Ads 468x60px

Pages

Learn English Vocabulary & Help the Poor| |Free Rice |

Greengram Varities - పెసర రుచులు

Greengram Varities - పెసర రుచులు

కావలసిన పదార్థాలు
పెసలు : 2 కప్పులు, అల్లం, పచ్చిమిరప : తగినంత, ఉల్లి తరుగు : అర కప్పు, ఉప్పు : తగినంత, నూనె : వేయించడానికి సరిపడా.

తయారు చేయు విధానం
ముందుగా పెసలు నానపెట్టి అందులో అల్లం, పచ్చిమిరప వేసి కొంచెం ఉప్పు వేసి ముద్దగా నూరి ఒక గిన్నెలోకి తీసుకొని అందులో ఉల్లి తరుగు వేసి పక్కన పెట్టాలి. తరువాత నూనె వేడిచేసి చిన్న మంట పెట్టి చిన్న చిన్న వడలుగా తట్టి నూనెలో వేయించాలి. ఇవి వేడిగా తింటే చాల బావుంటాయి. దీనిలో మంచి పోషకాలు ఎక్కువుగా ఉంటాయి.

మొటకెత్తిన పెసలు సలాడ్‌
కావలసిన పదార్థాలు

మొలకెత్తిన పెసలు : కప్‌, కేరట్‌ : ఒకటి, ఉల్లిపాయ : ఒకటి, నిమ్మ రసం : రెండు చెంచాలు, ఉప్పు, మిరియాల పౌడర్‌ : తగినంత, పచ్చిమిర్చి : రెండు, చాట్‌ మసాల : చెంచా, జీలకర్ర : అర చెంచా, ఆవాలు : అర చెంచా, ఇంగువ : కొంచం, కరివేపాకు : కొంచం.

తయారు చేయు విధానం
పెసలు ముందు రోజు నానబెట్టిన తీసుకోవాలి. పచ్చిమిర్చి పేస్టు చేసుకోవాలి. ఒక పాన్‌లో ఆయిల్‌ వేసి అందులో జీలకర్ర, ఆవాలు, ఇంగువ వేసి, అందులో పచ్చిమిర్చి పేస్టు వేసి వేయించి కరివేపాకు, నానపెట్టిన పెసలు, తురిమిన కారట్‌, తురిమిన ఉల్లిపాయ వేసి బాగా కలిపి కొంచం ఉప్పు, చాట్‌ మసాల, మిరియాల పొడి, నిమ్మరసం వేసి బాగా కలిపి ఒక బౌల్‌ లోకి తీసుకోవాలి. పైన కొంచెం కొత్తిమీర చల్ల్లితే తినడానికి బాగుంటుంది.

పెసర సమోసాలు
కావలసిన పదార్థాలు

మైదా : 2 కప్పులు, ఉప్పు : రుచికి తగినంత, జీలకర్ర : స్పూన్‌, నెయ్యి : స్పూన్‌, పెసరపప్పు : కప్పు, బంగాళా దుంపలు : 3, పచ్చి మిర్చిలు : 5, అల్లం పేస్ట్‌ : స్పూన్‌, , పసుపు : చిటికెడు, ఛాట్‌ మసాలా : అర స్పూన్‌, చింత పండు పులుసు : కొద్దిగా, కొత్తిమీర తరుగు : కొద్దిగా, నూనె : వేయించేందుకు తగినంత.

తయారు చేయు విధానం
ముందుగా కాసింత ఉప్పు వేసి మైదాను చపాతి పిండిలా కలుపుకుని నానబెట్టండి. పెసరపప్పు, బంగాళా దుంపలు వేర్వేరుగా ఉడికించుకున్నాక అందులో పచ్చి మిర్చి, ఛాట్‌ మసాలా, చింత పండు పులుసు, అల్లం పేస్ట్టు, పసుపు, కొత్తిమీర తరుగు వేసి స్టఫింగ్‌ తయారు చేసుకోండి. ఇప్పుడు నానబెట్టిన మైదా పిండిని పూరీలలా వత్తి సగానికి కట్‌ చేసి...దానిని ట్రయాంగిల్‌ షేప్‌లో చుడుతూ మధ్యలో స్టఫింగ్‌ని పెట్టి సమోసాలు రెడీ చేయండి. స్టౌపై బాణాలి పెట్టి నూనె వేసి మరిగించండి. ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్న సమోసాలు గోధమ రంగు వచ్చే దోరగా వేయించి, నచ్చిన చట్నితో పిల్లలకి ఇవ్వండి.

పాయసం
కావలసిన పదార్థాలు

పెసర పప్పు : కప్‌, పాలు : 3 కప్స్‌, బెల్లం : కప్‌, జీడిపప్పు : 10, ఏలకుల పొడి : 1/2 స్పూన్‌, నెయ్యి : 2 స్పూన్స్‌.

తయారు చేయు విధానం
బానలిలో స్పూన్‌ నెయ్యి వేసి జీడిపప్పు వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే బానలిలో కొంచం నెయ్యి వేసి, పెసర పప్పు వేసి దోరగా వేయించాలి. తరువాత పాలు వేసి పెసర పప్పు బాగా మెత్తగా ఉడకనివ్వాలి. మెత్తగా పెసర పప్పు ఉడికినాక, బెల్లం కూడా వేసి బాగా ఉడకనివ్వాలి. బెల్లం, పాలు, పెసర పప్పు బాగా ఉడికి క్రీం లా తయారవుతుంది. తరువాత ఏలకుల పొడి, వేయించిన జీడిపప్పు వేసి బాగా కలిపి స్టవ్‌ ఆఫ్‌ చేయాలి. ఎంతో రుచిగా ఉండే పెసర పప్పు పాయసం రెడీ.

మొలకల దోశ
కావలసిన పదార్థాలు

పెసలు: 1/2 కప్పు, శనగలు:1/2 కప్పు, రాజ్‌మా: 1/2 కప్పు, పచ్చిబఠాణీలు: 1/2 కప్పు, ఎండు బఠాణీలు: 1/2 కప్పు, బియ్యంపిండి : కప్పు, పచ్చిమిర్చి: 4-6, ఉల్లిపాయ తరుగు : కప్పు, జీలకర్ర : 2 స్పూన్లు, అల్లం : చిన్న ముక్క, ఉప్పు : రుచికి సరిపడా, నూనె : తగినంత.

తయారు చేయు విధానం
ముందుగా పెసలు, శనగలు, రాజ్‌మా, బఠాణీలను శుభ్రంగా కడిగి నానబెట్టాలి. తరువాత వాటన్నిటినీ మందపాటి వస్త్రంలో తీసుకుని మూటకట్టాలి. మర్నాటికి మొలకలు వస్తాయి. వాటిలో పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, ఉల్లి, తరుగు కలిపి మిక్సీలో వేసి దోసెపిండిలా రుబ్బుకోవాలి. తర్వాత స్టౌ మీద దోసె పాన్‌ పెట్టి పిండితో దోసె వేసుకోవాలి. బంగారు వర్ణంలోకి వచ్చాక మధ్యలో ఉల్లిపాయ ముక్కలు వేసి దించేస్తే మొలకల దోసె రెడీ...

మొలకల పులావ్‌
కావలసిన పదార్థాలు

మాత్‌ బీన్స్‌ : అర కప్పు(మొలకకట్టినవి), ముడి పెసళ్లు : అర కప్పు(మొలకొచ్చినవి, ఉడించుకోవాలి), బ్రౌన్‌ బియ్యం : 2 కప్పులు (అన్నం వండుకోవాలి), కాప్సికమ్‌ : కప్పు(చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి), ఫ్రెంచ్‌ బీన్స్‌ : 4 (చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి), టమోటాలు : 2 (చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి), ఉల్లిపాయ : ఒకటి (సన్నగా, చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి), అల్లం : 1 (చిన్న ముక్కలుగా తరిగుకోవాలి లేదా కచాపచా దంచి పెట్టుకోవాలి), వెల్లుల్లి పాయలు : 3-4 (చిన్న ముక్కలుగా తరిగుకోవాలి లేదా కచాపచా దంచి పెట్టుకోవాలి), పసుపు : స్పూన్‌, జీలకర్ర పొడి : స్పూన్‌, కారం : అర స్పూన్‌, ధనియాలపొడి : అర స్పూన్‌, ఉప్పు : రుచికి సరిపడా.

తయారు చేము విధానం
ముందుగా పాన్‌లో నూనె వేసి వేడిచేయాలి. తర్వాత అందులో జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత, అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి 5నిముషాలు మీడియం మంట మీద ఉడికించుకోవాలి. తర్వాత అల్లం, వెల్లుల్లి ముక్కలు వేసి 2 నిమిషాలు వేగించుకోవాలి. ఇప్పుడు అందులోనే చిన్న ముక్కలుగా కట్‌ చేసి పెట్టుకొన్ని ఫ్రెంచ్‌ బీన్స్‌, క్యాప్సికమ్‌, ఉప్పు వేసి వేగించాలి. తర్వాత టమోటోలు, పసుపు, జీలకర్రపొడి, ధనియాల పొడి, కారం వేసి మీడియం మంట మీద వేగిస్తూ, ఉడికించుకోవాలి. టమోటో మెత్తబడ్డాక అందులో మొలకలు మరియు ముడి పెసలు వేసి బాగా మిక్స్‌ చేసి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత అందులో ముందుగా వండి పెట్టుకొన్న బ్రౌన్‌ రైస్‌ అన్నం ను కూడా వేసి మిక్స్‌ చేయాలి. టేస్ట్‌కు సరిపడా ఉప్పు చేర్చాలి. తిరిగా బాగా మిక్స్‌ చేయాలి. మిక్స్‌ చేసిన తర్వాత స్టౌ ఆఫ్‌ చేసి వేడివేడిగా సర్వ్‌ చేయాలి.

పెసర మసాలా
కావలసిన పదార్థాలు

ముడిపెసలు : 1, ఉల్లిపాయలు : 2, పచ్చిమిర్చి : 2, టమోటా : 2, బంగాళా దుంపలు: 2, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ : 2, గరంమసాలా: 1, కారం: 1, నూనె: సరిపడా, పసుపు: 1/2, ఉప్పు : రుచికి సరిపడా, కొత్తిమీర తరుగు: 2.

తయారు చేయు విధానం
ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మిక్సి లో వేసుకొని గ్రైండ్‌ చేసుకోవాలి. తర్వాత బంగాళా దుంపలు ఉడకపెట్టి పైన తొక్క తీసి తురిమి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌ మీద పాన్‌ పెట్టి అందులో నూనె వేసి ఒక నిమిషం తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ పేస్ట్‌ వేసి పచ్చి వాసన పోయేవరకు వేగనిచ్చి అందులో టమేటా వేసి బాగా మగ్గనివ్వాలి. తరువాత అల్లం వెల్లుల్లి, ఉప్పు, పసుపు, కారం కూడా వేసి కొద్దిగా వేగనిచ్చి ముడిపెసలు, తరుమి పెట్టుకొన్న బంగాళా దుంపలు వేసి ఒక గ్లాస్‌ నీరు పోసి మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. పెసలు ఉడికాక అందులో గరంమసాలా వేసి భాగా కలిపి ఒక పదినిమిషాలు ఉడకనిచ్చి, కొత్తిమీర వేసుకొని స్టౌ ఆఫ్‌ చేయాలి. ఇది సాయంత్రం పూట స్నాక్‌ గా కూడా సర్వ్‌ చెయ్యొచ్చు.
Learn English Vocabulary & Help the Poor |Free Rice |
 
google-site-verification: google2463dc209284d38a.html