mango specials - మామిడేస్
నడి నెత్తిన సూర్యుడు బ్రేక్ డ్యాన్స్ చే స్తున్నాడని భయమెందుకు?ఇంట్లో మ్యాంగోఫ్రూట్‌తో మిల్క్ షేక్ చేసి ఆ డ్యాన్స్‌కు బ్రేకులు వేయండి.
ఎండలో ఏం వెరైటీలు ఉంటాయిలే అని వర్రీ అవడం ఎందుకు?
అండాతో మ్యాంగోను జతచేసి కేక పుట్టించే కేకును తయారుచెయ్యండి.
పండు అయితే మాత్రం వండటానికి నేను సరిపడనా
అంటూ సవాల్ విసురుతున్న
మామిడి పండును చేతిలోకి తీసుకోండి..
సలాడ్ నుంచి షాష్లిక్ వరకు
బోలెడన్ని వెరైటీలతో ఈవారం మీ ‘ఫ్యామిలీ’కి విందు చేయండి.
మ్యాంగో ఛీజ్ కేక్
తాజా మామిడి పండు - 1, గుడ్డు- 1 (పచ్చ సొన), పంచదార - 50 గ్రా, జెలెటిన్ - 10 గ్రా, విప్ క్రీమ్ (మార్కెట్లో లభిస్తుంది) - 50 గ్రా.
జెల్లీ కోసం...
మామిడిపండు గుజ్జు - 50 గ్రా; వేడి నీళ్లు - 50 ఎం.ఎల్; పంచదార - 30 గ్రా, జెలెటిన్ - టీ స్పూన్
తయారి:
గుడ్డులోని పచ్చ సొనను బాగా గిలకొట్టాలి. అందులో పంచదార వేసి, కరిగిపోయేంతవరకు కలపాలి.
అందులో మామిడిపండు గుజ్జు వేసి బాగా కలపాలి.
వేడినీళ్లలో జెలెటిన్‌ని వేసి కరిగించాలి.
విప్ క్రీమ్, గుడ్డు మిశ్రమం, జెలె టిన్‌ను బాగా కలపాలి.
వెడల్పాటి గిన్నెలో ముందుగా మామిడి పండు గుజ్జు, తర్వాత ఛీజ్, ఆ పైన విప్ క్రీమ్, ఆ పైన వెనిల్లా ఎసెన్స్, తర్వాత మామిడి పండు గుజ్జు... ఇలా లేయర్లుగా వేయాలి.
ఈ గిన్నెను రెండు గంటలపాటు ఫ్రీజర్‌లో ఉంచాలి.
తర్వాత ఆ గిన్నెను బయటకు తీసి, ఒక ప్లేట్‌లో బోర్లించి, తీయాలి. క్రీమ్, చెర్రీ, నల్ల ద్రాక్షతో గార్నిష్ చేసి చల్ల చల్లగా సర్వ్ చేయాలి.
లిచీస్ స్టఫ్డ్ మ్యాంగో విత్ చాక్లెట్
లిచీస్ సిరప్ (మార్కెట్లో లభిస్తుంది) - 1 టిన్, మామిడిపండు - ఒకటి(చిన్నది), డార్క్ చాక్లెట్ - 100 గ్రా.
తయారి:
టిన్ ఓపెన్ చేసి లిచీస్ బయటకు తీయాలి. వాటికి అంటి ఉన్న సిరప్ అంతా పోయేంతవరకు ఉంచాలి.
మామిడి పండును చిన్న ముక్కలుగా కట్ చేయాలి. లిచీస్ ఫ్రూట్స్‌లో నింపాలి.
చాక్లెట్ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసి, వేడినీళ్లలో పెట్టి, కరిగించాలి.
లిచీస్ ఫ్రూట్స్ పైన కరిగించిన చాక్లెట్ మిశ్రమాన్ని అందంగా వేసి, పది నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచాలి.
సర్వ్ చేసే ముందు మామిడిపండు ముక్కలు, పుదీనా ఆకులతో అలంకరించాలి.
మ్యాంగో చికెన్ షాష్లిక్
చికెన్ బ్రెస్ట్ (బోన్‌లెస్) - 500 గ్రా, రెడ్ క్యాప్సికమ్ - 50 గ్రా, గ్రీన్ క్యాప్సికమ్ - 50 గ్రా., ఉప్పు - తగినంత, నల్ల మిరియాలు (కచ్చాపచ్చాగా దంచాలి) - 10 గ్రా, ఆలివ్ ఆయిల్ - 100 గ్రా, వెదురుపుల్లలు - 8
సల్సా కోసం...
మామిడికాయ తురుము - 100 గ్రా, పచ్చిమిర్చి తరుగు - 2గ్రా, వెల్లుల్లి తరుగు - 5 గ్రా, కొత్తిమీర తరుగు - 5 గ్రా, ఆలివ్ ఆయిల్ - 10 ఎం.ఎల్, ఉప్పు - రుచికి తగినంత, నిమ్మరసం - 5ఎం.ఎల్, ఉల్లిపాయ తరుగు - 20 గ్రా.
తయారి:
చికెన్, రెడ్ అండ్ గ్రీన్ క్యాప్సికమ్‌ను సమానమైన ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఉప్పు, మిరియాలపొడి, ఆలివ్ ఆయిల్ చికెన్ ముక్కలకు కలిపి కొద్ది సేపు ఉంచాలి.
వెదురు పుల్లలను తీసుకొని ఒక చికెన్ ముక్క, తర్వాత రెడ్ అండ్ గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, తర్వాత మళ్లీ చికెన్ ముక్క.. ఇలా అన్ని ముక్కలు పుల్లలకు గుచ్చాలి. వీటిని షాష్లిక్ అంటారు.
వీటిని గ్రిల్డ్ చేసి, పక్కనుంచాలి.
ఒక పాత్రలో వెల్లుల్లి, ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి అందులో ఆలివ్ ఆయిల్, నిమ్మరసం, ఉప్పు, మిరియాలపొడి వేసి కలపాలి. దీనిని సల్సా అంటారు.
సల్సా మిశ్రమాన్ని గ్రిల్ చేసిన చికెన్ షాష్లిక్ పైన వేసి, వేడి వేడిగా సర్వ్ చేయాలి.
మ్యాంగో సలాడ్
మామిడి పండు - 300 గ్రా., చెర్రీ టొమాటో - 80 గ్రా., ఐస్‌బర్గ్/లెట్యూస్ (మార్కెట్లో లభిస్తుంది) - 100 గ్రా., బ్లాక్ ఆలివ్ ఫ్రూట్ - 20 గ్రా.,
డ్రెస్సింగ్ కోసం...
నిమ్మరసం - టీ స్పూన్, ఉప్పు - తగినంత, నల్లమిరియాలు (కచ్చాపచ్చాగా దంచాలి) - టీ స్పూన్, ఆలివ్ ఆయిల్ - 4 టీ స్పూన్లు, మామిడికాయ తురుము - 4 టీ స్పూన్లు
తయారి:
మామిడి పండు పై తొక్క తీయాలి. చెర్రీ టొమాటో, ఆలివ్స్, లెట్యూస్‌లను శుభ్రపరచాలి. అన్నీ కావలసిన పరిమాణంలో కట్ చేసుకోవాలి; ఒక గిన్నెలో మామిడి తురుము, ఉప్పు, నిమ్మరసం, మిరియాల పొడి కలపాలి; ఆ గిన్నెలో మామిడిపండు ముక్కలు, లెట్యూస్ వేసి కలపాలి; వీటిని సలాడ్ ప్లేట్‌లో సర్ది, పైన ఆలివ్స్, టొమాటోతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.
మ్యాంగో మిల్క్ షేక్
తాజా మామిడి పండ్లు - 400 గ్రా.,తాజా మామిడిపండు గుజ్జు - 200గ్రా., మ్యాంగో ఐస్‌క్రీమ్ - 200 గ్రా., షుగర్ సిరప్ - 50 మి.లీ., పాలు - 400 మి.లీ.
గార్నిష్ కోసం:
చెర్రీ - 4., మామిడి ముక్కలు - 4,పుదీనా ఆకులు - 2
తయారి:
మామిడిపండు ముక్కలు మిక్సర్ జార్‌లో వేసి, బ్లెండ్ చేయాలి. ఈ మిశ్రమంలో మామిడిపండు గుజ్జు, షుగర్ సిరప్, పాలు పోసి కలపాలి. గ్లాసులో పోసి, మామిడి పండు ముక్కలు, పుదీన ఆకులు, చెర్రీలతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. కూల్‌గా ఉండాలనుకునేవారు ఫ్రిజ్‌లో చల్లగా అయ్యేంతవరకు ఉంచాలి.
మ్యాంగో టిరమిసు
గుడ్లు - 2 (పచ్చసొన), క్యాస్టర్ షుగర్ (మార్కెట్లో లభిస్తుంది) - 40 గ్రా., మస్కారాపోన్ ఛీజ్ - 20గ్రా., విప్ క్రీమ్(మార్కెట్లో లభిస్తుంది) - 40గ్రా., వెనిల్లా ఎసెన్స్ - 2 చుక్కలు, కాఫీ పౌడర్ - అర టీ స్పూన్., వెనిల్లా స్పాంజ్ - 50 గ్రా., మామిడిపండు గుజ్జు - 100 గ్రా., ఫుడ్ కలర్ (ఎల్లో, ఆరెంజ్ మిక్స్) - చిటికెడు
తయారి:
గుడ్డులోని పచ్చ సొన విడిగా గిన్నెలోకి తీసుకొని బాగా గిలకొట్టాలి. దీంట్లో క్యాస్టర్ షుగర్ కలిపి, ఉడికించాలి.
కొన్ని వేడి నీళ్లలో జెలాటిన్ వేసి, కరిగించాలి.
{Mీమ్, ఛీజ్ బాగా కలపాలి.
కాఫీ పౌడర్, పంచదార కలిపి వేడిచేయాలి. ఇది చిక్కని సిరప్‌లా తయారవుతుంది.
ఉడికిన గుడ్డు మిశ్రమాన్ని, ఛీజ్‌తో కలపాలి.
వెనిల్లా స్పాంజ్ అడుగున పెట్టి, పైన కాఫీ సిరప్ వేయాలి. ఆ పైన ఛీజ్ మిశ్రమం, మామిడిపండు గుజ్జు 50 శాతం, ఆ పైన వెనిల్లా స్పాంజ్ 50 శాతం లేయర్‌గా ఉంచాలి. చక్కగా సెట్ చేసి, ఫ్రీజర్‌లో రెండు గంటలు ఉంచి, తర్వాత బయటకు తీసి, కట్ చేసి సర్వ్ చేయాలి.

