Ads 468x60px

Pages

Learn English Vocabulary & Help the Poor| |Free Rice |

Eat Italian - ఈట్ ఇటాలియన్‌

Eat Italian - ఈట్ ఇటాలియన్‌

పొరుగూరి రుచి ఎలా ఉంటుందీ... బహుదూరపు మరో దేశపు రుచి మరెలా ఉంటుందో? ఎలా ఉంటుంది.. ఎలా ఉంటుంది.. అని తర్కించుకుంటూ, ప్రశ్నించుకుంటూ ఉండటం ఎందుకు? రండి... లొట్టలేసుకుంటూ ఇటాలియన్ డిషెస్ రుచి చూద్దాం. పిట్ట రెక్కకూ, వంటింటి ఘుమఘుమకూ పాస్‌పోర్ట్ అక్కర్లేదు. జస్ట్... చేసుకునే ఓపిక ఉంటే... మీ కిచెన్‌ని ఈసారి దేశపు సరిహద్దులు దాటించడానికి సిద్ధంగా ఉంది మన ‘ఫ్యామిలీ’. మీ ఫ్యామిలీ సమేతంగా మీరూ రెడీయేనా?

ఫంగీ మ్యారినేటి (పుట్టగొడుగులు) (fungi marineti)

కావలసినవి:
బటన్ మష్రూమ్స్ - 10 వెలుల్లి పేస్ట్ - 2 టీ స్పూన్లు
కొత్తిమీర - టీ స్పూన్
నిమ్మకాయ - 1
నల్లమిరియాల పొడి - టీ స్పూన్
ఉప్పు - రుచికి తగినంత
ఆలివ్ ఆయిల్ - 3 టీ స్పూన్లు పొరుగింటి పుల్లకూర రుచి అన్న సామెత ఉన్నదే, అందరూ విన్నదే. మరి... పొరుగు ‘ఇంటి’ రుచే ఇలా ఉంటే...

తయారి:
ఒక గిన్నెలో వెల్లుల్లి, నిమ్మరసం, కొత్తిమీర, మిరియాల పొడి, ఉప్పు, ఆలివ్ ఆయిల్ అన్నింటినీ కలిపి మూడు నిమిషాలు ఉంచాలి.

మరొక గిన్నెలో పుట్టగొడుగులు వేసి, అందులో నిమ్మ మిశ్రమాన్ని వేసి కలపాలి. ఈ గిన్నెను అవెన్‌లో పది నిమిషాలు ఉంచి, బేక్ చేయాలి. (స్టౌ పై చేయాలనుకుంటే నాన్‌స్టిక్ కడాయిలో ఈ మిశ్రమం వేసి, పైన మూత పెట్టి, బేక్ చేయాలి).

ఫుసిల్లి మ్యారినేరా (పాస్తా)(pasta)

కావలసినవి:
ఫుసిల్లి పాస్తా - 200 గ్రా.
వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్
ఆలివ్ ఆయిల్ - 2 టీ స్పూన్లు
క్రీమ్ - 100 మీ.లీ
టొమాటో ప్యూరీ - 100 గ్రా.
ఎండుమిర్చి (కచ్చాపచ్చాగా దంచాలి) - టీ స్పూన్, ఉప్పు - రుచికి తగినంత
పార్మేషన్ ఛీజ్ - టీ స్పూన్

తయారి:
తగినన్ని నీళ్లు పోసి పాస్తాను ఉడికించి పక్కన పెట్టాలి.

విడిగా పాన్‌లో ఆలివ్ ఆయిల్ వేసి, వేడెక్కనివ్వాలి. తర్వాత వెల్లుల్లి, టొమాటో ప్యూరీ, క్రీమ్ వేసి కలపాలి.

అందులో ఉడికించిన పాస్తాను, పైన తురిమిన పార్మేషన్ ఛీజ్ వేసి 5 నిమిషాలు ఉంచి, దించాలి.

ఫిలడెల్ఫియా ఛీజ్ కేక్(philadelphiya cheese cake)

కావలసినవి:
ఫిలడెల్ఫియా ఛీజ్ - 25 గ్రా. కుకీస్ - 2
తాజా క్రీమ్ (మీగడను మిక్సీలో బ్లెండ్ చేసి వాడచ్చు) - 18 గ్రా.
పంచదార - 18 గ్రా., గుడ్డు - 1, నిమ్మకాయ - 1

తయారి:
ఒక గిన్నెలో గుడ్డులోని పచ్చ సొన వేసి గిలకొట్టాలి. అందులో క్రీమ్, పంచదార, నిమ్మరసం, ఛీజ్ వేసి పది నిమిషాల సేపు బాగా గిలకొట్టాలి.

కుకీస్‌ను మిక్సీలో వేసి కొద్దిగా బ్లెండ్ చేసి, పక్కన పెట్టుకోవాలి.

గిలకొట్టిన గడ్డు మిశ్రమాన్ని కేక్ తయారుచేసే మౌల్డ్‌లో పోసి, పైన కుకీస్ పలుకులను వేసి, 40 నిమిషాలు అవెన్‌లో పెట్టి బేక్ చేయాలి. స్టౌమీద తయారుచేసేవారు పెనం మీద ఇసుక పోసి, ఆ పైన కేక్ మిశ్రమం ఉన్న గిన్నెపెట్టి, బేక్ చేయాలి.

పెప్పరోని పిజ్జా(pepperoni pizza)

కావలసినవి:
మైదాపిండి - 140 గ్రా.
గుడ్డులోని పచ్చసొన - టీ స్పూన్
నీళ్లు - 10 మి.లీ
పాలు - 5 మి.లీ
ఉప్పు - రుచికితగినంత

తయారి:
పిజ్జా బేస్ కోసం మైదా, పచ్చసొన, నీళ్లు, పాలు, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇలా కలిపిన పిండి ముద్దపై ఒక గిన్నెను బోర్లించి, గంట సేపు ఉంచాలి.

పిజ్జా పైన...
టొమాటో ప్యూరీ - 20 గ్రా.
మోజరెల్లా ఛీజ్ - 100 గ్రా.
చికెన్ సాసేజ్ (మార్కెట్లో లభిస్తుంది) - 80 గ్రా.
చికెన్ సలామీ - తగినంత, వెల్లుల్లిపేస్ట్ - 5 గ్రా.
ఎండుమిర్చి (కచ్చాపచ్చాగా దంచాలి) - అర టీ స్పూన్

తయారి:
పాన్‌లో పిండి మిశ్రమాన్ని వెడల్పుగా పరచి బేస్ తయారుచేయాలి. దాని పైన టొమాటో ప్యూరీ, మోజరెల్లా ఛీజ్, చికెన్ సాసేజ్, చికెన్ సలామి, వెల్లుల్లి, పండు మిర్చి వేసి, పైన మూత పెట్టాలి. అవెన్‌లో అయితే పది నిమిషాలు, స్టౌ మీద అయితే పిజ్జా ఉడికేంత వరకు సన్నని మంట మీద ఉంచాలి.

చికెన్ మస్టర్డ్ సలాడ్ (chicken mustard salad)

కావలసినవి:
చికెన్ బ్రెస్ట్ - 150 గ్రా.
వెలుల్లిపేస్ట్ - 2 టీ స్పూన్లు
మస్టర్డ్ సాస్ - టీ స్పూన్
ఆలివ్ ఆయిల్ - 2 టీ స్పూన్లు
ఉప్పు - రుచికి తగినంత
ఐస్‌బర్గ్ లెట్యూస్ - 200 గ్రా.
మయొనైజ్ - 30 గ్రా.

తయారి:
చికెన్‌ను పది నిమిషాలు నిప్పుల మీద గ్రిల్ చేసి పక్కన పెట్టాలి.

ఒక పాత్రలో మయొనైజ్, వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ఆలివ్ ఆయిల్, మస్టర్డ్ సాస్, లెట్యూస్ వేసి బాగా కలిపి, ఉంచాలి.

వాటి మీద గ్రిల్ చేసిన చికెన్ ముక్కలను ఉంచి, సర్వ్ చేయాలి.

జప్పా డి పిసె (ఫిష్ సూప్)(Fish Soup)

కావలసినవి:
ఉల్లిపాయలు - 2 టీ స్పూన్లు , వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్, కొత్తిమీర - టీ స్పూన్
నీళ్లు - 150 మి.లీ, ఉప్పు - రుచికి తగినంత, రొయ్యలు - 30 గ్రా., చేపలు - 20 గ్రా.
ఆలివ్ ఆయిల్ - 2 టీ స్పూన్లు,

తయారి:
స్టౌ వెలిగించి, కడాయి పెట్టి, ఆలివ్ ఆయిల్ వేసి వేడి చేయాలి. అందులో వెల్లుల్లి, ఉల్లిపాయలు వేసి వేయించాలి. 2. శుభ్రపరిచిన రొయ్యలు, చేప ముక్కలు వేసి ఉడికించాలి.

దీంట్లో నీళ్లు పోసి, ఉప్పు వేసి, పైన కొత్తిమీర చల్లి, పది నిమిషాలు ఉడికించి, దించాలి.

ఇటాలియన్ వంట కొన్ని ముఖ్య విషయాలు...
ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ వంటపద్ధతుల్లో ఇటాలియన్ వంటకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రాంతాన్ని బట్టి ఇటాలియన్ వంటకాల్లో వైవిధ్యం ఉంటుంది.

ఇటాలియన్ వంటలో జున్ను, వైన్ ప్రధాన భాగంగా ఉంటాయి.

ఇటాలియన్ కాఫీకి ప్రపంచ వ్యాప్తంగా పేరుంది.

ఇటాలియన్ భోజనంలో అత్యంత ప్రసిద్ధ వంటకంగా పిజ్జా గుర్తింపు పొందింది.

నూనెలలో ఆలివ్ నూనె ఇటలీ వంటలలో అత్యవసర భాగం.

మొట్ట మొదటి ఇటాలియన్ ఆహారపదార్థ రచయితగా ఆర్కెస్ట్రాటస్ గుర్తింపు పొందాడు. ఇతను 4వ శతాబ్దం బి.సిలో నివసించాడని చరిత్ర చెబుతోంది.
Learn English Vocabulary & Help the Poor |Free Rice |
 
google-site-verification: google2463dc209284d38a.html