Different Juices - పండ్లరసాలు
ఏదో రెండు గుక్కల చల్లటి నీళ్లతో...వేసవిని దాటేద్దామంటే అయ్యేపని కాదు.
నోరెండి, నాలుక పిడచగట్టి...
తియ్యతియ్యగా, పుల్లపుల్లగా...ఏదైనా కావాలంటాయి.
ఆపిల్, లెమన్, పుదీనా, స్ట్రాబెరీ, మ్యాంగో...
ఏదైనా సరే... సమ్‌థింగ్ స్పెషల్!
తప్పదు.
వేసవిని దాసోహం చేసుకోవాలంటేపండ్లరసాలతో దాహం తీర్చుకోవలసిందే!
మీ మనసు దేన్ని కోరితే... దాన్ని షర్బత్‌గానో, జ్యూస్‌గానో సేవించండి.
మీ ‘గొంతమ్మ’ కోర్కెలన్నీ తీర్చుకోండి.
స్ట్రాబెర్రీ బ్లాజమ్
వెనీలా ఐస్‌క్రీమ్ - ఒకటిన్నర స్కూపులు
స్ట్రాబెర్రీలు - 5
పాలు - 80 మి.లీ. (కాచి చల్లార్చినవి)
తయారి:
స్ట్రాబెర్రీలను శుభ్రంగా కడిగి మిక్సీలో వేసి గుజ్జులా అయ్యేలా తిప్పాలి.
గాజు గ్లాసులో ముందుగా స్ట్రాబెర్రీ గుజ్జు వేయాలి.
తరవాత వెనీలా ఐస్‌క్రీమ్ వేయాలి.
చివరగా చల్లటిపాటు పోసి సర్వ్ చేయాలి.
వర్జిన్ మొజితో...
పుదీనా ఆకులు - 15
బ్రౌన్ సుగర్ - టీ స్పూను
(సూపర్ మార్కెట్‌లో లభ్యమవుతుంది)
నిమ్మరసం - టీ స్పూను
స్ప్రైట్ - 150 మి.లీ.
తయారి
పుదీనా ఆకులను కడిగి శుభ్రం చేసుకోవాలి.
మిక్సీలో బ్రౌన్ సుగర్, నిమ్మరం వేసి బాగా తిప్పాలి.
పుదీనా ఆకులను కూడా వేసి తిప్పాలి.
పొడవాటి గ్లాసులో ఈ మిశ్రమాన్ని వేయాలి.
చల్లటి స్ప్రైట్ వేసి కలిపి సర్వ్ చేయాలి.
వాటర్ మెలన్ జ్యూస్
నిమ్మకాయ - 1 (పెద్దది)
పుచ్చకాయ ముక్కలు -
మూడు కప్పులు
సోడా - 50 మి.లీ.
పంచదార - అరకప్పు
తయారి
ముందుగా నిమ్మరసం తీసి పక్కన ఉంచుకోవాలి.
పంచదారను నీటిలో వేసి కరిగించాలి.
పుచ్చకాయలను మిక్సీలో వేసి మెత్తగా చేయాలి.
నిమ్మరసం, పంచదార నీళ్లు కూడా పోసి మళ్లీ ఒకసారి తిప్పి వడబోయాలి.
ఫ్రిజ్‌లో ఉంచాలి.
సర్వ్ చేసే ముందు సోడా కలిపితే రుచిగా ఉంటుంది.
కివీ డిలైట్
తాజా కివీలు - మూడు (సూపర్ మార్కెట్లలో దొరుకుతాయి)
సోడా - 80 మి.లీ.
పంచదార - టేబుల్ స్పూన్
తయారి
కివీలను శుభ్రంగా కడిగి కట్ చేసి ఉంచుకోవాలి.
పంచదారను కొద్దిపాటి నీళ్లలో వేసి కరిగించాలి.
మిక్సీలో... కివీ ముక్కలు, పంచదార నీళ్లు వేసి బాగా తిప్పాలి.
ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో ఉంచాలి.
గ్లాసులో ఈ మిశ్రమాన్ని వేసి సోడా పోసి కలపాలి.
కివీ స్లైసెస్‌తో గార్నిష్ చేసి చల్లగా సర్వ్ చేయాలి.
ఆపిల్ టినీ మాక్‌టైల్
ఆపిల్ - 1
నిమ్మరసం - టీ స్పూను
పంచదార - టీ స్పూను
తయారి
కొద్దిగా నీరు తీసుకుని అందులో పంచదార వేసి కరిగించాలి.
ఆపిల్‌పై తొక్క తీసి చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి జ్యూసర్‌లో వేసి మెత్తగా అయ్యేలా తిప్పాలి.
నిమ్మరసం, పంచదార నీరు కూడా జతచేయాలి.
జ్యూసర్‌లో అన్నీ కలిసేలా మిక్స్ చేయాలి.
ఫ్రిజ్‌లో ఉంచాలి.
ఆపిల్ స్లైస్‌తో గార్నిష్ చేసి చల్లగా సర్వ్ చేయాలి.
మ్యాంగో సన్‌షైన్
మ్యాంగో ఐస్‌క్రీమ్ - ఒకటిన్నర స్కూపులు
మామిడిపండు - ఒకటిన్నర పండు
పాలు - 40 మి.లీ.
పంచదార - టేబుల్‌స్పూన్
తయారి:
మామిడిపండును శుభ్రంగా కడిగి తొక్క తీసి మిక్సర్‌లో వేసి మెత్తగా అయ్యేలా తిప్పాలి.
సగం ముక్కమామిడిపండును గుజ్జులా చేసి పక్కన ఉంచుకోవాలి.
పాలు కాచి చల్లార్చాలి.
గ్లాసులో మామిడిపండు గుజ్జు, మామిడిపండు రసం, పాలు, మ్యాంగో ఐస్‌క్రీమ్‌లను వరుసగా వేసి చల్లగా సర్వ్ చేయాలి.
బ్లూ లాగూన్
నిమ్మకాయ - పెద్దది ఒకటి
బ్లూ క్యురాసో సిరప్ - 30 మి.లీ.
(సూపర్ మార్కెట్‌లో లభిస్తుంది)
స్ప్రైట్ - 200 మి.లీ.
తయారి
ముందుగా నిమ్మరసం తీసి పక్కన ఉంచాలి.
ఒక గ్లాసులో నిమ్మరసం, బ్లూ క్యురాసో సిరస్ వేసి కలపాలి.
స్ప్రైట్ కూడా పోసి బాగా కలిపి చల్లగా సర్వ్ చేయాలి.
మిమోసా మాక్‌టైల్
కమలాపళ్లు - మూడు
సోడా - తగినంత
ఐస్ - తగినంత
తయారి:
ముందుగా కమలాపళ్ల నుంచి రసం తీయాలి. ఒక గ్లాసులో కమలాపండు రసం పోయాలి. తగినంత సోడా, ఐస్ వేసి చల్లగా సర్వ్ చేయాలి.

