Ads 468x60px

Pages

Learn English Vocabulary & Help the Poor| |Free Rice |

milE taste mErA tumhra - మిలే టేస్ట్ మేరా తుమ్హారా

milE taste mErA tumhra - మిలే టేస్ట్ మేరా తుమ్హారా

Special Recipes

కేక్ మనది కాదు. కానీ మన పిల్లలకు ప్రాణం.
పిజ్జా మనది కాదు. కానీ మన యూత్‌కి ఇష్టం.
శాండ్‌విచ్ మనది కాదు. కానీ మనవాళ్లకది...
ఫుల్‌మీల్స్‌తో సమానం!
స్పినాచ్ సూప్, రిసోతో రైస్‌డిష్, కివీ మూజ్...
చాలా ఉన్నాయ్... మనకు నచ్చే ఫారిన్ ఫుడ్స్!
ఏ సంస్కృతినైనా ఆదరించడం మన గొప్పతనం.
ఎలాంటి సంస్కృతికైనా...
‘ఇండియన్’ టచ్ ఇవ్వడం మన గడుసుదనం.
ఇవాళ రిపబ్లిక్ డే. గణతంత్ర దినోత్సవం!
ఈ రోజంతా మనకు దేశ దేశాల నుంచిశుభాకాంక్షలు అందుతూనే ఉంటాయి.
ధన్యవాద సమర్పణగా ఏం చేద్దామంటారు?
ఈ మువ్వన్నెల అంతర్జాతీయ రుచులను షేర్ చేసుకుందాం.
‘మిలే టేస్ట్ మేరా తుమ్హారా’ అని ఆస్వాదిద్దాం.


క్యారట్, పాలకూర సూప్

కావలసినవి
క్యారట్లు - 200 గ్రా.
పాలకూర - 150 గ్రా.
ఫ్రెష్ క్రీమ్ - 100 గ్రా.

తయారి
కొన్ని నీళ్లు పోసి, క్యారట్లను ఉడికించి, మిక్సీలో పేస్ట్ చేయాలి.
దీంట్లో తగినంత ఉప్పు, కొద్దిగా మిరియాలపొడి, పంచదార కలపాలి.

క్రీమ్‌లో కొద్దిగా నీళ్లు కలిపి విడిగా ఉడికించాలి.
కొన్ని నీళ్లు పోసి, పాలకూరను ఉడికించి, మిక్సీలో పేస్ట్ చేయాలి.
దీంట్లో తగినంత ఉప్పు, కొద్దిగా మిరియాలపొడి, పంచదార కలపాలి.
సూప్ బౌల్ తీసుకొని దాంట్లో క్యారట్ సూప్, స్పినాచ్ సూప్‌ను ఒకేసారి నెమ్మదిగా పోయాలి. మధ్యలో క్రీమ్‌తో గార్నిష్ చేయాలి.
ఇలా తయారుచేసుకున్నాక తిరంగా కలర్‌లో సూప్ నోరూరిస్తుంది.

కాటేజ్ చీజ్ పెస్తో సాండ్‌విచ్

కావలసినవి
కాటేజ్ చీజ్ (పనీర్) - 80 గ్రా.
టొమాటోలు - 2 (పల్చని స్లైసులుగా కట్ చేయాలి)
గ్రీన్ లెట్యూస్ - 4 ఆకులు
పెస్తో సాస్ - టేబుల్ స్పూన్
బ్రెడ్ (సియాబాటా) - 2 స్లైసులు
(పై పదార్థాలన్నీ మార్కెట్లో రెడీమేడ్‌గా లభిస్తాయి)

తయారి
బ్రెడ్‌ని సగం సగం (క్రాస్)గా కట్ చేసి, అవెన్‌లో పెట్టి టోస్ట్ చేయాలి.
పనీర్‌ను పెస్తో సాస్‌లో మ్యారినేట్ చేసి, గ్రిల్ చేయాలి.
టోస్ట్ చేసిన బ్రెడ్ మధ్యలో ముందుగా లెట్యూస్ ఆకులు అమర్చి, పైన గ్రిల్ చేసిన పనీర్, ఆ పైన టొమాటో స్లైసులు, వాటి పైన చీజ్‌ను అమర్చాలి.

కేక్

కావలసినవి
స్పాంజ్‌కేక్ - 500 గ్రా., ఆరెంజ్ క్రష్ - 60 ఎం.ఎల్
గ్రీన్ ఆపిల్ క్రష్ - 60 ఎం.ఎల్
విపిన్ క్రీమ్ - 200 గ్రా., షుగర్ సిరప్ - 50 ఎం.ఎల్
చాక్లెట్ స్టిక్స్, చెర్రీ - అలంకరణకు
(పైపదార్థాలన్నీ మార్కెట్లో రెడీమేడ్‌గా లభిస్తాయి)

తయారి
స్పాంజ్ కేక్ మూడు పొరలు వచ్చేలా లేయర్లుగా కట్ చేసుకోవాలి. మూడు లేయర్ల పైన షుగర్ సిరప్ కొద్దిగా చల్లాలి.
గ్రీన్ ఆపిల్ క్రష్‌లో విపిన్ క్రీమ్ వేసి కలపాలి. అలాగే విడిగా ఆరెంజ్ క్రష్‌లో విపిన్ క్రీమ్ వేసి కలపాలి.
కింది స్పాంజ్ కేక్ లేయర్‌పైన విపిన్ క్రీమ్ కలిపిన గ్రీన్ ఆపిల్ క్రష్‌ను పూయాలి. దానిపైన మరో స్పాంజ్ లేయర్ పెట్టాలి.
దానిపైన విపిన్ క్రీమ్ కలిపిన ఆరెంజ్ క్రష్‌ను పూయాలి.
చుట్టూ విపిన్ క్రీమ్‌తో కవర్ చేయాలి. దీంతో కేక్ షేప్ వస్తుంది. పైన చాక్లెట్ స్టిక్స్, చెర్రీతో గార్నిష్ చేసుకోవాలి.

ఆరెంజ్ అండ్ కివీ మూజ్

కావలసినవి
వైట్ చాక్లెట్ - 400 గ్రా.
ఫ్రెష్ ఆరెంజ్ క్రష్ - 110 ఎం.ఎల్
ఫ్రెష్ కివీ క్రష్ - 110 ఎం.ఎల్
ఫ్రెష్ ఆరెంజ్, ఫ్రెష్ కివీ - అలంకరణకు తగినంత
గుడ్డు - 1
విపిన్ క్రీమ్ - 60 ఎం.ఎల్
జెలటిన్ - 20 గ్రా.
(పై పదార్థాలన్నీ మార్కెట్లో రెడీమేడ్‌గా లభిస్తాయి)

తయారి
ఒక గిన్నెలో వైట్ చాక్లెట్ వేసి, వేడినీటిలో పెట్టి కరిగించాలి. దీనిని రెండు భాగాలుగా చే సి, రెండు గిన్నెలలో వేయాలి. ఒకదాంట్లో ఆరెంజ్ ఫ్రెష్, ఒక దాంట్లో కివీ ఫ్రెష్ కలపాలి.
గుడ్డు, జెలటిన్‌ను బాగా కలిపి, పై వాటిలో సమానంగా కలపాలి.
గ్లాస్‌లో కివీ మిశ్రమం, పైన విపిన్ క్రీమ్, ఆ పైన ఆరెంజ్ మిశ్రమం వేసి సెట్ చేయాలి.
ఇలా సెట్ చేసిన గ్లాసును డీప్ ఫ్రిజ్‌లో 45 ని.ల పాటు ఉంచాలి.
చల్లగా సర్వ్ చేయాలి.

పిజ్జా

కావలసినవి
కమలాపండు - 1 (తొక్క తీసి, తొనలుగా వలుచుకోవాలి)
పాలకూర - 20 గ్రా.
బ్రొకోలి - 20 గ్రా.
నట్స్ - టేబుల్ స్పూన్
మొజొరుల్లా చీజ్ - 100 గ్రా.
టొమాటో సాస్ - 2 టేబుల్‌స్పూన్లు
పెస్తో సాస్ - 2 టేబుల్ స్పూన్లు
పిజ్జా బేస్ - కేజీ

పిజ్జా బేస్ కోసం...

కావలసినవి:
మైదా - కేజీ
ఈస్ట్ - 20 గ్రా.
పంచదార - 20 గ్రా.
ఉప్పు - 20 గ్రా.
నీళ్లు - అర లీటర్
ఆలివ్ ఆయిల్ - 90 ఎం.ఎల్

బేస్ తయారి:
పిజ్జాబేస్ కోసం చెప్పిన పదార్థాలన్నీ బాగా కలిపి, బేకింగ్ పాత్రలో సెట్ చేసి, అవెన్‌లో బేక్ చేయాలి.

పిజ్జా తయారి
పిజ్జా బేస్ పైన సగభాగం టొమాటో సాస్‌తో నింపాలి. మిగతా సగభాగం పెస్తో సాస్‌తో నింపాలి. రెండింటి మధ్యలో మొజొరుల్లా చీజ్ వేయాలి. టొమాటో సాస్ భాగంలో ఆరెంజ్ స్లైసులు, పెస్తోసాస్ భాగంలో పాలకూర, బ్రొకోలీ సెట్ చేయాలి. ఇలా సెట్ చేసిన దానిని, అవెన్‌లో పెట్టి 200 డిగ్రీల ఉష్ణోగ్రతలో బేక్ చేసి, తీయాలి.

నోట్:
పిజ్జా బేస్ రెడీమేడ్‌గా కూడా దొరుకుతుంది.
అవెన్‌లో కాకుండా కుకర్‌లో చేయాలనుకుంటే బేస్ మరీ మెత్తగా అయిపోయి, రుచి మారుతుంది.

రైస్ డిష్

కావలసినవి
రైస్ - 250 గ్రా.
ఫ్రెష్ క్రీమ్ - 200 ఎం.ఎల్
స్టాక్ వాటర్ (కూరగాయలను ఉడికించిన నీరు) - 200 ఎం.ఎల్
ఆలివ్ ఆయిల్ - 10 ఎం.ఎల్
వెల్లుల్లి తరుగు - 2 టేబుల్ స్పూన్లు
టొమాటో సాస్ - 50 ఎం.ఎల్
పెస్తో సాస్ - 50 ఎం.ఎల్

తయారి
ముందుగా 500 ఎం.ఎల్ నీటిలో రైస్ వే సి ఉడికించాలి.
అన్నాన్ని మూడు సమ భాగాలుగా చేయాలి.
అలాగే స్టాక్ వాటర్, ఆలివ్ ఆయిల్, వెల్లుల్లి తరుగును కూడా మూడు సమభాగాలుగా చేసుకోవాలి.
ఒక భాగం అన్నానికి టొమాటో సాస్, ఆలివ్ ఆయిల్, స్టాక్‌వాటర్, వెల్లుల్లి తరుగు కలిపి, క్రీమ్ భాగం పైన వేసి, కొద్దిగా అదమాలి.
మరొక భాగం అన్నానికి క్రీమ్, స్టాక్ వాటర్, ఆలివ్ ఆయిల్, వెల్లుల్లి తరుగు కలిపి ఇంతకుముందు గిన్నెలో వేసిన భాగం మీద వేసి, కొద్దిగా అదమాలి.
ఇంకొక భాగం అన్నానికి పెస్తో సాస్, స్టాక్ వాటర్, ఆలివ్ ఆయిల్, వెల్లుల్లి తరుగు కలిపి ఒక గుండ్రటి గిన్నెలో వేసి, కొద్దిగా అదమాలి.
ఇలా మూడు భాగాల అన్నంతో నింపిన గిన్నెను ప్లేట్‌లో బోర్లించి తీయాలి.
పైన చెర్రీ టొమాటో, బేసిల్ ఆకు, చీజ్‌లతో గార్నిష్ చేసుకుంటే తిరంగా కలర్స్‌లో రైస్ ఘుమఘుమలాడుతుంది.
Learn English Vocabulary & Help the Poor |Free Rice |
 
google-site-verification: google2463dc209284d38a.html