బాండిలిలో దీపావళి-DiwAli Specials
సొరకాయ హల్వాసొరకాయ తురుము - మూడు కప్పులు;
పాలు - మూడు కప్పులు;
ఏలకులు - 3; పంచదార - అరకప్పు;
ఫుడ్‌కలర్ - రెండు చుక్కలు;
నెయ్యి - మూడు టీ స్పూన్లు;
గార్నిషింగ్ కోసం- రెండు టేబుల్‌స్పూన్ల బాదం పలుకులు, జీడిపప్పులు
తయారి:
ఒక పాన్‌లో నెయ్యి వేసి కరిగాక అందులో సొరకాయ తురుము వేసి బాగా దగ్గరపడే వరకు కలపాలి. పాలు పోసి, ఏలకుల పొడి వేసి మరగనివ్వాలి. సుమారు అరగంటసేపు సన్ననిసెగ మీద ఉంచి, మధ్యమధ్యలో కలుపుతుండాలి. హల్వా బాగా డ్రైగా అయిన తరవాత, పంచదార, ఫుడ్ కలర్‌వేసి బాగా కలపాలి. సుమారు పది నిముషాల తరవాత తడి బాగా ఆరిపోయింనిపించాక దింపాలి. బాదం, ఆల్మండ్స్‌తో గార్నిష్‌చేసి వేడివేడిగా సర్వ్ చేయాలి.
బంగాళదుంప టిక్కీలు
నూనె - రెండు టేబుల్‌స్పూన్లు; జీలకర్ర - టేబుల్ స్పూన్; పచ్చిమిర్చి తరుగు - రెండ టేబుల్‌స్పూన్లు; అల్లం తురుము - అర టీ స్పూను; ఉల్లితరుగు - పావు కప్పు; ఉడికించి ముద్ద చేసిన బంగాళదుంప - ఒక కప్పు; మెంతికూర - అరకప్పు; కసూరీమేతీ - మూడు టీ స్పూన్లు; ఆమ్‌చూర్ - రెండు టీస్పూన్లు; పసుపు - కొద్దిగా; గరంమసాలా - అర టీ స్పూను; కొత్తిమీర- పావు కప్పు; బ్రెడ్‌క్రంబ్స్ - పావు కప్పు; నూనె - డీప్‌ఫ్రైకి సరిపడా
తయారిః
పాన్‌లో నూనె కాగిన తరవాత జీలకర్ర వేసి వేయించాలి. పచ్చిమిర్చి తరుగు, అల్లం తురుము, ఉల్లి తరుగు వేసి గోధుమరంగు వచ్చే వరకు వేయించాలి. తరవాత మిగిలిన పదార్థాలన్నీ (బ్రడ్‌క్రంబ్స్ మినహా) వేసి వేయించాక, కిందకు దింపి చల్లారనివ్వాలి. కొద్దికొద్దిగా తీసుకుని రౌండ్‌గా టికీలా తయారుచేయాలి బ్రడ్ పొడిలో దొర్లించాలి. (అంచులు కూడా) కడాయిలో నూనె కాగిన తరవాత వీటిని అందులో వేసి వేయించాలి. టిష్యూ మీదకు తీసుకుని నూనె పీల్చేసిన తరవాత, వేడివేడిగా సర్వ్ చేయాలి

