Egg Noodles _ గుడ్డు నూడుల్స్
హాకా నూడుల్స్: పావుకిలో,
క్యారెట్, క్యాప్సికమ్ ముక్కలు: పావుకప్పు చొప్పున, సోయాసాస్: టీస్పూను,
టొమాటోసాస్: 2 టీస్పూన్లు,
పాస్టాసాస్: 2 టీస్పూను,
నిమ్మరసం: అరటీస్పూను,
గుడ్లు: రెండు,
వెల్లుల్లిరెబ్బలు: మూడు,
ఉల్లిపాయ: ఒకటి,
మిరియాలపొడి: అరటీస్పూను,
నూనె: 2 టేబుల్‌స్పూన్లు
తయారుచేసే విధానం
* నీళ్లు మరిగించి నూడుల్స్ ఉడికించి చల్లని నీళ్లతో కడిగి ఉంచాలి.
* బాణలిలో అరటీస్పూను నూనె వేసి గుడ్లసొన, చిటికెడు ఉప్పు, మిరియాలపొడి వేసి బాగా కలుపుతూ పొరటులా వేయించి తీసి పక్కన ఉంచాలి.
* మరో బాణలిలో మిగిలిన నూనె వేసి కాగాక వెల్లుల్లి, ఉల్లిపాయలు వేసి రెండు నిమిషాలు వేయించాలి.
* తరవాత సన్నగా తరిగిన కూరగాయ ముక్కలు వేసి వేయించాలి.
* తరవాత కొద్దిగా నీళ్లు చిలకరించి సోయాసాస్ వేసి కలిపి సిమ్‌లో పెట్టాలి.
* ఇప్పుడు పాస్టా సాస్, టొమాటో సాస్, ఉప్పు, మిరియాలపొడి వేసి బాగా కలపాలి.
* గుడ్డు పొరటును కూడా వేసి బాగా కలపాలి.
* చివరగా ఉడికించి పక్కన ఉంచిన నూడుల్స్ వేసి బాగా కలిపి రెండు నిమిషాలు వేయించాలి.
* తరవాత నిమ్మరసం కలిపి దించాలి.