Ads 468x60px

Pages

Learn English Vocabulary & Help the Poor| |Free Rice |

Eggless Cake - కలపకున్నాకేకు ఓకే

Eggless Cake - కలపకున్నాకేకు ఓకే

కోక్ చల్లగా ఉందా లేదా అని చూస్తాం.
 మైసూర్ పాక్... మృదువుగా ఉందా లేదా అని చూస్తాం.
 పకోడీ కరకరలాడేదేనా అని చూస్తాం.
 ప్యాక్డ్ ఫుడ్‌పై ఇంగ్రెడియెంట్స్ చూస్తాం.
 అన్నిట్లో అన్నీ చూస్తాం కానీ... కేక్‌లో ఇవేవీ చూడం.
 నోట్లో ఎప్పుడు వేసుకుందామా అని చూస్తాం!
 కానీ మనలో కొంతమంది...
 గుడ్డు గానీ కలవలేదు కదా అని చూస్తారు!
 ఎగ్ లేకుండా కేకా?! ఎవరు చేస్తారండీ!
 ఎవరో ఎందుకు మనమే చేద్దాం రండి.


Dates Cake - డేట్స్ కేక్

 కావలసినవి:
 మైదాపిండి - 2 కప్పులు, ఖర్జూరాలు సన్నగా తరిగిన ముక్కలు - కప్పు, పంచదార - ముప్పావు కప్పు, ఉప్పు లేని బటర్ - అర కప్పు, నీరు - 2 కప్పులు, కిస్‌మిస్ - పావు కప్పు, జీడిపప్పు పలుకులు - పావుకప్పు, వెనిలా ఎసెన్స్ - టీ స్పూను, బేకింగ్ సోడా - ఒకటి ముప్పావు టీ స్పూన్లు, నిమ్మరసం - టేబుల్ స్పూను, పాలు - కప్పు, ఉప్పు - చిటికెడు

 తయారి:
 ఒక నాన్‌స్టిక్ పాన్‌లో తరిగి ఉంచుకున్న ఖర్జూరం ముక్కలు, కిస్‌మిస్‌లు, నీరు, జీడిపప్పు పలుకులు, పంచదార, బటర్ వేసి స్టౌ మీద ఉంచి పంచదార, బటర్ కరిగేవరకు కలపాలి

 మంట తగ్గించి, ఖర్జూరాలు ముద్దగా అయ్యేవరకు సుమారు 25 నిముషాలు ఉడికించి, దించి, చల్లారనివ్వాలి

 వెనిల్ ఎసెన్స్, నిమ్మరసం జత చేయాలి

 అవెన్‌ను 180 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర ప్రీహీట్ చేయాలి

 కేక్ పాన్‌కు బటర్ పూసి పక్కన ఉంచాలి

 ఒక పాత్రలో బేకింగ్ సోడా, మైదా, ఉప్పు వేసి కలిపి, పైన తయారుచేసి ఉంచుకున్న మిశ్రమానికి జత చేయాలి

 పాలు జతచేసి మిశ్రమం చిక్కగా ఉండేలా కలపాలి

 ఆలస్యం చేయకుండా కేక్ పాన్‌లో ఈ మిశ్రమం పోసి అవెన్‌లో ఉంచాలి

 180 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర 35 నిముషాల పాటు బేక్ చేయాలి

 కేక్‌ను చల్లారిన తర్వాత కట్ చేసి సర్వ్ చేయాలి.

Venilla Sponge Cake - వెనిలా స్పాంజ్ కేక్

 కావలసినవి:
 మైదాపిండి - ఒకటిన్నర కప్పులు, పంచదార - ముప్పావు కప్పు, పెరుగు - కప్పు, నూనె - అరకప్పు, బేకింగ్ సోడా - అర టీ స్పూను, బేకింగ్ పౌడర్ - ఒకటింపావు టీ స్పూన్లు, వెనిలా ఎసెన్స్ - టీ స్పూను

 తయారి:
 ముందుగా మైదాపిండి జల్లించాలి

 అవెన్‌ను 200 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర ప్రీహీట్ చేయాలి

 8 అంగుళాల రౌండ్‌కేక్ పాన్‌కి నూనె రాసి పక్కన ఉంచాలి

 ఒకపాత్రలో పెరుగు వేసి దానికి బేకింగ్‌సోడా, బేకింగ్ పౌడర్ జత చేసి బాగా కలిపి కాసేపు పక్కన ఉంచాలి

 వెనిలా ఎసెన్స్ జత చేసి మరోమారు కలపాలి

 ఈ మిశ్రమంలో మైదాపిండిని కొద్దికొద్దిగా వేస్తూ కలపాలి. (ఎక్కడా ఉండలు లేకుండా చూసుకోవాలి. మరీ ఎక్కువగా కలపకూడదు)

 తయారు చేసి ఉంచుకున్న మిశ్రమాన్ని పాన్‌కేక్‌లో పోసి సమానంగా కలపాలి

 200 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర 10 నిముషాలు బేక్ చేయాలి

 180 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు తగ్గించి 30 నిముషాలు బేక్ చేసి తీసేయాలి

 (ఇంకాసేపటిలో కేక్ తయారవుతుందనగా, కేక్‌మీద పాలను పైపూతగా పూయాలి)

 కేక్ కాస్త చల్లారిన తర్వాత దానిని మరో పాత్రలోకి తిరగ తీసి కట్ చేయాలి.

Tooty Fruity Cake - టూటీ ఫ్రూటీ కేక్

 కావలసినవి:
 గోధుమపిండి - కొంచెం తక్కువగా రెండు కప్పులు, పంచదార - కప్పు, నీరు - కప్పు, నూనె - 5 టేబుల్ స్పూన్లు, టూటీ ఫ్రూటీ - 5 టేబుల్ స్పూన్లు, వెనిలా ఎసెన్స్ - 2 టీ స్పూన్లు, నిమ్మరసం - టేబుల్ స్పూను, బేకింగ్ సోడా - ఒకటింపావు టీ స్పూన్లు, ఉప్పు - చిటికెడు

 తయారి:  
 ఒక పాత్రలో గోధుమపిండి, ఉప్పు, బేకింగ్ సోడా వేసి బాగా కలిపి జల్లించి పక్కన ఉంచాలి

 అవెన్‌ను 180 డిగ్రీల దగ్గర ప్రీ హీట్ చేయాలి

 8 అంగుళాల పాన్‌కేక్‌కి నూనె రాసి పక్కన ఉంచాలి

 మిక్సీజార్‌లో పంచదార, నూనె, నీరు, నిమ్మరసం, వెనిలా ఎసెన్స్ వేసి అన్నీ కలిసి కరిగేవరకు బాగా మిక్సీ పట్టాలి

 టూటీఫ్రూటీ జతచేసి మరోమారు మిక్సీ పట్టి ఒక పాత్రలోకి తీసుకోవాలి

 గోధుమపిండి కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా బాగా కలపాలి

 ఈ మిశ్రమాన్ని ఆలస్యం చేయకుండా కేక్‌పాన్‌లో పోసి అవెన్‌లో ఉంచాలి

 180 డిగ్రీల దగ్గర 35 నిముషాల పాటు బేక్ చేయాలి

 కేక్‌చల్లారిన తర్వాత వేరే ప్లేట్‌లోకి తిరగదీసి ముక్కలుగా కట్ చేయాలి.
 

Banana Cake - బనానా కేక్

 కావలసినవి:
 మైదాపిండి - ముప్పావు కప్పు, బాగా పండిన అరటిపళ్లు - 2 (మెత్తగా గుజ్జు చేయాలి), పంచదార - 6 టేబుల్ స్పూన్లు, బేకింగ్ పౌడర్ - అర టీ స్పూను, బేకింగ్ సోడా - పావు టీ స్పూను, కోకో పౌడర్ - 5 టేబుల్ స్పూన్లు, ఉప్పు - కొద్దిగా, నూనె - పావు కప్పు, వెనిలా ఎసెన్స్ - అర టీ స్పూను

 తయారి:  
 ఒక పాత్రలోమైదాపిండి, ఉప్పు, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి బాగా కలిపి, జల్లించాలి
 అవెన్‌ను 180 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర ప్రీహీట్ చేయాలి

 7 అంగుళాల రౌండ్ పాన్ కేక్‌కు నూనె పట్టించాలి

 మిక్సీ జార్‌లో అరటిపండు గుజ్జు, పంచదార, నూనె, వెనిలా ఎసెన్స్ వేసి మిక్సీ పట్టి, ఒక పాత్రలోకి తీసుకోవాలి

 మైదాపిండి, కోకోపొడిని కొద్దికొద్దిగా జత చేస్తూ పిండి బాగా కలపాలి

 కేక్‌పాన్‌లోకి ఈ మిశ్రమాన్ని పోయాలి

 అవెన్‌లో 180 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర సుమారు 35 నిముషాలు బేక్ చేసి బయటకు తీయాలి

 చల్లారిన తర్వాత వేరే ప్లేట్‌లోకి తీసుకుని కట్ చేసి సర్వ్ చేయాలి.
Tags - టాగ్లు: కేక్‌, ఇంగ్రెడియెంట్స్, మైసూర్ పాక్, Cake, Ingredients, Mysore Pak
Learn English Vocabulary & Help the Poor |Free Rice |
 
google-site-verification: google2463dc209284d38a.html