Just a Minute (JAM) - జస్ట్ ఎ మినిట్...
పొరుగింటి పుల్లకూర కూడా రుచే.సొంతవి తినితిని బోరు కొడుతుంటే ఇరుగు పొరుగు వైపు చూడాల్సిందే...
థాయ్‌లాండ్ నుంచి ఒక వంటకం.
ఇండోనేషియా నుంచి ఇంకొకటి...
చెమటలు కక్కే శ్రమలేకుండా
చిటికెలో రెడీ అయ్యేలా...
చకాచక్ మీ కోసం...
థాయ్ చిల్లీ బసిల్ నూడుల్స్
నూడుల్స్ - 180 గ్రా.
ష్రెడెడ్ క్యాబేజీ - (సన్నగా పొడవుగా కట్ చేయాలి) - 30 గ్రా.
ష్రెడెడ్ క్యారట్స్ - 20 గ్రా.
ఉల్లి చక్రాలు - 20 గ్రా.
క్యాప్సికమ్ చక్రాలు - 20 గ్రా.
వెల్లుల్లి తరుగు - 15 గ్రా.
రిఫైన్డ్ ఆయిల్ - 20 ఎం.ఎల్
తులసి ఆకులు - 15 గ్రా.
మొలకెత్తిన బీన్స్ - 5 గ్రా.
డార్క్ సోయా సాస్ - 10 ఎం.ఎల్.
చైనీస్ క్యాబేజీ - 20 గ్రా.
లైట్ సోయా సాస్ - 15 ఎం.ఎల్
తయారి:
మరుగుతున్న నీటిలో నూడుల్స్‌ని వేసి ఉడికించి, వడకట్టి, చల్లని నీటిలో వేయాలి. నీరంతా పోయేంతవరకు జల్లెడలో వేయాలి. ఉడికించేటప్పుడు కొద్దిగా నూనె వేస్తే, నూడుల్స్ అతుక్కోకుండా ఉంటాయి.
పాన్‌లో నూనె వేసి, వేడయ్యాక తరిగిన వెల్లుల్లి వేయించి, కూరగాయల ముక్కలు, నూడుల్స్ వేసి కలపాలి.
దీంట్లో కొద్దిగా లైట్, డార్క్ సోయాసాస్ వేసి కలపాలి.
చివరగా తులసి ఆకులు వేసి, స్టౌ ఆర్పేయాలి.
మొలకెత్తిన బీన్స్, వేయించిన తులసి ఆకులతో గార్నిష్ చేసి, నూడుల్స్‌ను వేడి వేడిగా సర్వ్ చేయాలి.
నోట్: మాంసాహారులు ఉడికించిన బోన్‌లెస్ చికెన్ ముక్కలు లేదా కోడిగుడ్డు కలుపుకోవచ్చు.
పైనాపిల్ ఫ్రైడ్ రైస్
బాస్మతి రైస్ - 180 గ్రా.
పైనాపిల్ ముక్కలు - 50 గ్రా.
జీడిపప్పు - 15 గ్రా.
కిస్‌మిస్ - 10 గ్రా.
కారం - 10 గ్రా.
ఉప్పు - రుచికితగినంత
ఉల్లికాడల తరుగు - 2 టీ స్పూన్లు
రిఫైన్డ్ ఆయిల్ - 15 ఎం.ఎల్
పండుమిర్చి తరుగు - టీ స్పూన్
వెల్లుల్లి తరుగు - టీ స్పూన్
బీన్స్ తరుగు - 30 గ్రా.
పసుపు - చిటికెడు
తయారి:
బియ్యంలో నీళ్లు పోసి పలుకుగా ఉడికించాలి. చల్లారిన తర్వాత కొద్దిగా నూనె వేసి, అన్నం ఆరబెట్టాలి.
స్టౌమీద కడాయి పెట్టి, పోపుకు తగినంత నూనె వేసి, వేడి చేయాలి.
అందులో వెల్లుల్లి తరుగు, పండుమిర్చి తరుగు, బీన్స్, క్యారట్ తరుగు వేసి కలపాలి. పోపుగింజలు, ఉప్పు, కూరగాయ ముక్కలు, కారం, అన్నం, పసుపు, పైనాపిల్ ముక్కలు వేసి బాగా కలిపి, ప్లేట్‌లోకి తీసుకోవాలి.
వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్, ఉల్లికాడలతో గార్నిష్ చేసి, సర్వ్ చేయాలి.
నోట్: మాంసాహారం ఇష్టపడేవారు ఉడికించిన బోన్‌లెస్ చికెన్ ముక్కలు లేదా గుడ్డును వాడుకోవచ్చు.
క్రిస్పీ కార్న్ కెర్నల్స్
మొక్కజొన్న గింజలు - 80 గ్రా.
ఉల్లిపాయ తరుగు - 20 గ్రా.
పచ్చిమిర్చి తరుగు - 2 టీ స్పూన్లు
మైదా - 15 గ్రా.
కార్న్ ఫ్లోర్ - 10 గ్రా.
రిఫైన్డ్ ఆయిల్ - వేయించడానికి తగినంత
ఉప్పు - తగినంత
నల్లమిరియాలు, కార్న్ పౌడర్ - తగినంత
కొత్తిమీర తరుగు - 2 టీ స్పూన్లు
తయారి:
ఒక వెడల్పాటి పాత్రలో మొక్కజొన్న గింజలు, రిఫైన్డ్ ఫ్లోర్, మొక్కజొన్న పిండి, ఉప్పు, కొద్దిగా నీరు వేసి కలపాలి.
కడాయిలో వేయించడానికి తగినంత నూనె పోసి వేడి చేయాలి. తర్వాత మొక్కజొన్న గింజలను కాగుతున్న నూనెలో వేసి, బంగారువర్ణం వచ్చేంతవరకు వేయించాలి. నూనె పీల్చుకునే పేపర్ టవల్‌లోకి వేయించిన గింజలు వేయాలి.
మరొక పాన్‌లో టేబుల్‌స్పూన్ నూనె వేసి, కాగిన తర్వాత ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి. తర్వాత పోపు గింజలు, వేయించిన మొక్కజొన్న గింజలు, ఉప్పు, నల్ల మిరియాల పొడి, కార్న్ పౌడర్ వేసి కలపాలి.
ప్లేట్‌లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.
ఫ్రైడ్ ఐస్ క్రీమ్
కార్న్ ఫ్లేక్స్ - 30 గ్రా.,
బ్రెడ్ క్రంబ్స్ - 20 గ్రా., వెనిలా లేదా చాకొలెట్ ఐస్‌క్రీమ్ - 1 స్కూప్
చాకొలెట్ సాస్ - 10 ఎం.ఎల్
రిఫైన్డ్ ఆయిల్ - వేయించడానికి తగినంత
తయారి:
ఐస్ క్రీమ్‌ను డీప్ ఫ్రిజ్‌లో ఉంచాలి.
{బెడ్ క్రంబ్స్‌ని పొడి చేయాలి. కార్న్ ఫ్లేక్స్‌ని క్రష్ చేయాలి. డీప్ ఫ్రిజ్‌లో పెట్టిన ఐస్‌క్రీమ్‌ను బయటకు తీసి, బ్రెడ్ క్రంబ్స్ పొడి, కార్న్ ఫ్లేక్స్ దానికి పట్టేలా అద్దాలి.
తర్వాత అరగంట సేపు ఈ ఐస్‌క్రీమ్‌ని ఫ్రిజ్‌లో ఉంచాలి.
కడాయిలో నూనె పోసి, కాగిన తర్వాత, ఫ్రిజ్‌లో ఉంచిన ఐస్‌క్రీమ్ తీసి, నూనెలో వేసి ఒక్క నిముషంలోనే ప్లేట్‌లోకి తీసుకోవాలి.
పుదీనా ఆకు, చాకొలెట్ సాస్‌తో వెంటనే సర్వ్ చేయాలి.
అప్పటికప్పుడు చేసుకునే స్నాక్ ఐటమ్ ఇది. పిల్లలకు వెరైటీగా ఉంటుంది. ఇష్టంగా తింటారు.
టిప్స్:
నిముషానికి మించి ఐస్‌క్రీమ్‌ను ఫ్రై చేయకూడదు.
ఐస్‌క్రీమ్ స్కూప్స్ ఒక్కొక్కటిగానే ఫ్రై చేయాలి.
ఇష్టానుసారం వెనిలా, చాకొలెట్ ఫ్లేవర్స్‌ను కలుపుకోవచ్చు.
ఇండోనేషియా బనానా ఫ్రిటర్స్
అరటిపండ్లు - 4, పంచదార - 30 గ్రా.
మైదా - 100 గ్రా.
మొక్కజొన్న పిండి - 70 గ్రా.
కొబ్బరిపాలు - 120 ఎం.ఎల్
రిఫైన్డ్ ఆయిల్ - వేయించడానికి తగినంత
బటర్ - 30 గ్రా.
తయారి:
వెడల్పాటి బేసిన్‌లో రిఫైన్డ్ ఫోర్ల్, కార్న్ ఫ్లోర్, పంచదార వేసి కలపాలి. ఇందులో కొబ్బరిపాలు, కరిగించిన బటర్ వేసి దోసెపిండిలా కలుపుకోవాలి.
కడాయి స్టౌ మీద పెట్టి, నూనె పోసి కాగనివ్వాలి.
అరటిపండు తొక్క తీసి, పిండి మిశ్రమంలో ముంచి, కాగుతున్న నూనెలో వేయాలి. ముదురు గోధుమవర్ణం వచ్చేవరకు రెండువైపులా వేయించి, బయటకు తీయాలి.
నూనెలో నుంచి తీసిన అరటిపండును పేపర్ టవల్‌లోకి తీసుకోవాలి. అదనపు నూనెను పేపర్ టవల్ పీల్చుకుంటుంది.
పుదీనా ఆకులు, స్కూప్ ఐస్‌క్రీమ్‌తో గార్నిష్ చేసి, సర్వ్ చేయాలి.
నోట్: నచ్చినవారు దాల్చినచెక్క పొడి, పంచదార పొడి చల్లుకోవచ్చు.
డేట్స్ పాన్ కేక్
ఖర్జూరం (గింజ లేనివి) - 50 గ్రా. స్ప్రింగ్ రోల్ షీట్ - 10
కొబ్బరిపాలు - 15 ఎం.ఎల్,
రిఫైన్డ్ ఆయిల్ - తగినంత
కిస్‌మిస్ - 10 గ్రా.
వాల్‌నట్స్ - 25 గ్రా.
తయారి:
ఖర్జూరాలను సన్నగా తరగాలి. దీంట్లో వాల్‌నట్స్‌ను క్రష్ చేసి కలపాలి.
{స్పింగ్ రోల్ షీట్‌ని ఫ్లాట్‌గా పరిచి, ఖర్జూరాల మిశ్రమం వెడల్పుగా సర్దాలి.
స్క్వేర్ షేప్‌లో షీట్‌ను మడవాలి.
వేయించడానికి తగినంత నూనె కడాయిలో పోసి కాగనివ్వాలి. తయారు చేసుకున్న పాన్‌కేక్‌లను కాగుతున్న నూనెలో వేసి, రెండువైపులా వేయించి తీయాలి.
చాకుతో త్రికోణాకారంలో కట్ చేసుకోవాలి.
కిస్‌మిస్, కొబ్బరి, క్రీమ్, సాస్‌తో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.
నోట్: కావలసినన్ని డ్రై నట్స్, డేట్స్ మిక్స్చర్‌ని ఉపయోగించుకోవచ్చు.

