Saunf (Variyali) Sharbat - సోపు గింజలతో షర్భత్
నోటిని శుభ్రం చేసుకోవటానికి సోపు గింజలను వాడుతూ ఉంటారు. దీని వల్ల జీర్ణశక్తి బాగా పెరుగుతుందని ఆయిర్వేద నిపుణులు పేర్కొంటూ ఉంటారు.జీర్ణశక్తిని పెంచటంతో పాటుగా, వేసవిలో వేడికి ఇది మందులా పనిచేస్తుందని చాలా మంది భావిస్తారు. ముఖ్యంగా గుజరాత్‌లో సొపుతో చేసి షర్భత్‌కు వేసవిలో చాలా డిమాండ్ ఉంటుంది. ఈ షర్భత్‌ను ఎలా చేయాలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
సొపు గింజలు- పావుకప్పు,
పటిక బెల్లం- రెండున్నర చెంచాలు,
నీళ్లు- రెండున్నర కప్పులు,
లవంగం- ఒకటి.
చేసే విధానం :
సోపు గింజలను, లవంగాన్ని పొడి చేయాలి. ఈ పొడిని కనీసం రెండు గంటలు నీటిలో నానపెట్టాలి. ఆ మిశ్రమాన్ని వడబోసి, సోపుగింజల పొడి ముద్దను వేరు చేయాలి. మిశ్రమంలో పటిక బెల్లం పొడిని కలపాలి. దీనిని ఐస్ క్యూబ్స్‌తో కలిపి సర్వ్ చేయాలి. దీనిలో నిమ్మరసం వేసుకుంటే చాలా బావుంటుంది. కొందరు మిరియాల పొడిని కూడా ఈ మిశ్రమంలో కొద్దిగా కలుపుతారు.