Ads 468x60px

Pages

Learn English Vocabulary & Help the Poor| |Free Rice |
Showing posts with label Diwali Special. Show all posts
Showing posts with label Diwali Special. Show all posts

Diwali Special

బాణాసంచా ఢాంఢాంలలో పండగ హడావిడి వినిపిస్తే, వంటింటి సుయ్‌సుయ్‌ల్లో కమ్మదనం కనిపిస్తుంది. దీపావళికి టపాసుల శబ్దాలు చెవుల్ని హోరెత్తిస్తే, తీపి రుచులు నోటిని నింపుతుంటాయి. ఈసారి దీపావళి స్పెషల్‌గా స్వీట్ క్యాండిల్స్, జీడిపప్పు, డ్రైఫ్రూట్స్ బర్ఫీ, ఖర్జూర రోల్స్, ఖర్జూర-నువ్వుల లడ్లు మీ 'వంటిల్లు'లోకి వచ్చాయి.
కాజు బర్ఫీ - Cashew Barfi
కావలసినవి: జీడిపప్పు పొడి - రెండు కప్పులు, పాలు - పావు కప్పు, పంచదార - ముప్పావుకప్పు, సిల్వర్ వార్క్ - అలంకరణకు.
తయారీ: పెద్ద గిన్నెలో పాలు పోసి వేడిచేసి పంచదార కలపాలి. పాలు ఉడుకుపట్టాక స్టవ్ మీద నుంచి దింపి జీడిపప్పు పొడి కొద్దికొద్దిగా వేస్తూ చిక్కటి పేస్ట్‌లా అయ్యే వరకు కలపాలి. వెడల్పాటి పళ్లానికి నూనె రాసి అందులో ఈ మిశ్రమాన్ని పోసి పళ్ళెమంతా సర్దాలి. దానిపైన సిల్వర్ వార్క్ వేయాలి(అవసరమనుకుంటే). బాగా చల్లారిన తరువాత బర్ఫీల్లా కోసి గాలిచొరబడని డబ్బాలో నిల్వ ఉంచాలి.
ఖర్జూర రోల్స్ - Dates Rolls
కావలసినవి: ఖర్జూరాలు - అరకేజి, పాలు - ఒక లీటర్, డ్రైఫ్రూట్స్ - అరకప్పు, నెయ్యి - రెండు టేబుల్‌స్పూన్లు, కొబ్బరి పొడి, వాల్‌నట్స్ - అలంకరణకు.
తయారీ: ఖర్జూరాల్లోని గింజలు తీసేసి చిన్న ముక్కలు చేయాలి. పాన్‌లో నెయ్యి కరిగించి ఖర్జూరాలు వేసి తక్కువ సెగ మీద 20 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించాలి. ఖర్జూర పలుకులు మెత్తగా అయ్యాక పాలు పోసి చిక్కగా అయ్యే వరకు స్టవ్ మీదే ఉంచాలి. ఆ తరువాత డ్రైఫ్రూట్స్ పలుకుల్ని కలిపి పాన్‌ను కిందికి దింపాలి. వేడి తగ్గాక ఈ మిశ్రమాన్ని రెండు గంటలు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఫ్రిజ్ నుంచి బయటికి తీశాక రోల్స్‌లా చుట్టి కొబ్బరిపొడిలో దొర్లించి, వాల్‌నట్స్‌తో అలంకరిస్తే టేస్టీ టేస్టీ ఖర్జూర రోల్స్ రెడీ.
డ్రైఫ్రూట్స్ బర్ఫీ - Dry Fruits Barfi
కావలసినవి: అంజీర్ (డ్రై ఫిగ్స్) - ఒకటిన్నర కప్పులు, ఖర్జూర - ఒక కప్పు, బాదం, వాల్‌నట్ (అక్రోట్), పిస్తా, ఎండుద్రాక్ష - ఒక్కోటి ముప్పావు కప్పు, యాలకల పొడి - అర టీస్పూన్, నట్‌మెగ్ (జాజి) పొడి - పావు టీస్పూన్, నెయ్యి లేదా నూనె - ఒక టేబుల్‌స్పూన్, సిల్వర్ వార్క్ - ఒకటి.
తయారీ: గోరు వెచ్చటి నీళ్లలో అంజీర్‌ను పావుగంట నానపెట్టిన తరువాత నీళ్లు వడకట్టి ఆరపెట్టాలి. బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్ష, వాల్‌నట్, పిస్తా, ఖర్జూరాలను సన్నటి ముక్కలుగా తరగాలి. ఒకవేళ మిక్సీలో వేస్తే పొడి కాకుండా కచ్చాపచ్చాగా పట్టాలి. ఆ తరువాత అంజీర్‌ను మిక్సీలో వేసి నీళ్లు పోయకుండా మెత్తటి పేస్ట్‌లా చేయాలి. నూనె వేడిచేసి అందులో అంజీర్ పేస్ట్‌ను వేసి నిమిషం పాటు వేగించాక ఖర్జూర ముక్కలను వేసి బాగా కలిపి రెండు నిమిషాలు ఉడికించాలి. తరువాత డ్రైఫ్రూట్స్ వేసి కలిపి యాలకలపొడి, నట్‌మెగ్ పొడి వేసి కలిపి ఒక నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆపేయాలి. వెడల్పాటి పళ్లానికి నూనె రాసి ఈ బర్ఫీ మిశ్రమాన్ని పోసి గరిటెతో సమంగా సర్ది చల్లారనివ్వాలి. ఇష్టపడే వాళ్లు పైన సిల్వర్ వార్క్ వేసుకోవచ్చు. అరగంట పాటు ఫ్రిజ్‌లో ఉంచి ఆ తరువాత మీకు నచ్చిన ఆకారంలో కోసుకోవచ్చు. వీటిని గాలి చొరబడని సీసాలో ఉంచితే రెండు వారాల పాటు తాజాగా ఉంటాయి.
కావలసినవి: పాలు, పంచదార - ఒక్కోటి రెండు కప్పుల చొప్పున, మొక్కజొన్న పిండి, బియ్యప్పిండి, మైదా - అరకప్పు చొప్పున, జీడిపప్పు ముద్ద - పావు కప్పు, నెయ్యి - అర కప్పు, యాలకులపొడి - ఒక స్పూన్, మిఠాయి రంగులు - మూడు.
తయారీ: పొయ్యి మీద పాన్ పెట్టి పచ్చిపాలు పోసి అందులో పంచదార, మైదా, బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి ఒకదాని తరువాత ఒకటి వరసగా వేయాలి. సన్నని సెగ మీద ఉంచి గరిటెతో కలుపుతూ ఉండాలి. మిశ్రమం దగ్గరపడుతుండగా జీడిపప్పు ముద్ద కలిపి, యాలకులపొడి కూడా చల్లి రెండు నిమిషాలయ్యాక స్టవ్ మీద నుంచి పాన్ దింపేయాలి. ఈ మిశ్రమాన్ని మీకు కావాల్సినన్ని భాగాలుగా చేసి మీకు నచ్చిన రంగులు కలపాలి. చల్లారాక కొవ్వొత్తుల మాదిరిగా చేయాలి. అదే మిశ్రమాన్ని ఒత్తుల్లా చేసి కొవ్వొత్తుల పైన పెట్టాలి. నోట్లో వేసుకోగానే కరిగిపోయే రుచికరమైన స్వీట్ క్యాండిల్స్ సిద్ధం.
ఖర్జూర నువ్వుల లడ్డు - Dates Sesame Laddu
కావలసినవి: తెల్ల నువ్వులు - ఒక కప్పు, ఖర్జూర (గింజలు తీసి తరగాలి)- ముప్పావు కప్పు, ఎండుకొబ్బరి తురుము - అర కప్పు.
తయారీ: నువ్వుల్ని పాన్‌లో వేసి ఓ మాదిరి మంట మీద నూనె వేయకుండా గోధుమరంగుకి వచ్చే వరకు వేగించి పక్కన పెట్టాలి. అదే పాన్‌లో కొబ్బరి వేసి కాసేపు వేగించి స్టవ్ ఆపేయాలి. నువ్వుల్ని మిక్సీలో వేసి నాలుగు సెకన్లు మాత్రమే (కచ్చాపచ్చాగా అయ్యేలా) మిక్సీ చేయాలి. వీటిని ఒక పెద్ద గిన్నెలోకి తీసి ఖర్జూర తరుగు, కొబ్బరి (ఒక టేబుల్‌స్పూన్ కొబ్బరి పొడిని పక్కన పెట్టుకోవాలి) వేసి చేతితో కలపాలి. ఈ మిశ్రమాన్ని లడ్డు ఉండల్లా చుట్టి కొబ్బరి తురుములో దొర్లించాలి.

Sweet Diwali - తియ్యని తీపావళి

Sweet Diwali - తియ్యని తీపావళి

తియ్యని తీపావళి
ఏ వాకిట్లో వెలిగినా...
 చీకట్లు ఉన్నంత మేర ప్రయాణిస్తాయి దీపకాంతులు.
 తీపిని పంచుకున్నా అంతే!
 వత్తిని వత్తి వెలిగించినట్లు...
 చేయిని చేయి హత్తుకున్నట్లు...
 హృదయాలన్నీ తియ్యందనాలౌతాయి.
 ఇచ్చిపుచ్చుకున్నవన్నీచిచ్చుబుడ్లయి పూలు కురిపిస్తాయి.
 ఆఖరికి...
 హ్యాపీ దీపావళి అనే మాట కూడా...
 తియ్యని ‘తీపావళి’లా వినిపిస్తుంది.
 మరి మీరేం పంచబోతున్నారు?
 బర్ఫీనా, గులాబ్‌జామా?
 లడ్డూనా, సున్నుండలా?


 సెవెన్ కప్ బర్ఫీ - Seven cup barphi

 కావలసినవి:

 శనగపిండి - ఒక కప్పు, పాలు - ఒక కప్పు, పచ్చికొబ్బరితురుము - ఒక కప్పు, పంచదార - ఒకటిన్నర  కప్పులు, కరిగించిన నెయ్యి - ఒకటిన్నర కప్పులు, ఏలకులపొడి - టీ స్పూను, బాదంపప్పులు - గార్నిషింగ్‌కి తగినన్ని

 తయారి:  
 బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి బాదంపప్పులను బంగారురంగులోకి వచ్చేవరకు వేయించి తీసి పక్కన ఉంచాలి
 అదే బాణలిలో శనగపిండి వేసి సన్నని మంట మీద దోరగా వేయించాలి. (మాడకుండా చూసుకోవాలి)

 మందంగా ఉండే పెద్ద బాణలిలో ఈ మిశ్రమాలన్నిటినీ వేసి బాగా కలపాలి

 (మిక్సీ జార్‌లో వేసి బ్లెండ్ చేస్తే ఉండలు లేకుండా అన్ని పదార్థాలు బాగా కలుస్తాయి)
 స్టౌ మీద ఈ బాణలి ఉంచి ఐదు నిముషాలు పెద్ద మంట మీద ఉంచి ఆపకుండా కలుపుతుండాలి

 మంట తగ్గించి అడుగు అంటకుండా కలుపుతూనే ఉండాలి

 సుమారు అరగంట తరవాత ఈ మిశ్రమం బాగా ఉడికి బాణలి నుండి విడుతుంటుంది

 ఒక పెద్ద ప్లేట్‌కి నెయ్యి రాసి, ఉడికిన మిశ్రమాన్ని అందులో పోసి సమానంగా పరవాలి

 బాదంపప్పులతో గార్నిష్ చేసి, వేడిగా ఉండగానే కావలసిన ఆకారంలోముక్కలుగా కట్ చేయాలి

 చల్లారిన తరవాత ముక్కలను తీసి గాలి చొరని డబ్బాలో జాగ్రత్త చేసుకోవాలి  ఇవి సుమారు నెల రోజుల దాకా నిల్వ ఉంటాయి.

 (గమనిక: చాలామంది మైసూర్‌పాక్ సరిగా రావటంలేదని అనుకుంటారు. కాని ఈ సెవెన్ కప్ బర్ఫీ కుదరకపోవడం ఉండదు. చాలా రుచిగా వస్తుంది)

 పెసర సున్నుండలు - Greengram sunnuNDalu

 కావలసినవి:

 పెసలు - కప్పు, బెల్లం తురుము - కప్పు, నెయ్యి - అర కప్పు, బియ్యం - కొద్దిగా, కిస్‌మిస్ - 10 గ్రా., జీడిపప్పు - 10 గ్రా.

 తయారి:  
 స్టౌ మీద బాణలిలో పెసలు వేసి దోరగా వేయించాలి

 కొద్దిగా రంగుమారాక దించి పక్కన ఉంచాలి

 అదే బాణలిలో బియ్యం వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి

 చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పిండి చేసుకోవాలి

 బెల్లం తురుము జతచేసి మరోమారు మిక్సీ పట్టాలి

 ఈ పొడిని ఒక పాత్రలోకి తీసుకుని, జీడిపప్పులు, కిస్‌మిస్ జతచేసి, కరిగించిన నెయ్యి కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు కట్టుకోవాలి

 గాలికి ఆరిన తర్వాత గాలి చొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి

 ఇవి నెలరోజులకు పైగా నిల్వ ఉంటాయి.

 సేమ్యా... కొబ్బరి లడ్డు - Vermicelli Coconut LaDDu


 కావలసినవి:
 సేమ్యా - కప్పు, పంచదార- కప్పు, ఎండుకొబ్బరి తురుము - కప్పు, నెయ్యి - అరకప్పు, ఏలకులపొడి - టీ స్పూను, మిఠాయిరంగు - చిటికెడు

 తయారి:  
 బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి కరిగాక, సేమ్యా వేసి వేయించి దించేయాలి

 చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి అయ్యేలా గ్రైండ్ చేయాలి

 ఒక పాత్రలో పంచదార, కొద్దిగా నీరు పోసి స్టౌ మీద ఉంచి పంచదార కరిగి తీగపాకం వచ్చేవరకు ఉంచాలి

 సేమ్యాపొడి, కొబ్బరితురుము, ఏలకులపొడి, మిఠాయిరంగు వేసి బాగా కలపాలి  నెయ్యి కొద్దికొద్దిగా వేస్తూ కలుపుతుండాలి

 ఉడుకుతున్న మిశ్రమం అంచులను విడుతున్నట్టుగా అనిపించాక స్టౌ ఆర్పేయాలి  కొద్దిగా చల్లారిన తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని, ఉడికిన మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుని లడ్డూలు తయారు చేయాలి

 పూర్తిగా చల్లారాక గాలిచొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి

 ఇవి వారం రోజులు నిల్వ ఉంటాయి.

 క్యారట్ గులాబ్‌జామ్ - Carrot GulAbjAm

 కావలసినవి:
 క్యారట్లు - పావు కిలో, పంచదార - పావుకిలో, మైదా - 125 గ్రా., గులాబ్‌జామ్ పొడి - 125 గ్రా., కార్న్‌ఫ్లోర్ - 6 టీ స్పూన్లు, పిస్తా - 10 (సన్నగా కట్ చేసుకోవాలి), పంచదార - అర టేబుల్ స్పూను, నీరు - ఒకటింపావు కప్పులు, ఏలకులపొడి - పావు టీ స్పూను, నెయ్యి - వేయించడానికి తగినంత

 తయారి:  
 క్యారట్లను శుభ్రంగా కడిగి తొక్క తీసి తురుముకోవాలి

 కుకర్‌లో ఉంచి సుమారు 20 నిముషాలు ఉడికించాలి

 చల్లారాక అధికంగా ఉన్న నీటిని పిండి తీసేసి, క్యారట్ తురుమును మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి

 ఒక  పాత్రలో మైదా, గులాబ్‌జామ్ పొడి వేసి బాగా కలపాలి

 అందులోనే క్యారట్ పేస్ట్, కార్న్‌ఫ్లోర్ జత చేసి బాగా కలపాలి చిన్నచిన్న ఉండలుగా చేసి ప్రతి బాల్‌నూ చేతితో పూరీలా ఒత్తి, అందులో కొద్దిగా పంచదార, పిస్తా ముక్కలు ఉంచి బాల్‌లా తయారుచేయాలి

 స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఈ బాల్స్‌ని వేసి మీడియం మంట మీద వేయించి బంగారువర్ణంలోకి వచ్చాక తీసేయాలి

 ఒక పాత్రలో పంచదార, నీరు పోసి మరిగించి స్టౌ ఆర్పేయాలి

 ఏలకుల పొడి వేసి కలపాలి వేయించి ఉంచుకున్న జామూన్స్‌ని ఇందులో వేసి సుమారు రెండు గంటల తరవాత సర్వ్ చేయాలి.

 దబ్బకాయ పులిహోర - Dabbakaya pulihOra

  కావలసినవి:

 బియ్యం - రెండు కప్పులు, నీరు - మూడు కప్పులు, దబ్బకాయ - 1, ఆవాలు - టీ స్పూను, శనగపప్పు - మూడు టీ స్పూన్లు, మినప్పప్పు - మూడు టీ స్పూన్లు, కరివేపాకు - మూడు రెమ్మలు, ఎండుమిర్చి - ఆరు, పచ్చిమిర్చి - నాలుగు, పల్లీలు - పావు కప్పు, జీడిపప్పు - 10 గ్రా., పసుపు - అర టీ స్పూను, ఉప్పు - తగినంత, ఇంగువ - టీ స్పూను, నూనె - నాలుగు టేబుల్ స్పూన్లు

 తయారి:  
 బియ్యాన్ని శుభ్రంగా కడిగి మూడుకప్పుల నీరు పోసి పొడిపొడిగా వచ్చేలా అన్నం ఉడికించి దించి వేడిగా ఉండగానే పెద్ద పాత్రలోకి తిరగతీసి  అటు ఇటు కలపాలి  బాణలిలో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగాక ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు వేసి బాగా వేయించాలి

 పచ్చిమిర్చి తరుగు, ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు, పసుపు, ఇంగువ జత చేసి వేయించి దించేయాలి

 ఒక పాత్రలోకి దబ్బకాయ రసం తీసి, ఉప్పు జతచేసి బాగా కలపాలి

 పాత్రలోకి తీసుకున్న అన్నం మీద వేయించి ఉంచుకున్న పోపు, దబ్బకాయరసం వేసి బాగా కలిపి సుమారు గంట తర్వాత సర్వ్ చేయాలి.

 రవ్వ అప్పాలు - Ravva AppAlu


 కావలసినవి:

 బొంబాయిరవ్వ - కప్పు, పంచదార - కప్పు, నీరు - కప్పు, కొబ్బరి తురుము - పావు కప్పు, నెయ్యి - రెండు టీ స్పూన్లు, ఏలకుల పొడి - అర టీ స్పూను, నూనె - డీప్ ఫ్రైకి తగినంత

 తయారి:  
 ముందుగా ఒక బాణలిలో బొంబాయిరవ్వ వేసి సన్నని మంట మీద దోరగా వేయించుకోవాలి

 ఒక పాత్రలో కప్పు నీరు పోసి మరిగించాలి  వేయించి ఉంచిన బొంబాయిరవ్వను కొద్దికొద్దిగా పోస్తూ ఆపకుండా కలుపుతుండాలి

 పంచదార జతచేసి బాగా కలపాలి  నెయ్యి, కొబ్బరితురుము, ఏలకులపొడి వేసి మరోమారు కలిపి మిశ్రమం దగ్గర పడేవరకు కలుపుతుండాలి

 కిందకు దించి ఐదు నిముషాలు చల్లారనివ్వాలి

 చేతికి కొద్దిగా నెయ్యి లేదా నూనె రాసుకుని ఉడికించిన మిశ్రమం కొద్దిగా తీసుకుని అప్పాల మాదిరిగా ఒత్తాలి

 స్టౌ మీద బాణలిలో నూనె బాగా కాగాక మంట మీడియంలోకి తగ్గించి, తయారుచేసి ఉంచుకున్న రవ్వ అప్పాలను ఒక్కటొక్కక్కటిగా నూనెలో వేసి రెండువైపులా దోరగా వేయించాలి

 ఇవిసుమారు నాలుగైదు రోజులు నిల్వ ఉంటాయి.
Learn English Vocabulary & Help the Poor |Free Rice |
 
google-site-verification: google2463dc209284d38a.html