Ads 468x60px

Pages

Learn English Vocabulary & Help the Poor| |Free Rice |

Corn Tastes - కార్న్ రుచులు


అమోఘమైన కార్న్ రుచుల్ని ఫుల్ వాల్యూమ్‌తో
నీరు-నిప్పు ఒకదానికొకటి యాంటీ.
 ‘పొత్తు’ కుదిరితే మాత్రం ఒకటే పార్టీ!
 నిప్పులపై కాలుతున్న మొక్కజొన్నలు...
 నింగినుంచి రాలుతున్న చల్లటి జల్లులు...
 చిటపట... చిటపట.... చిటపట...

Wonderful Corn Varieties - అమోఘమైన కార్న్ రుచుల్ని ఫుల్ వాల్యూమ్‌తో

 ఒకటే సంగీతం. ఒకటే యుగళగీతం
 వర్ష రుతువులో... ‘మేఘరాగం’లా!
 ఈ రాగానికి ఇవాళ మీ కిచెన్‌ని ట్యూన్ చెయ్యండి.
 అమోఘమైన కార్న్ రుచుల్ని ఫుల్ వాల్యూమ్‌తో... ఘుమఘుమలాడించండి. 
 షీష్ కబాబ్ పొటాబో వెడ్జెస్
 కావలసినవి: 
 ఉడికించి మెత్తగా చేసిన చికెన్ - పావు కిలో
 చీజ్ తురుము - పావు కప్పు; ఉప్పు - తగినంత
 వెల్లుల్లిపేస్ట్ - అర టీ స్పూను: మిరియాలపొడి పొడి - పావు టీ స్పూను; దాల్చినచెక్క పొడి - అర టీ స్పూను; స్వీట్‌కార్న్ - 1
 బంగాళదుంపలు - రెండు (పెద్దపెద్ద ముక్కలుగా కట్ చేయాలి)
 ఆవిరి మీద ఉడికించిన ఉల్లిపాయలు - 1
 రెడ్, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు - 8 (పెద్దవి)
 తయారి:
 మెత్తగా చేసిన చికెన్, చీజ్, ఉప్పు, వెల్లుల్లి పేస్ట్, మిరియాలపొడి, దాల్చినచెక్క పొడి... వీటిని ఒక పాత్రలో వేసి బాగా కలిపి, పెద బాల్స్‌లా చేసి పక్కన ఉంచాలి. 
 కబాబ్ తయారుచేసే ఊచకి... బంగాళదుంప ముక్క, చికెన్ బాల్, క్యాప్సికమ్ ముక్క, మొక్కజొన్న ముక్క గుచ్చాలి. ఈ విధంగా మళ్లీ ముక్కలను గుచ్చాలి.
 గుచ్చిన పదార్థాలన్నీ మెత్తబడేవరకు ఆవిరి మీద ఉడికించాలి. (ఇష్టపడేవారు... నిప్పుల మీద మొక్కజొన్నపొత్తులు కాల్చినట్టు కాల్చుకోవచ్చు)
 స్వీట్‌కార్న్ సూప్
 కావలసినవి: 
 స్టాక్ వాటర్ - అర లీటరు
 ఉల్లితరుగు - పావు కప్పు
 వెల్లుల్లి తరుగు - అర టీ స్పూను
 మొక్కజొన్న గింజలు - 2 కప్పులు
 రైస్‌నూడుల్స్ - 80 గ్రా. (చిన్నచిన్న ముక్కలుగా విరిచేయాలి); అల్లంముక్క - చిన్నది; ఉప్పు, మిరియాలపొడి - తగినంత
 తయారి: 
 ఒక పెద్ద పాత్రలో స్టాక్ వాటర్, ఉల్లి తరుగు, వెల్లుల్లి తరుగు, మొక్కజొన్న గింజలు, రైస్ నూడుల్స్, అల్లం ముక్క వేసి స్టౌ మీద ఉంచాలి. 
  
 పాత్ర మీద మూత ఉంచి, సన్నని మంట మీద 15 నిముషాలు ఉడికించి దించేయాలి.
  
 ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపి సర్వ్ చేయాలి.
 కార్న్ వెజిటబుల్ కర్రీ
 కావలసినవి: 
 కొత్తిమీర - కొద్దిగా 
 ధనియాలపొడి - టేబుల్ స్పూను
 నానబెట్టిన మొక్కజొన్న గింజలు - రెండు కప్పులు
 కరివేపాకు - నాలుగు రెమ్మలు; పసుపు - కొద్దిగా
 వెల్లుల్లి తరుగు - టీ స్పూను; వెల్లుల్లిరేకలు - 4
 పచ్చిమిర్చి తరుగు - పావు టీ స్పూను
 ఆవాలు - టీ స్పూను; నెయ్యి - టేబుల్ స్పూను
 ఉల్లితరుగు - పావు కప్పు; కారం - కొద్దిగా
 ఉప్పు - తగినంత; గరంమసాలా - టీ స్పూను
 టొమాటో తరుగు - అర కప్పు; ఇంగువ - చిటికెడు
 తయారి: 
 పాన్‌లో నెయ్యి వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి.
 
 ఉల్లితరుగు వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి.
 
 పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు జత చేసి బాగా కలపాలి.
 
 టొమాటో ముక్కలు వేసి ఉడికించాలి.
 
 మసాలా దినుసులు, కొద్దిగా నీరు జతచేసి కొద్దిసేపు కలపాలి.
 
 మొక్కజొన్నగింజలు వేసి మరోమారు కలపాలి.
 
 తగినంత నీరు పోసి, కుకర్‌లో ఉడికించి దించేయాలి.
 
 కొత్తిమీరతో గార్నిష్ చేసి రోటీలతో సర్వ్ చేయాలి.
 కార్న్ స్టఫ్‌డ్ టొమాటో
 కావలసినవి:
 ఉడికించిన మొక్కజొన్న గింజలు - రెండు కప్పులు
 ఎల్లో క్యాప్సికమ్ తరుగు - పావు కప్పు
 గ్రీన్ క్యాప్సికమ్ తరుగు - పావు కప్పు
 ఉల్లితరుగు - పావు కప్పు; ఉప్పు - తగినంత
 కొత్తిమీర తరుగు - 3 టేబుల్ స్పూన్లు
 నిమ్మరసం - రెండున్నర స్పూన్లు
 మిరియాల పొడి - పావు టీ స్పూను
 జీలకర్ర - పావు టీ స్పూను
 పెద్ద టొమాటోలు - 6
 తయారి:
 టొమాటోలు, కొత్తిమీర తప్ప మిగిలిన వస్తువులన్నీ ఒక పెద్ద పాత్రలో వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి.
 
 టొమాటోలను బుట్ట ఆకారంలో వచ్చేలా జాగ్రత్తగా కట్ చేయాలి.
 
 ఒక్కో టొమాటోను ఈ మిశ్రమంతో స్టఫ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.
 స్వీట్‌కార్న్ ఫ్రిట్టర్స్
 కావలసినవి: 
 నానబెట్టిన మొక్కజొన్న గింజలు - 200 గ్రా.
 ఉల్లికాడల తరుగు - పావుకప్పు; ఎండుమిర్చి - 1
 మొక్కజొన్న రవ్వ - 75 గ్రా.; జీలకర్ర - 40 గ్రా.
 బేకింగ్ పౌడర్ - టీ స్పూను; పసుపు - కొద్దిగా
 జీలకర్ర పొడి - అర టీ స్పూను; కొత్తిమీర - కొద్దిగా
 తయారి: 
 మిక్సీలో మొక్కజొన్న గింజలు, ఉల్లికాడల తరుగు, ఎండుమిర్చి... వేసి మెత్తగా చేసి, ఒక పాత్రలోకి తీసుకోవాలి. (ఈ మిశ్రమం గట్టిగా ఉండాలి)  మొక్కజొన్న రవ్వ, జీలకర్ర, బేకింగ్‌పౌడర్, పసుపు, జీలకర్ర పొడి, కొత్తిమీర జతచేసి చేతితో బాగా కలపాలి  ఈ మిశ్రమాన్ని వడల మాదిరిగా ఒత్తాలి  పాన్ మీద కొద్దిగా నూనె వేసి కాగాక వీటిని ఒక్కటొక్కటిగా వేసి రెండు వైపులా దోరగా కాల్చాలి.
Learn English Vocabulary & Help the Poor |Free Rice |
 
google-site-verification: google2463dc209284d38a.html