Ads 468x60px

Pages

Learn English Vocabulary & Help the Poor| |Free Rice |

Sea The Taste - సీ... ద టేస్ట్

Sea The Taste - సీ... ద టేస్ట్

చేపలూ రొయ్యలూ లేకపోతే సముద్రానికి మనం అంతగా విలువివ్వనక్కర్లేదు.
చేపలూ రొయ్యలూ సముద్ర పంట.
తనకు తనే పండించి మన వలలకు సిద్ధం చేసే పంట.
తాజా చేపలు దొరికిన వాళ్లు అదృష్టవంతులు. వాటిని రోజూలా కాకుండా కొత్తగా వండటం నేర్చినవాళ్లు భాగ్యమంతులు. ఫిష్‌ను టిక్కా చేసినా ప్రాన్స్‌ను హక్కా చేసినా తుదకు నాలుక మీద చేరే వేళకు యమ్మీ అనిపించాలి.
నిలువెల్లా రుచి కమ్మేయాలి.
సండే ఒక కిలో చేపలు కొనండి.
పోనీ అరకిలో రొయ్యలైనా సరే.
ఉప్పూ... కారం... కాసింత మసాలా... రెండు ముద్దల దూరంలో స్వర్గం. ఎంజాయ్.


ఫిష్ టిక్కా

కావలసినవి:
కొరమీను చేపలు - 250 గ్రా., నిమ్మకాయ - 1, పెరుగు - 100 గ్రా., అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 2 టీ స్పూన్లు, ఆవ నూనె - 2 టీ స్పూన్లు, ఉప్పు - తగినంత, ఆవ పొడి - టీ స్పూన్, వాము - టీ స్పూన్, పండుమిరప పేస్ట్ - 2 టీ స్పూన్లు, శనగపిండి - టీ స్పూన్, గరం మసాలా పొడి - అర టీ స్పూన్, జీలకర్ర పొడి - టీ స్పూన్, చికెన్ బ్రోత్ పౌడర్ (మార్కెట్లో లభిస్తుంది) - 2 టీ స్పూన్లు

తయారి:
చేపలను శభ్రపరిచి, కావలసిన పరిమాణంలో కట్ చేసుకోవాలి. నిమ్మరసం, పెరుగు, అల్లం వెల్లుల్లిపేస్ట్, ఆవనూనె, ఉప్పు, ఆవపొడి, వాము, పండుమిరప పేస్ట్, శనగపిండి, గరం మసాలా, జీలకర్రపొడి, చికెన్ బ్రోత్ పౌడర్.. అన్నీ చేప ముక్కలకు పట్టేలా కలిపి మ్యారినేట్ చేయాలి. పది నిమిషాలు తర్వాత పాన్‌లో కొద్దిగా నూనె వేసి, చేప ముక్కలను రెండు వైపులా గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి. పుదీనా చట్నీతో వేడి వేడిగా వడ్డించాలి.

హక్కా ప్రాన్స్

కావలసినవి:
రొయ్యలు - 250 గ్రా.
కార్న్ ఫ్లోర్ - 30 గ్రా.
మైదా - 30 గ్రా.
పొట్టు తీసిన వెల్లుల్లి - 40 గ్రా.
ఉల్లికాడలు - 20 గ్రా.
డార్క్ సోయా సాస్ - 20 గ్రా.
పచ్చిమిర్చి - 20 గ్రా.
ఎమ్.ఎస్.జి (మోనో సోడియమ్ గల్టమేట్ ఇది మార్కెట్లో లభిస్తుంది) - చిటికెడు
ఉప్పు - తగినంత
పంచదార - టీ స్పూన్
నూనె - 40 మీ.లీ
తెల్ల మిరియాలపొడి - చిటికెడు
రెడ్ చిల్లీ ఆయిల్ (మార్కెట్లో లభిస్తుంది) - 20 మీ.లీ
చికెన్ బ్రోత్ పౌడర్ (మార్కెట్లో లభిస్తుంది) - 2 టీ స్పూన్లు

తయారి:
రొయ్యలను శుభ్రపరుచుకొని, పక్కన ఉంచాలి.

మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు, నీళ్లు కలిపి పిండిని జారుగా కలుపుకోవాలి.

కడాయిలో నూనె పోసి, కాగనివ్వాలి.

రొయ్యలను మైదా పిండిలో ముంచి, కాగుతున్న నూనెలో వేసి, రెండు వైపులా వేయించి, తీయాలి.

విడిగా మరొక పాన్‌లో బటర్ వేసి, వేడయ్యాక.. వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు, ఉల్లికాడలు వేయించాలి.

వేయించిన రొయ్యలను వేగుతున్న బటర్ మిశ్రమంలో వేసి కలిపి, రెండు నిమిషాలు వేయించాలి.

చక్రాలుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, వేయించిన వెల్లుల్లిరెబ్బలతో ఈ హక్కా ప్రాన్స్‌ను వేడి వేడిగా సర్వ్ చేయాలి.

థాయ్ ప్రాన్ కేక్

కావలసినవి:
రొయ్యలు - 300 గ్రా.
పండు మిరప పేస్ట్ - 2 టీ స్పూన్లు
లెమన్ గ్రాస్ - 3 టీ స్పూన్లు
వెల్లుల్లి పేస్ట్ - 3 టీ స్పూన్లు
కారం - 2 టీ స్పూన్లు
నిమ్మరసం - 2 టీ స్పూన్లు
ఉప్పు - 2 టీ స్పూన్లు
ఫిష్ సాస్ - 2 టీ స్పూన్లు
తులసి ఆకులు - 2 టీ స్పూన్లు
నూనె - 2 టీ స్పూన్లు
చిల్లీ ఆయిల్ - 2 టీ స్పూన్లు
ఉల్లికాడలు - 25 గ్రా.
కార్న్ ఫ్లోర్- 30 గ్రా.
అల్లం పేస్ట్ - 2 టీ స్పూన్లు
నిమ్మ ఆకులు - 2

తయారి:
రొయ్యలను శుభ్రపరిచాలి.

చిల్లీపేస్ట్, లెమన్ గ్రాస్, వెల్లుల్లి, కారం, నిమ్మరసం, ఉప్పు, ఫిష్ సాస్, తులసి ఆకులు, చిల్లీ ఆయిల్, ఉల్లికాడలు, కార్న్‌ఫ్లోర్, అల్లం పేస్ట్ రొయ్యలలో వేసి కలపాలి. తర్వాత చిన్న చిన్న ముద్దలు చేసి, చేత్తో అదమాలి. వీటిని నాన్‌స్టిక్ పాన్‌పై కొద్దిగా నూనె వేసి, వేడయ్యాక రెండు వైపులా కాల్చి, తీయాలి.

గార్లిక్ సాస్‌తో తయారు చేసుకున్న థాయ్ ప్రాన్ కేక్‌లను వేడి వేడిగా సర్వ్ చేయాలి.

స్వీట్ సోర్ ఫిష్

కావలసినవి:
కొరమీనులు - 300 గ్రా., పైనాపిల్ - 1, రెడ్/ఎల్లో/గ్రీన్ క్యాప్సికమ్ - 1, ఉప్పు, తగినంత, సోయా సాస్ - 2 టీ స్పూన్లు, నిమ్మరసం - 2 టీ స్పూన్లు, తెల్ల మిరియాల పొడి - టీ స్పూన్, టొమాటో కెచప్ - 5 టీ స్పూన్లు, చెక్క పుల్లలు - 2

తయారి:
చేపలను శుభ్రపరిచి, ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంతే పరిమాణంలో క్యాప్సికమ్, పైనాపిల్ ముక్కలను కూడా కట్ చేసుకోవాలి. చెక్కపుల్లలకు క్యాప్సికమ్, పైనాపిల్, చేప ముక్కలను ఒకదాని తర్వాత ఒకటి గుచ్చాలి. వీటిని సోయాసాస్, వెనిగర్,టొమాటో కెచప్, ఉప్పు, మిరియాలపొడి కలిపిన మిశ్రమంలో అరగంట మ్యారినేట్ చేయాలి. గ్రిల్‌లో లేదా నాన్ స్టిక్ పాన్‌లో చెక్కపుల్లలకు గుచ్చిన ముక్కలను వేయించుకోవాలి. ఫ్రైడ్ రైస్‌తో పాటు వేడి వేడిగా ఈ చేపముక్కలను సర్వ్ చేయాలి.

థాయ్ ఫిష్ కర్రీ

కావలసినవి:
చేపలు- అర కేజీ
టొమాటోలు - 2
చింతపండు - 25 గ్రా.
మామిడికాయ - సగం ముక్క
ఉల్లిపాయ తరుగు - 3 టీ స్పూన్లు
కారం- టేబుల్ స్పూన్
నూనె - టేబుల్ స్పూన్
నిమ్మరసం - 2 టీ స్పూన్లు
కరివేపాకు - రెండు రెమ్మలు
ఆవాలు - అర టీ స్పూన్
మెంతులు - అర టీ స్పూన్

తయారి:
ముందుగా చేపముక్కలను శుభ్రపరిచి, వాటికి ఉప్పు రాసి పక్కన పెట్టుకోవాలి.

చింతపండు నానబెట్టి రసం తీసి దానిలో ఉప్పు, పసుపు కారం కలిపి పక్కన ఉంచాలి.

మామిడికాయ పై తొక్క తీసి ముక్కలు చేయాలి. ఉల్లిపాయలు, టొమాటోలు తరిగి ఉంచాలి.

స్టౌ మీద మూకుడు ఉంచి మెంతులు, జీలకర్ర వేసి వేయించి దించాలి. చల్లారక పొడి చేయాలి.

మూకుడులో నూనె వేసి కాగాక, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేగాక కరివేపాకు, చింతపండు రసం, టొమాటో ముక్కలు వేసి, కలిపి మూతపెట్టాలి.

ఐదు నిమిషాల తర్వాత చేపముక్కలను, మామిడికాయ ముక్కలను వేసి ఉడికించాలి.

తర్వాత జీలకర్ర, మెంతి పొడి వేసి, కలిపి, రసం కొంచెం చిక్కబడే వరకు ఉంచి, తర్వాత దించేయాలి.

వేడి వేడి అన్నంలోకి ఈ ఫిష్ కర్రీ వడ్డించాలి.

ఫిష్ కోల్బెర్ట్

కావలసినవి:
కొరమీను చేపలు - 250 గ్రా., నిమ్మకాయ - 1, పెరుగు - 40 గ్రా., నూనె - వేయించడానికి తగినంత, మైదా - 4 టీ స్పూన్లు, ఉప్పు - తగినంత, తెల్ల మిరియాలపొడి - టీ స్పూన్, గుడ్డు - 1, బ్రెడ్ క్రంబ్స్ (మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి) -50 గ్రా., కొత్తిమీర తరుగు - టీ స్పూన్, మయోనైజ్ (మార్కెట్లో లభిస్తుంది) - 2 టీ స్పూన్లు, గెర్కిన్స్ (చిన్న దోసకాయలను తీపి పచ్చడిలా తయారుచేస్తారు. ఇవి మార్కెట్లో లభిస్తాయి) - టీ స్పూన్, కేపర్స్ బ్లాక్ ఆలివ్ - టీ స్పూన్, ఉల్లిపాయ తరుగు - టీ స్పూన్.

తయారి:
చేప ముక్కలను శుభ్రపరిచి, వాటికి ఉప్పు, మిరియాలపొడి, నిమ్మరసం, కొత్తిమీర తరుగు కలిపి మ్యారినేట్ చేయాలి.

విడిగా మైదా, బ్రెడ్ పొడి, గుడ్డుసొన, కొద్దిగా నీళ్లు పోసి జారుగా కలపాలి.

కడాయిలో నూనె పోసి, వేడెక్కనివ్వాలి.

మైదా మిశ్రమంలో చేపముక్కలను ముంచి, కాగిన నూనెలో వేసి రెండు వైపులా కాల్చి, పక్కన పెట్టాలి.

టార్టర్ సాస్ కోసం.. మయొనైజ్, గెర్కిన్స్ తరుగు, కేపర్స్, ఆలివ్, ఉల్లిపాయ తరుగు కలపాలి.

కోల్బెర్ట్‌బటర్ కోసం.. కొత్తిమీర తరుగు, నిమ్మరసం, క్రీమ్ బటర్ కలిపి ఫ్రిజ్‌లో పెట్టాలి.

సర్వ్ చేసే ముందు కూల్‌గా ఉండే కోల్బెర్ట్ బటర్, హాట్‌గా ఉండే టార్టర్ సాస్‌ని చేపముక్కలకు కాంబినేషన్‌గా అందివ్వాలి.

చిట్కాలు
చేపలను కొనడానికి ముందు అవి బ్రైట్‌గా ఉన్నాయా, కండపట్టినవా, పట్టుకుంటే గట్టిగా ఉన్నాయా... అని చూసి తీసుకోవాలి.

చేపల తాజాదనాన్ని బట్టి కొన్ని వారాల వరకు డీప్ ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవచ్చు. వండే ముందు చేప ముక్కలను రూమ్ టెంపరేచర్‌లోకి వచ్చేంతవరకు ఉంచి ఉపయోగించాలి.

{ఫిజ్‌లో నుంచి తీసిన తర్వాత త్వరగా డీప్రాస్ట్ చేయాలంటే చేపముక్కలు ఉన్న బేసిన్‌లో నీళ్లు పోసి, 2-3 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసి కలపాలి.

కూర చేయడానికి చేప ముక్కలు పెద్దవిగా ఉండేలా చూసి, కట్ చేసుకోవాలి.

చేపముక్కలు త్వరగా ఉడికిపోతాయి. అందుకని సూప్ గానీ లేదా కూర గానీ మిశ్రమం తయారయ్యాక చివరలో వేసి ఉడికించాలి. ముక్క చితికిపోయేంతవరకు ఉడికిస్తే రుచి ఉండదు.

వేపుడువి కాకుండా ఉడికించిన చేపలు తినడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు సక్రమంగా అందుతాయి.
Learn English Vocabulary & Help the Poor |Free Rice |
 
google-site-verification: google2463dc209284d38a.html