Mutton Strength - మటన్ బలం
ఒక్క మటన్ పది కూరల పెట్టు.అంతే సారం. పదింతల బలం.
సింగిల్ మటన్... టెన్ టేస్ట్స్.
అందుకే దాన్ని మ‘టెన్’ అంటే ఎవరికైనా డౌట్ ఏముంటుంది?
పండగనాడు ఒక్క మటన్ చాలు...
అదే పదివేల టేస్టులు. పదిరోజుల పండగ దసరా!
ఆ నాటి రుచిని పది కాలాలు తలచుకునేలా మటన్ ఐటమ్స్ చేసుకుందాం రండి.
కిచెన్‌లోకి ఎంట్రీ ఇచ్చుకుందాం రండి.
మటన్ రోస్ట్
మటన్ - కప్పు
పసుపు - టీ స్పూన్
కారం - టీ స్పూన్
ఉల్లిపాయ ముక్కలు - కప్పు
మిరియాల పొడి - టీ స్పూన్
చాట్ మసాలా - టీ స్పూన్
నిమ్మరసం - టీ స్పూన్
ఉప్పు - తగినంత
నూనె - వేయించడానికి సరిపడినంత
తయారి:
బాణలిలో నూనె వేడి చేసి మటన్ ముక్కలను వేయించి పక్కన పెట్టాలి. మిగిలిన నూనెలో ఉల్లిపాయ ముక్కలను వేయించాలి. అవి వేగిన తర్వాత పసుపు, కారం, ఉప్పు, మాంసం ముక్కలు వేసి కలిపి పైన చాట్‌మసాలా, మిరియాల పొడి చల్లి ఐదు నిమిషాల పాటు వేగనివ్వాలి. చివరగా నిమ్మరసం కలిపి దించేయాలి. మటన్ రోస్ట్ రెడీ.
మటన్ గోంగూర
మటన్ - కప్పు గోంగూర - కప్పు గసాలు - 50 గ్రా
జీడిపప్పు - 10 గ్రా, నూనె - సరిపడా
పోపు కోసం:
ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు, కారం - టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి - నాలుగు, పసుపు - టీ స్పూన్, ధనియాల పొడి - టీ స్పూన్
గరం మసాలా పొడి - చిటికెడు
తయారి:
గసాలు, జీడిపప్పును కలిపి మెత్తగా గ్రైండ్ చేయాలి. పాత్రలో నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కలను వేయించిన తర్వాత అందులో పచ్చిమిర్చి, మిగిలిన పోపు దినుసులన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటిగా వేయాలి. అన్నీ వేగిన తర్వాత మటన్ వేసి తగినంత నీటిని పోసి ఉడికించాలి. మటన్ ఉడికిన తర్వాత గోంగూర, గసాలాజీడిపప్పు మసాలా వేసి ఉడికిస్తే గోంగూర మటన్ రెడీ.

