Healthy Babycorn - హెల్దీ బేబీ కార్న్
గాల్లో తేలినట్టుందే... అంటూ తేలిగ్గా ఉండాలని తహతహలాడేవారికి జిమ్‌ని మించిన జెమ్ లేతమొక్కజొన్న.అనారోగ్యాన్ని అడ్రస్ లేకుండా చేసి బ్రైట్‌నెస్‌ను పెంచే ఓషధి అది.
బేబీ...! అంటూ ముద్దుగా పిలుచుకునే ఈ కార్న్ పెద్దలకు ఎలాగూ ముద్దొచ్చేదే!
కాని తినడానికి మొరాయించే బుజ్జాయిల మీదే దీని గురి.
ఆబాలగోపాలం... బేబీకార్న్ రుచికి గులాం.
బేబీకార్న్ సూప్(Baby corn soup)
బేబీకార్న్ - 2, మష్రూమ్స్ - 50 గ్రా.
ఉడికించిన చికెన్ ముక్కలు - 4
క్యాలీఫ్లవర్ - 50 గ్రా., ఉప్పు - తగినంత
పంచదార - అర టీ స్పూన్
ఉల్లికాడల తరుగు - టేబుల్ స్పూన్
ఆలివ్ ఆయిల్ - 2 టీ స్పూన్లు
మిరియాల పొడి - చిటికెడు, టొమాటో - 1
తయారి
ఒక గిన్నెలో మూడు కప్పుల నీళ్లు పోసి బేబీకార్న్, మష్రూమ్స్, టొమాటో వేసి ఉడికించాలి. చికెన్‌ముక్కలను సన్నని ముక్కలుగా చేసుకోవాలి. కప్పున్నర నీళ్లు అయ్యాక ఉప్పు, పంచదార, మిరియాలపొడి, ఆలివ్ ఆయిల్ వేసి, మరికాసేపు ఉడికించాలి.
బేబీకార్న్ ఫ్రైడ్‌రైస్ (Babycorn Fried Rice)
బేబీకార్న్ - 4, బాస్మతి బియ్యం - కప్పు, బటర్ - 3 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి - 5, ఉల్లిపాయ - 1 (సన్నగా తరగాలి), బ్రొకోలీ - పావు కప్పు, మష్రూమ్స్ - పావు కప్పు, ఎండుమిర్చి - 5 (మధ్యకు విరవాలి), అజినమోటో - పావు టీ స్పూన్, నూనె - టేబుల్ స్పూన్, జీడిపప్పు పలుకులు - తగినన్ని, తాలింపు దినుసులు - తగినన్ని
తయారి
బియ్యాన్ని కడిగి, అరగంట నానబెట్టి, తర్వాత నీళ్లు లేకుండా వడకట్టాలి.
స్టౌ మీద పాన్ పెట్టి 3 కప్పుల నీళ్లు పోసి మరిగించి, అందులో బియ్యం వేసి ఉడికించాలి.
అన్నం పూర్తిగా ఉడికాక, ప్లేట్‌లోకి తీసుకొని, ఆరనివ్వాలి.
అందులో బటర్, ఉప్పు వేసి కలపాలి.
పాన్‌లో టేబుల్ స్పూన్ నూనె, బటర్ వేసి కాగాక, వెల్లుల్లి, ఎండుమిర్చి వేసి వేయించాలి.
ఉల్లిపాయలు వేసి, గోధుమరంగు వచ్చేవరకు ఉంచి, బేబీకార్న్ ముక్కలు, మష్రూమ్స్ అజినమోటో వేసి, కొన్ని నిమిషాల పాటు వేయించాలి.
దీంట్లో ఉప్పు, అన్నం వేసి కలిపి, 10-15 నిమిషాలు ఉంచి, చివరగా వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేయాలి ఏదైనా గ్రేవీతో ఈ ఫ్రైడ్ రైస్‌ని సర్వ్ చేయాలి.
గోల్డెన్ ఫ్రై బేబీకార్న్ (Golden fry Babycorn)
శనగపిండి - 20 గ్రా, మైదా - 20 గ్రా.
కార్న్‌ఫ్లోర్ - 20 గ్రా, వంటసోడా - చిటికెడు
ఉప్పు - తగినంత
కారం - అర టీ స్పూన్, నీళ్లు - తగినన్ని
నూనె - వేయించడానికి తగినంత
కొత్తిమీర - అలంకరణకు తగినంత
తయారి
బేబీకార్న్‌లో తగినన్ని నీళ్లు పోసి, కొద్దిగా ఉడికించి, నీళ్లన్నీ పోయేంతవరకు పక్కన పెట్టుకోవాలి. శనగపిండి, మైదా, కార్న్‌ఫ్లోర్, వంటసోడా, ఉప్పు, కారం కలపాలి. దీంట్లో తగినన్ని నీళ్లు పోసి పిండిని జారుగా కలుపుకోవాలి. స్టౌ మీద కడాయి పెట్టి, నూనె పోసి, కాగనివ్వాలి. ఉడికించిన బేబీకార్న్ ఒక్కొక్కటీ తీసుకొని పిండి మిశ్రమంలో ముంచి కాగుతున్న నూనెలో వేసి, అన్నివైపులా బంగారురంగులోకి వచ్చేవరకు వేయించి తీయాలి. క్యారట్ తరుగు, కొత్తిమీర , ఉల్లిచక్రాలు, టొమాటో కెచప్‌తో సర్వ్ చేసుకోవాలి.
బేబీకార్న్ సలాడ్ (Babycorn Salad)
టోఫు - చిన్న బాక్స్, బేబీ కార్న్ - 5 ముక్కలు, మష్రూమ్స్ - 100 గ్రా.
నూనె - 2 టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి - 5 రెబ్బలు
ఉల్లిపాయలు - 1 (సన్నగా తరగాలి)
క్యాప్సికమ్ - 2 (ముక్కలుగా
కట్ చేయాలి)
సోయా సాస్ - 2 టేబుల్ స్పూన్లు
ఉల్లికాడలు - గార్నిష్‌కు తగినన్ని
ఉప్పు - తగినంత
మిరియాల పొడి - తగినంత
కొత్తిమీర తరుగు - 2 టీ స్పూన్లు
తయారి
స్టౌ పై కడాయి పెట్టి, నూనె వేడి చేయాలి. అందులో వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు వేయించాలి. తర్వాత టోఫు, బేబీ కార్న్, మష్రూమ్స్, క్యాప్సికమ్ ముక్కలు వేసి కలపాలి. ముక్కలు ఉడికిన తర్వాత మిరియాలపొడి, సోయా సాస్, ఉప్పు కలిపి, కొత్తిమీర చల్లాలి.

