కావలసిన పదార్థాలు:
బియ్యం - అర కిలో
మినప్పప్పు - 100 గ్రా
శనగపప్పు - 50 గ్రా
ఉప్పు - తగినంత
చీజ్ - 50 గ్రా
పచ్చిమిర్చి - కొన్ని ముక్కలు
తయారీ విధానం:
బియ్యం, పప్పు రాత్రంతా నానబెట్టాలి.
పొద్దున్నే ఉప్పు కలుపుకోవాలి.
పెనం వేడి చేసి ముందుగా నూనె పూసి తర్వాత నీళ్లు చల్లాలి.
పిండిని దోశగా పోసుకోవాలి.
చీజ్, పచ్చిమిర్చి తరుగు పట్టించాలి. నూనె వేసి దోరగా కాల్చి తీయాలి.