Ads 468x60px

Pages

Learn English Vocabulary & Help the Poor| |Free Rice |

Honey Dates - హనీ డేట్‌

Honey Dates - హనీ డేట్‌

ఇవి కావాలి:
మైదాపిండి : పావు కేజీ
ఖర్జూరాలు : పావు కేజీ
తేనె  : వంద గ్రా.
నూనె  : తగినంత


ఇలా చేయాలి:
మైదాపిండిని చపాతీ పిండిలా కలిపి కాసేపు నాననివ్వాలి. ఖర్జూరాల్లోని గింజల్ని తీసి పారవేసి.. మిక్సీలో వేసి మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేయాలి. మరోవైపు కలిపి పెట్టుకున్న మైదాపిండిని చతుర్రస్తాకారంలో కాస్త మందంగా వత్తాలి. దీనిపై సరిపడా ఖర్జూరాల ముద్దను తీసుకుని ఒక పక్కన మందంగా వేయాలి. మిగతా భాగంతో ఈ మిశ్రమాన్ని మూసేయాలి. వేలితో నొక్కి అతికించాలి. ఇప్పుడది కజ్జికాయలాగా తయారౌతుంది.
ఇలా మొత్తం పిండినంతటినీ చేసుకుని కనీసం పదినిముషాలపాటు ఆరనిచ్చి, స్లైసుల్లా కోసి నూనెలో వేయించాలి. (ఆరకపోతే నూనెలో వేయగానే స్లైసు విరిగి మిశ్రమం నూనెలో కలిసిపోతుంది కాబట్టి ఆరేలా చూడాలి). ఆపై నూనెలో వేయించిన వాటిని తేనెలో ముంచి తీయాలి. తీపి అంతగా ఇష్టం లేనివారు వేయించిన స్లైసులపై తేనెను కాస్తగా చిలకరించుకుంటే సరిపోతుంది. అంతే హనీడేట్‌ తయార్‌..
Learn English Vocabulary & Help the Poor |Free Rice |
 
google-site-verification: google2463dc209284d38a.html