Tomato Times - టొమాటో టైమ్స్
ఏ కూర వండాలన్నా జతగా టొమాటో ఉండాల్సిందే!టొమాటో వంటింట్లో ఉంటే ఏ కూరలూ లేవన్న చింతే ఉండదు.
బటర్‌తోనూ, చికెన్‌తోనూ, ప్రాన్స్‌తోనూ ...
టొమాటోను జత చేస్తే ఆ రోజు టేస్టీ డే అయినట్టే...
టొమాటో రుచులు సిద్ధం చేయండి.
ఇంటిల్లిపాదికీ విందు ఇవ్వండి.
స్టఫ్డ్ టొమాటో
టొమాటోలు - 6,
పనీరు తురుము - 150 గ్రా.
ఉల్లిపాయ - 1 (సన్నగా తరగాలి)
కొత్తిమీర తరుగు - టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి - 2 (సన్నగా తరగాలి)
ఉప్పు, కారం - తగినంత
గరంమసాలా - అర టీ స్పూన్
పసుపు - అర టీ స్పూన్
చీజ్ తురుము - టేబుల్ స్పూన్
నూనె - టేబుల్ స్పూన్
తయారి:
టొమాటోలను శుభ్రపరిచి, క్లాత్‌తో తడిలేకుండా తుడవాలి.
టొమాటో పై భాగంలో క్యాప్‌లాగ కట్ చేయాలి.
స్టౌ మీద కడాయి పెట్టి, నూనె వేసి, వేడయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి.
టొమాటోను కట్ చేసిన పై ముక్కను తరిగి, పేస్ట్ చేసిన మిశ్రమాన్ని ఇందులో కలిపి, ఉడికించాలి.
పనీర్ తురుము వేసి మరో నిమిషం ఉడికించాలి.
టొమాటో కప్పులను ఈ మిశ్రమంతో నింపాలి.
పైన చీజ్ తురుము, కొత్తిమీర తరుగు వేయాలి.
{పెజర్ కుకర్ పాన్‌లో బటర్ వేసి, కరిగాక టొమాటో కప్పులను అందులో ఉంచి, ఉడికించి, దించాలి. (అవెన్‌లో అయితే 200 డిగ్రీ సెంటీగ్రేడ్‌లో 20 నిమిషాలు బేక్ చేయాలి)
స్టఫ్డ్ పనీర్ టొమాటో వేడి వేడిగా తింటే రుచిగా ఉంటుంది.
క్రీమ్ టొమాటో సూప్
టొమాటోలు - 4, పుదీనా ఆకులు - కొన్ని
ఉప్పు - తగినంత
మిరియాల పొడి - తగినంత, క్రీమ్ - గార్నిష్‌కి తగినంత
కొత్తిమీర తరుగు - కొద్దిగా
ఆలివ్ ఆయిల్ - అర టీ స్పూన్
తయారి:
టొమాటోలను శుభ్రపరిచి, తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి.
దీంట్లో పుదీనా, ఉప్పు వేసి మరో పది నిముషాలు ఉడికించి, చల్లారనివ్వాలి.
ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్‌లో వేసి బ్లెండ్ చేయాలి.
బ్లెండ్ చేసిన టొమాటో మిశ్రమాన్ని పెద్ద జల్లిలో వేసి, వడకట్టి, గింజలను తీసేయాలి.
స్టౌ పై కడాయి పెట్టి, ఆలివ్ ఆయిల్ వేసి, వేడయ్యాక, అందులో వడకట్టిన టొమాటో మిశ్రమాన్ని పోసి వేడి చేయాలి. కప్పులో పోసి, పైన మిరియాలపొడి చల్లి, క్రీమ్ వేసి సర్వ్ చేయాలి.
అన్‌గర టంగ్డి
చికెన్ - 2 పెద్ద ముక్కలు, పెరుగు - అర కప్పు,
నిమ్మరసం - టేబుల్ స్పూన్, గరం మసాలా - టీ స్పూన్,
కారం - టీ స్పూన్, ఉప్పు - తనగింత,
టొమాటోలు - 2 (ఉడికించి, పేస్ట్ చేయాలి)
అల్లం వెల్లుల్లి పేస్ట్ - టేబుల్ స్పూన్, ఆరెంజ్ ఫుడ్ కలర్ - కొన్ని చుక్కలు
తయారి:
చికెన్‌ను శుభ్రపరిచి, చాకుతో సన్నని గీతలు పెట్టాలి.
మరొక గిన్నెలో చికెన్, ఉప్పు మినహా కావలసిన పదార్థాలన్నీ కలపాలి.
ఈ మిశ్రమాన్ని చికెన్ ముక్కలకు అన్ని వైపులా పట్టించి, గంటసేపు ఉంచాలి.
ముక్కలకు ఉప్పు రాసి, గ్రిల్ చేయాలి లేదా పాన్ మీద కొద్దిగా నూనె వేసి రెండు వైపులా వేయించాలి.
నిమ్మరసం, చాట్‌మసాలా చల్లి, గుండ్రంగా తరిగిన ఉల్లిపాయలతో సర్వ్ చేయాలి.
బటర్ చికెన్
టొమాటోలు - 400 గ్రా., చికెన్ క్యూబ్స్ - కేజీ,
కారం - ఒకటిన్నర టీ స్పూన్, బిర్యానీ ఆకు తురుము - అర టీ స్పూన్, లవంగాల పొడి, దాల్చినచెక్క పొడి - పావు టీ స్పూన్,
ఏలకులు - 4, బటర్ - 75 గ్రా., కార్న్ నూనె - టేబుల్ స్పూన్,
ఉల్లిపాయల తరుగు - కప్పు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 2 టీ స్పూన్లు,
గరంమసాలా - టీ స్పూన్, ఉప్పు - తగినంత,
కుకింగ్ క్రీమ్ - 4 టేబుల్ స్పూన్లు, పెరుగు - 150 ఎం.ఎల్,
బాదంపప్పు - 50 గ్రా., కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు,
తయారి:
పెరుగు, బాదం పప్పు పేస్ట్, మసాలా పొడులు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, టొమాటోలు, ఉప్పు కలిపి మిక్సర్‌లో బ్లెండ్ చేయాలి.
ఒక గిన్నెలో చికెన్ ముక్కలు, టొమాటో మిశ్రమాన్ని కలపాలి.
పాన్‌ని స్టౌ మీద పెట్టి బటర్ కరిగించాలి. దీంట్లో ఉల్లిపాయలు వేగాక, చికెన్ ముక్కలను పది నిమిషాలు వేయించాలి.
కొత్తిమీర చల్లి, క్రీమ్ వేసి, వేయించి దించాలి.
కొత్తిమీరతో గార్నిష్ చేసి చికెన్ కర్రీని సర్వ్ చేయాలి.
బార్బిక్యూ ప్రాన్స్
టొమాటో పేస్ట్ - 100 గ్రా.
రొయ్యలు - అర కేజీ
వెల్లుల్లి తరుగు - టేబుల్ స్పూన్
నిమ్మరసం - టేబుల్ స్పూన్
ఆలివ్ ఆయిల్ - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి తగినంత
టొమాటో కెచప్ - 100 గ్రా.
తయారి:
టొమాటోలను ఉడికించి, పేస్ట్ చేయాలి.
వెడల్పాటి గిన్నెలో వెల్లుల్లి తరుగు, నిమ్మరసం, ఉప్పు, టొమా టో కెచప్, టొమోటో పేస్ట్ వేసి కలిపి, ఈ మిశ్రమాన్ని రొయ్యలకు పట్టించి, పదిహేను నిమిషాలు ఉంచాలి.
రొయ్యలను సన్నని ఇనుప పుల్లలకు గుచ్చాలి రొయ్యలకు ఆలివ్ ఆయిల్‌ను అప్లై చేస్తూ, ఐదు నిమిషాలు గ్రిల్ చేయాలి.
కొత్తిమీర, నిమ్మకాయ ముక్కల తో గార్నిష్ చేసి, సర్వ్ చేయాలి.

