Ads 468x60px

Pages

Learn English Vocabulary & Help the Poor| |Free Rice |

Palak Plate - పాలక్ ప్లేట్

Palak Plate - పాలక్ ప్లేట్


ఆకులందు పాలకూర వేరుగానుండు
వండి చూడ వెరైటీలు బోలెడుండు
తిని చూడ రుచులు యమ టేస్ట్‌గానుండు
అన్ని విధముల ఆరోగ్యము మెండుగానుండు
పద్యాన్ని పక్కన పెట్టేసి...
శక్తినిచ్చే పాలకూరతో
రకరకాల రుచులను వండి
ఇంటిల్లిపాదికీ విందు ఇవ్వండి.
‘పాలక్ విందు బహు పసంద్’ అంటూ
ఆరగించినవారి కితాబులు కొట్టేయండి


పాలక్ ప్యాటీస్

కావలసినవి:
పాలక్ ప్యూరీ (పాలకూరను తరిగి, ఉడికించి, గ్రైండ్ చేసుకోవాలి) - కప్పు
బంగాళదుంపలు- 4, క్యారట్ - 3
క్యాబేజీ (తరిగినది) - అర కప్పు
పచ్చి బఠాణీలు - అర కప్పు
కారం - అర టీ స్పూన్
గరం మసాలా - అర టీ స్పూన్
కార్న్ ఫ్లోర్ - 2 టేబుల్‌స్పూన్లు
ఉప్పు - రుచికి తగినంత
తయారి: బంగాళదుంపలను ఉడికించి పై పొట్టు తీయాలి. క్యారట్, క్యాబేజీలను ఉడికించాలి. వీటన్నింటినీ గుజ్జులా చేయాలి. ఇందులో పాలక్‌ప్యూరీ, కారం, గరమ్ మసాలా, ఉప్పు, కార్న్ ఫ్లోర్ వేసి కలపాలి. కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని చేతిలోకి తీసుకొని ప్యాటీస్ షేప్‌లో చేసుకోవాలి. (దీంట్లో నచ్చిన ఆకుకూరలు, కూరగాయల గుజ్జును కూడా కలుపుకోవచ్చు). పాన్ వేడయ్యాక పట్టీలను కొద్ది కొద్దిగా నూనె వేస్తూ రెండు వైపులా కాల్చాలి. వీటిని టొమాటో సాస్‌తో వేడి వేడిగా సర్వ్ చేయాలి.

పాలక్ పూరి

కావలసినవి: పాలక్ ప్యూరీ (పాలకూర ఆకులను ఉడికించి నీరంతా పోయాక గ్రైండ్ చేయాలి) - కప్పు, గోధుమపిండి - తగినంత, ఉప్పు - తగినంత, జీలకర్ర పొడి - అర టీ స్పూన్, నూనె - వేయించడానికి తగినంత

తయారి: గోధుమపిండిలో పాలక్‌ప్యూరీ, ఉప్పు, జీలకర్రపొడి వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. పిండి మరికాస్త మెత్తగా రావాలనుకుంటే కొద్దిగా నీరు కలుపుకోవచ్చు. ఘాటుగా ఉండాలనుకునేవారు కారం, గరం మసాలా, అర టీ స్పూన్ సోంపు పొడి వేసి కలుపుకోవచ్చు. ముద్దగా చేసిన పిండిని చిన్ని చిన్న బాల్స్ చేసుకొని పూరీని వత్తాలి. నూనె వేడయ్యాక అందులో వేసి రెండువైపులా కాల్చాలి. చోలే తో పాలక్ పూరీలను వేడివేడిగా వడ్డించాలి.

పాలక్ ఫ్రైడ్ రైస్

కావలసినవి: బాస్మతి బియ్యం - 250 గ్రా./ ఒక గ్లాస్, పాలక్ ప్యూరీ (పాలకూరను ఉడికించి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి) - 1 కప్పు, ఉల్లిపాయ - 1 (నిలువు ముక్కలుగా కట్ చేసుకోవాలి), క్యారెట్ - 1 (ముక్కలుగా కట్ చేసుకోవాలి), పచ్చి బఠానీ గింజలు - అర కప్పు, పచ్చి మిర్చి - 3 (కట్ చేసుకోవాలి, మిరియాల పొడి - అర టీ స్పూన్, సోయాసాస్ - అర టేబుల్‌స్పూన్, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 2 టీ స్పూన్లు

తయారి: గిన్నెలో నూనె వేడయ్యాక ఉల్లిపాయలు, క్యారట్, పచ్చిమిర్చి, బఠానీలు... ఒకదాని తర్వాత ఒకటి వేసి వేగనివ్వాలి. తర్వాత పాలక్ ప్యూరీ, ఉప్పు, మిరియాలపొడి, సోయాసాస్ వేసి కొన్ని నిమిషాలు ఉడికించి, ఒకటిన్నర గ్లాసుల నీళ్లు పోసి మరగనివ్వాలి. త ర్వాత బియ్యం పోసి ఉడకనివ్వాలి. అన్నం పూర్తయ్యాక దించి రైతాతో వేడి వేడిగా వడ్డించాలి. (అన్నం విడిగా వండి, నీళ్లు పోయకుండా ఉడికిన పాలక్ ప్యూరీ మిశ్రమంలో వేసి, కలిపి కూడా పాలక్ ఫ్రైడ్ రైస్‌ను తయారుచేసుకోవచ్చు)

క్రిస్పీ పాలక్

కావలసినవి: పాలకూర ఆకులు - 10-15 (తాజాగా, పొడవు, వెడల్పు ఉన్నవి), కార్న్ ఫ్లోర్ - 100 గ్రా., మైదా - 50 గ్రా.చిల్లీ సాస్ - టీ స్పూన్, టొమాటో సాస్ - టీ స్పూన్, సోయా సాస్ - కొన్ని చుక్కలు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - వేయించడానికి తగినంత

తయారి: ఒక పాత్రలో కార్న్‌ఫ్లోర్, మైదా, చిల్లీ సాస్, టొమాటో సాస్, సోయా సాస్, ఉప్పు వేసి, తగినన్ని నీళ్లుపోసి జారుగా కలుపుకోవాలి. స్టౌ పై కడాయి పెట్టి నూనె పోసి వేడి చేయాలి. ఒక్కో పాలకూర ఆకును తీసుకొని, కలిపిన పిండి మిశ్రమంలో ముంచి నూనెలో వేసి రెండు వైపులా వేయించాలి. వీటిని నచ్చిన సాస్‌తో వేడి వేడిగా వడ్డించాలి.

పాలక్ సూప్

కావలసినవి: పాలక్‌వాటర్ - (పాలకూరలో రెండు కప్పుల నీళ్లు పోసి, ఉడికించి, వడకట్టుకోవాలి), కార్న్ ఫ్లోర్ - 3 టీ స్పూన్లు, మిరియాలపొడి - పావు టీ స్పూన్, ఉప్పు - రుచికి తగినంత, పంచదార - అర టీ స్పూన్, నిమ్మకాయ - ఒకటి, ఫ్రెష్ క్రీమ్ - తగినంత

తయారి:
ఉప్పు, మిరియాలపొడి, పంచదార పాలక్ వాటర్ లో వేసి మరిగించాలి. ఇందులో కార్న్ (మరొకపాత్రలో కొద్దిగా నీళ్లు కలిపి కార్న్‌ను కలపాలి) వేసి కలపాలి. ఈ మిశ్రమం బాగా మరిగాక దించి నిమ్మరసం పిండాలి. పాలక్‌సూప్‌ను కప్పులలో పోసి ఫ్రెష్ క్రీమ్ వేసి సర్వ్ చేయాలి. (మీగడను గ్రైండ్ చేసి క్రీమ్‌ను తయారుచేసుకోవచ్చు)
Learn English Vocabulary & Help the Poor |Free Rice |
 
google-site-verification: google2463dc209284d38a.html