PineApple Chutney _ అనాస పచ్చడి
anAsa pachhaDi
కావలసిన వస్తువులు:
అనాస (ఫైనాపిల్) - 150గ్రాములు,
పచ్చికొబ్బరి తురుము - 100 గ్రాములు,
వెల్లుల్లి రెబ్బలు - 3,
అల్లం - 10 గ్రాములు,
పచ్చిమిర్చి - 3,
పెరుగు - 100 గ్రాములు,
కరివేపాకు - రెండు రెబ్బలు,
ఆవాలు - అర టీ స్పూను,
ఎండుమిర్చి - 2,
కొబ్బరినూనె - 2 టేబుల్ స్పూన్లు.
తయారుచేసే విధానం:
అనాసను నాలుగు పలకల చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. కొబ్బరి, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చిలను కలిపి పేస్టులా చేసుకోవాలి. కడాయిలో కొబ్బరినూనెని వేడిచేసి ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు చిటపటమన్నాక కొబ్బరి పేస్టుని వేసి కొద్ది నిమిషాల పాటు వేగించాక, అనాస ముక్కల్ని వేసి మరో 3 నిమిషాలు ఉంచాలి. దించేముందు పెరుగు కలపాలి.
ఇది తియతియ్యగా, పులపుల్లగా కొత్త రుచిగా ఉంటుంది.