Ads 468x60px

Pages

Learn English Vocabulary & Help the Poor| |Free Rice |

Cooky taste(Eggs) - ఉడుకు రుచి(కోడిగుడ్లు)

Cooky taste(Eggs) - ఉడుకు రుచి(కోడిగుడ్లు)

ఆమ్లెట్ ఎవరైనా పోస్తారు.
గుడ్డుకూర చేసినవారే దూకుడులా హిట్ కొడతారు.
పైన తెల్లసొన లోన పచ్చసొన విడువలేని ఆస్వాదన.
హఠాత్తుగా ఊడిపడే అతిథులకు చికెనూ మటనూ లేకున్నా గుడ్డే ఘనగౌరవం.
ఉడకబెట్టిన గుడ్లతో చేసిన ఈ వంటకాలు నో డౌట్ వెరీ గుడ్.
సండే తినండి... మన్‌డే తినండి... ‘అండే’ తినండి.


చిల్లీ ఎగ్స్ (Chilly Eggs)

కావలసినవి:
కోడిగుడ్లు - 4 (ఉడికించి, పై పొట్టు తీసినవి)
పండు మిరపకాయల పేస్ట్ - టీ స్పూన్
పచ్చిమిరపకాయల పేస్ట్ - టీ స్పూన్
అల్లం- చిన్న ముక్క (పై పొట్టు తీసి సన్నగా తరగాలి)
వెల్లుల్లి రెబ్బలు - 2 (పై పొట్టు తీసి సన్నగా తరగాలి)
చింతపండు గుజ్జు - 2 టేబుల్‌స్పూన్లు
ఉప్పు - రుచికి తగినంత; ఉల్లిపాయ తరుగు - టేబుల్ స్పూన్
వంటసోడా - చిటికెడు; సోయా సాస్- టీ స్పూన్
నూనె -వేయించడానికి తగినంత

తయారి:
బాణలిలో నూనె పోసి వేడయ్యాక గుడ్లను మెల్లగా వేసి పైనంతా గోధుమరంగు వచ్చేవరకు వేయించి, తీసి పక్కన పెట్టాలి. విడిగా మరో పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అల్లం, వెల్లుల్లి తరుగు వేయించాలి. తర్వాత ఉల్లిపాయలు వేసి వేగనివ్వాలి. అందులో పండుమిర్చి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ వేసి నిమిషం పాటు వేయించాలి. దానికి సోయా సాస్, చింతపండు గుజ్జు, ఉప్పు వేసి ఉడికించి స్టౌ కట్టేయాలి. ఆ మిశ్రమంలో వేయించిన గుడ్లకు సాస్ పూసి వేయాలి. చైనీస్ రైస్, రోటీ లేదా పరోఠాలోకి ఈ చిల్లీ ఎగ్ కాంబినేషన్ రుచిగా ఉంటుంది. గుడ్డు ఇష్టపడనివాళ్లు దీనికి బదులుగా బంగాళదుంపలు వాడి చిల్లీ పొటాటో చేసుకోవచ్చు.

ఎగ్ బిర్యానీ (Egg BiryAni)

కావలసినవి:
కోడిగుడ్లు - 4 (ఉడికించి, పై పొట్టు తీసినవి)
బాస్మతి రైస్- 2 కప్పులు; నూనె - 6-8 టీ స్పూన్లు
నీళ్లు - మూడున్నర కప్పులు
పచ్చిమిర్చి - 5 (నిలువు, అడ్డం చిన్న ముక్కలుగా కట్ చేయాలి); అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 1 టీ స్పూన్లు
ఉల్లిపాయ - 1 (ముక్కలుగా కట్ చేయాలి)
దాల్చిన చెక్క - చిన్న ముక్క; లవంగాలు - 3
జీడిపప్పు - 6 (వేయించినవి)
పసుపు - పావు టీ స్పూన్
ఉప్పు - రుచికి తగినంత
కొత్తిమీర - అలంకరణకు తగినంత

తయారి:
బియ్యం కడిగి పక్కనుంచాలి. గిన్నెలో నూనె వేడయ్యాక దాల్చిన చెక్క, లవంగాలు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పసుపు ఒకదాని తర్వాత ఒకటి వేసి మూడు నిమిషాలు వేయించుకోవాలి. అందులో నీళ్లుపోసి, ఉప్పు కలిపి కడిగిన బియ్యం వేసి ఉడకనివ్వాలి. బియ్యం కాస్త పలుకుగా ఉన్నప్పుడు కోడిగుడ్లు, జీడిపప్పు వేసి కలిపి మూత పెట్టాలి. చివరగా కొత్తిమీరతో అలంకరించుకోవాలి.

ఎగ్ సేమియా (Egg SemiyA)

కావలసినవి:
కోడిగుడ్లు - 3 (ఉడికించి, పొట్టు తీసినవి)
సేమియా - (వెర్మిసెల్లి) ఒకటిన్నర కప్పు
చాట్‌మసాలా - టీ స్పూన్
నిమ్మరసం - టీ స్పూన్; ఉప్పు - రుచికి తగినంత
మిరియాల పొడి - అర టీ స్పూన్
కోడిగుడ్డు - 1 (ఉడకబెట్టనిది)
నూనె - వేయించడానికి తగినంత

తయారి:
ఒక పాత్రలో సేమియా, చాట్‌మసాలా, నిమ్మరసం, ఉప్పు, మిరియాలపొడి, అందులో కోడిగుడ్డును పగలగొట్టి లోపలి సొన వేసి బాగా కలపాలి. ఉడికించిన గుడ్డును అందులో వేసి మిశ్రమమంతా బాగా పట్టేలా తిప్పాలి. స్టౌ పై బాణలి పెట్టి నూనె కాగనివ్వాలి. తర్వాత ఆ గుడ్డును తీసి నూనెలో వేసి సేమియా మిశ్రమం గోధుమరంగులోకి మారేంతవరకు అటూ ఇటూ తిప్పి వేయించాలి. బయటకు తీసి బ్లాటింగ్ పేపర్‌మీద పెట్టాలి. గుడ్డుకు అంటుకొని ఉన్న అదనపు నూనె పేపర్ పీల్చుకున్నాక ఆ గుడ్డును కత్తితో గుండ్రని ముక్కలుగా కట్‌చేసి లేదా అలాగే సర్వ్ చేసుకోవచ్చు.

ఎగ్ మసాలా (Egg MasAlA)

కావలసినవి:
కోడిగుడ్లు - అరడజను
(ఉడికించి, పై పొట్టు తీసినవి)
ఉల్లిపాయలు - 4 (పెద్దవి)
వెలుల్లి రెబ్బలు - 5
(పై పొట్టు తీసి, సన్నగా తరగాలి)
అల్లం - చిన్న ముక్క
(పై పొట్టు తీసి, సన్నగా తరగాలి)
ధనియాలు,
జీలకర్ర పొడులు - టేబుల్‌స్పూన్
ఎండుకారం - అర టేబుల్ స్పూన్
పసుపు - పావు టీ స్పూన్
టొమాటోలు - 3 (సన్నగా తరిగినవి)
కొత్తిమీర తరుగు -
అలంకరణకు తగినంత
నూనె - 3 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి తగినంత

తయారి:
కడాయిలో నూనె కాగాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, పసుపు ఒకదాని తర్వాత ఒకటి వేసి గోధుమరంగు వచ్చేంత వరకు వేయించాలి. దాంట్లో టొమాటో ముక్కలు వేసి మగ్గనివ్వాలి. తర్వాత గుడ్లు, కారం, జీలకర్ర-ధనియాలపొడులు, ఉప్పు వేసి పదిహేను నిమిషాలు ఉడికించాలి. చివరగా కొత్తిమీరతో అలంకరించాలి.

ఎగ్ కోఫ్తా (Egg KoftA)

కావలసినవి:
కోడిగుడ్లు - 3 (ఉడికించి, పొట్టు తీసినవి)
మటన్ ఖీమా - 150 గ్రా.లు; పచ్చిమిర్చి తరుగు - టేబుల్ స్పూన్; అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్
ఎండుకారం - టీ స్పూన్; ఉప్పు - రుచికి త గినంత
ధనియాలపొడి - అర టీ స్పూన్; శనగపిండి - 2 టేబుల్ స్పూన్లు; గరం మసాలా - చిటికెడు; నిమ్మరసం - టీ స్పూన్; కొత్తిమీర తరుగు - టేబుల్ స్పూన్; నూనె - వేయించడానికి తగినంత

తయారి:
ఒక పాత్రలో మటన్ ఖీమా, పచ్చిమిర్చి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుకారం, ఉప్పు, ధనియాలపొడి, శనగపిండి, గరంమసాలా, నిమ్మరసం, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి. ఉడికించిన గుడ్డును అందులో వేసి మిశ్రమంతా బాగా పట్టేలా తిప్పాలి. స్టౌ పై బాణలి పెట్టి నూనె కాగనివ్వాలి. తర్వాత ఆ గుడ్డును తీసి నూనెలో వేసి ఖీమా మిశ్రమం గోధుమరంగులోకి మారేంతవరకు అటూ ఇటూ తిప్పి వేయించాలి. బయటకు తీసి బ్లాటింగ్ పేపర్‌మీద పెట్టాలి. గుడ్డుకు అంటుకొని ఉన్న అదనపు నూనె పేపర్ పీల్చుకున్నాక ఆ గుడ్డును గుండ్రని ముక్కలుగా కట్‌చేసి ప్లేట్‌లో సర్ది వేడి వేడిగా అందించాలి.

ఓట్‌మీల్ ఎగ్ బజ్జీ (Oatmeal Egg Bajji)

కావలసినవి:
కోడిగుడ్లు - 3
(ఉడికించి, పై పొట్టు తీసినవి)
ఓట్స్ - ఒకటిన్నర కప్పు
చాట్‌మసాలా - టీ స్పూన్
నిమ్మరసం - టీ స్పూన్
ఉప్పు - రుచికి తగినంత
మిరియాల పొడి - అర టీ స్పూన్
కోడిగుడ్డు - 1 (ఉడకబెట్టనిది)
నూనె - వేయించడానికి తగినంత

తయారి:
ఒక పాత్రలో ఓట్స్, చాట్‌మసాలా, నిమ్మరసం, ఉప్పు, మిరియాలపొడి, గుడ్డు సొన వేసి బాగా కలపాలి. ఉడికించిన గుడ్డును అందులో వేసి మిశ్రమమంతా బాగా పట్టేలా తిప్పాలి. స్టౌ పై బాణలి పెట్టి నూనె కాగనివ్వాలి. ఆ గుడ్డును నూనెలో వేసి ఓట్స్ మిశ్రమం గోధుమరంగులోకి మారేంతవరకు అటూ ఇటూ తిప్పి వేయించాలి. బయటకు తీసి బ్లాటింగ్ పేపర్‌మీద పెట్టాలి. గుడ్డుకు అంటుకొని ఉన్న అదనపు నూనె పేపర్ పీల్చుకుంటుంది. ఆ గుడ్డును కత్తితో గుండ్రని ముక్కలుగా కట్‌చేసి ప్లేట్‌లో సర్ది వేడి వేడిగా వడ్డించాలి.

Learn English Vocabulary & Help the Poor |Free Rice |
 
google-site-verification: google2463dc209284d38a.html