UgAdi dishes - ఉగాది రుచులు
UgAdi Special
ఉగాది పచ్చడిపచ్చిమామిడికాయ - 1
బెల్లం తురుము - 5 టీ స్పూన్లు
చింతపండు గుజ్జు - 2 టేబుల్ స్పూన్లు, నీళ్లు - కప్పు
వేపపువ్వు- టేబుల్ స్పూన్
కారం - చిటికెడు
జీలకర్ర - చిటికెడు
ఉప్పు - తగినంత
తయారి:
మామిడికాయ పైతొక్క తీసి, సన్నని ముక్కలు కట్‌చేసి పక్కన ఉంచాలి. ఒక గిన్నెలో చింతపండు గుజ్జు, నీళ్లు పోసి కలపాలి. మామిడికాయ ముక్కలు, ఉప్పు, కారం, వేపపువ్వు, బెల్లం తురుము వేసి కలపాలి. రుచి కోసం అరటిపండు, కొబ్బరి, చెరుకు ముక్కలు, పుట్నాలపప్పు వేసుకోవచ్చు. ప్రాంతాలవారీగా ఉగాది పచ్చడిని పలచగాను, చిక్కగానూ చేసుకుంటారు.
మామిడికాయ పులిహోర
బియ్యం - పావుకేజీ
మామిడికాయ తురుము - తగినంత (అర టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసి కలపాలి)
పోపుకోసం:
పచ్చిమిర్చి - 4
ఎండుమిర్చి - 5
కరివేపాకు - రెమ్మ
నూనె - తగినంత
ఇంగువ - చిటికెడు
శనగపప్పు - 3 టీ స్పూన్లు
జీలకర్ర, ఆవాలు - అర టీ స్పూన్
జీడిపప్పు - 3 టీ స్పూన్లు
కొత్తిమీర - టీ స్పూన్
తయారి:
ముందుగా అన్నం వండి, బేసిన్‌లో వేసి ఆరనివ్వాలి. స్టౌ మీద కడాయి పెట్టి నూనె వేసి, వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇంగువ, కరివేపాకు వేయాలి. ఇవి వేగాక ఉప్పు, పసుపు కలిపిన మామిడి తురుము వేసి కొద్దిగా ఉడికించాలి. చివరగా కొత్తిమీర వేసి దించి, పక్కన పెట్టిన అన్నంలో కలపాలి. విడిగా నెయ్యిలో వేయించిన జీడిపప్పులను అలంకరణకు వాడితే వడ్డించడానికి కమ్మటి పులిహోర సిద్ధంగా ఉంటుంది.
బొబ్బట్లు / భక్ష్యాలు
శనగపప్పు - కప్పు
బెల్లం తురుము - కప్పు
మైదా/ గోధుమపిండి - కప్పు
ఏలకుల పొడి - టీ స్పూన్
ఉప్పు - చిటికెడు
నూనె/నెయ్యి - తగినంత
తయారి:
శనగపప్పును పలుకుగా ఉడికించి, నీళ్లు వడకట్టాలి. ఉడికించిన శనగపప్పులో బెల్లం తురుము, ఏలకుల పొడి కలిపి మెత్తగా రుబ్చి, పక్కన పెట్టాలి. మైదాలో తగినన్ని నీళ్లు పోసి పూరీ పిండిలా కలిపి, పక్కన ఉంచాలి. తర్వాత చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని చేత్తో అదిమి, అందులో శనగపప్పు మిశ్రమాన్ని ఉంచి, అంచులు మూసేసి ఉండలా చేయాలి. పీట మీద ఒక ప్లాస్టిక్ కవర్ వేసి, పైన కొద్దిగా నూనె రాసి, ఉండను పెట్టి చేత్తో వెడల్పుగా ఒత్తాలి. తర్వాత పెనం మీద నెయ్యి వేసి వేడయ్యాక, ఒత్తిన బొబ్బట్లను రెండు వైపులా కాల్చాలి.

