China Kung Pavo Chicken - చైనా - కుంగ్ పావో చికెన్
స్కిన్‌లెస్, బోన్‌లెస్ చికెన్ - కప్పు (ముక్కలు చేయాలి); సాయ్ సాస్ - 2 టేబుల్ స్పూన్లు; నువ్వుల నూనె - 2 టేబుల్ స్పూన్లు; కార్న్‌ఫ్లోర్ - 2 టేబుల్ స్పూన్లు (2 టేబుల్ స్పూన్ల నీళ్లలో కలపాలి); ఎండు మిర్చి ముద్ద - టేబుల్ స్పూను; వైట్ వెనిగర్ - టీ స్పూను; బ్రౌన్ సుగర్ - 2 టీ స్పూన్లు; ఉల్లికాడల తరుగు - అర కప్పు; వెల్లుల్లి తరుగు - టేబుల్ స్పూను; వాటర్ చెస్ట్‌నట్స్- 2 టేబుల్ స్పూన్లు; పల్లీ తురుము- టేబుల్ స్పూను.
తయారీ:
ఊరబెట్టడానికి: ఒక పాత్రలో టేబుల్ స్పూను సాయ్ సాస్, టేబుల్ స్పూను నూనె, టేబుల్ స్పూను నీళ్లలో కలిపిన కార్న్‌ఫ్లోర్ వేసి కలిపి, అందులో చికెన్ ముక్కలు వేసి సుమారు గంటసేపు ఊరనిచ్చాక, కింద నుంచి పైకి బాగా కలిపి, మూత పెట్టి ఫ్రిజ్‌లో అర గంటసేపు ఉంచాలి
సాస్ తయారీ:
చిన్న పాత్రలో టేబుల్ స్పూన్ సాయ్ సాస్, టేబుల్ స్పూను నూనె, టేబుల్ స్పూను కార్న్‌ఫ్లోర్ కలిపిన నీళ్లు, ఎండు మిర్చి ముద్ద, వెనిగర్, పంచదార వేసి బాగా కలిపి ఉల్లికాడల తరుగు, వెల్లుల్లి తరుగు, నీళ్లు, చెస్ట్‌నట్స్ తురుము, పల్లీల తురుము వేసి బాగా కలిపి, బాణలిలో వేసి స్టౌ మీద ఉంచి చిక్కగా అయ్యేవరకు కలుపుతుండాలి
ఫ్రిజ్‌లో నుంచి చికెన్ మిశ్రమం తీసి, వేరే పాన్‌లో వేసి స్టౌ మీద ఉంచి, చికెన్ తెల్లగా మారేవరకు బాగా కలిపి, సాస్ తయారవుతున్న పాత్రలో వేసి కలపాలి
అన్ని పదార్థాలు ఉడికి, కూర బాగా దగ్గర పడ్డాక దించేయాలి.

