Carrot Cake - క్యారట్ కేక్
కోడిగుడ్లు - 4; వెజిటబుల్ ఆయిల్ - ఒకటిన్నర కప్పులు; బెల్లం తురుము - 2 కప్పులు; వెనిలా ఎక్స్‌ట్రాక్ట్ - 2 టీ స్పూన్లు; మైదా - 2 కప్పులు; బేకింగ్ సోడా - 2 టీ స్పూన్లు; బేకింగ్ పౌడర్ - 2 టీ స్పూన్లు; ఉప్పు - అర టీ స్పూను; దాల్చినచెక్క పొడి - 2 టీ స్పూన్లు; క్యారట్ తురుము - 3 కప్పులు; వాల్నట్ తురుము - కప్పు; నూనె - అర కప్పు; క్రీమ్ చీజ్ - అర కప్పు; కన్ఫెక్షనరీ సుగర్ - 4 కప్పులు; వెనిలా ఎక్స్‌ట్రాక్ట్ - టీ స్పూను; వాల్నట్ తురుము - కప్పు
తయారీ:
అవెన్‌ను 350 డిగ్రీల దగ్గర ప్రీహీట్ చేయాలి
పెద్ద పాత్రలో కోడిగుడ్లు (తెల్ల సొన మాత్రమే), నూనె, బెల్లం తురుము, 2 టీ స్పూన్ల వెనిలా ఎక్స్‌ట్రాక్ట్ వేసి గిలకొట్టాక, మైదా, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఉప్పు, దాల్చిన చెక్క పొడి వేసి బాగా కలపాలి
క్యారట్ తురుము, వాల్నట్ పొడి జత చేసి మరోమారు కలిపి నూనె రాసి ఉంచుకున్న బేకింగ్ పాన్‌లో ఈ మిశ్రమాన్ని వేసి అవెన్‌లో సుమారు 50 నిమిషాలు బేక్ చేసి బయటకు తీసి పది నిమిషాలు చల్లారనివ్వాలి
ఒక పాత్రలో నూనె, బెల్లం తురుము, టీ స్పూను వెనిలా ఎసెన్స్ వేసి నురుగులా వచ్చేలా గిలక్కొట్టాలి
వాల్నట్ తురుము జత చేసి డీప్ ఫ్రిజ్‌లో ఉంచి తీసేసి, క్యారట్ కేక్ మీద వేసి చల్లగా అందించాలి.
 

