Cake Varities - వెరైటీలు హట్‘కేక్’లు
కేక్‌లు సాధారణంగా పిండి, చెక్కర, గుడ్లు, వెన్న లేదా నూనెల మిశ్రమాన్ని కలిగి ఉంటారుు. కొన్ని రకాల కేక్‌లకు ద్రవాలు (సాధారణంగా పాలు లేదా నీరు), గుల్లపొడి అంశాలు (ఈస్టు కిణ్వం లేదా బేకింగ్ పొడి) అవసరమవుతారుు. ఎక్కువగా పళ్ల కట్టు, గింజలు లేదా సంగ్రహాలు వంటి రుచికరమైన అంశాలను జోడిస్తారు. ప్రాథమిక దినుసుల కోసం పలు ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నారుు. కేక్‌లను తరచూ పళ్లతో చేసిన పదార్ధాలు లేదా డెజర్ట్ సాస్‌లు (పాస్ట్రీ క్రీవ్గు వంటివి), బటర్ క్రీవ్గుతో చేసిన ఐస్ లేదా ఇతర ఐస్ చేసిన పదార్ధాలతో నింపుతారు. మార్జిపాన్, గొట్టాలతో హద్దులు లేదా చెక్కరతో చేసిన పళ్లతో అలంకరిస్తారు. కేక్ అనేది ఆడంబర పూర్వక ఉత్సవాలు, ప్రత్యేకంగా వివాహాలు, వార్షికోత్సవాలు, పుట్టినరోజుల్లో భోజనాల్లో వడ్డించే డెజర్ట్ పదార్ధంగా చెప్పవచ్చు. ప్రస్తుతం లెక్కలేనన్ని కేక్ వంటకాలు ఉన్నారుు. కొన్ని రొట్టె వంటి పదార్ధాలు, కొన్ని అద్భుతమైన రుచి, అలంకరణలతో అందుబాటులో ఉన్నారుు. పలు రకాలు దశాబ్దాల చరిత్రలను కలిగి ఉన్నారుు. కేక్ తయారీ ప్రస్తుతం క్లిష్టమైన పని కాదు. ఒకానొక కాలంలో కేక్ తయారీ చాలా శ్రమతో కూడిన పనిగా భావించేవారు. ప్రస్తుతం అనుభవం లేనివారు కూడా అద్భుతంగా కేక్ తయారు చేయడానికి వీలుగా బేకింగ్ సామగ్రి, సూచనలు సరళీకృతం చేయబడ్డారుు.ేచాక్లెట్ కేక్ - Chocolate Cake
కావలసిన వస్తువులు
మైదా : 5 స్పూన్లు, చక్కెర : 4 స్పూన్లు, కోకో పౌడర్ : 2 స్పూన్లు, కోడిగుడ్డు : 1, పాలు : 3 స్పూన్లు, నూనె లేదా బటర్ : 2 స్పూన్లు, చాక్లెట్ చిప్స్ : 3 స్పూన్లు, వెనిల్లా ఎసెన్స్ : చిటికెడు, పొడుగాటి పింగాణి మగ్గు.
తయారి విధానం
ఒక గిన్నెలో మైదా, చక్కెర, కోకో పౌడర్ వేసి బాగా కలపండి. ఇందులో గుడ్డు పగలగొట్టి వేయండి. బాగా గిలక్కొట్టాలి. తరవాత పాలు, నూనె వేసి కలపాలి. అన్ని వస్తువులు బాగా గిలక్కొట్టాలి.దీనికోసం ఎలక్ట్రిక్ బీటర్ వాడితే మంచిది. చివర్లో వెనిల్లా ఎసెన్స్, చాక్లెట్ చిప్స్ కలిపి మగ్గులో పోయండి. ఈ మగ్గుని మైక్రోవేవ్ ఓవెన్ లో పెట్టి 1000 పై మూడు నిమిషాలు ఉడికించండి. మగ్గులో మిశ్రమం పొంగి పైకి వస్తుంది. కంగారు పడకండి. కాస్త చల్లారాక ఒక ప్లేట్ పై మగ్గు తిరగేసి మెల్లిగా తడితే కేకు బయటకు వస్తుంది విడిపోకుండా.. ఘమఘుమలాడే, నోరూరించే చాక్లెట్ కప్ కేక్ రెడీ. ఐస్ క్రీమ్ లేదా చాక్లెట్ క్రీమ్‌తో సర్వ్ చేయండి.
వెజ్ కేక్ - Veg Cake
కావలసిన వస్తువులు
పాలు : అర లీటర్, వెన్న : 150 గ్రాములు, వెనిల్లా ఎసెన్స్ : 3 స్పూన్లు, మైదాపిండి : 250 గ్రాములు, పంచదార : 150 గ్రాములు, బేకింగ్ పౌడర్ : 2 టేబుల్ స్పూన్లు.
తయారీ విధానం
పాలు చిక్కగా మరిగించి ఆరబెట్టాలి. జల్లించిన మైదాపిండిలో బేకింగ్ పౌడర్, పంచదార పొడి, వెనిల్లా ఎసెన్స్, వెన్న, చిక్కటి పాలు పోసి బాగా కలియదిప్పాలి. ఈ మిశ్రమాన్ని ఓవెన్ లో పెట్టి ఉడికించాలి. లేదా కేక్‌బాక్సులో పోసి సన్నసెగమీద ఉడికించాలి.
బంగాళాదుంప కేక్ - Potato Cake
కావలసిన పదార్థాలు
బంగాళదుంప తరుము : 3 కప్పులు, ఉల్లిపాయ తురుము : కప్పు, మైదా : కప్పు, గుడ్డు: 1, మిరియాలపొడి : 1/2 స్పూన్, పంచదార : 1/2 స్పూన్, ఉప్పు : రుచికి తగినంత, దాల్చిన చెక్క : చిన్న ముక్క, పాలు : ప్పు, నూనె : కావలసినంత, బేకింగ్ పౌడర్ : 1/2 స్పూన్, బేకింగ్ సోడా : ఒక చిటికెడ్ (కావాలనుకుంటే).
తయారీ విధానం
ముందుగా తురిమి పెట్టుకున్న ఆలు, ఉల్లిపాయలను కలిపి విడిగా పెట్టుకోవాలి. ఆలూను తురిమిన వెంటనే నీళ్ళలో వేస్తే రంగు మారదు. ఒక బౌల్‌లో మైదా, ఉప్పు, మిరియాల పొడి, దాల్చిన చెక్కముక్కలు, గుడ్డు, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడాలను కలుపుకోవాలి. అందులో కలిపి పెట్టుకున్న ఆలు, ఉల్లి తురుమును కలిపి అందులో జారుగా వచ్చేలా తగినన్ని నీళ్ళు కానీ పాలు కానీ పోసి కలుపుకోవాలి. గరిట జారుగా కలుపుకున్న పిండిని ఎక్కువగా కలపకుండా ఉంటేనే మంచిది. స్టౌ మీద పాన్ పెట్టి వేడెక్కిన తరువాత దానిపై కాస్త నూనె పోసి పాన్ అంతా అంటేలా గరిటతో తిప్పాలి. తర్వాత ఒక కపెద్ద గరిటెడు పిండిని తీసుకుని దోశలకు పోసినట్టుగా పోయాలి. రెండు నిమిషాలపాటు దానిని ఉడకనిచ్చి రెండో వైపుకి తిప్పాలి. ఆ వైపు కూడా అలాగే కాలే దాకా ఉంచాలి. దీనిని టమేటో కెచప్ తో కానీ జామ్ తో కానీ చట్నీతో కానీ దేనితోనైనా తినవచ్చు. కొబ్బరి చట్నీ అయితే మహా అద్బుతంగా ఉంటుంది.
కొబ్బరి కేక్ - Coconut Cake
కావలసిన వస్తువులు
మైదా : 30 గ్రా, కొబ్బరి : సగం చెక్క, పంచదార : 20 గ్రా
గుడ్లు : రెండు, పాలు : అర కప్పు, వెన్న : 20 గ్రా, చేర్రీస్ : ఐదు, బేకింగ్ పౌడర్ : పావు టీ స్పూన్.
తయారీ విధానం
ఒక గిన్నెలో వెన్న, పంచదారపొడి కలియబెట్టి మిశ్రమం లా తయారు చేయండి. ఇందులో పాలు, జల్లించిన మైదా, బేకింగ్ పౌడర్, బీట్ చేసిన గుడ్ల మిశ్రమాన్ని కలపండి. ఆ పైన తురిమిన కొబ్బరి వేసి కలపండి. కప్పులకు వెన్నగాని, నెయ్యి గాని పూసి కొబ్బరి కలిపిన మిశ్రమాన్ని పోయండి. దీనిపైన చేర్రీస్ పెట్టండి. వీటిని ఓవెన్‌లో నూట ఎనభై డిగ్రీల దగ్గర ఇరవై నిమిషాలు కుక్ చేయండి. ఓవెన్ లేకపోతే కుక్కేర్‌లో ఇసుక పోసి, దాని పైన కప్పుల్ని ఉంచి-గాస్ కట్ లేకుండా మూత పెట్టి స్టవ్ మీద అరగంట సేపు కుక్ చేస్తే కొబ్బరి కేక్ రెడీ.
ప్లమ్ కేక్ - Plum Cake
కావలసిన వస్తువులు
మిల్క్ మెయిడ్ : 1 టిన్ను, మైదా : 200 గ్రాములు, వెన్న : 100 గ్రాములు, బేకింగ్ పౌడర్ : స్పూన్, వంట సోడా : 1/2 స్పూన్, బిస్లెరి సోడా : 125 ఎంఎల్, డ్రై ఫ్రూట్స్ కాజు, బాదాం, అక్రోట్, టూటీ ఫ్రూటీ, కిస్మిస్) : 150 గ్రాములు, పంచదార : 6 స్పూన్, కోకో పౌడర్ : 2 స్పూన్, నీళ్లు : 50 ఎంఎల్.
తయారీ విధానం
కేకు చేసే టిన్నులోపల భాగమంతా వెన్న రాసి కొద్దిగా మైదా పిండి చల్లి గిన్నె అంతా పరిచేలా కదపాలి. ఒక గిన్నెలో పంచదార కరిగించి ఎర్రగా అయ్యాక అందులో పావు కప్పు నీళ్లు కలిపి క్యారమెల్ సిరప్ చేసి పెట్టుకోవాలి. మైదా పిండిలో వంట సోడా, బేకింగ్ పౌడర్, కోకో పౌడర్ వేసి రెండు సార్లు జల్లించాలి. వెడల్పాటి గిన్నెలో వెన్న కరిగించి మిల్క్ మెయిడ్ వేసి బాగా కలపాలి. ఇందులో బిస్లెరి సోడా, మైదా పిండి మార్చి మార్చి వేస్తూ బాగా కలపాలి. చివర్లో క్యారమెల్ సిరప్, సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలపాలి. వెన్న రాసి పెట్టుకున్న కేకు టిన్నులో ఈ మిశ్రమం వేసి సమానంగా సర్దాలి. ఒవెన్ 180 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద వేడి చేసి ఈ కేకు మిశ్రమాన్ని పెట్టి ముప్పావుగంట బేక్ చేయాలి. కేకులో సన్నపుల్ల గుచ్చితే అది పిండి అంటుకోకుండా బయటకు వస్తే కేకు పూర్తిగా ఉడికినట్టే. అప్పుడు ఓవెన్ నుండి తీసేయొచ్చు.