మూత పెట్టి ఉండటం వలన వేడి కూడా తగ్గదు)
మోనా
కోడి గుడ్లు - 6 (మరో రెండు గుడ్లు విడిగా ఉంచుకోవాలి); సోంపు కషాయం - (అర లీటరు); చల్లటి పాలు - 750 మి.లీ.; ఆలివ్ ఆయిల్ - 250 మి.లీ.; పంచదార - అర కేజీ; నిమ్మ తొక్కల తురుము - కొద్దిగా; ఈస్ట్ - 75 గ్రా.; మైదా పిండి - 2.5 కేజీలు; దాల్చినచెక్క పొడి - కొద్దిగా
తయారీ:
కోడిగుడ్లను బాగా గిలక్కొట్టి పక్కన ఉంచాలి
ఒక పాత్రలో సోంపు కషాయం, ఈస్ట్ వేసి బాగా కలిపి, పాలు, ఆలివ్ ఆయిల్, నిమ్మ తొక్కల తురుము, పంచదార వేసి బాగా కలిపి, గిలక్కొట్టిన కోడిగుడ్లలో వేయాలి
మైదాపిండి కొద్దికొద్దిగా వేస్తూ చేత్తో జాగ్రత్తగా కలుపుతూండాలి. (చేతికి అంటకుండా ఉండేవరకు కలపాలి)
ఈ మిశ్రమాన్ని ఒక పెద్ద పాత్రలోకి నెమ్మదిగా పోసి సుమారు రెండు గంటలు అలా వదిలేయాలి
మిశ్రమం కొద్దిగా పొంగిన తర్వాత పెద్ద నారింజకాయ పరిమాణంలో కట్ చేసి, అదనంగా ఉంచుకున్న కోడిగుడ్ల సొన ఉపయోగిస్తూ రింగ్ ఆకారంలో తయారుచేయాలి (సుమారు 30 సెం.మీ. పొడవు, 10 సెం.మీ వెడల్పు)
అవెన్‌ను 180 డిగ్రీల దగ్గర ప్రీహీట్ చేయాలి
నెయ్యి లేదా నూనె రాసిన ట్రేలో తయారుచేసి ఉంచుకున్న మోనాలను ఉంచి, వాటి మీద కోడి గుడ్డు సొన లేదా పంచదార + దాల్చినచెక్క మిశ్రమం వేసి అవెన్‌లో ఉంచాలి
బంగారురంగులోకి వచ్చేవరకు బేక్ చేసి బయటకు తీసి టీ తో అందించాలి.
గ్రీన్ టీ విత్ తులసి
నీళ్లు - 2 కప్పులు; గ్రీన్ టీ + తులసి టీ బ్యాగులు - 2; పంచదార - 2 టీ స్పూన్లు
తయారీ:
నీళ్లను మరిగించాక, అందులో టీ బ్యాగ్ వేసి రెండు మూడు నిమిషాలు ముంచి తీస్తూ చేయాలి. అలా చేయడం వలన వాటిలో ఉండే ఫ్లేవర్ టీ లోకి వస్తుంది. (వీటిని నీటితో కలిపి మరిగించకూడదు. సాధారణంగా ఒక కప్పు టీ కి ఒక బ్యాగ్ సరిపోతుంది)
పంచదార జత చేయాలి. ఇష్టపడేవారు పాలు కూడా కలుపుకోవచ్చు.
బేక్‌డ్ మేథీ ముథియా
కసూరీ మేథీ - ఒకటిన్నర టీ స్పూన్లు; గోధుమపిండి - 5 టేబుల్ స్పూన్లు; సెనగ పిండి - 5 టేబుల్ స్పూన్లు; అల్లం పచ్చి మిర్చి ముద్ద - 2 టీ స్పూన్లు; జీలకర్ర పొడి - ఒకటిన్నర టీ స్పూన్లు; మిరియాలు - 6 గింజలు; గరం మసాలా - అర టీ స్పూను; ఇంగువ - చిటికెడు; నూనె - 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు - తగినంత
తయారీ:
400 డిగ్రీ ఫారెన్ హీట్ దగ్గర అవెన్‌ను ప్రీ హీట్ చేయాలి
ఒక పాత్రలో అన్ని వస్తువులూ వేసి తగినంత నీళ్లు పోసి చపాతీ పిండిలా కలపాలి, ఉండలు చేసి, చేతితో వడల మాదిరిగా కొద్దిగా ఒత్తాలి
నూనె రాసిన బేకింగ్ డిష్‌లో వీటిని ఉంచి సుమారు పది నిమిషాలు బేక్ చేయాలి. (అవసరమనుకుంటే రెండో వైపు కూడా బంగారు రంగు వచ్చేలా మరోమారు అవెన్‌లో ఉంచవచ్చు)
కొత్తిమీర పచ్చడి, నిమ్మ చెక్కలతో సర్వ్ చేయాలి.
పాల టీ
అల్లం + ఏలకులు/ అల్లం + ఏలకులు + లవంగాలు; పాలు - కప్పు; పంచదార - అర టీ స్పూను; టీ పొడి - అర టీ స్పూను
తయారీ
తగినన్ని నీళ్లను మరిగించాలి
ఆ నీళ్లలో మనకు కావలసిన ఫ్లేవర్ ఆకులు, టీ పొడి వేసి కొద్దిసేపు వదిలేయాలి
వేడి పాలు, పంచదార జత చేసి, శ్నాక్స్‌తో కలిపి అందించాలి.
మలై స్టైల్ కర్రీ పఫ్
ఫ్రోజెన్ పఫ్ పేస్ట్రీ - ఒక ప్యాకెట్ (సూపర్ మార్కెట్‌లో దొరుకుతుంది); బంగాళదుంపలు - 3 (ఉడికించి, తొక్క తీసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయాలి); కైమా మీట్ - కప్పు (ఉప్పు, మిరియాల పొడి జత చేసి మ్యారినేట్ చేయాలి); ఉల్లి తరుగు - అర కప్పు; వెల్లుల్లి - 2 రేకలు (సన్నగా తరగాలి); ఉడికించిన కూర ముక్కలు - కప్పు (బఠాణీ, మొక్కజొన్న, క్యారట్); కూర పొడి - 3 టేబుల్ స్పూన్లు; నీళ్లు - కప్పు; ఉప్పు, పంచదార, మిరియాల పొడి - రుచికి తగినంత; నూనె - తగినంత
తయారీ:
బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక వెల్లుల్లి తరుగు వేసి వేయించాలి
కై మా మీట్ వేసి రెండు నిమిషాలు వేయించాలి
ఉల్లి తరుగు జత చేసి బాగా వేయించాక, బంగాళ దుంప ముక్కలు, కూర పొడి, నీళ్లు, ఉప్పు, పంచదార, మిరియాల పొడి వేసి మంట తగ్గించి అన్నీ మెత్తగా అయ్యేవరకు ఉడికించి, దించేయాలి
పఫ్ పేస్ట్రీని పొడవుగా ముక్కలుగా కట్ చేసి, ఉడికించి ఉంచుకున్న మిశ్రమాన్ని ఒక్కో దానిలో ఉంచి, మడత పెట్టి, కోడిగుడ్డు సొనతో అంచులు మూసేయాలి
ఫ్రోజెన్ పఫ్ పేస్ట్రీని ప్యాకెట్ మీద ఉన్న సూచనల మేరకు, ప్రీహీట్ చేసిన అవెన్‌లో బేక్ చేయాలి.
పుదీనా టీ
పుదీనా ఆకులు - రెండు టీ స్పూన్లు; సోంపు - అర టీ స్పూను; ఎండు అల్లం - చిటికెడు
తయారీ
ఒక కప్పులో మరిగించిన నీళ్లు పోయాలి
పుదీనా ఆకులు, సోంపు, ఎండు అల్లం వేసి మూత ఉంచి ఐదు నిమిషాల తర్వాత వడ గట్టి తాగాలి.
Chicken Fry - చికెన్ ఫ్రై
Chicken Fry - చికెన్ ఫ్రై
కావలసినవి:
స్కిన్ లెస్ చికెన్ - అర కేజీ; అల్లంవెల్లుల్లి పేస్ట్ - 2 టీ స్పూన్లు; కారం - టీ స్పూను; నిమ్మరసం - 2 టీ స్పూన్లు; లవంగాలు - 3; ఏలకులు - 2; దాల్చినచెక్క - చిన్న ముక్క; పసుపు - పావు టీ స్పూను; ఉల్లిపాయ పేస్ట్ - అరకప్పు; పుదీనా ఆకులు - గుప్పెడు; ఉప్పు - తగినంత; నూనె - 3 టేబుల్ స్పూన్లు; పచ్చి మిర్చి - 3; పేస్ట్ కోసం... జీడిపప్పులు - 10; గసగసాలు - 2 టీ స్పూన్లు; ధనియాలు - 3 టీ స్పూన్లు; జీలకర్ర - టీస్పూను; పేస్ట్ కోసం పైన చెప్పిన పదార్థాలకు తగినన్ని నీళ్లు జత చేసి మిక్సీలో వేసి మెత్తగా చేసి పక్కన ఉంచాలి.
తయారీ:
చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టీ స్పూను కారం, నిమ్మరసం, పసుపు జత చేసి అర గంట సేపు మ్యారినేట్ చేయాలి
మ్యారినేట్ చేసిన చికెన్‌కు తగినన్ని నీళ్లు జత చేసి కుకర్‌లో ఉంచి నాలుగు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి
బాణలిలో నూనె వేసి కాగాక లవంగాలు, ఏలకులు, దాల్చినచెక్క వేసి వేయించాలి
టీ స్పూను అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు వేయించాక అర టీ స్పూను కారం వేసి కలిపి, పుదీనా ఆకులు, ఉల్లిపాయ పేస్ట్ వేసి కలియబెట్టాలి
ఉప్పు జత చేసి మసాలా మిశ్రమం బాగా విడివిడిలాడేవరకు వేయించాలి
రెండు నిమిషాలయ్యాక ఉడికించిన చికెన్ ముక్కలు వేసి కలిపి ఐదు నిమిషాలయ్యాక దింపాలి.
స్కిన్ లెస్ చికెన్ - అర కేజీ; అల్లంవెల్లుల్లి పేస్ట్ - 2 టీ స్పూన్లు; కారం - టీ స్పూను; నిమ్మరసం - 2 టీ స్పూన్లు; లవంగాలు - 3; ఏలకులు - 2; దాల్చినచెక్క - చిన్న ముక్క; పసుపు - పావు టీ స్పూను; ఉల్లిపాయ పేస్ట్ - అరకప్పు; పుదీనా ఆకులు - గుప్పెడు; ఉప్పు - తగినంత; నూనె - 3 టేబుల్ స్పూన్లు; పచ్చి మిర్చి - 3; పేస్ట్ కోసం... జీడిపప్పులు - 10; గసగసాలు - 2 టీ స్పూన్లు; ధనియాలు - 3 టీ స్పూన్లు; జీలకర్ర - టీస్పూను; పేస్ట్ కోసం పైన చెప్పిన పదార్థాలకు తగినన్ని నీళ్లు జత చేసి మిక్సీలో వేసి మెత్తగా చేసి పక్కన ఉంచాలి.
తయారీ:
చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టీ స్పూను కారం, నిమ్మరసం, పసుపు జత చేసి అర గంట సేపు మ్యారినేట్ చేయాలి
మ్యారినేట్ చేసిన చికెన్‌కు తగినన్ని నీళ్లు జత చేసి కుకర్‌లో ఉంచి నాలుగు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి
బాణలిలో నూనె వేసి కాగాక లవంగాలు, ఏలకులు, దాల్చినచెక్క వేసి వేయించాలి
టీ స్పూను అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు వేయించాక అర టీ స్పూను కారం వేసి కలిపి, పుదీనా ఆకులు, ఉల్లిపాయ పేస్ట్ వేసి కలియబెట్టాలి
ఉప్పు జత చేసి మసాలా మిశ్రమం బాగా విడివిడిలాడేవరకు వేయించాలి
రెండు నిమిషాలయ్యాక ఉడికించిన చికెన్ ముక్కలు వేసి కలిపి ఐదు నిమిషాలయ్యాక దింపాలి.


