Ads 468x60px

Pages

Learn English Vocabulary & Help the Poor| |Free Rice |

Varities with Indian gooseberry

Varities with Indian gooseberry / Phyllanthus emblica

Phyllanthus emblica (syn. Emblica officinalis), the Indian gooseberry,or Dhatrik (in Maithili) or amala from Sanskrit amalika, is a deciduous tree of the family Phyllanthaceae. It is known for its edible fruit of the same name.
కార్తీకమాసపు చన్నీటి స్నానాలు చేసి, దేవుడికి నైవేద్యం పెట్టి.. పాయసమో, దద్దోజనమో తిని ఉండడం వల్ల ఈ కాలంలో నోరు పులుపు కోరుకుంటుంటుంది. అందుకే మార్కెట్ నుంచి వస్తూ వస్తూ ఓ నాలుగు పచ్చి ఉసిరికాయలు పట్టుకురండి. ఉసిరితో ఇదివరకెప్పుడూ వండుకోని కొత్తరకం కూరలను ఈ దఫా ట్రై చేయండి... మీ వంటింటిని పోషకాలసిరి ఉసిరితో నింపేయండి..
పాయసం
కావలసినవి: ఉసిరికాయలు - ఐదు, పాలు - రెండు కప్పులు, బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్షలు - ఒక్కోటి పది చొప్పున, యాలక్కాయ పొడి - చిటికెడు, జాజిపొడి - కొద్దిగా, తేనె, నెయ్యి - తగినంత.
తయారీ: ఉసిరికాయల్ని కడిగి ఆవిరికి ఉడికించాలి. తరువాత గింజలు తీసి ముక్కలుగా కోసి వాటిని తేనెలో గంట పాటు నానపెట్టాలి. బాదం, జీడిపప్పుల్ని నీళ్లలో నానపెట్టి మెత్తటి గుజ్జులా చేయాలి. పాలను కాగపెట్టి బాదం, జీడిపప్పుల గుజ్జు, పంచదార వేయాలి. ఇది బాగా ఉడుకుతున్నప్పుడు తే నెలో నానపెట్టిన ఉసిరి ముక్కల్ని వేయాలి. కొన్ని నిమిషాల తరువాత స్టవ్ మీద నుంచి గిన్నె దింపేయాలి. తరువాత యాలక్కాయపొడి, జాజికాయ పొడి వేయాలి. చివర్లో నెయ్యి వేడిచేసి ఎండుద్రాక్షల్ని వేగించి పాయసంలో వేసి బాగా కలిపి తినేయడమే. వగరుగా, పుల్లగా ఉన్న ఉసిరికి పాలు, పంచదార కలవడం వల్ల వచ్చే రుచి మిగతా పాయసాలతో పోలిస్తే కాస్త వెరైటీగా ఉంటుంది.
కూర
కావలసినవి: ఉసిరికాయలు - పావు కిలో, పచ్చిమిర్చి - వందగ్రాములు, నూనె -రెండున్నర టేబుల్‌స్పూన్లు, ఇంగువ - రెండు చిటికెలు, జీలకర్ర, వాము - ఒక్కో చిన్న స్పూన్, పసుపు - కొద్దిగా, సోంపు పొడి- ఒకటిన్నర స్పూన్, ధనియాల పొడి - చిన్న స్పూన్, కారం - పావు టీస్పూన్, ఉప్పు - రుచికి సరిపడా.
తయారీ: ఉసిరికాయల్ని శుభ్రంగా కడిగి గింజలు తీయాలి. పచ్చిమిర్చిని తరగాలి. గిన్నెలో నూనె వేడిచేసి ఇంగువ, జీలకర్ర, వాము వేసి వేగించాలి. అవి వేగాక పసుపు, ధనియాల పొడి, సోంపు పొడి వేసి ఒక నిమిషం తర్వాత ఉసిరి, పచ్చిమిర్చి ముక్కలు, కారం, ఉప్పు వేసి మరో రెండు నిమిషాలు వేగించాలి. ఆ తరువాత మూతపెట్టి సన్నటి మంట మీద ఐదు నిమిషాలు ఉంచాలి. మూత తీసి ఉసిరి ముక్కల్ని గరిటెతో కలిపి సరిగా ఉడికిందో లేదో ముక్కని నొక్కి చూడాలి. ముక్క గట్టిగా ఉంటే మళ్లీ మూతపెట్టి సన్నటి మంటమీద మరో రెండు నిమిషాలు ఉంచాలి. ఈ ఉసిరి కూర పది నుంచి పన్నెండు రోజులు నిల్వ ఉంటుంది. భోజనంతో కలిపి తింటే రుచితో కూడిన ఆరోగ్యం మీ సొంతం.
సాంబార్
కావలసినవి: ఉసిరికాయలు - వందగ్రాములు, కందిపప్పు (ఉడికించి) - ఒక కప్పు, సాంబార్‌పొడి - రెండు టీస్పూన్లు, పసుపు - చిటికెడు, పచ్చిమిర్చి - రెండు, కరివేపాకులు - కొన్ని, ఆవాలు - ఒక టీస్పూన్, ఇంగువ - చిటికెడు, ఉప్పు, నూనె - సరిపడా.
తయారీ: ఉసిరికాయల్ని కడిగి గింజలు తీసి ముక్కలు కోయాలి. పచ్చిమిర్చిని నిలువుగా చీల్చాలి. గిన్నెలో ఒక కప్పు నీళ్లు పోసి ఉసిరి ముక్కల్ని ఉడికించాలి. తరువాత సాంబార్ పొడి, పసుపు, పచ్చిమిర్చి, ఇంగువ, ఉప్పు వేసి ఉడికించాలి. ఉసిరి ముక్కలు ఉడకగానే వాటిని మెత్తగా మెదపాలి. తరువాత ఉడి కించిన కందిపప్పు వేసి మళ్లీ ఉడికించాలి. అన్ని పదార్ధాలు బాగా కలిసిపోయిన తరువాత గిన్నెను స్టవ్ మీద నుంచి కిందకు దింపాలి. తాలింపుకు నూనె వేడిచేసి ఆవాలు, కరివేపాకు వేయాలి. ఆవాలు చిటపటమంటున్నప్పుడు సాంబార్‌లో ఆ తాలింపు వేస్తే ఉసిరి సాంబార్ రెడీ.
పొడి
కావలసినవి: ఉసిరికాయలు - పావు కిలో, జీలకర్ర - రెండు స్పూన్లు, మిరియాలు - అర స్పూన్, శొంఠి - 50 గ్రాములు, ఇంగువ - కొద్దిగా, ఉప్పు - సరిపడా.
తయారీ: ఉసిరికాయల్ని ఎండపెట్టాలి. అవి ఎండిన తరువాత ఉసిరికాయలు, జీలకర్ర, ఇంగువ, శొంఠి, మిరియాలు, ఉప్పుతో కలిపి మిక్సీ పట్టాలి. ఈ ఉసిరి పొడిని వేడివేడి అన్నంలో, నెయ్యి వేసుకుని తింటే కమ్మగా ఉంటుంది.
పకోడి
కావలసినవి: ఉసిరికాయ తురుము - ఒక కప్పు, శెనగపిండి - మూడు టీస్పూన్లు, బియ్యప్పిండి, మొక్కజొన్నపిండి - ఒక్కో టీస్పూన్, ఇంగువ - చిటికెడు, కారం - అర టీస్పూన్, ఉప్పు, నూనె - తగినంత.
తయారీ: శెనగపిండి, బియ్యప్పిండి, మొక్కజొన్నపిండి, ఉసిరి తురుము, ఇంగువ, కారం, ఉప్పులను ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి పకోడి పిండిలా కలపాలి. కళాయిలో నూనె వేడెక్కాక కొంచెం వేసి కరకరలాడేదాకా వేగించుకోవాలి.
Learn English Vocabulary & Help the Poor |Free Rice |
 
google-site-verification: google2463dc209284d38a.html