క్రిస్మస్ స్పెషల్ - ప్లమ్ విత్ ఐసింగ్ కేక్ (Christmas Special - Plum with Icing Cake)
కావలసిన పదార్థాలు:
మైదాపిండి: 1/2kg
డాల్డా: 1/2kg
పంచదార పొడి: 250grms
బేకింగ్ సోడా: 1/2tsp
కోడిగుడ్లు: 6
డ్రైఫ్రూట్స్: 1/2kg (అంజీర్, సీడ్‌లెస్ ఖర్జూరం, కిస్ మిస్, జింజర్ చిప్స్, నల్ల కిస్ మిస్, కట్ పీల్, ఆరెంజ్ పీల్, కాజు..అన్నిటినీ చిన్నచిన్న ముక్కలుగా చేసుకోవాలి).
సుగంధద్రవ్యాల పొడి: 1tsp(యాలకులు, జాజికాయ, జాపత్రి, దాల్చినచెక్క, లవంగాలు.. అన్నీ కలిపి తయారుచేసుకున్న పొడి. ఈ పొడిని డ్రైఫ్రూట్స్ మిశ్రమంలో వేయాలి).
ఐసింగ్ కోసం:
పంచదార పొడి: 1/2kg
డాల్డా (మార్జిరిన్): 1/2kg
ఎసెన్స్: కొద్దిగా(ఇష్టపడే ఫ్లేవర్ అంటే స్ట్రాబెర్రీ, మ్యాంగో, ఆరెంజ్..వేటినైనా వాడుకోవచ్చు)
రిఫైన్‌డ్ ఆయిల్: 50grms
తయారు చేయు విధానము:
1. ఒక పెద్ద బౌల్ లో కోడిగుడ్ల సొన, డాల్డా, పంచదారపొడి వేసి బాగా కలపాలి. అన్నీ కలిసిన తరవాత అందులో మైదాపిండి, డ్రైఫ్రూట్స్ మిశ్రమం, బేకింగ్ జతచేసి మరోమారు కలపాలి.
2. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మౌల్డ్ (ఇష్టమైన ఆకారం ఎంచుకోవచ్చు) లో పోసి 180 డిగ్రీల నుంచి 200 డిగ్రీల టెంపరేచర్ దగ్గర అవెన్‌లో సుమారు 30 నిముషాలు బేక్ చేయాలి.
3. ఐసింగ్ కోసం ఒక పెద్ద బౌల్ లో ముందుగా డాల్డా, పంచదారపొడి మెత్తటి పేస్ట్ లా అయ్యేవరకు బాగా కలపాలి. తరవాత రిఫైన్‌డ్ ఆయిల్, ఎసెన్స్ చుక్కలు జతచేసి మరోమారు బాగా కలపాలి. ఈ మిశ్రమంతో కేక్ పైన ఎవరికి నచ్చిన ఆకారంలో వారు డెకొరేట్ చేసుకోవచ్చు.
English summary
Plum cake is a favorite Polish dessert. It's quick and easy and uses Dry fruit. 'Plum cakes are about ease of transportation. They enjoy a wider distribution reach which companies like Elite, Olio, Nutrifud and Modern Breads have exploited to the fullest.

