Ads 468x60px

Pages

Learn English Vocabulary & Help the Poor| |Free Rice |

Noodles - Childrens Special

Noodles - Childrens Special

పిల్లకు ప్రియం - నూడుల్స్‌

చికెన్‌ నూడుల్స్‌ - Chicken Noodles
కావలసిన పదార్థాలు

చికెన్‌ : పావు కేజీ, నూడుల్స్‌ : రెండు ప్యాకెట్లు, ఉల్లికాడలు : ఒక కట్ట, క్యాప్సికం : ఒకటి, ఉప్పు : తగినంత, మిరియాలపొడి : ఒక టీ, అజినమోటో : అర టీ, మొలకెత్తిన పెసలు : అర కప్పు, సోయాసాస్‌ : రెండు టీ, నూనె : తగినంత.

తయారీ విధానం
చికెన్‌ ముక్కలను ఉడికించాలి. నూడుల్స్‌ను ఉడికించి, నీటిని వార్చేసి కొద్దిగా నూనె కలిపి ప్రక్కన ఉంచాలి. ఉల్లికాడలను తరిగి, క్యాప్సికంు్న పెద్ద పెద్ద ముక్కలుగా చేయాలి. పాన్‌లో నూనె వేడిచేసి.. క్యాప్సికం, ఉల్లికాడలు, ఉప్పు, మిరియాలపొడి, అజినమోటో, వేగి కాసేపు వేయించాలి. తరువాత అందులోనే మొలకెత్తిన పెసలు, చికెన్‌ ముక్కలను వేసి బాగా వేయించాలి. చివరగా ఉడికించిన నూడుల్స్‌, సోయాసాస్‌ వేసి బాగా కలియబెట్టి మరో ఐదు నిమిషాలపాటు ఉడికించి దించి, వేడి వేడిగా సర్వ్‌ చేయాలి. అంతే ఘుమఘుమలాడే చికెన్‌ నూడుల్స్‌ రెడీ అయినట్లే...!

ఎగ్‌ నూడుల్స్‌ - Egg Noodles
కావలసిన పదార్థాలు

నూడుల్స్‌ : 500 గ్రా, గుడ్లు : 2, కాబేజీ : 1/2 కప్పు (తరిగింది), క్యారెట్‌ : 1/2 కప్పు (తరిగింది), కాప్సికమ్‌ : 1/2 కప్పు (తరిగింది), మష్రూమ్స్‌ : 1/2 కప్పు (తరిగింది), ఉల్లికాడలు : 1/2 కప్పు (తరిగింది), అల్లం : స్పూన్‌ (పేస్ట్‌), వెల్లుల్లి : స్పూన్‌ (పేస్ట్‌), మిరపకాయ : 1, మిరియాల పొడి : 1 స్పూన్‌, కారం : స్పూన్‌, చిల్లీ సాస్‌ : స్పూన్‌, సోయా సాస్‌ : 1/2 స్పూన్‌, నూనె : 2 స్పూన్లు, ఉప్పు : తగినంత.

తయారీ విధానం
పొయ్యి మీద బాణలి పెట్టి అందులో నీళ్లు పోసి, తగినంత ఉప్పు వేసి మరిగించాలి. నీరు మరుగుతున్నప్పుడు నూడుల్స్‌ అందులో వేసి ఒక ఐదారు నిమిషాల పాటు ఉడికించాలి. అవి మౄఎదువుగా అయిన తర్వాత బయట కు తీసి ఒక చిల్లుల బుట్టలో వేసి నీరంతా బయటకు పోయేలా చేసి పక్కన పెట్టుకోవాలి. మరొక బాణలి తీసుకొని అందులో కాస్త నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ అందులో వేయాలి. తర్వాత క్యారెట్‌ తురుము, క్యాబే జి, కాప్సికమ్‌, మష్రూమ్స్‌ అన్నీ వేసి దోరగా వేగనివ్వాలి. అందులో వండిన నూడుల్స్‌ వేసి ఒక నిమిషం పాటు వేగనివ్వాలి. ఇప్పుడు అందులో సోయా సాస్‌, చిల్లీ సాస్‌ వేసి బాగా కలిపి మరొక నిమిషం లేదా రెండు నిమిషాలు ఉడకనివ్వాలి.ఒక బౌల్‌ తీసుకుని అందులో గుడ్లు కొట్టుకోవాలి. బాణలి తీసుకొని అందులో కొంచెం నూనె వేసి ఈ గుడ్లను అందులో వేయాలి. గుడ్ల సొన ఉండచుట్టుకోకుండా బాగా కలపాలి. తర్వాత అందులో ఉప్పు, కారం, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు దీనిని నూడుల్స్‌లో కలిపి సర్వ్‌ చేయడమే. గుడ్లు ఇష్టం లేని వారికి ఈ పొరటును కలపకుండా సర్వ్‌ చేయవచ్చు.

ప్రాన్స్‌ నూడుల్స్‌ - Prawns Noodles
కావలసిన పదార్థాలు

నూడుల్స్‌ : 250 గ్రాములు, చికెన్‌ : 100 గ్రాములు, ప్రాన్స్‌ : 100 గ్రాములు, ఉల్లిపొరక : కప్పు, వెల్లుల్లి : 4, నూనె : 3 టీ స్పూన్స్‌, సోయాసాస్‌ : 2 టీ స్పూన్స్‌, ఆయిస్టర్‌ సాస్‌ : టీ స్పూన్‌, చక్కెర : టీ స్పూన్‌, మిరియాలపొడి : 1/4 టీ స్పూన్‌, ఉప్పు : తగినంత, పండు మిర్చి : 2.

తయారీ విదానం
ఒక గిన్నెలో 2 లీటర్ల నీళ్లు మరిగించి నూడుల్స్‌ వేయాలి. అవి ముప్పావు వంతు ఉడికిన తర్వాత తీసి జల్లెట్లో వేసి వెంటనే దాని మీద చల్లటి నీళ్లు పోయాలి. దానివల్ల నూడుల్స్‌ ఇంకా ఉడికి మెత్తబడకుండా ఉంటాయి. చికెన్‌, రొయ్యలు కూడా సగం ఉడికించి పెట్టుకోవాలి. ప్యాన్‌లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన వెల్లుల్లి వేసి దోరగా వేయించాలి. తర్వాత ఉడికించి చిన్నగా కట్‌ చేసుకున్న చికెన్‌ ముక్కలు, రొయ్యలు వేసి మరో రెండు నిమిషాలు పెద్దమంట మీద వేయించాలి. ఇందులో సోయా సాస్‌, ఆయిస్టర్‌ సాస్‌ వేయాలి. కొంచం వేగిన తర్వాత నూడుల్స్‌ వేసి కలపాలి. తర్వాత ఇందులో తగినంత ఉప్పు, మిరియాలపొడి, పండు మిర్చి ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపొరక వేసి రెండు నిమిషాలు వేపి దింపేయాలి.

వెజ్‌ నూడిల్స్‌ - Veg Noodles
కావలసిన పదార్థాలు

రెడీమేడ్‌ నూడుల్స్‌ : 1, పచ్చిబఠాణీ: 1/2(ఉడికించినవి), బంగాళాదుంప: 2(ఉడికించినవి), కాలీఫ్లవర్‌, క్యారెట్‌ తరుగు : 1/4, ఉల్లిపాయ : 1, వెల్లుల్లి రెబ్బలు : 2-4, అల్లం : చిన్నముక్క, పచ్చిమిర్చి: 2-4, టమాటా ముక్కలు : 1/4, ఉప్పు: రుచికి తగినంత, టమోటో సాస్‌: 2, సోయాసాస్‌: 2.

తయారీ విధానం
మొదటగా స్టౌ మీద చిన్న గిన్నెలో నీళ్లు పోసి అందులో ఉప్పు వేసి అందులో నూడుల్స్‌లను ఉడికించాలి. అర్థం ఉడికిన తర్వాత నీళ్లు వడగట్టి నూడుల్స్‌ ప్రక్కన తీసి పెట్టుకోవాలి. తర్వాత పాన్‌లో నూనె వేసి వేడి అయ్యాక అందులో ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, వేసి దోరగా వేయించాలి. కొద్దిసేపటి తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి వేయించాలి. ఇప్పడు టామోటాలు ముక్కలు ఉడికిన తర్వాత కూరగాయ ముక్కలన్నీ వేసి ఉప్పు కూడా వేసి మూతపెట్టాలి. అవి వేగిన తర్వాత నూడుల్స్‌ వేసి వేయించాలి. చివరగా ఒక టీస్పూన్‌ సోయాసాస్‌ కూడా వేసి వేయించి టమాట్‌ సాస్‌ తో వేడివేడిగా సర్వ్‌ చేయాలి. అంతే వెరైటీ వెజ్‌ నూడిల్స్‌ రెడీ.
Learn English Vocabulary & Help the Poor |Free Rice |
 
google-site-verification: google2463dc209284d38a.html