క్రిస్మస్ స్పెషల్-చికెన్ బిర్యాని(Christmas Special - Chicken Biryani)
కావలసిన పదార్ధాలు :
చికెన్: 1kg
బాస్మతి బియ్యం: 1kg
నెయ్యి : 1/4cup పలావు ఆకులు: 3
లవంగాలు: 10
యాలకులు: 10
దాల్చిన చెక్క: రెండు ముక్కలు
ఉప్పు : రుచికి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్: 3tbsp
ఉల్లిపాయలు : 2 పెద్దసైజువి
కారం: 3tsp
పెరుగు: 2cups
నిమ్మరసం: 1/4cup
కొత్తిమిర: రెండు కట్టలు
పుదినా ఆకులు: 1/2cup
పసుపు: 1tsp
తయారు చేయు విధానం :
1. ముందుగా చికెన్‌ని తీసుకుని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2. తర్వాత బియ్యం కడిగి నీళ్ళుపోసి అరగంట పక్కనపెట్టాలి.
3. స్టవ్ వెలిగించి వెడల్పాటి గిన్నెపెట్టి నెయ్యి వేసి వేడిచెయ్యాలి.
4. మసాల దినుసులలో అన్నింటిలో సగం తీసుకోని, కాగే నేతిలో వేపి, వేగాక ఉల్లిముక్కలు, మిర్చి ముక్కలు వేసి కలపాలి.
5. ఇప్పుడు అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక, కారం, ఉప్పు, పసుపు వేసి కలిపి, చికెన్ ముక్కలు వేసి కలపాలి. 6. కాసేపు ఆగి, కప్పు పెరుగు, కొద్దిగా నీళ్లు వేసి ఉడకనివ్వాలి.
7. పక్క స్టవ్ మీద నీళ్లు మరిగించి, మిగిలిన మసాల దినుసులు వేసి, బియ్యం, ఉప్పు వేసి, అన్నం వండి పదును మీద ఉండగానే వార్చి పక్కన పెట్టుకోవాలి.
8. ఇంతలోపు చికెన్ ఉడికి రెడీగా ఉంటుంది. దీనిలో నిమ్మరసం కలిపి, స్టవ్ ఆపాలి.
9. తర్వాత వేరే గిన్నె తీసుకోని ముందుగా ఉడికిన చికెన్ సగం దానిలో వేసి, దానిమీద ఉడికిన అన్నం సగం వేసి, చికెన్ మిద సర్దాలి.
10. దానిమీద పుదినా ఆకులు కొన్ని, కొత్తిమిర తురుము కొంచెం వేసి మళ్లీ మిగిలిన చికెన్ వేసి సర్ది, దానిమీద మిగిలిన అన్నం వేసి వెడల్పుగా చేసి మిగిలిన పుదినా, కొత్తిమిర జల్లి కప్పు పెరుగు బాగా గిలకొట్టి అన్నం మీద వేసి మూత పెట్టాలి.
11. ఆవిరి బయటకు పోకుండా మైదా పిండి ముద్దతో అంచులు మూసి వెయ్యాలి.
12. ఇప్పుడు దీనిని స్టవ్ మీద పెట్టి సిమ్ లో పావుగంట దమ్ చేయాలి. అంతే చికెన్ బిర్యాని రెడి. ఉల్లిపాయ ముక్కలు, కీరకాయ ముక్కలను గార్నిష్ చేసి వచ్చిన అతిథులకు వడ్డించడమే..
Topics: chicken, garam masala, rice, ginger, garlic, salt, చికెన్, గరం మసాలా, బియ్యం, అల్లం, వెల్లుల్లి, ఉప్పు
English summary
Chicken biryani is the most popular Indian rice dish. Biriyani is a baked Indian dish of spiced rice combined with chicken, seafood, or other meats.

