క్రిస్మస్ స్పెషల్- చికెన్ కాజూ కుర్మా(Christmas Special - Chicken Cashew Kurma)
కావలసిన పదార్థాలు:
చికెన్ : 1kg
ఉల్లిపాయలు: 4
పచ్చిమిర్చి: 8
కరివేపాకు: రెండు రెమ్ములు
కాజు: 1/2cup
కొత్తిమీర: 1cup
నూనె: తగినంత
ఉప్పు: రుచికి సరిపడా
కారం: తగినంత
పసుపు: 1/2tsp
అల్లం వెల్లుల్లి పేస్ట్: 4tsp
మసాలాకు
లవంగాలు: ఆరు
చెక్క: చిన్నముక్క
జీలకర్ర: 2tsp
ధనియా పౌడర్: 2tbsp
గసగసాలు: 2tsp
తయారు చేయు విధానము:
1. ముందుగా చికెన్ లో కొంచెం ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి ఒక అరగంట ఫ్రిజ్ ల ఉంచాలి.
2. మసాలా దినుసులు అన్ని మెత్తగా పొడి చేసుకోవాలి. పది జీడిపప్పులను కూడా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు పాన్ లో నూనె వేసి వేడి చేసి మిగిలిన కాజూ వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే నూనెలో తరిగిన కొత్తిమీర, మిర్చి, తగినంత కారం వేసి దోరగా వేగాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించాలి.
4. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించి, మసాలా పొడి, పసుపు కూడా వేసి బాగా కలిపి రెండు నిముషాలు వేయించాలి.
5. తర్వాత అందులో ముందుగా నానబెట్టుకొన్న చికెన్ వేసి బాగా కలిపి తక్కువ మంటలో అయిదు నిమిషాలు ఉడికించి తగినంత ఉప్పు, ఒక కప్పునీళ్ళు కలిపి మూత పెట్టి ఉడికించాలి.
6. చికెన్ ముక్కలు మెత్తగా ఉడికిన తరువాత కాజుపొడి, వేయించిన కాజు కలిపి కూర బాగా దగ్గరయ్యే వరకు ఉడికించి దించెయ్యాలి. అంతే ఒక బౌల్ లోనికి తీసుకుని కొంచెం కొత్తిమీర తరుమును గార్నిష్ గా అలంకరించుకుంటే సరి చికెన్ కాజు కుర్మా రెడీ.
English summary
Kaaju chicken is very famous as chinese and thai recipes with little variations. chicken with kaaju is very easy and quick to cook with very little spices. Main ingredient for cashew chicken is soy sauce.

