Snacks with Tea - స్నాక్స్ విత్ చాయ్
అసలే
చలికాలం. ఆపై వరుస తుపాన్లు. ఇంకేముంది? మబ్బుపట్టిన ఆకాశంలా నిస్సత్తువగా
మారిపోతున్నాయి శరీరాలు. బయటికి వెళితే వణుకు. మరి దీనికి విరుగుడు? వేడి.
ఏదైనా తిన్నా, తాగినా వెచ్చగా గొంతులోకి దిగితేనే మజా. ఎప్పుడూ తినే వాటి
జోలికి వెళ్లకుండా.. రుచికరమైన మల్టీగ్రెయిన్ డైమండ్ కట్స్, బ్రెడ్
ఫ్రిట్టర్స్, సగ్గుబియ్యం వడలు వంటి స్నాక్స్ వండుకుని.. ఆరెంజ్, యాపిల్,
ఆల్మండ్ ఫ్లేవర్లతో మసాలా చాయ్ కాచుకుని చలికాలాన్ని మస్తు ఎంజాయ్
చేయండి...
యాపిల్దాల్చిన చెక్క టీ
కావలసినవి: యాపిల్ - సగం (సన్నగా తరిగి), చమొమైల్ టీ బ్యాగులు - రెండు, దాల్చినచెక్క - కొద్దిగా.
తయారీ: రెండు కప్పుల నీళ్లను వేడిచేయాలి. ఆ తరువాత గిన్నెను స్టవ్ మీద నుంచి దింపి యాపిల్ తరుగు, టీ బ్యాగ్స్, దాల్చినచెక్క వేసి ఐదు నిమిషాలు నాననివ్వాలి. ఈ టీని వేడివేడిగా తాగితే తాజాగా ఉంటుంది.
సగ్గుబియ్యం వడ
కావలసినవి: సగ్గుబియ్యం - ఒక కప్పు, బంగాళాదుంప (ఉడికించి, పొట్టుతీసి, మెదిపి) - ఒకటి, పల్లీలు (వేగించి, కచ్చాపచ్చాగా చేసి) - అర కప్పు, పచ్చిమిర్చి (చీల్చి) - రెండు, జీలకర్ర - ఒక టీస్పూన్, కొత్తిమీర తరుగు - రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - వేగించడానికి సరిపడా.
తయారీ: సగ్గుబియ్యాన్ని రెండుమూడుసార్లు కడగాలి. సగ్గుబియ్యం మునిగేంత మేర నీళ్లు పోసి ఆరు గంటలు నానపెట్టాలి. వీటిని ఇతర పదార్థాలతో పాటు కలిపి మెత్తటి ముద్దలా చేయాలి. ఆ ముద్దను పన్నెండు భాగాలుగా చేయాలి. ఒక్కో భాగాన్ని గుండ్రంగా చేసి చదునుగా వడల్లా వత్తాలి. వేడి వేడి నూనెలో వీటిని వేసి ఓ మాదిరి మంట మీద బంగారు రంగు వచ్చే వరకు వేగించి నూనె పీల్చే పేపర్ మీద వేయాలి. చలికాలపు సాయంత్రాలకు అద్భుతమైన స్నాక్.
ఆరెంజ్ టీ
కావలసినవి: నీళ్లు - ఏడు కప్పులు, ఆరెంజ్ జ్యూస్ - ఒకటిన్నర కప్పులు, పంచదార - అర కప్పు, నిమ్మరసం - రెండు టేబుల్ స్పూన్లు, ఇన్‌స్టంట్ టీ పొడి - ఐదు టీస్పూన్లు, లవంగాలు - ఒక టీస్పూన్.
తయారీ: పెద్ద గిన్నెలో నీళ్లు పోసి ఆరెంజ్ జ్యూస్, పంచదార, నిమ్మరసం, టీ పొడి వేయాలి. లవంగాలను పలుచటి బట్టలో చుట్టి వేయాలి. సన్నని మంట మీద మూత పెట్టకుండా పావుగంట పాటు ఉడికించాలి. ఆ తరువాత బట్టలో చుట్టిన లవంగాలను బయటకు తీయాలి. ఆరెంజ్ టీని వేడిగా తాగాలి. మిగిలిన దాన్ని గాజు సీసాలో పెట్టి దాయొచ్చు. ఇది ఎనిమిది సర్వింగ్‌లకు పనికొస్తుంది.
ఆల్మండ్ టీ
కావలసినవి: నీళ్లు - ఎనిమిది కప్పులు, పంచదార - ఒకటిన్నర కప్పులు, టీ బ్యాగ్‌లు - రెండు, నిమ్మకాయలు - నాలుగు (రసం తీసి), వెనిల్లా, ఆల్మండ్ ఎక్స్‌ట్రాక్ట్ - ఒక్కో టేబుల్ స్పూన్.
తయారీ: ఆరు కప్పుల నీళ్లలో పంచదార వేసి పది నిమిషాల పాటు వేడిచేయాలి. మరో గిన్నెలో రెండు కప్పుల నీళ్లు పోసి వేడి చేసి అందులో టీ బ్యాగ్‌లు వేయాలి. ఐదు నిమిషాలు నాననివ్వాలి. టీ బ్యాగ్‌లను తీసేసి అందులో ముందు పంచదార తరువాత నిమ్మరసం, వెనిల్లా, ఆల్మండ్ ఎక్స్‌ట్రాక్ట్‌లను కలపాలి. ఈ టీని వేడిగా లేదా చల్లగా ఎలా తాగినా రుచిగా ఉంటుంది.
మల్టీగ్రెయిన్ డైమండ్ కట్స్
కావలసినవి: గోధుమ పిండి - 400 గ్రాములు, శెనగపిండి, రాగి పిండి - ఒక్కోటి 100గ్రాములు, నెయ్యి లేదా వెన్న - పావు కప్పు, పసుపు, నువ్వులు, జీలకర్ర (కచ్చాపచ్చాగా మెదిపి), నల్లమిరియాలు (మెదిపి) - ఒక టీస్పూన్, వాము - పావు టీస్పూన్, పుదీనా తరుగు - గుప్పెడు, కొత్తిమీర కట్ట (తరిగి) - ఒకటి, అల్లం (తురిమి) - కొద్దిగా, పచ్చిమిర్చి (నిలువుగా చీల్చి సన్నగా తరిగి) - ఒకటి, నూనె - వేగించడానికి సరిపడా.
తయారీ: పెద్ద గిన్నెలో అన్ని పిండ్లు పోసి నెయ్యి, ఉప్పు వేసి పొడిపొడిగా కలపాలి. తర్వాత మిగతా పదార్థాలన్నిట్నీ కూడా వేసి నీళ్లతో మెత్తటి ముద్దలా చేయాలి. మూతపెట్టి అరగంటపాటు పక్కనపెట్టాలి. తరువాత కొద్దిగా నెయ్యి లేదా నూనె చేతులకు రాసుకుని మరోసారి కలపాలి. దీన్నుంచి నిమ్మకాయ సైజ్‌లో ఉండలు చేసి చపాతీల్లా వత్తాలి. వీటిని నచ్చిన ఆకారంలో ముక్కలుగా కోయాలి.
కళాయిలో నూనె వేడి చేసి కోసిన ముక్కల్ని బంగారు రంగు వచ్చేవరకు వేగించాలి. పేపర్ టవల్ మీద వేస్తే నూనెను పీల్చుకుంటాయి. బాగా చల్లారిన తరువాత గాలి చొరబడని డబ్బాలో నిల్వచేయాలి. టీ టైంలో తీసుకునే హెల్తీ స్నాక్ ఇది.
బ్రెడ్ ఫ్రిట్టర్స్
కావలసినవి: బ్రెడ్ ముక్కలు - పది, క్యారెట్ తురుము - అర కప్పు, పుల్లటి పెరుగు - పావు కప్పు, కొత్తిమీర తరుగు - రెండు టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చి పేస్ట్ - ఒక టీస్పూన్, శెనగపిండి - అరకప్పు, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - వేగించడానికి సరిపడా.
తయారీ: బ్రెడ్ చుట్టూరా ఉండే భాగాన్ని తీసేయాలి. చేతి వేళ్లతో బ్రెడ్‌ని చిన్న చిన్న ముక్కలుగా చేయాలి. ఇందులో పెరుగు, కొద్దిగా నీళ్లు వేసి పావుగంట నానబెట్టాలి. తరువాత కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్, కారం, శెనగపిండి, ఉప్పు వేసి బాగా కలపాలి. కళాయిలో నూనె వేడిచేసి అందులో ఈ మిశ్రమాన్ని వడల్లా వేసి బంగారు రంగు వచ్చే వరకు వేగించాలి. నూనె పీల్చేందుకు పేపర్ మీద వేయండి. టొమాటో సాస్‌తో కలిపి తింటే బాగుంటాయి.